Intinti Gruhalakshmi: డాక్యూమెంట్లు మాయం.. అడ్డంగా బుక్కైపోయిన హీరోయిన్.. కథలో ఊహించని మలుపు

పోటీ పెరుగుతన్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
25వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తన వంటలు బాలేకపోయినా అందరూ లొట్టలేసుకుని మరీ తినడంతో నందూ నిరాశ చెందుతాడు. ఆ తర్వాత రత్నప్రభ వాళ్లు సామ్రాట్ బాబాయిని బెదిరించే ప్రయత్నం చేస్తారు. అనంతరం తులసితో మంచిగా ఉంటూ సామ్రాట్ లాకర్ కీ గురించి తెలుసుకోవాలని ప్లాన్ చేస్తారు. అలాగే, హనీ ఇకపై చదువుకోవడానికి వీల్లేదని తన పుస్తాకాలను ధనుంజయ్ కాల్చేస్తాడు. ఇక, విక్రమ్ తిట్టాడన్న కోపంతో జాహ్నవి తన చేతిని కట్ చేసుకుంటుంది. దీంతో అతడు సారీ చెప్తాడు. అనంతరం ఆమెకు దగ్గర అయిపోతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: September 25th to 30th Episodes highlights 2023

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
26వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. హనీని చదువు మాన్పించినందుకు సామ్రాట్ వాళ్ల బాబాయి బాధపడుతుంటాడు. అంతలోనే తులసి అక్కడకు వస్తుంది. వచ్చీ రావడమే ఆమె హనీ గురించి అడుగుతుంది. అప్పుడు హనీని చూసిన తులసి స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదని అడుగుతుంది. దీంతో అందరికీ అలవాటు అవడం కోసమే మాన్పించాము అని చెప్తుంది. అంతేకాదు, తులసిని ఇకపై ఇంటికి రావొద్దని చెప్పడంతో బాధగా వెళ్లిపోతుంది. ఇక, జానూకు విక్రమ్ అన్నం తినిపించడంతో దివ్య అతడితో తీవ్ర స్థాయిలోనే గొడవ పడుతుంది.

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
20వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్యతో గొడవ జరిగిన తర్వాత బాధగా బయటకు వచ్చిన విక్రమ్‌ను జానూ ఓదార్చుతుంది. ఆ సమయంలో విక్రమ్‌ను రెచ్చగొట్టి అతడికి దగ్గర అవ్వాలని అనుకుంటుంది. కానీ, విక్రమ్ మాత్రం తనకు దివ్యపై ప్రేమ ఉందనే అంటాడు. హనీని కలిసి వచ్చిన తులసి బాధగా ఇంటికి రావడం గమనించిన నందూ ఏమైందని అడుగుతాడు. తర్వాత నందూకు రత్నప్రభ ఫోన్ చేసి తులసికి శిక్ష పడబోతుంది అని బెదిరిస్తుంది. ఇక, భాగ్య ఇంట్లో తులసి తాగుతూ ఉంటుంది. భాగ్యను వంట చేయమని అడుగుతుంది.

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
21వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అటు విక్రమ్, ఇటు దివ్య తమ తప్పులను ఒప్పుకుని ఒక్కటైపోతారు. దీంతో సంతోషంగా వినాయక చవితి జరుపుకోవాలని తులసికి దివ్య ఫోన్ చేస్తుంది. కానీ, ఆమెకు అప్పటికే దెబ్బలు తగిలి ఉండడంతో మీ ఇంట్లో మీరే చేసుకోండి అని చెప్తుంది. ఇక, గాయపడి ఉన్న తులసికి నందూ సేవలు చేస్తుంటాడు. సామ్రాట్ ఇంట్లో హనీని రత్నప్రభ హింసిస్తూ ఉంటుంది. అలాగే, తను తినే వాటిపై కూడా రిస్టిక్షన్స్ పెడుతుంది. దీంతో సామ్రాట్ బాబాయి ఆమెను వేడుకుంటాడు. ఇక, తులసి కోసం నందూ ఫుడ్ తీసుకు వచ్చి తినమని బ్రతిమాలతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

22 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
22వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. హనీ మీద దిగులుతో ఉన్న తులసి ఆ చిన్నారికి కాల్ చేస్తుంది. అప్పుడు తులసికి అన్నీ అబద్దాలే చెబుతుంది. అవన్నీ నిజమే అని తులసి నమ్ముతుంది. ఇక, దివ్య వినాయక చవితి రోజు చంద్రుడిని చూసేలా రాజ్యలక్ష్మి ప్లాన్ చేస్తుంది. కానీ, బసవయ్య వచ్చి అనుకోకుండా ఆ ప్లాన్‌ను చెడగొడతాడు. దీంతో అతడిపై అందరూ ఫైర్ అవుతారు. తర్వాత విక్రమ్‌కు దివ్య నలుగు పెట్టి స్నానం చేయించాలని అనుకుంటుంది. అంతలోనే జానూ వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంది. దీంతో ఆమెకు దివ్య అదిరిపోయే రీతిలో వార్నింగ్ ఇస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
23వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. వినాయక చవితి సందర్భంగా దివ్య స్వయంగా పూజకు కావాల్సిన అన్ని పనులు చేస్తుంది. అలాగే, పిండి వంటలు కూడా వండుతుంది. వాటిలో కొన్నింటిని పుట్టింటికి కూడా పంపుతుంది. అది చూసి వాళ్లంతా సంతోషిస్తారు. ఇక, దివ్యను ఎలాగైనా దెబ్బకొట్టాలని ల్యాండ్ డాక్యూమెంట్లను మాయం చేయాలని రాజ్యలక్ష్మి ప్లాన్ చేస్తుంది. ఇక, తన ఇంట్లో ఉన్న లాస్యను భాగ్య ఘోరంగా అవమానిస్తుంది. చివర్లో హనీకి పనిమనిషి బిస్కెట్లు తెచ్చివ్వడం చూసిన రత్నప్రభ.. సీరియస్ అవడంతో పాటు ఆమెకు శిక్ష విధిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
సెప్టెంబర్ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ఈ వారంలో విక్రమ్, దివ్య ఒక్కటవడాన్ని చూపించారు. అదే సమయంలో వాళ్లను శాశ్వతంగా దూరం చేయడం కోసం రాజ్యలక్ష్మి పన్నాగాలు పన్నడం కూడా హైలైట్ చేశారు. అందులో ఒకటి విఫలం అయినా.. రెండో దానితో దివ్యకు చెక్ పెట్టబోతుంది. ఇక, హనీకి రత్నప్రభ నుంచి కష్టాలు వచ్చాయి. తులసేమో యాక్సిడెంట్‌లో గాయపడి రెస్ట్ తీసుకుంటోంది. ఇక, వచ్చే వారం డాక్యూమెంట్లు మాయం అవడంతో కథ మలుపులు తిరగబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X