Intinti Gruhalakshmi Weekly Roundup: తులసికి తెలియనున్న అసలు నిజం.. సామ్రాట్ అంత పనీ చేస్తాడా!

కొత్త కొత్త కాన్సెప్టులతో షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!

 26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

26వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కంపెనీకి సంబంధించిన ప్రెస్‌మీట్‌లో రిపోర్టర్లు సామ్రాట్‌ను ‘భూమి పూజ జరిగిన రోజే తులసి గారు పార్టనర్‌షిప్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ మీ పక్కన కూర్చున్నారు. మీ పార్టనర్‌షిప్ కోసం మీరు ఏం చేశారు. ఆవిడ కాళ్లు పట్టుకున్నారా? తెర వెనుక ఏం జరిగింది సార్? ఇంతకీ మీ భార్య ఎవరు? ఆమె ఎక్కడున్నారు? అసలు ఉన్నారా లేదా?' అని ప్రశ్నిస్తారు. కానీ, అప్పుడు సామ్రాట్ ఏమీ మాట్లాడడు. తులసే వాళ్లకు సమాధానం చెప్తుంది. చివర్లో హనీతో సామ్రాట్ నువ్వు నా కూతురు కాదు అని అంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


27వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్రెస్‌మీట్ తన భార్య గురించి అడిగితే సామ్రాట్ ఏమీ చెప్పకపోవడంతో కలకలం రేగుతుంది. ఆ తర్వాత హనీ తన తల్లి గురించి సామ్రాట్‌ను ప్రశ్నిస్తుంది. కానీ, అతడు సమాధానం చెప్పడు. అనంతరం అభిని నందూ, లాస్య రెచ్చగొడతారు. దీంతో తర్వాతి రోజు ఉదయాన్నే అతడు సామ్రాట్‌ భార్య గురించి చెప్పమంటూ కుటుంబ సభ్యులు అందరి ముందే పెద్ద గొడవ చెస్తాడు. దీంతో సామ్రాట్ బాబాయి అసలు హనీ అతడి కూతురు కాదని, చెల్లెలి కూతురు అని అంటాడు. దీంతో అందరూ షాక్‌కు గురవుతారు.

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


28వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ భార్య గురించి ప్రస్తావన రావడంతో అతడు ఎంతగానో కృంగిపోతాడు. దీంతో సామ్రాట్ బాబాయి హనీ అసలు సొంత కూతురు కాదన్న నిజాన్ని బయటపెడతాడు. అంతేకాదు, సామ్రాట్ చెల్లి ప్రేమ వివాహం చేసుకుందని, అతడు డబ్బుల కోసం ఆమెకు వేధించేవాడని, దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్న విషయాన్ని ఆయన అందరికీ చెప్తాడు. అప్పుడు సామ్రాట్ ఈ విషయాన్ని హనీకి చెప్పొద్దని వాళ్ల నుంచి ప్రామిస్ తీసుకుంటాడు. చివర్లో సామ్రాట్, తులసి గురించి ఓ న్యూస్ వస్తుంది. దీంతో అభి గొడవ చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


29వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి ముందు అభి తన బాధనంతా వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలోనే తన మనసులో ఏమీ లేదని.. తనను ఎవరూ రెచ్చగొట్టడం లేదని చెప్తాడు. అంతేకాదు, తులసికి ప్రామిస్ కూడా చేస్తాడు. అనంతరం సామ్రాట్, తులసి గురించి ఆలోచిస్తూ బాధ పడుతుంటాడు. ఆమెను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానని బాబాయితో చెప్పుకుంటాడు. ఇక, కూరగాయల కోసం బయటకు వెళ్లిన అనసూయతో ఇంటి పక్క వాళ్లు తులసి గురించి చెడుగా మాట్లాడతాడు. ఆ తర్వాత తులసి జనరల్ మేనేజర్‌గా ఆఫీసుకు వెళ్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

30వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆఫీసులో తులసి జనరల్ మేనేజర్ సీటులో కూర్చుని ఉండడం చూసి లాస్య కుళ్లుకుంటుంది. అప్పుడామె వచ్చి ఫైల్ రెడీ చేయకపోతే తప్పుకోమంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అనసూయను అభి బాగా రెచ్చగొడతాడు. దీంతో ఆమె నేరుగా సామ్రాట్ ఇంటికి వెళ్తుంది. అంతేకాదు, తులసిని మీ నుంచి, మీ కంపెనీ నుంచి దూరం చేసుకోవాలని అతడిని కోరుతుంది. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ప్రేమ్ ఓ మ్యూజిక్ ఆడిషన్స్‌కు వెళ్లగా.. అందులో అతడు సెలెక్ట్ అయినట్లు ఈవెంట్ వాళ్లు చెబుతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 1వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

1వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

1వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆడిషన్స్‌లో ప్రేమ్ సెలెక్ట్ అవడంపై తోటి కంటెస్టెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. అంతేకాదు, తులసి, సామ్రాట్‌ను బుట్టలో వేసుకుని ప్రేమ్‌కు ఈ అవకాశం వచ్చేలా చేసిందని నిందిస్తాడు. దీంతో ప్రేమ్ అతడిని కొడతాడు. అప్పుడు వాళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో ప్రేమ్ వెంటనే సామ్రాట్‌కు ఫోన్ చేస్తాడు. అప్పుడతను వెళ్లి ప్రేమ్‌ను విడిపిస్తాడు. మరోవైపు, తులసిని సామ్రాట్ దూరం పెట్టేలా చేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఆమె భోజనం కోసం ఫోన్ చేయగా ఓ రేంజ్‌లో సీరియస్ అవుతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే


సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 24వ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో సామ్రాట్‌కు అసలు పెళ్లే కాలేదని, హనీ తన చెల్లెలి కూతురు అని అతడి బాబాయి ద్వారా అందరికీ తెలుస్తుంది. ఇక, సామ్రాట్ కంపెనీలో తులసి మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరిస్తుంది. మరోవైపు బయట తులసి, సామ్రాట్ గురించి పుకార్లు రావడంతో అనసూయకు అనుమానం మొదలవుతుంది. వెంటనే సామ్రాట్ దగ్గరకు వెళ్లి తులసిని దూరం చేయమని అడుగుతుంది. దీంతో అతడు తరచూ తులసిని నిందిస్తూ ఉంటాడు. ఇక, ఫైల్ విషయాన్ని తులసి సీరియస్‌గా తీసుకుంటుంది. దీంతో వచ్చే వారం ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా సాగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X