Intinti Gruhalakshmi Weekly Roundup: తులసికి దక్కని ఫ్యామిలీ సపోర్ట్.. నిజం తెలుసుకున్న సామ్రాట్
మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది.
దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!

5వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
5వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తన కంపెనీలో పార్ట్‌నర్‌షిప్ వద్దని తులసి మెసేజ్ చేసినప్పటి నుంచి సామ్రాట్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే వాళ్ల బాబాయి వచ్చి అడగ్గా ఆయనపై కూడా ఫైర్ అవుతాడు. ఆ తర్వాత లాస్య, నందూ వచ్చి తులసిపై మరింత కోపం పెరిగేలా మాట్లాడతారు.
దీంతో సామ్రాట్ వాళ్లతో తులసిని ఎలాగైనా ఒప్పించి తీసుకు రమ్మని చెబుతాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ తులసి ఇంటికి వెళ్లి సామ్రాట్ ఆఫీస్‌కు రమ్మని అడుగుతారు. కానీ, ఆమె మాత్రం రానని సమాధానం చెబుతుంది. దీంతో వాళ్లు నిరాశగా వెనుదిరుగుతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

6వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
6వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అంకిత, తులసి కలిసి వెళ్తుండగా అభి తన తల్లిని ఆపుతాడు. అంతేకాదు, డాడ్‌తో ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? ఆయనను తరచూ ఎందుకు అవమానిస్తున్నావు? అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో తులసి అతడికి సరైన సమాధానం చెబుతుంది. అనంతరం ప్రేమ్ ఈవెంట్ మేనేజర్ పిలిచాడని వెళ్తుండగా.. శృతి అతడి బైక్ గాలి తీసేస్తుంది. ఇక, కంపెనీలో సామ్రాట్ తులసి కోసం వేచి చూస్తుంటాడు. అనంతరం లాస్య, నందూ వెళ్లి తులసి రానంది అని చెప్తారు. అలాగే, ఆమెపై లేనిపోనివి అన్నీ చెప్పి అతడిలో కోపం పెంచుతారు.

7వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
7వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అభి ఒంటరిగా గాయత్రి ఇంటికి వెళ్తాడు. దీంతో ఆమెకు కోపం వచ్చి అంకిత ఎక్కడని ప్రశ్నిస్తుంది. అప్పుడతను అంకిత రాలేదని సమాధానం చెప్తాడు. దీంతో గాయత్రి కోపంలో అంకిత రాకపోతే నువ్వు ఈ ఇంటికి రావొద్దు అంటుంది. అంతేకాదు, ఆమెకు విడాకులు ఇవ్వమని అంటుంది. అనంతరం లాస్య ప్లాన్ ప్రకారం సామ్రాట్ గురించి తులసి విమర్శలు చేసినట్లు పేపర్లో వేయిస్తుంది. అది చూసిన సామ్రాట్‌కు కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే ఆ పేపర్ పట్టుకుని అతడు తులసి ఇంటికి వెళ్లి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.7వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
7వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అభి ఒంటరిగా గాయత్రి ఇంటికి వెళ్తాడు. దీంతో ఆమెకు కోపం వచ్చి అంకిత ఎక్కడని ప్రశ్నిస్తుంది. అప్పుడతను అంకిత రాలేదని సమాధానం చెప్తాడు. దీంతో గాయత్రి కోపంలో అంకిత రాకపోతే నువ్వు ఈ ఇంటికి రావొద్దు అంటుంది. అంతేకాదు, ఆమెకు విడాకులు ఇవ్వమని అంటుంది. అనంతరం లాస్య ప్లాన్ ప్రకారం సామ్రాట్ గురించి తులసి విమర్శలు చేసినట్లు పేపర్లో వేయిస్తుంది. అది చూసిన సామ్రాట్‌కు కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే ఆ పేపర్ పట్టుకుని అతడు తులసి ఇంటికి వెళ్లి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

8వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
8వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ చూసిన సామ్రాట్.. తులసి ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేస్తాడు. దీంతో ప్రేమ్ సహా ఇంట్లోని వాళ్లందరూ ఏమైందో చెప్పమని అడుగుతారు. దీంతో ‘నాతో పార్ట్‌నర్‌షిప్ వద్దనుకుంటే వచ్చి మాట్లాడాలి. అంతేకానీ, మెసేజ్ చేసి చెప్పడం. తర్వాత నా కంపెనీ రెప్యుటేషన్ పాడు చేయడం ఎందుకు? నాకు చెడ్డపేరు తీసుకు రావడం ఎందుకు? ఈ పేపర్ స్టేట్‌మెంట్ ఎందుకు' అని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత హనీ అతడిని ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది. దీంతో కూతురిపై సామ్రాట్ కోప్పడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

9వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
9వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి గురించి హనీకి అబద్ధం చెప్పి మేనేజ్ చేశావు కానీ తనకు నిజం తెలిస్తే ఏం చేస్తావు అని సామ్రాట్‌ను వాళ్ల బాబాయి అడుగుతాడు. దీంతో అతడు మరోసారి సీరియస్ అవుతూ తులసిని ఎప్పటికీ కలవను అని చెప్తాడు. ఆ తర్వాత హనీ, లక్కీ స్టేషనరీ షాప్ దగ్గర కలుస్తారు. ఆ తర్వాత తులసిని చూసిన వాళ్లిద్దరూ వినాయక చవితి పూజ కోసం ఇంటికి వస్తామని అడుగుతారు. దీనికామె ఓకే అంటుంది. ఆ వెంటనే ఇంటికి వచ్చి తమ తమ ఇళ్లల్లో పర్మీషన్ తీసుకుంటారు. ఇక, ప్రేమ్.. శృతిని కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
10వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. లాస్య, నందూకు చెప్పేసి లక్కీ.. తులసి వాళ్ల ఇంటికి వస్తాడు. ఆ తర్వాత సామ్రాట్ కూడా హనీని తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేస్తాడు. తనకు వేరే పని ఉందని కార్లోనే కూర్చుని ఉండిపోతాడు. అప్పుడు లాస్య, నందూ వచ్చి పిలవకుండా వచ్చినందుకు గింజుకుంటూ ఉంటారు. ఆ సమయంలో లాస్య.. నందూ, తులసితో చేసుకున్న ఒప్పందం గురించి మాట్లాడుతుంది. అదంతా కారులో ఉన్న సామ్రాట్ వినేస్తాడు. దీంతో నిజం తెలుసుకుని బాధ పడతాడు. ఇక, ఇంటికొచ్చిన నందూ, లాస్యను తులసి ఉండమని అంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
ప్టెంబర్ 5వ తేదీ నుంచి 10వ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో తన పార్ట్‌నర్‌షిప్ వద్దనడం, పేపర్‌లో ఆర్టికల్ వేయించడం వంటి ఆంశాలను పట్టుకుని సామ్రాట్.. తులసిపై గుర్రుగా ఉంటాడు. కానీ, ఆమె మాత్రం ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకుంటుంది. మరోవైపు, లాస్య, నందూ తులసిని మరింత ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలను మాత్రం ముమ్మరం చేసేశారు. అయితే, వాళ్ల మాటలు విన్న సామ్రాట్‌కు నిజం తెలియడంతో వచ్చే వారం మరింత ఆసక్తికరంగా సాగబోతుంది.


Click it and Unblock the Notifications











