మరో నటుడికి కరోనా పాజిటివ్.. అలా అయితేనే షూటింగ్‌లో పాల్గొంటామంటోన్న బుల్లితెర ఆర్టిస్ట్‌లు!
కరోనా మహమ్మరి రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే ఇండియాలో ఐదు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా స్వైర విహారం చేస్తోంది. ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల కారణంగా కరోనా అడ్డూ అదుపు లేకుండా వ్యాప్తి చెందుతోంది. దాదాపు వంద రోజుల తరువాత షూటింగ్‌లు ప్రారంభించేసరికి తమకు మంచిరోజుల వచ్చాయని సినీ కార్మికులు, ఆర్టిస్ట్‌లు సంబరపడ్డారు. కానీ అక్కడా కరోనా కలకలం సృష్టిస్తోంది.

షూటింగ్‌లు మొదలు..
సినిమా రంగాన్ని ఆదుకునేందకు ప్రభుత్వాలిచ్చిన సడలింపులే ఇప్పుడు శాపంగా మారాయి. ఎన్నో ఆశలతో షూటింగ్‌లను మొదలుపెట్టారు. బుల్లితెర సీరియల్స్ మొదటగా
షూటింగ్‌లు ప్రారంభించాయి. అయితే వారం తిరక్కుండానే వారికి షాక్ తగిలింది.

దెబ్బకు షాక్..
సీరియల్ నటుడు ప్రభాకర్‌కు కరోనా వచ్చిందనే వార్త అందర్నీ షాక్‌కు గురి చేసింది. జీ తెలుగులో ప్రసారం అయ్యే సూర్యకాంతం సీరియల్ సహా వేరొక సీరియల్ లోనూ ఆయన నటిస్తున్నాడు. అయితే ఈయనతో కలిసి దాదాపు 32 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.

మరొక కేసు..
తాజాగా ఇంటింటి గృహలక్ష్మీ నటుడు హరికృష్ణకు కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని తెలుస్తోంది. దీంతో మరోసారి అంతా ఉలిక్కి పడ్డారు. ఇలాగే కొనసాగితే తమ పరిస్థితి ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారట. అయితే తాజాగా అలాంటి వారందరికీ ఓ తీపి కబురు వచ్చింది.

అందరికీ నెగెటివ్..
ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన సీరియల్ ప్రభాకర్‌తో కాంటాక్ట్ అయిన 33 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా ఆ 32 మందికి నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అక్కడితో గండం గడిచినా మున్ముందు పరిస్థితి ఏంటని అంతా ఆందోళన చెందున్నారు.
Recommended Video

అలా అయితేనే షూటింగ్‌లకు..
తాజా పరిస్థితిని ఆధారంగా చేసుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఇకపై షూటింగ్‌లో పాల్గొంటామని, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్‌లో పాల్గొనేది లేదని ఖారఖండీగా సినీ, టీవీ కార్మికులు చెప్పుకొస్తున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











