For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి సామ్రాట్ గుడ్ న్యూస్.. చేయకూడని తప్పు చేసిన లాస్య

  |

  ఎప్పటికప్పుడు సరికొత్త నేపథ్యాలతో కార్యక్రమాలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

   సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గుడికి వెళ్లేందుకు బయలుదేరిన సామ్రాట్‌ను అసలు మీకు దేవాలయానికి వెళ్లమని ఎవరు చెప్పారని తులసి ప్రశ్నిస్తుంది. దీంతో ఆఫీస్‌లోని కొందరు చెప్పారని అంటాడు. ఆ తర్వాత ఆ గుడికి వెళ్లి పూజలు చేయించుకున్నాక.. ముడుపు కట్టమని పూజారి చెప్తాడు. దీంతో సామ్రాట్, తులసి ముడుపులు కడతారు. అయితే, తులసి ఏం కోరిక కోరిందో అని సామ్రాట్ చూస్తాడు. అదంతా చూసిన పూజారి.. ఆ కోరికను నువ్వే తీర్చాలి అని సామ్రాట్‌కు చెబుతాడు. ఇక, లాస్య తనను అవమానించిన విషయాన్ని ప్రేమ్‌కు శృతి చెప్పేస్తుంది.

  Bigg Boss Winner: ఫినాలే వీక్‌లో షాకింగ్ ఓటింగ్.. అతడికే అన్ని ఓట్లా.. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరంటే!

   తులసిని సర్‌ప్రైజ్ చేయాలని

  తులసిని సర్‌ప్రైజ్ చేయాలని


  తులసి తన కోరికను చెప్పకపోవడంతో సామ్రాట్ 'ఆ అమ్మవారు ఎంత బిజీగా ఉంటారు కదా. మీ కోరిక ఏంటో చెబితే నా ప్రయత్నం నేను చేస్తాను. అయినా నేను మిమ్మల్ని గుడికి తీసుకెళ్లడం వల్లనే కదా.. మీకు ముడుపు కట్టుకునే అవకాశం వచ్చింది. అందుకే మీరు నాకు థాంక్స్ చెప్పుకోవాలి. అన్నట్టుగా రేపు మనం ప్రాజెక్ట్ పనిమీద ఊరికి వెళ్తున్నాం. మీరు కూడా వస్తున్నారు. ఉదయం 7 గంటలకే వెళ్లాలి' అని చెబుతాడు. దీంతో తులసి ఏ ఊరికి అని అడుగుతుంది. దీనికతడు నాకు తెలియదు.. అంటే ఫైల్‌లో ఉంది చూడలేదు అని సమాధానం చెబుతాడు.

   ప్రేమ్‌కు ఫుడ్.. నందూ డౌట్‌గా

  ప్రేమ్‌కు ఫుడ్.. నందూ డౌట్‌గా


  ఇంట్లో కూర్చూని నందూ లాప్‌టాప్‌లో ఏదో చూసుకుంటూ ఉంటాడు. అంతలో ఒక డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకుని వస్తాడు. అప్పుడు నందూ వెళ్లి ఎవరు ఆర్డర్ చేశారు అని ప్రశ్నిస్తాడు. దీంతో అతడు చెక్ చేసి ప్రేమ్ అనే పేరు మీద ఫ్రైడ్ రైస్‌ను ఆర్డర్ చేశారు సార్ అని చెప్పి ఫుడ్ ఇచ్చేస్తాడు. అప్పుడు నందూ 'అదేంటి ఎప్పుడూ లేనిది ప్రేమ్ ఫుడ్ ఎందుకు ఆర్డర్ చేశాడు' అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతలో లాస్య అక్కడకు వచ్చి 'ఏంటి నందూ.. ప్రేమ్ ఫుడ్ ఆర్డర్ చేశాడా' అని అడుగుతుంది. దీంతో నందూ నీకెలా తెలుసు అని ఆమెను ప్రశ్నిస్తాడు.

  మరోసారి హద్దు దాటిన కేతిక శర్మ: బెడ్‌పై ఆ బాడీ పార్టులు కనిపించేలా!

   భర్తకు అబద్ధం చెప్పిన లాస్య

  భర్తకు అబద్ధం చెప్పిన లాస్య


  నందూ అడిగిన దానికి లాస్య 'ఇప్పుడు ఇంట్లో అందరికి కలిసి ఒకసారి వండితే బాగుంటుందా? ఒక్కొక్కరిగా ఒకలా వండితే బాగుంటుందా? అందరం కలిసి ఒకటి తింటినే కదా డబ్బులు ఆదా అవుతాయి. ఇప్పుడు మన పరిస్థితికి అలాగే చేయాలి కదా' అంటుంది. దీనికి నందూ అవును అంటాడు. అప్పుడు లాస్య 'ఇదే మాటను ప్రేమ్‌కు చెప్పాను. ఇంట్లో పరిస్థితి బాలేదు ఖర్చులు తగ్గించుకుందాం అని వివరంగా చెప్పాను. దానికి వాళ్లకు కోపం వచ్చినట్లుంది. అందుకే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు' అని జరిగింది కాకుండా అబద్ధాలను చెబుతుంది.

  శృతికి నందూ క్లాస్ పీకడంతో

  శృతికి నందూ క్లాస్ పీకడంతో


  లాస్య చెప్పింది నిజమేనేమో అనుకుని నమ్మేసిన నందూ.. గతంలో మాదిరిగా కాకుండా సున్నితంగానే మాట్లాడతాడు. ఆ వెంటనే అక్కడున్న శృతిని పిలిచి 'చూడు శృతి.. నువ్వేమీ చిన్నపిల్లవు కాదు. మా ఇద్దరికీ ఉద్యోగాలు లేవు. కాబట్టి అందరం అడ్జస్ట్ చేసుకుని తినాలి. ఇది అందరం అర్థం చేసుకుంటే మంచిది. మంచి మాటలు తులసి చెబితేనే కాదు.. ఎవరు చెప్పినా వినాలి. ఇంకోసారి నాకు ఇలాంటి ఫిర్యాదు అందకూడదు' అని వెళ్లిపోతాడు. దీంతో లాస్య 'చూశావా? నేనేమీ అన్నానో నందూ కూడా అదే చెప్పాడు. కాబట్టి ఫాలో అవ్వండి' అంటుంది. దీంతో శృతి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అనసూయ ఆమెను ఓదార్చుతుంది. దీంతో పరందామయ్య ఈ విషయం ప్రేమ్‌కు చెప్పొద్దు అని అంటాడు.

  నటి సురేఖ వాణి అందాల ఆరబోత: షర్ట్ విప్పేసి.. ప్యాంట్ లేకుండా వామ్మో!

   సామ్రాట్‌కు హానీగుడ్ న్యూస్

  సామ్రాట్‌కు హానీగుడ్ న్యూస్


  సామ్రాట్ ఇంట్లో ఉండగా హనీ స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది. దీంతో అతడు 'ఎప్పుడూ లేనిది హనీ ఇంత సీరియస్‌గా ఉందేంటి? ఏం జరిగి ఉంటుంది. ముఖం చూసి పలకరించలేదు. రిజల్ట్ వచ్చిందేమో.. ఫస్ట్ ర్యాంక్ మిస్ అయిందేమో. ఇప్పుడు ఏం చేయాలి. హనీని ఎలా కూల్ చేయాలి' అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు హనీ మోసం చేశావు. అసలు నువ్వు దేవుడితో మాట్లాడావా అని అడుగుతుంది. దీంతో మాట్లాడటమే కాదు.. అమ్మవారికి ముడుపు కూడా కట్టాను అంటాడు. అలా టెన్షన్ పెట్టిన తర్వాత హనీ తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెబుతుంది.

   తులసికి చెప్పేసిన సామ్రాట్

  తులసికి చెప్పేసిన సామ్రాట్


  హనీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్న సంతోషంలో సామ్రాట్ సంబరపడుతుంటాడు. అంతేకాదు, 'నువ్వు వచ్చేలోపు నీకు ఇష్టమైన వంటలు చేయించాను. నువ్వు రెడీ అయి వస్తే ఇద్దరం కలిసి భోం చేద్దాం అంటాడు. ఇంతలో తులసి అతడికి ఫోన్ చేస్తుంది. అప్పుడు సామ్రాట్ 'సరిగ్గా మీ గురించే ఆలోచిస్తున్నాను. ఇంతలో మీరే కాల్ చేశారు. మీకు గుడ్ న్యూస్ చెబుదామని అనుకున్నా. హనీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది' అంటాడు. దీంతో తులసి 'అవునా.. అయితే అమ్మ వారి పవర్ రుజువు అయిందన్నమాట అంటుంది. అంటే నా కోరికపై కూడా నమ్మకం పెట్టుకోవచ్చు' అంటుంది. తర్వాత సామ్రాట్ రేపు మనం ఓ ఊరు వెళ్తున్నాం అంటాడు. దీంతో ఏ ఊరని తులసి అడుగుతుంది. కానీ, అతడు మాత్రం సస్పెన్స్ అంటాడు.

  బీచ్‌లో రెచ్చిపోయిన దీపికా పిల్లి: టాప్ కిందకు జరిపి హీటు పెంచేలా!

   పరందామయ్యకు లాస్య షాక్

  పరందామయ్యకు లాస్య షాక్

  పరందామయ్యకు ఆకలి వేస్తుండడంతో అనసూయ ఓ వంటకాన్ని తీసుకుని వస్తుంది. అవి ఆయన నోట్లో వేసుకుంటూ ఉండగా లాస్య వచ్చి తిననివ్వకుండా ఆపుతుంది. అంతేకాదు, వాటిని ఆమె తింటూ ఉంటుంది. అలా మొత్తం ఖాళీ చేసేస్తుంది. తర్వాత 'ఇలాంటి మసాలా ఐటెమ్స్ మీరు తినకూడదు. ఇలాంటివి నాకు కూడా చేసి పెట్టొచ్చు కదా. మీరు వీటికి దూరంగా ఉంటే కాస్త ఒళ్లు తగ్గుతుంది' అని వెళ్లిపోతుంది. దీంతో అనసూయ తను కావాలనే చేస్తోంది అంటుంది. అప్పుడు పరందామయ్య 'మొగుడు పెళ్లాల మధ్య బంధం తుమ్మితే ఊడిపడేలా ఉంది. ఇప్పుడు మనం రెచ్చిపోతే వాళ్ల కాపురం రోడ్డున పడుతుంది. చూడు అనసూయ.. ఓపిక ఉన్నంత వరకు భరిద్దాం. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు' అని చెబుతాడు.

  నందూ కోసం ప్రాణం తెగించి

  నందూ కోసం ప్రాణం తెగించి


  తర్వాత రోజు ఉదయాన్నే సామ్రాట్, తులసి కారులో ఊరు వెళ్తుంటారు. అప్పుడతను మిమ్మల్ని ఉదయాన్నే హడావుడి పెట్టానా అని అడుగుతాడ. దీంతో తులసి 'మా వాళ్లు ఉంటే హడావుడే ఉండేది. కానీ, ఇప్పుడు నేను ఒంటరిదాన్నే కదా' అంటూ దివ్య స్టోరీ చెబుతుంది. 'దివ్య కడుపులో ఉన్నప్పుడు కాన్పు కష్టం అబార్షన్ చేయించుకో అన్నారు. లేకపోతే ప్రాణానికే ప్రమాదం అన్నారు. కానీ, నందగోపాల్ గారికి ఆడపిల్ల అంటే ప్రాణం. ఆయన కోసం ప్రాణాలకు తెగించి దివ్యను కన్నాను' అని చెబుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 814: Honey Shares her Happiness with Samrat. After That Lasya Misleads Nandhu with her Cheap Tricks Against the Family.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X