For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అందరి ముందే ముద్దు.. మళ్లీ ఫస్ట్ నైట్.. రొమాంటిక్ ఎపిసోడ్ ఇదే

  |

  చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి మ్యూజిక్ స్కూల్ ఫైల్‌ను తీసుకున్న నందూ.. దాన్ని లాస్యకు అప్పగిస్తాడు. ఆ సమయంలో సామ్రాట్ వచ్చి నందూకు క్లాస్ పీకుతాడు. దీంతో అతడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేమ్, శృతి మరోసారి గొడవ పడతారు. దీంతో ఆమెను ఇంట్లో నుంచి వెళ్లిపోమంటాడు. అప్పుడు శృతి వెళ్లిపోతుండగా.. తులసి చూసి ఆపుతుంది. అలా నిజం తెలుసుకున్న తులసి.. ప్రేమ్‌ను పిలిచి చెంపపై కొడుతుంది. అనంతరం నందూ ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చి, లాస్య ముందరే సామ్రాట్‌పై ఉన్న కోపాన్ని బయటపెడతాడు.

  తల్లైనా తగ్గని హీరోయిన్ ప్రణిత: ఎద భాగాలు కనిపించేలా హాట్ షో

  నందగోపాల్ కొడుకువురా అంటూ

  నందగోపాల్ కొడుకువురా అంటూ


  శృతి చెప్పింది విన్న తర్వాత ప్రేమ్‌ను నిలదీసిన తులసి 'నువ్వేం మనిషివిరా. నీకోసం శృతి పనిమనిషిగా చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి తిడతావా? తను నీకోసం చేసిన త్యాగాలను, నీ మీద చూపించిన ప్రేమను మర్చిపోతావా? నువ్వు నీ భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటావని అనుకున్నా. ఇన్నాళ్లు నువ్వు నా కొడుకువు అనుకున్నా. కానీ, నువ్వు కూడా ఆ నందగోపాల్ కొడుకువేరా. మా ఆడవాళ్లను కూడా మర్యాదగా బతకనివ్వండి. మీ అహంకారాన్ని తగ్గించుకోండి. కుదరదు అనుకుంటే మాకింత విషం తీసుకొచ్చి ఇవ్వండి' అని అతడిపై ఫైర్ అవుతుంది.

   శృతి కాళ్లు పట్టుకోబోయిన ప్రేమ్

  శృతి కాళ్లు పట్టుకోబోయిన ప్రేమ్


  తులసి అడిగిన ప్రశ్నలకు ప్రేమ్ రియలైజ్ అవుతాడు. అప్పుడు ఏడుస్తూ తులసి కాళ్ల మీద పడి 'నన్ను క్షమించమ్మా.. తప్పు చేశాను. బాధపెట్టాను. ఇంకెప్పుడూ ఇలా చేయను. నేను చేసింది ఎంత పెద్ద తప్పో తెలిసొచ్చింది. నన్ను క్షమించమ్మా ప్లీజ్' అంటూ వేడుకుంటాడు. దీంతో తులసి 'నిన్ను క్షమించాల్సింది నేను కాదు.. శృతి. వెళ్లి తన కాళ్లు పట్టుకో' అంటుంది. అప్పుడు ప్రేమ్ వెళ్లి ఆమె కాళ్లు పట్టుకోబోతాడు. దీంతో శృతి వద్దు అని వారిస్తుంది. ఆ తర్వాత ప్రేమ్‌ను హత్తుకుంటుంది. దీంతో ప్రేమ్ ఆమెకు సారీ చెప్తాడ. దీన్ని శృతి యక్సెప్ట్ చేసి ఓకే అంటుంది.

  మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి: టాప్ కిందకు జరిపి మరీ!

  క్లాస్ పీకిన తులసి.. ముద్దు అని

  క్లాస్ పీకిన తులసి.. ముద్దు అని


  ఆ తర్వాత తులసి 'సమస్య నీలోనే దాచుకొని నీలో నువ్వే కుమిలిపోతే పరిష్కారం దొరకదు. సమస్యను మీరు పరిష్కరించుకోలేనప్పుడు పెద్దవాళ్లం మేము ఉన్నాం కదా. ఇలా జీవితాలను నాశనం చేసుకుంటారా? చిన్న చిన్న సమస్యకే భార్యాభర్తలు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎదురు దెబ్బలు తగిలాయి కాబట్టే జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నాం. మీరు కూడా ఇలాంటి ఏవైనా సమస్యల్లో ఉన్నారా' అని అభి, అంకితను అడుగుతుంది. దీంతో వాళ్లు ఏం లేదు అంటారు. తర్వాత ప్రేమ్‌ను దెబ్బ బాగా తాకిందా అని అడుగుతుంది. అప్పుడు పరందామయ్య ఆ దెబ్బ తగ్గాలంటే ఆయన భార్య అక్కడ ముద్దు పెడితే సరి అంటాడు. దీంతో శృతి ముద్దు పెడుతుంది. తర్వాత అంతా నవ్వుకుంటారు.

  మళ్లీ ఫస్ట్‌నైట్ జరిపించాలంటూ

  మళ్లీ ఫస్ట్‌నైట్ జరిపించాలంటూ

  ఇంట్లో అంతా సర్ధుకున్న తర్వాత అనసూయ 'గుళ్లో ముడుపులు పెట్టడమే కాదు.. ఇంట్లో ఊయల కూడా కట్టాలి' అంటుంది. అప్పుడు పరందామయ్య అంటే రెండు జంటలకు మళ్లీ ఫస్ట్ నైట్ జరపాలా అంటాడు. దీనికామె అంతేగా మరి అంటుంది. దీంతో అభి - అంకిత, ప్రేమ్ - శృతికి ఫస్ట్ నైట్ చేయాలని అందరూ డిసైడ్ అవుతారు. ఆ తర్వాత తులసి ఇద్దరు కోడళ్లను తయారు చేస్తుంటుంది. అప్పుడు అంకిత నాకు మీ పద్ధతి ఏం నచ్చలేదు ఆంటీ అంటుంది. శృతి కూడా నాకూ నచ్చలేదు అంటుంది. దీంతో తులసి వాళ్లిద్దరికీ సర్ధి చెప్పి ఎలాగోలా ఒప్పించేస్తుంది.

  Dethadi Harika Marriage: షాకిస్తోన్న దేత్తడి హారిక పెళ్లి వార్త.. ఆ యూట్యూబర్‌తోనే లవ్ మ్యారేజ్!

  రెండు జంటల మధ్య రొమాన్స్

  రెండు జంటల మధ్య రొమాన్స్


  ఫస్ట్ నైట్ కోసం అభి, ప్రేమ్‌లను బస్కీలు కొట్టమని పరందామయ్య చెప్తాడు. అంతేకాదు, ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళేముందు ఇలా బస్కీలు తీయడం మన వంశం అలవాటురా అంటాడు. ఆ తర్వాత అనసూయ వాళ్లను ఇక ఆటపట్టించడం ఆపండి అంటుంది. అనంతరం ఇద్దరు ఎవ్వరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోతారు. అంతేకాదు, ఫోన్లలో ఉప్పెన పాట జలజల పాతం పాట చూస్తారు. ఆ తర్వాత ప్రేమ్.. శృతి కోసం వెయిట్ చేస్తుంటాడు. అంకిత.. అభి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శృతి పాలు తీసుకొని ప్రేమ్ గదిలోకి వెళ్తుంది. అలాగే, అభి.. అంకితకు పాలు తీసుకొని వెళ్తాడు.

  వాళ్ల ఇబ్బంది.. సూటిగా అనేసి

  వాళ్ల ఇబ్బంది.. సూటిగా అనేసి


  రూమ్‌లోకి వెళ్లిన తర్వాత అభి 'నేనైతే సిగ్గుతో చచ్చిపోయాను. నువ్వు రిక్వెస్ట్ చేశావని నేను పాల గ్లాస్ తీసుకొచ్చా. ఎందుకు ఇలా చేశావు' అని అంకితను అడుగుతాడు. దీంతో అంకిత 'ఫస్ట్ నైట్ రోజు నేను పాలు తీసుకొచ్చా కదా.. ఈసారి వెరైటీగా ఉంటుందని నిన్ను పాల గ్లాస్ తీసుకురా అని చెప్పా. ఆలస్యం ఎందుకు సగం పాలు తాగి ఇవ్వు' అంటుంది. మరోవైపు, శృతి మొత్తం పాలు తాగుతుంది. దీంతో ప్రేమ్ అలా తాగేశావు ఏంటి అని అడుగుతాడు. అప్పుడామె ఇదేమన్నా మనిద్దరికీ జరిగే మొదటి రాత్రా.. సగం పాలు తాగి నీకు ఇవ్వడానికి అంటుంది.

  జబర్ధస్త్ రీతూ చౌదరి ఎద అందాల ఆరబోత: హాట్ షోలో గీత దాటేసిందిగా!

   రొమాన్స్ స్టార్ట్ చేసేసిన జంటలు

  రొమాన్స్ స్టార్ట్ చేసేసిన జంటలు


  ఆ తర్వాత శృతి 'పెళ్లయిన ఇన్నాళ్లకు మళ్లీ కొత్తగా ఫస్ట్ నైట్ ఏంటి? ఈ పెద్దాళ్లకు పిచ్చి పట్టింది' అని అంటుంది. అప్పుడు ప్రేమ్ 'కానీ, వీళ్లు ఎంత మంచి పని చేశారో ఇప్పుడు అర్థం అవుతోంది. చిన్న చిన్న పొరపాట్లను భూతద్దంలో చూసుకున్నాం. ఒకరికి ఒకరంగా బతకాల్సిన మనం.. దూరం చేసుకున్నాం. నిజం చెబుతున్నాను శృతి ఇలాంటి రోజు ఒకటి మళ్లీ వస్తుందని అనుకోలేదు' అంటాడు. అలా అంకిత మాట్లాడుతుండగా అభి ఇక మాటలు చాలు అంటాడు. ఆ తర్వాత రెండు జంటలు రొమాన్స్ మొదలు పెడతాయి. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 764: Prem Realises his Mistake and Apologises to Shruthi. After That Divya Teases Shruthi and Ankitha about First Night.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X