For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు నిజం చెప్పిన నందూ.. తులసిని అక్కడికి రమ్మన్న సామ్రాట్

  |

  తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి పాడిన పాటకు ఫిదా అయిన సామ్రాట్.. ఇంత టాలెంట్‌ను ఎందుకు దాచుకున్నారని అడుగుతాడు. దీంతో ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అందులో నందూ.. తులసి టాలెంట్‌ను తొక్కేసినట్లు చూపిస్తారు. ఆ తర్వాత అనసూయ కూడా తులసి ఎదగకపోడానికి తానే కారణం అంటుంది. ఆ సమయంలో చిన్న డిస్కర్షన్ జరుగుతుంది. ఇక, సామ్రాట్ వాళ్ల బాబాయి తులసిని 'నీ భర్త నిన్ను ఎందుకు వదిలేశాడు' అని అందరి ముందే అడుగుతాడు. దీంతో తులసికి కోపం వచ్చి దండం పెట్టేసి మరీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

  శివాత్మక రాజశేఖర్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌తో ఓ రేంజ్ ట్రీట్

  లాస్యకు నిజం చెప్పేసిన నందూ

  లాస్యకు నిజం చెప్పేసిన నందూ


  సామ్రాట్ మీద కోపంతో నందూ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అంటాడు. దీంతో లాస్య నీ మైండ్ లోనే ఏదో చిప్ దొబ్బింది అంటుంది. అప్పుడు నందూ 'అసలు నీవల్లే నా పరిస్థితి ఇలా అయింది. నాకు, సామ్రాట్ మీద హాండ్ రైజ్ ఎందుకు చేయించావు' అని అడుగుతాడు. దీంతో లాస్య అయితే ఏమైంది. నువ్వు గెలిచావు కదా అంటుంది. దీనికి నందూ 'నేను గెలవలేదు. ఆ సామ్రాట్ ఓడిపోయాడు. కావాలని ఓడిపోయి నన్ను గెలిపించాడు. తులసి సైగ చేయడంతో ఆ సామ్రాట్ ఓడిపోయాడు' అని చెప్తాడు. దీంతో లాస్య ఈ విషయం నాకు తెలియదు అంటుంది.

   నందూను హెచ్చరించిన లాస్య

  నందూను హెచ్చరించిన లాస్య


  నందూ అసలు విషయం చెప్పగానే లాస్య 'నువ్వు నిజంగానే గెలిచావేమో అనుకుని నిన్ను అభినందించాను. అసలు జరిగింది ఇదేనా' అంటూ అతడిని చులకన చేసి మాట్లాడుతుంది. అప్పుడు నందూ 'ఈ జాబ్ పోతే పోయింది మనం ఇంకోటి చూసుకుందాం' అంటాడు. దీనికి లాస్య 'అయినా ఏంటి జాబ్ పోతే పోయేది. ఈ పరిస్థితుల్లో జాబ్ పోతే పొందడం ఎంత కష్టమో నీకు తెలుసు కదా. నువ్వు అలాంటి ఆలోచన మానేయ్. అసలు దాని గురించి ఆలోచించకు. ముఖ్యంగా తులసి విషయంలో జాగ్రత్తగా ఉండు' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

  ఏకంగా టాప్‌ను విప్పేసిన ప్రియాంక చోప్రా: అబ్బో ఆమె ఫోజు చూశారంటే!

  తులసి ఇంటికి వచ్చిన సామ్రాట్

  తులసి ఇంటికి వచ్చిన సామ్రాట్

  సామ్రాట్, అతడి బాబాయి తులసి ఇంటికి వస్తారు. తులసి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన సామ్రాట్‌ను చూసి తులసి కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. అప్పుడు సామ్రాట్ 'నేను చెప్పానా బాబాయి. నువ్వు వినిపించుకోవు. అర్థం చేసుకోవు. నీ మొండితనం నీదే' అంటూ ఫైర్ అవుతూ ఉంటాడు. దీంతో ఆయన వీడేంటి నా మీద విరుచుకుపడుతున్నాడు అని అనుకుంటాడు. తర్వాత ఏమైందిరా అని అడుగుతాడు. అప్పుడు సామ్రాట్ 'చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతావు' అని అంటూ బాబాయిపై విరుచుకుపడతాడు.

   తులసి ముందు సామ్రాట్ నటన

  తులసి ముందు సామ్రాట్ నటన


  సామ్రాట్ వాళ్ల బాబాయిని తిడుతుండగా తులసి 'మీ బాబాయి గారి మీద ఎందుకు అంతలా చిరాకుపడుతున్నారు. ఏం చేశారని' అంటుంది. అప్పుడు సామ్రాట్ నోరు జారి మాట అనేశావు కదా అని వాళ్ల బాబాయితో అంటాడు. అప్పుడాయన ఎవరిని అంటే.. సామ్రాట్ 'తులసి గారిని. అడగకూడనిది అడిగావు.. ఇప్పుడు చూడు.. తులసి గారు మనల్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుగా నిలబడ్డారా లేదా. మా బాబాయికి ఈ శాస్తి జరగాల్సిందే. మీరు మాత్రం అస్సలు తగ్గకండి. ఇలాగే పట్టుదలగా ఉండండి. అప్పుడు గానీ మా బాబాయికి బుద్ధి రాదు. ఇక పదా వెళ్దాం' అంటాడు.

  ఒంటిపై నూలు పోగు లేకుండా నితిన్ హీరోయిన్ ఫోజులు: మరీ ఇంత పచ్చిగానా!

   తులసికి మరోసారి గిప్ట్ ఇచ్చాడు

  తులసికి మరోసారి గిప్ట్ ఇచ్చాడు


  సామ్రాట్ మాటలకు తులసి 'మీ బాబాయి గారు ఏం తప్పు చేశారు. పెద్దవాళ్లు అలాగే మాట్లాడుతారు. నేనే కొంచెం అతిగా ప్రవర్తించాను. సారీ' అంటుంది. దీంతో సామ్రాట్ 'అయ్యో.. మీరెందుకు సారీ చెప్పడం' అంటాడు. అప్పుడు వాళ్ల బాబాయి 'క్షమించమ్మా. ఇంకెప్పుడు నేను ఆ విషయం గురించి అడగను' అంటాడు. అప్పుడు తులసి నేను కూడా ఆ విషయాన్ని మరిచిపోయా అంటుంది. దీంతో సామ్రాట్ నేను నమ్మేదెలా అని.. కారు దగ్గరికెళ్లి వీణను తీసుకొచ్చి తులసి దగ్గరికి వస్తాడు. దాన్ని తులసి తీసుకుంటుంది. అప్పుడు అంకిత 'ఒక గిఫ్ట్‌ను ఒకసారి అందుకోవడమే గ్రేట్. అలాంటిది మా ఆంటి ఒకే గిఫ్ట్‌ను ఒకే వ్యక్తి నుంచి రెండు సార్లు అందుకుంది. చాలా గ్రేట్' అంటుంది. తర్వాత తులసి వాళ్లను పిలవగా సామ్రాట్ పనుందని వెళ్లిపోతాడు.

   లాస్య, నందూకు సామ్రాట్ షాక్

  లాస్య, నందూకు సామ్రాట్ షాక్


  సామ్రాట్ ఇంటికి నందూ, లాస్య వస్తారు. వాళ్లంతా తులసి కోసం వెయిట్ చేస్తుంటారు. అప్పుడు సామ్రాట్ 'మీటింగ్ ఉందని తులసికి తెలుసు కదా. మరి ఇంకా రాలేదేంటి' అని అంటాడు. దీంతో నందూ టైమ్ సెన్స్ లేదు అంటూ నందూ ఫోన్ చేస్తుండగానే తులసి ఆటో దిగి వచ్చేస్తుంది. అప్పుడు సామ్రాట్ 'వ్యక్తిగతంగానే కాదు.. వర్క్ విషయంలోనూ అంతే నిజాయితీ ఉండాలి తులసి గారు. ఏ కారణంతో మీకు లేట్ అయిందో నాకు తెలియదు కానీ.. ఇలా ఇంకొకరిని వెయిట్ చేయించి టైమ్ వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. నాకు అది నచ్చదు. వచ్చి కూర్చోండి' అంటాడు. అప్పుడు నందూ, లాస్య కూడా తులసిని తిడతారు. దీంతో సామ్రాట్.. తులసికి వాళ్లతో క్షమాపణలు చెప్పిస్తాడు.

  శృతి మించిన గబ్బర్ సింగ్ బ్యూటీ హాట్ షో: ఆమె డ్రెస్ చూస్తే మెంటలెక్కిపోవడమే!

  తులసిని వైజాగ్ రమ్మని కోరుతూ

  తులసిని వైజాగ్ రమ్మని కోరుతూ


  ఆ తర్వాత తులసి మ్యూజిక్ స్కూల్ డిజైన్ గురించి చర్చిస్తారు. అప్పుడు సామ్రాట్ మీకు ఓకేనా అని అడుగుతాడు. దీంతో నాకు నచ్చింది అంటుంది. ఆ తర్వాత సామ్రాట్ రేపు మీరు వైజాగ్ నాతో వస్తున్నారా అని నందూను అడుగుతాడు. దీంతో రేపు ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నాను కుదరదు అంటాడు. దీంతో సామ్రాట్ బాబాయి 'తులసిని తీసుకెళ్లరా.. తనకూ అనుభవం వస్తుంది' అంటాడు. దీనికి సామ్రాట్ 'నేనూ అదే అనుకుంటున్నాను' అంటాడు. దీంతో నందూ, లాస్యకు కోపం వస్తుంది. ఆ తర్వాత నందూ ఇదే విషయం గురించి లాస్యతో మాట్లాడతాడు. అప్పుడు సామ్రాట్‌పై కోపం వస్తుందని అంటాడు. ఆ సమయంలోనే లాస్య.. నందూను రెచ్చగొడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 705: Nandhu Decides to Resign From his Job. Then Lasya Warns Him. After That Samrat Applauds Tulasi for her kind Nature.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X