For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అసలు నిజం చెప్పిన సామ్రాట్.. తులసి ఇంట్లో వాళ్ల మధ్య వాగ్వాదం

  |

  జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

   బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సాయంత్రం లోపల తులసి గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని సామ్రాట్‌ను అనసూయ డిమాండ్ చేస్తుంది. అనంతరం హనీని సామ్రాట్ తెచ్చిన డ్రెస్‌తోనే తులసి రెడీ చేసి తీసుకొస్తుంది. ఆ సమయంలో అతడు డ్రెస్ ఎందుకు వద్దన్నాడు అన్న దానిపై అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి హనీతో కేక్ కట్ చేయిస్తారు. అనంతరం హనీ తులసి కోసం అమ్మ పాటను పాడుతుంది. ఇక, పార్టీ జరుగుతున్నప్పుడే తులసి స్థానంలో నందూను జనరల్ మేనేజర్‌గా నియమిస్తున్నట్లు సామ్రాట్ ప్రకటిస్తాడు.

  టాలీవుడ్ స్టార్ హీరోతో భయానక అనుభవం.. నాలుగో నెల కడుపుతోనే: రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

   నందూకు కంగ్రాట్స్ చెప్పిన తులసి

  నందూకు కంగ్రాట్స్ చెప్పిన తులసి


  హనీ బర్త్‌డే పార్టీలో నందూను సామ్రాట్ జనరల్ మేనేజర్‌గా ప్రకటించిన తర్వాత తులసి అతడికి కంగ్రాట్స్ చెబుతుంది. ఆ తర్వాత సామ్రాట్‌తో మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు అంటుంది. అప్పుడతను నేను ముందే చెబుదామనుకున్నా అంటాడు. కానీ, తులసి 'మీరు కంపెనీకి బాస్. ఈ విషయం ముందు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది. కంపెనీకి ఏది చెడు, ఏది మంచి అనేది తెలిసింది మీకే. నేను తప్పు చేయగానే తప్పుకుందామని అనుకున్నా' అంటుంది.

   ఇకపై జాబ్ చేయనని అన్న తులసి

  ఇకపై జాబ్ చేయనని అన్న తులసి

  ఆ తర్వాత నందూ గారు అర్హత కలిగిన వ్యక్తే. ఆయనకు జనరల్ మేనేజర్ పోస్ట్ ఇవ్వడం మంచి నిర్ణయం అని సామ్రాట్‌తో తులసి అంటుంది. దీంతో లాస్య ఈ విషయం నువ్వు మనస్ఫూర్తిగా చెబుతున్నావా తులసి అని అడుగుతుంది. దీంతో తులసి 'అవును.. మనస్ఫూర్తిగా నేను చెబుతున్నా.. ఈ విషయం నందగోపాల్ గారికి కూడా తెలుసు' అని అంటుంది. అప్పుడు లాస్య ' సామ్రాట్ గారు.. తులసి చేసిన చిన్న తప్పును వదిలేసి తనకు ఏదైనా అర్హత గల పోస్ట్ ఇప్పించండి' అని అడుగుతుంది. దీంతో తులసి 'నాకు ఏమీ వద్దు. నేను ఉద్యోగం చేయాలని అనుకోవడం లేదు. మళ్లీ నన్ను ఆ పంజరంలో బంధించకండి' అని సామ్రాట్‌కు చెప్పి అక్కడి నుంచి తులసితో పాటు తన కుటుంబ సభ్యులు కూడా అందరూ వెళ్లిపోతారు.

  శృతి మించిన ప్రియ ప్రకాశ్ హాట్ షో: తడిచిన దేహంతో మెంటలెక్కించేలా!

   తులసి ఫ్యామిలీలో సామ్రాట్ చర్చ

  తులసి ఫ్యామిలీలో సామ్రాట్ చర్చ


  పార్టీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తులసి కుటుంబ సభ్యులు అందరూ బాధతో ఉంటారు. కానీ, అభి, అనసూయ మాత్రం సంతోషంగా ఉంటారు. అప్పుడు అభి 'గౌరవం లేని చోట ఉద్యోగం చేయడం కంటే రోడ్డు మీద అడుక్కు తినడం బెస్ట్. మామ్ జాబ్ పోయినందుకు నాకు బాదలేదు. కానీ.. జాబ్‌లో నుంచి తీసేసిన పద్ధతి నాకు నచ్చలేదు. ఈ విషయం మామ్‌కు అర్థం అయ్యేలా మీరే చెప్పండి' అని అంటాడు. దీంతో పరందామయ్య 'తులసిని జాబ్‌లో నుంచి తీసేయడం ఆయన సొంత నిర్ణయం కాకపోవచ్చు.. ఎవరో ఆయన్ను బలవంతం చేసుంటారు' అంటాడు.

   సామ్రాట్‌ను ప్రశ్నించిన బాబాయి

  సామ్రాట్‌ను ప్రశ్నించిన బాబాయి


  మరోవైపు హనీకి సామ్రాట్ అన్నం తినిపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ల బాబాయి చాలా కోపంగా వస్తాడు. వచ్చీ రావడమే 'తులసిని మేనేజర్ పోస్ట్‌లో నుంచి ఎందుకు తీసేశావు. నువ్వే తులసిని నెత్తిన ఎక్కించి నిర్దాక్షిణ్యంగా కిందికి తోశావు. అసలు తులసి చేసిన తప్పేంటి? నిన్ను గుడ్డిగా నమ్మటమా?. హనీ విషయంలో నీకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా అండగా నిలబడటమా? ఏంట్రా తను చేసిన తప్పు? నీ తొందరపాటు వల్ల అందరి దృష్టిలో తులసి చేతగానిదని ముద్రపడింది. ఇప్పుడేం చేయగలవు' అని అతడిపై తన ప్రశ్నలతో నిందిస్తాడు.

  పైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షో

   బాబాయికి నిజం చెప్పిన సామ్రాట్

  బాబాయికి నిజం చెప్పిన సామ్రాట్


  బాబాయి అడిగిన ప్రశ్నలకు సామ్రాట్ 'నీతి లేనిది అని ముద్రపడితే చెడుపుకోవడం చాలా కష్టం బాబాయి' అంటాడు. దీంతో ఎవర్రా ఆ మాట అన్నది అని ఆయన అడుగుతాడు. అప్పుడు సామ్రాట్ 'తులసి వాళ్ల ఇంట్లో వాళ్లకే సమస్య. తులసి గారిని ఆఫీసుకు దూరం చేయమని అనసూయమ్మ గారు స్వయంగా వచ్చి నన్ను అడిగారు' అని అసలు నిజం చెబుతాడు. దీంతో వాళ్ల బాబాయి షాక్ అవుతాడు. ఆ తర్వాత ప్రేమ్ విషయంలో కూడా జరిగినదాన్ని సామ్రాట్ చెప్పి 'నేను మౌనంగా ఉండకపోతే తులసి గారి ఫ్యామిలీ ఇలాంటివే ఎదుర్కోవాలి' అని అంటాడు.

   తులసికి ప్రశ్న.. టెన్షన్ వద్దంటూ

  తులసికి ప్రశ్న.. టెన్షన్ వద్దంటూ


  ఆ తర్వాత ప్రేమ్.. తులసితో మాట్లాడతాడు. అప్పుడు 'ఫంక్షన్‌లో జరిగిన అవమానానికి నీకు బాధగా అనిపించలేదా. నిజం చెప్పు అమ్మా' అని అందరూ అడుగుతారు. దీనికి తులసి 'అవమానం జరిగిందని మీరు అనుకుంటున్నారు. కానీ. నాకు అలా అనిపించడం లేదు. నెత్తి మీద నుంచి పెద్ద బండరాయిని తీసి కింద పెట్టుకున్నట్టు ఉంది' అంటుంది. అప్పుడు అనసూయ ఎందుకు టెన్షన్.. సంగీతం పాఠాలు చెప్పుకుంటే చాలు.. ఇల్లు ఈజీగా గడిచిపోతుంది అని సర్దిచెబుతుంది. దీంతో తులసి 'నాకేదో అయిందని ఎవ్వరూ టెన్షన్ పడకండి. ప్రశాంతంగా నిద్రపోండి'అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

  దీపిక - రణ్‌వీర్ విడాకులు: నగ్నంగా చేసిన పని వల్లే.. హీరోనే స్వయంగా చెప్పడంతో!

  నందూ, లాస్యకు సామ్రాట్ షాక్

  నందూ, లాస్యకు సామ్రాట్ షాక్

  ఇక, ఆఫీసులో సామ్రాట్ 'ఈరోజు నుంచి మ్యూజిక్ స్కూల్‌కు సంబంధించిన విషయాలు నువ్వు, నందూ చూసుకోవాలి' అని చెప్తాడు. దీంతో లాస్య 'తులసిని వద్దనుకున్నప్పుడు మ్యూజిక్ స్కూల్‌తో పనేంటి సార్. టైమ్ వేస్ట్ కదా' అంటుంది. అప్పుడు సామ్రాట్ 'నేను మొదలు పెట్టిన ఏ ప్రాజెక్ట్ కూడా మధ్యలోనే ఆగిపోవడానికి వీలు లేదు. జస్ట్ డు వాట్ ఐసే' అని షాకిస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 756: Samrat Uncle Questions him About his Odd Behaviour with Tulasi. After That Tulasi Convinces her Family about Samrat Decision.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X