For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్య ప్లాన్ చెప్పిన అనసూయ.. హనీ ఫోన్‌తో సామ్రాట్‌లో టెన్షన్

  |

  జనరేషన్లు ఛేంజ్ అవుతోన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన కోసం వచ్చిన సామ్రాట్‌ను ఎందుకు వచ్చారో చెప్పమని తులసి సూటిగా ప్రశ్నిస్తుంది. దీంతో అతడు నీకోసమే వచ్చానని అంటాడు. అప్పుడు తులసి మీరు నన్ను తీసేసి మంచి పని చేశారు. లేకుంటే నేనే బాధ పడాల్సి వచ్చేది అంటుంది. ఆ తర్వాత తమ ఇంట్లో జరిగే బతుకమ్మ పండుగకు హనీని పంపించమని అడుగుతుంది. మరోవైపు, లాస్య.. అనసూయను బుట్టలో వేసుకుని తులసికి దూరం చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆ వెంటనే ఆమెకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది. దీనికామె వెంటనే ఒప్పుకుని వస్తా అంటుంది.

  Rashmika Vijay Marriage: సీక్రెట్‌గా రష్మిక, విజయ్ పెళ్లి.. ఫొటో వైరల్.. మరీ ఇంతకు తెగించారేంటి!

  అసలు నిజం చెప్పిన అనసూయ

  అసలు నిజం చెప్పిన అనసూయ


  పండుగ ముందు తులసి ఫ్యామిలీలోని అందరూ కలిసి గుడికి వస్తారు. అలా వాళ్లు లోపలికి వెళ్లగానే లాస్య, నందూ, లక్కీలు కూడా అక్కడకు చేరుకుంటారు. వాళ్లను చూసి అనసూయ చేయి ఊపుతుంది. అది గమనించిన పరందామయ్య 'ఏంటి వాళ్లను చూసి చేయి ఊపుతున్నావు. వాళ్లేమీ మన చుట్టాలు కాదు' అంటాడు. అప్పుడు అనసూయ 'అవును వాళ్లు చుట్టాలు కాదు.. నా కన్న కొడుకు. నా కొడుకుకు జనరల్ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. అందుకని నా ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు నా పేరు మీద పూజ చేయించడానికి వచ్చారు' అని నిజం చెబుతుంది.

   తులసికి గుళ్లో షాక్ ఇచ్చిన లాస్య

  తులసికి గుళ్లో షాక్ ఇచ్చిన లాస్య

  అనంతరం లాస్య, నందూ వెళ్లి అనసూయ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి గుడిలోకి వెళ్తారు. అప్పుడు తులసి పంతులు గారిని పలకరిస్తుంది. దీంతో ఆయన అమ్మవారి దయ వల్ల బానే ఉన్నాను. ఈరోజు కుటుంబం మొత్తం కలిసి వచ్చిందేంటి అని అంటాడు. అప్పుడు తులసి అత్తయ్య, మామయ్య పేరు మీద అర్చన చేయించండి అని ఆయనకు చెబుతుంది. అప్పుడే లాస్య కల్పించుకొని 'ఇవాళ అత్తయ్య, మామయ్య గారి పేరు మీద మేము అర్చన చేయిస్తాం. మీరు మీ పూజను వేరేగా చేయించుకోండి' అని తులసికి షాక్ ఇస్తుంది.

  బ్రాతో యాంకర్ శ్రీముఖి తెగింపు: ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!

  ముడుపులు కట్టమన్న పంతులు

  ముడుపులు కట్టమన్న పంతులు


  పంతులు అర్చన చేస్తుండగా.. నా వాళ్లందరినీ మంచిగా ఉండేలా చేయి అని కోరుకుంటుంది. ఆ తర్వాత పూజారి వచ్చి 'ఈరోజు చాలా పవిత్రమైన రోజు. మనసులో ఉన్న కోరికలు కోరుకొని అమ్మవారికి ముడుపు కడితే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది' అంటుంది. దీంతో తులసి 'నాకున్న కోరిక అల్లా నా మనవళ్లను ఎత్తుకొని తిరగాలి. నా ఇద్దరు కోడళ్ల కడుపు పండటం కోసమే ఎదురు చూస్తున్నా' అని అంటుంది. అప్పుడు పూజారి 'ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే వెళ్లి మనసులోని కోరికను అమ్మవారికి చెప్పుకుని ఆ చెట్టుకు ముడుపు కట్టేయండి' అని చెప్తాడు.

  ముడుపుల గురించి ఎవరికివారే

  ముడుపుల గురించి ఎవరికివారే

  పూజారి చెప్పిన తర్వాత ఇంట్లో వాళ్లందరూ కలిసి ముడుపులు కట్టే ప్రదేశానికి వెళ్తారు. అప్పుడు శృతి ఇప్పుడు ఈ ముడుపులు ఇవి అవసరమా ఆంటి అని అడుగుతుంది. దీంతో తులసి నిష్కల్మషంగా ప్రార్థించి ఆ దేవుడిని వేడుకుంటే నుదిటి వ్రాత కాస్త మార్చేస్తాడేమో అంటుంది. దీంతో ఇష్టం లేకుండానే వెళ్లి శృతి, అంకిత ముడుపులు కడతారు. ఆ సమయంలో శృతి 'అమ్మా.. నా మనసులో ఉందొకటి.. ఇక్కడ జరుగుతోంది ఒకటి నువ్వే అర్థం చేసుకో' అని దండం పెట్టుకుంటుంది. తర్వాత అంకిత 'మనసులు వేరయ్యాక ఈ ముడుపులు ఏం చేస్తాయో నాకు తెలియదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను' అని ముడుపు కట్టబోతుంది. అయితే, చెట్టు కొమ్మలు వాళ్లకు అందకపోవడంతో అభి, ప్రేమ్ ఎత్తుకుని కట్టిస్తారు.

  Bigg Boss Nominations: ఆరో వారం నామినేషన్స్ లీక్.. ముఖంపై కొట్టి మరీ.. మళ్లీ 8 మంది నామినేట్

  సామ్రాట్ మిస్సింగ్.. లాస్య డౌట్

  సామ్రాట్ మిస్సింగ్.. లాస్య డౌట్


  ఇక, తులసి వాళ్ల కాలనీలో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం అవుతాయి. అప్పుడు అందరూ అక్కడ బతుకమ్మ పాటలు పాడాలని తులసిని కోరుకుంటారు. అంతకు ముందే అక్కడకు హనీ కూడా వస్తుంది. ఇక, తులసి బతుకమ్మ పాట పాడగా అందరూ కోరస్ ఇస్తారు. అనంతరం లాస్య 'హనీ ఒక్కతే కనబడుతోంది. సామ్రాట్ ఎందుకు రాలేదు? అసలు తులసి, సామ్రాట్ మధ్య ఏమైంది తెలుసుకోవాలి. సామ్రాట్, తులసిని మరింత దూరం చేయాలి' అని అనుకుంటుంది. అందుకోసం హనీని వాడుకోవాలని ప్లాన్ చేసుకుని సరికొత్త ప్లాన్‌ను తయారు చేసుకుంటుంది.

   హనీని బుట్టలో పడేసిన లాస్య

  హనీని బుట్టలో పడేసిన లాస్య


  తన ప్లాన్ ప్రకారం లాస్య.. హనీ కోసం వెతుకుంటుంది. అంతలో తను కారు దగ్గర వాటర్ తాగుతుంటుంది. అప్పుడు మీ నాన్న రాలేదా హనీ అని అడుగుతుంది. దీంతో 'దీంతో ఏదో మీటింగ్ ఉందట అందుకే రాలేదు' అని చెప్తుంది. అప్పుడు లాస్య 'పండుగ పూట మీ నాన్న ఒంటరిగా ఉండటం ఏమైనా బాగుంటుందా? మరి ఫోన్ చేసి రమ్మని పిలవొచ్చు కదా. నువ్వు పిలిస్తే రారా' అంటూ అని అంటుంది. అప్పుడు హనీ ఒక్క నిమిషం అని చెప్పి కారు డ్రైవర్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఫోన్‌ను తీసుకొని సామ్రాట్‌కు కాల్ చేస్తుంది. 'సడన్‌గా స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది నాన్న' అని అబద్దం చెప్తుంది. దీంతో సామ్రాట్.. అయ్యో తులసి ఆంటిని చెప్పకపోయావా అని అంటాడు. అప్పుడు హనీ తను ట్యాబ్లెట్ ఇచ్చింది. ఇప్పుడు ఓకే అంటుంది.

  హాట్ షోలో హద్దు దాటిన ఇలియానా: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

   హనీ కోసం బయలుదేరిన తండ్రి

  హనీ కోసం బయలుదేరిన తండ్రి

  తర్వాత హనీని సామ్రాట్ నువ్వు వచ్చేస్తావా అని అడుగుతాడు. దీంతో ఆ చిన్నారి నువ్వే వచ్చి తీసుకెళ్లు అంటుంది. అప్పుడు సామ్రాట్ సరే వస్తా.. నువ్వు అప్పటి వరకు తులసి ఆంటి దగ్గరే ఉండు అని అంటాడు. ఇదంతా చూసిన లాస్య తన ప్లాన్ వర్కవుట్ అవుతోందని అనుకుంటుంది. కాలనీలో బతుకమ్మ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇంకోవైపు సామ్రాట్, బాబాయి ఇద్దరూ కారులో వస్తూ ఉంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 759: Tulasi Family Feels Happy for Celebrating Festival. After That Lasya Manipulates Honey to Trouble Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X