Intinti Gruhalakshmi: తులసి చేతిలో సామ్రాట్ కీ.. విక్రమ్ వల్ల ఆమె ఆత్మహత్యయత్నం.. కథలో అనుకోని మలుపు

పోటీ పెరుగుతన్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:19వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. జాహ్నవికి దివ్య వార్నింగ్ ఇస్తుండగా తులసి వచ్చి ఏమైందని అడుగుతుంది. దీంతో దివ్య బెదిరిస్తుందని జానూ చెప్తుంది. అప్పుడు తులసి కూతురిని మందలిస్తుంది. పూజ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఉట్టి కొట్టే ఆట ఆడతారు. అందులో దివ్య ఒక టీమ్, జానూ ఒక టీమ్ ఉండగా.. చివరికి ఇద్దరూ విజేతలుగా నిలుస్తారు. ఆ తర్వాత అందరూ దాండియా ఆడుతుండగా దివ్యకు దెబ్బ తగులుతుంది. దీంతో విక్రమ్‌కు కోపం వచ్చి జానూపై అరుస్తాడు. చివర్లో హనీని తీసుకువెళ్లిన నందూకు రత్నప్రభ వార్నింగ్ ఇస్తుంది.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: September 19th to 23rd Episodes highlights

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:20వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్యను చూసి బాధ పడిన విక్రమ్.. జానూపై కోప్పడతాడు. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి, బసవయ్య నాటకం ఆడి దివ్యపై లేనిపోనివి చెప్తారు. దీంతో దివ్య ఇక్కడే ఉండి బావ కళ్లలో ఆనందం చూస్తానని అంటుంది. హనీని తీసుకుని వచ్చిన నందూతో రత్నప్రభ దురుసుగా మాట్లాడుతుంది. అంతేకాదు, తమ వ్యవహారాల్లో తలదూరిస్తే తులసిని చంపేస్తామని బెదిరిస్తుంది. దీంతో నందూ భయపడిపోతూ ఇంటికి వెళ్తాడు. కానీ, తులసికి మాత్రం ఈ నిజాన్ని తెలియనివ్వడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: September 19th to 23rd Episodes highlights

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:21వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రత్నప్రభ వాళ్లు తులసిని చంపుతామని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని నందూ తల్లిదండ్రులకు చెప్తాడు. దీంతో ఆమెను సామ్రాట్ ఇంటికి దూరంగా ఉంచాలని వాళ్లు ప్లాన్ చేస్తారు. ఇక, భర్త చేసిన పనికి పొంగిపోతున్న దివ్య అతడికి ముద్దులు పెట్టాలని అనుకుంటుంది. కానీ, విక్రమ్ మాత్రం ఆమెను నమ్మనంటూ వెళ్లిపోతాడు. ఇక, కంపెనీ సీఈవోగా ధనుంజయ్‌ను పెట్టకపోతే హనీ ప్రాణాలకే ప్రమాదం అని రత్నప్రభ బెదిరిస్తుంది. ఎపిసోడ్ చివర్లో లాస్య.. భాగ్య ఇంట్లో తలదాచుకున్న విషయం బయట పడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: September 19th to 23rd Episodes highlights

22 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:22వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంటి నుంచి వెళ్లిపోతున్న జానూను విక్రమ్ ఆపుతాడు. అప్పుడామె అతడికి హగ్ ఇస్తుంది. ఇది చూసి దివ్య కోపం పెరుగుతుంది. అనంతరం సామ్రాట్ బాబాయి తులసిని కలిసేందుకు వస్తాడు. అది చూసిన నందూ.. ఆయనను బయటే ఆపేస్తాడు. అంతేకాదు, ధనుంజయ్ వాళ్లు తులసిని చంపుతానన్న విషయాన్ని చెప్తాడు. దీంతో ఆయన తులసిని ఇంకెప్పుడూ ఇంటికి రావొద్దని అంటాడు. ఇక, విక్రమ్ స్నానం చేస్తుండగా జానూ వెళ్లి వీపు రుద్దుతుంది. అది చూసిన దివ్యకు కోపం వచ్చి ఆమెతో గొడవకు దిగిపోతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: September 19th to 23rd Episodes highlights

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:23వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్ విషయంలో దివ్య నిజంగానే తప్పు చేసిందేమో అనుకుంటున్న జానూ.. ఆమెతో చాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత సామ్రాట్ కంపెనీని దక్కించుకున్నామని సంతోషిస్తున్న రత్నప్రభ వాళ్లకు లాకర్ కీ తులసి దగ్గరే ఉందని తెలుస్తుంది. ఇక, జానూ బావను బుట్టలో వేసుకోవాలన్న ప్లాన్లు వర్కౌట్ కాకుండా దివ్య దెబ్బ కొడుతుంది. మరోవైపు, తులసి పక్కన ఉండడంతో నందూ కెఫే కాంట్రాక్టును దక్కించుకుంటాడు. తర్వాత ఎప్పుడూ తన పక్కనే ఉండమని అడగ్గా ఆమె కోప్పడుతుంది. అనంతరం తులసి కోసం నందూ వంట చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: September 19th to 23rd Episodes highlights

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే:సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ఈ వారంలో విక్రమ్‌ను కాక పట్టేందుకు జాహ్నవి ప్రయత్నాలు చేయడం.. ఆమెను తిప్పి కొట్టేందుకు దివ్య ప్రయత్నించడం హైలైట్ చేశారు. అలాగే, ధనుంజయ్ వాళ్లు సామ్రాట్ ఆస్తి కొట్టేసే క్రమంలో వార్నింగ్ ఇవ్వడంతో నందూలో టెన్షన్ పెరిగింది. కానీ, తులసికి మాత్రమే సామ్రాట్ కీ గురించి తెలియడం పెద్ద ట్విస్టులా మారింది. ఇక, వచ్చే వారం ఎపిసోడ్‌లో విక్రమ్ మీద కోపంతో జానూ ఆత్మహత్యాయత్నం చేయడంతో కథ అనుకోని మలుపు తిరిగింది. (వినాయక చవితి సందర్భంగా సోమవారం ఎపిసోడ్ ప్రసారం చేయలేదు)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X