For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: వాళ్ల ఇంటికెళ్లిన తులసి.. కృష్ణుడు ప్రత్యక్షం.. ఆ మాట చెప్పడంతో!

  |

  ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ, లాస్య, అనసూయ, అభి తనపై వేసిన నిందలకు తులసి తట్టుకోలేక బాగా బాధపడుతుంది. ఆ తర్వాత వాళ్లకు ఎదురు తిరిగి అందరికీ పేరు పేరునా సరైన సమాధానాలను చెబుతుంది. అనంతరం ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని అంటుంది. అప్పుడు కూడా తులసిని నిందిస్తుంటారు. ఆ తర్వాత పరందామయ్య వచ్చి తులసికి వీర తిలకం దిద్ది మరీ వెళ్లిపోమని పంపిస్తాడు. ఆ తర్వాత ఆమెతో పాటు ప్రేమ్ కూడా బయలుదేరుతాడు. కానీ, అతడిని వెనక్కి వెళ్లిపోమని చెప్పిన తులసి.. ఒంటరిగా అక్కడిన నుంచి వెళ్లిపోతుంది.

  బోల్డు షోలో హద్దు దాటిన అనన్య నాగళ్ల: కుర్రాళ్లకు ఇది కదా అసలైన విందు

  ప్రేమ్‌కు ఫోన్ చేసిన సామ్రాట్

  ప్రేమ్‌కు ఫోన్ చేసిన సామ్రాట్


  తులసి వెళ్లిపోగానే ప్రేమ్ 'ఏంటయ్యా దేవుడా ఇది. ఏం పాపం చేసిందని కష్టాలన్నీ మా అమ్మకే ఇస్తున్నావ్? కష్టాలు ఇచ్చిన వాడివి వాటిని తట్టుకునే శక్తిని మా అమ్మకి ఇవ్వు' కోరుకుంటాడు. ఆ తర్వాత తులసికి ఏమైపోయిందోనని సామ్రాట్ తెగ టెన్షన్ పడిపోతుంటాడు. ఆ సమయంలో 'నేను ఇక వెయిట్ చేయలేను. నా వల్ల కాదు. తులసి గారి పరిస్థితి ఏంటో ఆ ఇంట్లో ఏమైందో తెలుసుకోవాలి. ఏదైతే అది అయింది' అంటూ తులసికి కాల్ చేస్తాడు. కానీ, అది కలవదు. ఆ వెంటనే ప్రేమ్‌కు ఫోన్ చేస్తాడు. అప్పుడు 'మీ అమ్మ నా ఫోన్ ఎందుకు తీయడం లేదు.. అమె బాగానే ఉంది కదా.. నా కారణంగా మా ఇంట్లో ఏం గొడవ జరగలేదు కదా' అని అడుగుతాడు. దీంతో ప్రేమ్ ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయిందన్న విషయాన్ని సామ్రాట్‌కు చెప్తాడు.

  తులసి గురించి వాళ్ల చర్చలు

  తులసి గురించి వాళ్ల చర్చలు


  తులసి వెళ్లిపోయిన తర్వాత నందూ, లాస్య, అనసూయలు మీటింగ్ పెట్టుకుంటారు. ఆ సమయంలో నందూ 'మాట్లాడితే కుటుంబం అంటే నా ప్రాణం. కుటుంబం కోసం నా ప్రాణాలైనా ఇస్తానని కోటలు దాటే మాటలు చెప్పింది కదా.. అంత ఈజీగా ఇల్లు వదిలి ఎలా వెళ్లిందేంటి' అని అంటాడు. అప్పుడు అనసూయ 'ఇంతకు ముందు కూడా తులసితో గొడవలు అయ్యేవిరా.. కానీ ఈసారే తులసి ఇల్లు వదిలివెళ్లిపోయిందా? ఇంత పని చేస్తుందని అనుకోలేదు. కనీసం ఇల్లు వదిలి వెళ్లిపోతున్నాననే బాధ తులసి కళ్లలో కనిపించలేదు' అని చెబుతుంది.

  Bigg Boss Telugu 6: బాత్రూంలోనే ఆ కంటెస్టెంట్.. రిక్వెస్ట్ చేసినా వదలకుండా.. షాకిచ్చిన నాగార్జున

   దరిద్రం వదిలిపోయిందంటూ

  దరిద్రం వదిలిపోయిందంటూ


  వాళ్లు మాట్లాడుతుండగా అభి మామ్ ఇలా చేస్తుందని అనుకోలేదు అంటాడు. అప్పుడు లాస్య 'ఇప్పుడు ఈ పనికి మాలిన మీటింగ్ ఎందుకో నాకు అర్ధం కావడం లేదు. తులసి వెళ్లిపోవడం ప్రాబ్లమ్ అనుకుంటే బ్రతిమిలాడాల్సింది. తులసి ఉంటే ఈ ఇంట్లో ప్రాబ్లమ్. వెళ్లిపోతే ప్రాబ్లమ్ ఏంటి? ఆమె ఇంట్లో ఉంటే ప్రతిరోజూ ప్రాబ్లమే. మాట వినని మనిషి కోసం ఎందుకింత తాపత్రయం? ఏదైతేనేం ఇల్లు వదిలిపోయింది పోనివ్వండి ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంది' అని అంటుంది. దీనికి అభి 'అదేంటి ఆంటీ అలా మాట్లాడతారు.. కంటితో ప్రాబ్లమ్ ఉందని కంటిని పొడచుకోలేం కదా' అని అంటాడు. దీనికి లాస్య 'నువ్వు అన్నది కరెక్టే.. మనం ఎవరైనా తులసిని ఇల్లు వదిలి వెళ్లిపోమన్నమా? లేదు కదా' అంటుంది.

   మాకేం సంబంధం లేదంటూ

  మాకేం సంబంధం లేదంటూ


  లాస్య మాటలకు మనం తులసిని వెళ్లిపోమనలేదు కదా అని అనసూయ అంటుంది. అప్పుడు లాస్య 'ఫినిష్.. తులసి ఇష్టపడి వెళ్లింది. తప్పంతా మామయ్య గారిదే. ఆయన వెళ్లిపోమని అన్నారు. ఆవిడ వెళ్లిపోయింది' అని అంటుంది. దీనికి అభి జరిగిన దాని గురించి కాదు.. జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం అని అంటాడు. అప్పుడు లాస్య 'అంటే.. వెళ్లి మీ అమ్మను బ్రతిమాలి తీసుకొద్దాం అంటావా? ఏం అత్తయ్యా మీరు వెళ్తారా' అని అడుగుతుంది. దీనికామె నేనెందుకు వెళ్తాను అంటుంది. అలాగే, లాస్య, నందూ కూడా మాకేం సంబంధం అంటారు.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో శృతి హాసన్: లోపలివి కనిపించేలా ఘోరంగా!

  దేవుడిపై భారం వేసిన మామ

  దేవుడిపై భారం వేసిన మామ


  లాస్య మాటలకు అభి.. మామ్ కోసం తాతయ్యని పంపిద్దాం అని అంటాడు. దీనికి లాస్య 'అది జరిగే పని కాదు. మనసు మారి తులసి రావాలే తప్ప. ఎవ్వరం ఏమీ చేయలేం. తులసి లేకపోతే ఈ ఇంటికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ పనీ ఆగదు. ఆమె గురించి ఎక్కువ ఆలోచించొద్దు' అని అంటుంది. మరోవైపు పరందామయ్య కృష్ణుడి విగ్రహం ముందు హారతి ఇస్తూ 'గుండె పగిలేలా ఏడుస్తున్నా వినపడుతుందా? నీ కళ్ల ముందే అంతా జరిగింది కృష్ణా.. ఆ ఘోరాన్ని చూడలేక నవ్వు కూడా ఏడ్చి ఉంటావు. దేవుడివి కదా.. అది మాకు కనిపించకుండా దాచుకుంటావు. బాధతో నీ వేణువు కూడా మూగబోతుంది. ఈ ఇంటి ఇంటింటి గృహలక్ష్మి బాధతో అవమానంతో గడపదాటి బయటకువ వెళ్లిపోయింది. ఈ తండ్రి ఆపలేకపోయాడు' అంటూ అఖండ జ్యోతి వెలిగిస్తాడు.

  తులసికి ధైర్యం చెప్పిన కృష్ణ

  తులసికి ధైర్యం చెప్పిన కృష్ణ


  ఓ పార్క్‌లో కూర్చుని తెగ బాధపడిపోతున్న తులసి దగ్గరకు చిన్న కృష్ణయ్య వెళ్లి.. బాధలో ఉన్నావా అని అడుగుతాడు. దీనికామె ఔను అన్నట్టుగా తల ఊపుతుంది. 'ఎందుకు అలా దిగులుగా ఉన్నావు? నీ బాధ ఏంటో నాకు చెప్పు? నీకు ఏ కష్టం ఉన్నా తీరుస్తాను' అంటాడు. ఆ వెంటనే ఆమెను హత్తుకుని బాధ పడొద్దని ఓదార్చుతాడు. అప్పుడు తులసి తనపై వేసిన నిందను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుని బోరు బోరున ఏడుస్తుంది. అప్పుడు కృష్ణయ్య 'నీ కష్టాలను తీరుస్తా తులసీ.. నేను ఉన్నాను కదా. ఏడవడం తప్పని మా అమ్మ చెప్తుంది. స్వయంగా ఈ కిట్టయ్యే చెప్పాడు కదా. నీ కష్టాలు తీరిపోతాయి. ఆశీర్వాదం ఇస్తున్నా తీసుకో' అంటూ చెప్తాడు. ఇదంతా పక్కనే ఉన్న సామ్రాట్ చూస్తుంటాడు.

  యాంకర్ శ్రీముఖికి చేదు అనుభవం: అది లేకుండానే షోలోకి.. స్టేజ్‌పైనే పరువు తీసిన హీరోయిన్

  వాళ్ల ఇంటికి తులసి.. సామ్రాట్

  వాళ్ల ఇంటికి తులసి.. సామ్రాట్


  ఆ తర్వాత తులసి అక్కడి నుంచి వాళ్ల అమ్మ ఇంటికి వెళ్లిపోతుంది. ఆమె వెనకాలే సామ్రాట్ కూడా వెళ్తుంటాడు. అప్పుడు ప్రేమ్‌ను చూసిన అతడు 'మీ అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్లావ్' అని ప్రశ్నిస్తాడు. దీంతో ప్రేమ్ చార్జర్ తెద్దామని వెళ్లాను.. అంతలో అమ్మ మాయం అయింది అంటాడు. ఆ తర్వాత తులసి వాళ్ల అమ్మ ఇంటికి వెళ్లిందని ప్రేమ్ ద్వారా సామ్రాట్‌కు తెలుస్తుంది. ఇక, తులసిని ఓదార్చమని ప్రేమ్.. సామ్రాట్‌ను కోరుతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 777: Samrat Gets Tensed After Learning about Tulasi Situation. After That Lasya Provokes Nandhu and Anasuya on Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X