For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నందూను బుక్ చేసిన లాస్య.. తులసి వద్దన్నా వినకుండా రెడీ

  |

  చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై మాత్రమే ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   సామ్రాట్ కోసం ఎంటరైన తులసి

  సామ్రాట్ కోసం ఎంటరైన తులసి

  సామ్రాట్, నందూ వంటల పోటీలో పాల్గొంటారు. నందూకు అభి, అంకిత.. సామ్రాట్‌కు ప్రేమ్, దివ్య సహాయం చేస్తారు. ఆ సమయంలోనే నందూ దగ్గరకు వచ్చిన లాస్య అతడికి వంటలో సహాయం చేస్తుంది. అప్పుడు హనీ 'నందూ అంకుల్‌కు లాస్య ఆంటీ సహాయం చేస్తున్నారు. ఇది చీటింగ్' అంటుంది. అప్పుడు లక్కీ 'నందూ అంకుల్‌కు మా మమ్మీ హెల్ప్ చేస్తే తప్పేముంది? కావాలంటే మీరు తులసి ఆంటీ హెల్ప్ తీసుకోండి' అంటాడు. దీంతో హనీ.. తులసి ఆంటీ మీరు మా డాడీకి హెల్ప్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేయగా ఆమె ఎంటరవుతుంది.

   నందూకు గట్టి క్లాస్ తీసుకోవడంతో

  నందూకు గట్టి క్లాస్ తీసుకోవడంతో


  వంటలు చేయడం అయిన తర్వాత జడ్జ్‌లుగా ఉన్న తులసి, లాస్య‌ను వాటిని టేస్ట్ చేసి ఎవరు విజేతలో చెప్పాలని ఇంట్లో వాళ్లు అడుగుతారు. అప్పుడు నందూ 'అసలు వంటలు చేయాల్సింది ఆడవాళ్లు. వాటిని మేము టేస్ట్ చేయాలి. అంతేకానీ ఇలా చేయడం ఏంటి' అని అడుగుతాడు. అప్పుడు తులసి 'వంటలు ఆడవాళ్లే చేయాలని ఎక్కడ ఉంది నందగోపాల్ గారు? అలా అయితే మరి ఆడవాళ్లతో జాబ్ ఎందుకు చేయిస్తున్నారు? ఆడవాళ్లను చులకన చేసి మాట్లాడే తీరును మార్చుకోవాలి. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది' అంటూ క్లాస్ పీకుతుంది.

  శివాని రాజశేఖర్ అందాల ఆరబోత: తొలిసారి ఇంత హాట్‌గా కనిపించడంతో!

   పోటీలో విజేతగా సామ్రాట్ ఎంపిక

  పోటీలో విజేతగా సామ్రాట్ ఎంపిక


  లాస్య, తులసి జడ్జ్‌లుగా ఉండడానికి నందూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తులసి కూడా ఆలోచిస్తుంది. ఆ తర్వాత 'ఈ పరిస్థితుల్లో లాస్య, నేను జడ్జ్‌లుగా ఉండకూడదు. కాబట్టి అత్తయ్య, మామయ్యలే ఈ పోటీలో విజేతలను నిర్ణయిస్తారు' అని చెప్తుంది. దీనికి లాస్య 'అదేంటి తులసి? వాళ్లెలా జడ్జ్ చేస్తారు' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు సామ్రాట్ 'లాస్య మీరు ఆగండి. తులసి గారు చెప్పిన ఐడియా బాగుంది కదా' అంటాడు. ఆ తర్వాత పరందామయ్య, అనసూయ అన్ని వంటలను రూచి చూస్తారు. ఇక, ఇందులో సామ్రాట్ విజేతగా నిలిచినట్లు వాళ్లిద్దరూ ప్రకటిస్తారు.

  సామ్రాట్.. దివ్య చెస్.. మళ్లీ విన్నే

  సామ్రాట్.. దివ్య చెస్.. మళ్లీ విన్నే


  వంటల పోటీ ముగిసిన తర్వాత అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే దివ్య, సామ్రాట్ మధ్య చెస్ పోటీ జరుగుతుంది. అప్పుడు హనీ 'ఇది చాలా చీటింగ్. మా డాడీ ఒక్కరే ఆడుతుంటే మీరందరూ సహాయం చేసుకుంటున్నారు' అంటుంది. అప్పుడు లక్కీ 'కావాలంటే నువ్వు మీ డాడీ కోసం తులసి ఆంటీ హెల్ప్ తీసుకో' అంటాడు. దీంతో అక్కడే ఉన్న నందూ 'మధ్యలో వీడి సలహాలు మాటలు నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి' అని లక్కీని అంటాడు. ఆ తర్వాత తులసి తనకు చెస్ ఆడడం రాదని అంటుంది. మొత్తానికి ఈ పోటీలో సామ్రాట్‌ విజేతగా నిలుస్తాడు. దీంతో అందరూ అతడికి చప్పట్లు కొట్టి అభినందిస్తారు.

  యాంకర్ శ్రీముఖి గ్లామర్ షో: అబ్బో ఆమె అందాలు చూసి తట్టుకోగలరా!

   వాళ్లిద్దరూ క్లోజ్‌గా.. నందూ కోపంగా

  వాళ్లిద్దరూ క్లోజ్‌గా.. నందూ కోపంగా


  సామ్రాట్ విజయం సాధించగానే తులసితో పాటు అందరూ చప్పట్లు కొడతారు. దీంతో నందూ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు అతడి వెనకాలే లాస్య వెళ్లి ఏమైందని అడుగుతుంది. అప్పుడు నందూ 'సందు దొరికింది కదా అని ఆ సామ్రాట్ తులసితో సరదాగా చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది' అని అంటాడు. దీంతో లాస్య 'ఇప్పుడు సామ్రాట్ వచ్చి ఏమైందని అడిగితే ఏం చెప్తావు' అని ప్రశ్నిస్తుంది. దీనికి నందూ 'అంతా చెబుతాను. నువ్వు తులసితో చనువుగా ఉండడం నాకు నచ్చడం లేదని అంటాను' అని చెప్తాడు. అప్పుడు లాస్య 'నువ్వు అలా చెప్తే మీ ఇద్దరి మధ్య రిలేషన్ గురించి ఆయనకు తెలిసిపోతుంది. అది అవసరమా' అని అంటుంది. అంతలో సామ్రాట్ అక్కడకు వచ్చి వాళ్లను ఇంట్లోకి తీసుకు వెళ్తాడు.

   నందూను బుక్ చేసేసిన లాస్య

  నందూను బుక్ చేసేసిన లాస్య


  నందూ, లాస్య ఇంట్లోకి వెళ్లిన తర్వాత సామ్రాట్ గురించి వాళ్ల బాబాయి ఎన్నో విషయాలు చెప్తాడు. 'మా సామ్రాట్ చాలా మంచి ప్లేయర్. అన్నింట్లోనూ వాడు అదరగొట్టేవాడు. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎన్నో ఫ్రైజ్‌లు కూడా వచ్చాయి. ఆర్మ్స్ రెజ్లింగ్‌లో మావాడు స్పెషలిస్టు' అని చెప్తాడు. అప్పుడు లాస్య 'సామ్రాట్ గారికి సరైన వాడు దొరకలేదు అనుకుంటా. అందుకే ఆయన అన్నింట్లోనూ గెలిచారు' అంటుంది. అప్పుడు సామ్రాట్ వాళ్ల బాబాయి 'సరైనోడు అంటే ఏంటి లాస్య.. అలా ఎవరున్నారు' అని పదే పదే అడుగుతాడు. దీంతో ఆమె నందూ పేరు చెప్తుంది.

  విచిత్రమైన డ్రెస్‌లో జాన్వీ కపూర్ రచ్చ: వామ్మో మరీ ఇంత దారుణమా!

  నందూ, సామ్రాట్ మధ్య పోటీ

  నందూ, సామ్రాట్ మధ్య పోటీ


  లాస్య.. నందూ పేరు చెప్పగానే అతడు మనసులో 'మళ్లీ నన్నే బుక్ చేసేసింది. అసలు ఈ లాస్య ఏమనుకుంటుందో అర్థం కావడం లేదు' అంటాడు. అప్పుడు లక్కీ 'ఇప్పుడు సామ్రాట్ అంకుల్ మా నందూ అంకుల్‌తో పోటీ పడాలి. లేకపోతే ఆయన భయపడినట్లే' అని రెచ్చగొడతాడు. కానీ, సామ్రాట్, తులసి మాత్రం ఈ పోటీ వద్దని చెప్తుంది. కానీ, లక్కీ ఊరుకోకుండా నందూను హైలైట్ చేస్తాడు. అప్పుడు లాస్య కూడా 'నువ్వు ఒప్పుకో నందూ. బాస్ చేతిలో ఓడినా పర్వాలేదు. నీ మీద ఆయనకు సింపతీ వస్తుంది' అని చెప్తుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 702: Samrat Defeated Nandhu in a Cooking Competition. After That They Get Ready to Take part in an Arm Wrestling Competition.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X