Intinti Gruhalakshmi: హనీని చంపాలని ప్లాన్.. దివ్యకు కొత్త శత్రువు.. తులసి అడ్డు తొలగించే దిశగా!
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి.
తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 04వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పూజ కోసం వచ్చిన తులసిని లాస్య వెటకారం ఆడుతుంది. అప్పుడామెకు అనసూయ వాళ్లు కౌంటర్లు ఇస్తారు. ఆ తర్వాత తులసి కోసం నందూ లవ్ లెటర్ రాయగా.. దాన్ని దివ్య చదువుతుంది. తర్వాత ఆమెకు ఇవ్వాలని అనుకుంటూ ఉండగా.. నందూ తీసుకుని పూజ చేయించాలని అంటాడు. అనంతరం దాన్ని పూజారికి ఇచ్చి దేవుడి దగ్గర పెట్టిస్తాడు. ఆ తర్వాత తులసి చీరను కాల్చాలని లాస్య వాళ్లు వేసిన ప్లాన్‌ను దివ్య భగ్నం చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

05వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 05వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి చీరకు లిక్విడ్ రాసి నిప్పు అంటించాలని లాస్య ప్లాన్ చేసిందని దివ్య ఆరోపిస్తుంది. అప్పుడు లాస్య ఏడుస్తూ యాక్టింగ్ చేయడంతో విక్రమ్ అదే నిజం అనుకుంటాడు. దీంతో లాస్య దొరికిపోకముందే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అంతలోనే తులసి ఆమెను ఆపి చీరను లాగుతుంది. దీంతో కొంగు చాటున దాచిన లిక్విడ్ బాటిల్ కింద పడిపోతుంది. దీంతో రాజ్యలక్ష్మి, బసవయ్య.. లాస్యపై ఫైర్ అవుతారు. ఆ తర్వాత విక్రమ్ కూడా ఆమెను తిట్టడంతో పాటు పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటూ చెలరేగిపోతాడు.

06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 06వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసికి తన చేతిలో ఉన్న లవ్ లెటర్‌ను నందూ అందిస్తాడు. అప్పుడామె దాన్ని చదువుతుండగా సామ్రాట్ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు ఓ న్యూస్ కనిపిస్తుంది. అది చూసిన తులసి గుండె పగిలేలా ఏడుస్తుంది. తర్వాత టీవీలో న్యూస్ చూడగా.. అందులోనూ ఇదే చూపిస్తారు. దీంతో వెంటనే నందూ, తులసి కలిసి సామ్రాట్ ఇంటికి వెళ్తారు. అక్కడ హనీ తన తండ్రి కావాలని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ వాళ్ల బాబాయి కూడా బాధ పడతాడు. వాళ్లను తులసి, నందూ ఓదార్చే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
07వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 07వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత తులసి బాధ పడుతూనే ఉంటుంది. అది చూసిన నందూ తన చేతిలో ఉన్న లవ్ లెటర్‌ను చించి పడేస్తాడు. దీంతో అతడి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి తులసిలో మార్పును తీసుకు రావాలని సూచిస్తారు. ఇక, లాస్య గురించి రాజ్యలక్ష్మి ఇంట్లో ప్రస్థావన వస్తుంది. దీంతో ఆమెపై కేసు పెట్టాలని అంటారు. కానీ, దీనికి విక్రమ్ మాత్రం ఒప్పుకోడు. తర్వాత విక్రమ్ విషయంలో దివ్యను దెబ్బకొట్టేందుకు బసవయ్య కూతురిని రంగంలోకి దించాలని రాజ్యలక్ష్మి అదిరిపోయే ప్లాన్‌ను రెడీ చేసుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

08 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 08వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ చనిపోయాడన్న బాధతో అన్నం కూడా తినకుండా ఉన్న తులసిని నందూ బ్రతిమాలతాడు. అంతేకాదు, ఆమెను ఎలాగైనా తినేలా చేస్తాడు. అనంతరం హనీ కోసం సామ్రాట్ ఇంటికి వెళ్లేందుకు తులసి రెడీ అవుతుండగా.. నందూ వద్దు అంటాడు. దీంతో సామ్రాట్ ఫ్యామిలీతో బంధం ఎప్పటికీ పోదని అంటుంది. అనంతరం అక్కడకు వెళ్లగా.. సామ్రాట్ వాళ్ల తమ్ముడు ఫ్యామిలీ వస్తుంది. వాళ్లకే హనీ బాధ్యతలు అప్పగిస్తుంది. ఇక, విక్రమ్‌ను దివ్య ఎంత రెచ్చగొట్టినా టెంప్ట్ అవడు. పైగా తన తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

09వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 09వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్యకు దూరంగా ఉంటున్న కొడుకుకు విక్రమ్ తండ్రి క్లాస్ పీకుతాడు. అయినప్పటికీ అతడిలో మార్పు మాత్రం రాదు. అనంతరం సామ్రాట్ ఇంటికి వచ్చిన ధనుంజయ్, రత్నప్రభ.. హనీ పేరు మీద ఉన్న ఆస్తిని ఎలాగైనా కాజేయాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం అవసరమైతే హనీని చంపేసి, తులసి అడ్డు కూడా తొలగించుకోవాలని అనుకుంటారు. ఇక, నందూ మాత్రం తులసి మనసును మార్చేసి తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటాడు. చివర్లో జాహ్నవి వచ్చి దివ్యను, విక్రమ్‌ను దూరం చేయాలని అనుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే: సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో సామ్రాట్ మరణాన్ని హైలైట్ చేసి చూపించారు. అతడు చనిపోవడంతో వాళ్ల తమ్ముడు ఫ్యామిలీ వచ్చి ఆస్తిని కాజేయాలని అనుకోవడాన్ని హైలైట్ చేశారు. అలాగే, దివ్య, విక్రమ్ మధ్య దూరం పెంచేందుకు బసవయ్య కూతురు జాహ్నవిని దింపారు. దీంతో వచ్చే ఎపిసోడ్లలో ధనుంజయ్ ఫ్యామిలీ ఆస్తి కోసం ప్లాన్లు చేయడం.. జాహ్నవి బావ కోసం ప్రయత్నాలు చేయడం చూపించబోతున్నారు. దీంతో ఇది ఆసక్తికరంగా మారనుంది.


Click it and Unblock the Notifications











