Intinti Gruhalakshmi: దివ్యకు తెలిసిన అసలు నిజం.. ఆమెతో పెళ్లికి ఒప్పుకున్న విక్రమ్.. తులసి మాత్రం!
ఎప్పటికప్పుడు కొత్త షోలు వస్తున్నా తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య ప్లాన్ ప్రకారం తులసిని తన భార్యగా నటించేలా అడగడానికి నందూ.. పరందామయ్య, అనసూయకు ఈ విషయం చెప్తాడు. దీంతో వాళ్లిద్దరూ అతడికి గట్టిగానే క్లాస్ పీకుతారు. ఇక, హాస్పిటల్‌లో ఫైల్‌పై సంతకం చేయించడం కోసం సంజయ్ రూమ్‌కు వెళ్లిన దివ్యకు.. అక్కడ అతడు ఓ నర్స్‌తో రొమాన్స్ చేస్తూ దొరికిపోతాడు. దీంతో ఇద్దిరి మధ్య వాదన జరుగుతుంది. ఆ తర్వాత లాస్య వచ్చి కాసేపు కాకా పట్టి తులసికి విషయం చెప్తుంది. దీంతో ఆమె గట్టిగానే సీరియస్ అవుతుంది. ఇక, విక్రమ్‌ను దివ్య మళ్లీ అపార్థం చేసుకుంటుంది.

విక్రమ్‌ను అపార్థం చేసుకుని
శిరీషను మోసం చేసింది విక్రమ్ అనుకున్న దివ్య 'గంగి గోవులా చూడ్డానికి అమాయకంగానే కనిపించాడు. కానీ ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదు' అంటుంది. దీంతో శిరీష వాళ్ల అమ్మ ఆ అబ్బాయి మీకు తెలుసా అమ్మా అని అడగ్గా 'తెలుసు అడిగి అడగగానే అడిగినంత డబ్బు ఇచ్చి అమ్మాయిలను ట్రాప్ చేసి ముగ్గులోకి దింపుతాడు. అదృష్టం బాగుంది కాబట్టి వాడి బారి నుంచి నేను తప్పించుకున్నాను. లేదంటే నాకు ఇదే పరిస్థితి వచ్చేదేమో' అని దివ్య అంటుంది. తర్వాత శిరీష వాళ్ల అమ్మకు ధైర్యం చెప్పి.. ఆమెకు న్యాయం చేస్తానని భరోసాను కల్పిస్తుంది.

విక్రమ్‌పై తల్లి దొంగ ప్రేమతో
ఇక, రాజ్యలక్ష్మి బసవయ్యతో మాట్లాడుతూ 'ఎలా అయినా ఈ పెళ్లి సంబంధం కుదరాలి. ఎక్కడ ఉన్నాడు మన కీలుబొమ్మ' అని అడుగుతుంది. అంతలోనే విక్రమ్ అక్కడకు వస్తాడు. అప్పుడు అతడిపై రాజ్యలక్ష్మి దొంగ ప్రేమ కురిపిస్తూ నా దిష్టే తగిలేలా ఉంది అంటాడు. అప్పుడు బసవయ్య 'ఆహాహా ఈ తల్లి కొడుకులకు నా దిష్టి తగిలేలా ఉంది' అని అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి 'నాన్న ఇన్ని రోజులు నీకు అమ్మ స్థానంలో నేను ఉన్నాను. మరి కొద్ది రోజుల్లో ఆ స్థానాన్ని భార్య తీసుకోబోతోంది' అంటాడు. దీంతో విక్రమ్ 'ఇప్పటికీ నాకు అమ్మ స్థానంలో నువ్వు మాత్రమే ఉంటావు ఇంకెవరు రారు' అంటాడు. అప్పుడే బసవయ్య వాళ్ల బంధం గురించి మరింతగా మాట్లాడుతుంటాడు.

బలిచ్చే మేకపోతు అంటూ
విక్రమ్‌తో రాజ్యలక్ష్మి ప్రేమగా మాట్లాడుతుండడంతో బసవయ్య 'పాపం బలిచ్చే మేకపోతులా తలూపుతున్నాడు. బలివ్వడానికే పెంచినట్లు పెంచుతున్నావు. కానీ వాడికి ఆ విషయం తెలియక నిన్ను గొర్రె కసాయి వాడిని నమ్ముతున్నట్లు' అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే పెళ్లి వాళ్ళు రావడంతో బసవయ్య లోపలికి పిలుచుకొని వచ్చి అందర్నీ పరిచయం చేస్తూ ఉంటాడు. అప్పుడాయన 'పెళ్లి కూతురు ఫోటో చూడగానే ఈ అమ్మాయి తెగ నచ్చేసింది. అందుకే మిమ్మల్ని పిలిపించాము. మీ అమ్మాయి మా వాడికి సరైన జోడీ' అని బాగా మాట్లాడతాడు.

పెళ్లి చెడగొట్టాలన్న ప్లాన్‌తో
వాళ్లు మాట్లాడుతూ ఉండగానే విక్రమ్ వాళ్ల తాతయ్య అక్కడకు వస్తాడు. అలాగే, సంజయ్ కూడా వస్తాడు. అప్పుడు అతడికి అమ్మాయిని చూపించగానే 'నీకు పర్ఫెక్ట్ జోడి అన్నయ్య' అని అబద్ధం చెబుతుంటాడు. అంతేకాదు, అందరి ముందరే నీకు నచ్చింది కదా అన్నయ్య అని అడుగుతాడు. దీంతో విక్రమ్ 'ఇంతకుముందే చెప్పాను కదా. అమ్మకు ఇష్టమైతే నాకు ఓకే' అని అంటాడు. అప్పుడు అందరూ నవ్వుతూ ఉంటారు. ఆ సమయంలోనే దేవుడు.. విక్రమ్ వాళ్ళ తాతయ్యకు 'అసలు అమ్మాయికి పెళ్లి ఇష్టం లేనట్టుంది ఈ కారణం చాలు మనం పెళ్లి సంబంధం చెడగొట్టడానికి' అని సలహా ఇస్తాడు. దీంతో ఆయన 'విక్రమ్ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే బయటకు తీసుకెళ్లు' అంటాడు.

వాసుదేవ్ ఎంట్రీ.. నాటకం
నందూ వాళ్ళ ఫ్రెండ్ వాసుదేవ్ కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. 'వాడు వస్తాడు వాడికి నిజం తెలిస్తే ఇంట్లోకి రాకుండా అలాగే వెళ్ళిపోతాడు' అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే వాసుదేవ్ వస్తాడు. ఇప్పుడు పరంధామయ్య ఎదురు వెళ్లి ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. అప్పుడు నందూ నిజం తెలిస్తే ఏమనుకుంటాడో అని టెన్షన్ పడుతూ ఉండగా 'ఏంటి నందు నాతో డీలింగ్ కుదుర్చుకోవడం నీకు ఇష్టం లేదా' అని ప్రశ్నిస్తాడు. దీంతో 'నువ్వు షడన్‌గా వచ్చే సరికి టెన్షన్‌గా ఉందిరా' అంటాడు. అప్పుడు వాసుదేవ్.. తులసి గురించి అడుగుతాడు. అప్పుడు ఆమె 'హారతి తీసుకొని వచ్చేసరికి లేట్ అయింది అన్నయ్య' అంటూ వస్తుంది. ఆ తర్వాత అందరూ వెళ్లి లోపల కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.

తులసి అబద్ధం చెప్పగానే
వాసుదేవ్ మాట్లాడుతున్నా నందూ టెన్షన్ పడుతుంటాడు. అప్పుడు తులసి 'అవును అన్న మీరు అన్నది నిజమే. ఆయన చలువ వల్లే నేను లోకమంటే ఏంటో తెలుసుకోగలిగాను. నా కాళ్ల మీద నేను బతుకుతున్నాను' అంటుంది. దీంతో వాసుదేవ్ అసలు విషయం తెలియక నందూను పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత తులసి కాఫీ తీసుకోవడానికి కిచెన్‌లోకి వెళ్ళగా వెనకాలే నందూ కూడా వెళ్తాడు. అప్పుడు తులసి 'మోసం చేయడం అంత మంచిది కాదు. మీరే వెళ్లి అన్నయ్యకు అసలు నిజం చెప్పేయండి' అంటుంది. దీంతో నందూలో భయం పెరిగిపోతూనే ఉంటుంది.

విక్రమ్ గురించి నిజం చెప్పి
ఇక, శిరీష దగ్గరకు వెళ్లిన దివ్య విక్రమ్ మీద పోలీస్ కేసు పెడతానని అంటుంది. అలాగే, రెస్టారెంట్‌లో చూసింది మొత్తం చెప్తుంది. అప్పుడు శిరీష 'ఛీఛీ.. విక్రమ్ నన్నే కాదు కలలో కూడా ఏ అమ్మాయిని మోసం చేయాలి అనుకోడు. అవసరమైతే సహాయం చేస్తాడు. విక్రమ్‌ను చేసుకునే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. మీరు ఏదో తప్పుగా అపార్థం చేసుకున్నట్టు ఉన్నారు. ఏం పర్లేదు కలిసి సారీ చెప్పండి ఈజీగా తీసుకుంటాడు కోపం పెంచుకోడు నవ్వుతూ మాట్లాడతాడు' అని చెప్పడంతో దివ్య సంతోషంగా వెళ్లిపోతుంది. మరోవైపు, పెళ్లికూతురు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని అంటుంది. దీంతో ఆమెనే నేరుగా ఈ విషయం చెప్పమని విక్రమ్ ధైర్యం చెప్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications