For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్యను వదిలి వెళ్లిపోయిన నందూ.. సామ్రాట్‌ను ప్రశ్నించిన తులసి

  |

  చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే


  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూతో గొడవ పడి వెళ్లిపోయిన సామ్రాట్ ఒంటరిగా కూర్చుని బాధ పడుతూ ఉంటాడు. ఆ సమయంలో వాళ్ల బాబాయి వచ్చి అతడిని ఓదార్చే ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు, తులసిని ప్రేమ్ ఓదార్చడానికి చూస్తుంటాడు. మొదట్లో మొరాయించిన ఆమె.. ఆ తర్వాత కూల్ అవుతుంది. దీంతో సామ్రాట్ గారు నీకు సపోర్టు చేస్తున్నారు.. ఆయనను అర్థం చేసుకో అని చెబుతాడు. ఇక, సామ్రాట్ మాటలతో నందూ ఆలోచనలో పడిపోతాడు. ఆ సమయంలో లాస్య వచ్చి అతడిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది.

  Bigg Boss Elimination: ఓటింగ్‌లో ట్విస్ట్.. అతడు సేఫ్ అవడంతో వాళ్లకు షాక్.. డేంజర్‌ జోన్‌లో ఎవరంటే!

  తులసి ఆలోచన.. లాస్య మాటలు

  తులసి ఆలోచన.. లాస్య మాటలు


  సామ్రాట్ గొడవ పెట్టుకుని వెళ్లిన తర్వాత తులసి విషయంలో తాను తప్పుచేశానని నందూ పశ్చాత్తాప పడుతుంటాడు. ఇంతలో లాస్య వచ్చి 'తులసిపై ఒపీనియన్ మార్చుకున్నావా' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ 'నీ అనుమానాలకు సమాధానాలు చెప్పే ఓపిక నాకు లేదు. నేను అర్జెంట్‌గా ముంబై వెళ్తున్నా' అని చెప్తాడు. దీంతో లాస్య ఎందుకు అని అడుగుతుంది. అప్పుడతను 'జాబ్ కోసం అర్జెంట్ మీటింగ్ ఉంది వెళ్తున్నా. నేను వచ్చే వరకూ ఇంట్లో వాళ్లందర్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ముఖ్యంగా నాన్న జాగ్రత్త' అని అంటాడు.

   వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన నందూ

  వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన నందూ

  నందూ ఆ మాట చెప్పగానే లాస్య 'నందూ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది. ఆ సామ్రాట్ మాటలకు కరిగిపోయాడా ఏంటి? ఏదైతేనేం అతడు తిరిగి వచ్చే సరికి ఇంట్లో వాళ్లను నా వైపునకు తిప్పుకుంటా' అని అనుకుంటుంది. ఇక, నందూ ముంబై వెళ్తుండగా 'ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంటే నువ్వు కూడా వెళ్తున్నావా? మీ నాన్న ఎలా ఉన్నారో చూశావు కదా. నువ్వు పక్కన ఉంటే మాకు ధైర్యం' అని అంటుంది. ఇంతలో లాస్య తులసిపై నిందులు వేయడంతో నందూకు కోపం వస్తుది. దీంతో అతడు 'ఇలాంటి డిస్కషన్స్ వల్లే నాన్న బాధపడుతున్నారు. ప్రతిదానికి గొడవ పరిష్కారం కాదు. నాన్న బాధకి కారణం ఏంటో మనందరికి తెలుసు. ఎదురుచూడటం తప్పితే వేరే మార్గం లేదు. నేను లేని టైంలో నాన్నని ఎవరైనా బాధపెడితే ఊరుకోను' వార్నింగ్ ఇస్తాడు.

  సీతా రామం హీరోయిన్ హాట్ షో: సినిమాలో పద్దతిగా.. అందులో మాత్రం!

  అనసూయను రెచ్చగొట్టిన లాస్య

  అనసూయను రెచ్చగొట్టిన లాస్య


  నందూ మాటలతో లాస్యకు భయం వేస్తుంది. దీంతో ఎలాగైనా అనసూయను మాత్రం మారనీయకూడదని అనుకున్న ఆమె.. 'మామయ్యను బాధపెట్టొద్దన్నాడు ఓకే అత్తయ్యా. కానీ.. ఆ తులసి గురించి పట్టించుకోవద్దని అంటాడేంటి? నిప్పు పెట్టే వాళ్లను వదిలేసి.. ఒళ్లు కాలి ఏడుస్తున్న వాళ్లపై పడతాడేంటి' అని ప్రశ్నిస్తుంది. ఆ మాటతో అనసూయ 'తులసిని ఎలా వదిలి పెడతాను? దాని వల్లే మనశ్శాంతి లేకుండా పోయింది. దాన్ని ఎలా వదిలిపెడతాను' అని అంటుంది. దీంతో లాస్య 'అదీ.. ఈ మాట మీదే ఉండండి అత్తయ్యా.. ఆ తులసిని వదిలిపెట్టకు' అంటుంది.

  సామ్రాట్ గురించి తులసి అలా

  సామ్రాట్ గురించి తులసి అలా

  పెద్ద గొడవ తర్వాత తులసి ఇంట్లోని తులసి చెట్టుకు పూజ చేస్తూ 'మనసు ఊగిసలాడుతుంది. ఏం చేయాలో తెలియడం లేదు. సామ్రాట్ చేసింది తప్పో ఒప్పో తెలియడం లేదు. నాకు సరైన దారి చూపించు తల్లీ' అని కోరుకుంటుంది. అప్పుడే సామ్రాట్ కూడా 'నేను చేసేది తప్పో ఒప్పో ఆ కాలమే నిర్ణయిస్తుంది' అని అనుకుంటూ తులసి దగ్గరకు బయలుదేరుతాడు. అతడు అలా వస్తున్న విషయం తులసికి అర్థం అవుతుంది. ఇక, తులసిని నేను ఎలా ఫేస్ చేయాలని సామ్రాట్ ఆలోచిస్తుండగా.. తులసి కూడా అలాగే అనుకుంటుంది. ఇలా ఇద్దరూ ముందుకెళ్తారు.

  శృతి మించిన శివాత్మిక బోల్డు షో: ఆ డ్రెస్సేంటి.. ఆ ఫోజులేంటి బాబోయ్!

  ఒక విషయం అడగాలి అంటూ

  ఒక విషయం అడగాలి అంటూ


  ఒకరికి ఒకరు ఎదురు పడగానే నేను మీ దగ్గరకే బయలుదేరాను అని సామ్రాట్ అంటాడు. అప్పుడామె కూడా నేనూ మీ దగ్గరకే బయలుదేరాను అని అంటుంది. దీంతో సామ్రాట్ నా దగ్గరకు ఎందుకు అని ప్రశ్నిస్తాడు. అప్పుడామె 'మిమ్మల్ని ఒక విషయం అడగాలి.. అడగనా?' అని అంటుంది. అప్పుడతను అడగండి అని అంటాడు. కానీ, ఆమె ఆలోచిస్తూ పదే పదే అతడిని అడుగుతుంది. ఆ తర్వాత 'మీరు నా గురించి ఎందుకు అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నేను నిలదీయడం లేదు. అడుగుతున్నా. స్నేహం చేయడం అంటే సహాయం చేయడం. నా తరుపున మీరు యుద్ధం చేయడాన్ని ఏమంటారు' అని అడుగుతుంది. దీనికి సామ్రాట్ 'నేను అలా చేయాలని అనుకోలేదు.. నా మనసులో అలాంటి ఉద్దేశం లేదు' అని అంటాడు.

  మీ ఉద్దేశం నాకు తెలుసంటూ

  మీ ఉద్దేశం నాకు తెలుసంటూ

  సామ్రాట్ మాటలకు తులసి 'మనసులో ఏమీ లేకుండా ఎవరూ ఏమీ చేయరు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది' అని అంటుంది. అప్పుడతను 'నేను ఒక స్నేహితుడిగానే ఆలోచించాను. సడెన్‌గా నా మైండ్ ట్రాక్ తప్పింది' అని అంటాడు. దీంతో తులసి 'దీన్ని బట్టి నాకు ఒకటి అర్ధం అయింది. నా గురించి నాకు కూడా తెలియనంతగా మీకు తెలుసని. నా గురించి నేను కూడా ఆలోచించనంతగా మీరు ఆలోచిస్తున్నారు. నాకు కొత్తగా అనిపించారు. నిజం చెప్పండి. మీరు ఆరాధించేటంత గొప్పదాన్నా నేను' అని ప్రశ్నిస్తుంది. అప్పుడతను 'నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదండీ' అంటాడు. దీనికామె 'మీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు. నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా చూశాను. నేను అక్కడే ఉన్నాను. మీరు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు' అంటుంది.

  బ్రాతో బిగ్ బాస్ దివి అరాచకం: బాడీ మొత్తం చూపిస్తూ హాట్ వీడియో
  https://telugu.filmibeat.com/television/actress-divi-vadthya-sizzling-video-goes-viral-114669.html

   కలిసిపోయిన సామ్రాట్, తులసి

  కలిసిపోయిన సామ్రాట్, తులసి


  ఆ తర్వాత సామ్రాట్ నేను గీత దాటానా అని ప్రశ్నిస్తుంది. అప్పుడామె 'అవును దాటారు.. కష్టాల్లో సహాయం చేసే స్నేహం గొప్పది. అసలు కష్టాలే రాకుండా చూసుకునే స్నేహం ఇంకా గొప్పది. మీరు స్నేహం అనే గీత దాటి ముందుకు వచ్చారు. గొప్ప స్నేహితుడు అనిపించుకున్నారు' అని అంటుంది. దీంతో సామ్రాట్ 'లేదు తులసి గారూ.. మీ కష్టాన్ని ఎక్కువ చేశాను. లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టాను. మీ పర్సనల్ లైఫ్‌లో జోక్యం చేసుకోవడం నా తప్పు. మీ వాళ్లను నిలదీసే అధికారం నాకు ఎక్కడిది? వాళ్ల తప్పుల్ని ఎత్తి చూపడం తప్పే కదా. రాత్రి అంతా ఇదే బాధ.. ఇదే ఆలోచన. మనసు నలిగిపోయింది' అని అంటాడు. అలా మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ చేతులు కలుపుకుని తులసి ఇంటికి వెళ్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 791: Anasuya Gets Upset as Parandhamaiah Avoids her Family. After That Samrat Apologies to Tulasi for Having a Conflict with Nandhu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X