twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: తులసికి సామ్రాట్ ఊహించని గిఫ్ట్.. ఆ ఇంటికి వెళ్లిపోయిన శృతి

    |

    తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే


    బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. హనీ లిఫ్టులో ఇరుక్కుపోయిన విషయం తెలిసిన సామ్రాట్.. తులసిని నిందిస్తూ మాట్లాడతాడు. అంతలో అతడి బాబాయ్ వచ్చి జరిగిన విషయాన్ని అతడికి వివరిస్తాడు. దీంతో నిజం తెలుసుకున్న సామ్రాట్ పశ్చాత్తాపపడుతుంటాడు. ఆ తర్వాత హనీని బయటకు తీసుకు వస్తారు. మరోవైపు, ప్రేమ్ ఫుల్లుగా తాగొచ్చి శృతితో గొడవ పెట్టుకుంటాడు. తన దగ్గర నిజం దాచడంతో తీవ్రంగా నిందిస్తాడు. అలాగే, అంకిత కూడా అభిని తిడుతుంటుంది. దీంతో వీళ్లను కలిపేందుకు తులసి కృష్ణాష్టమి పండుగను జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటుంది.

    <strong>Dhee షోలో షాకింగ్ సీన్: శ్రద్దా దాస్‌, ప్రదీప్‌తో కిరణ్ గొడవ.. ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన హీరోయిన్</strong><br />Dhee షోలో షాకింగ్ సీన్: శ్రద్దా దాస్‌, ప్రదీప్‌తో కిరణ్ గొడవ.. ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన హీరోయిన్

    సామ్రాట్‌ను నిజం చెప్పిన బాబాయ్

    సామ్రాట్‌ను నిజం చెప్పిన బాబాయ్


    ఇంటికి చేరుకున్న తర్వాత సామ్రాట్‌కు అతడి బాబాయ్ జరిగిన విషయాన్ని వెల్లడిస్తాడు. 'ఈ క్షణంలో పాప నీ ఒడిలో అంత ప్రశాంతంగా పడుకోవడానికి కారణం తులసి. పాప బతికి ఉండటానికి కారణం తులసి. నువ్వు తనకు కిడ్నాపర్ అనే ముద్ర వేశావు. స్టేషన్‌కు పంపించావు. ఇంటి మీద పడి రచ్చ రచ్చ చేశావు. ఇన్నాళ్లు నీతో గొడవ పడలేదు. నువ్వు పెట్టిన కష్టాలన్నీ మౌనంగా భరించింది. హనీకి యాక్సిడెంట్ అయినప్పుడు.. హాస్పిటల్‌లో తనను జాయిన్ చేయించినప్పుడు పాపకు తల్లిగా రికార్డుల్లో రాయించింది. ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందేమో.. పరువు పోతుందేమో అని కూడా ఆలోచించలేదు' అని వివరిస్తాడు.

    తులసికి డబ్బు ఇస్తానన్న సామ్రాట్

    తులసికి డబ్బు ఇస్తానన్న సామ్రాట్


    ఆ తర్వాత సామ్రాట్ బాబాయ్ మాట్లాడుతూ.. 'తను చేసిన త్యాగానికి వెల కట్టగలవా? కావాలని మన ఇంటి అడ్రస్ చెప్పకుండా హనీ ఊరంతా తిప్పించింది. ఈ మాట హనీనే స్వయంగా నాకు చెప్పింది' అంటాడు. దీనికి సామ్రాట్ మరి.. హనీ నాకెందుకు చెప్పలేదు బాబాయి అని అడుగుతాడు. దీంతో హనీ నీకు భయపడింది. మరి ఇప్పుడు ఏం చేస్తావు అని అంటాడు. అప్పుడు సామ్రాట్ 'తను కోరుకున్నది ఇస్తాను. అడిగినంత డబ్బు ఇస్తాను' అని చెప్తాడు. దీనికి బాబాయ్ 'తులసి డబ్బు తీసుకోకపోతే' అని అడుగుతాడు. దీంతో సామ్రాట్ 'తులసి డబ్బు మనిషి కాకపోవచ్చు కానీ.. మధ్య తరగతి కుటుంబాల గురించి నాకు తెలుసు' అని చెప్పి హనీని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

    క్లోజప్ ఫొటోల్లో తెలుగు హీరోయిన్ అందాల విందు: స్లీవ్‌లెస్ టాప్‌లో యమ హాట్‌గా!క్లోజప్ ఫొటోల్లో తెలుగు హీరోయిన్ అందాల విందు: స్లీవ్‌లెస్ టాప్‌లో యమ హాట్‌గా!

     అభిని పిలుద్దామని చెప్పిన తులసి

    అభిని పిలుద్దామని చెప్పిన తులసి


    ఇంట్లో ఉన్న అంకిత దేని గురించో బాగా ఆలోచిస్తుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన తులసి.. పండగకు అభిని పిలుద్దామని అనుకుంటున్నాను అని చెప్తుంది. కానీ, అంకిత మౌనంగా ఉండడంతో ఏం మాట్లాడవేంటి అని అడుగుతుంది. దీంతో అంకిత 'ఇందులో నేను మాట్లాడకపోవడానికి ఏం ఉంది ఆంటి. మీ అబ్బాయి.. మీ ఇల్లు.. మీ ఇష్టం' అంటుంది. మరి ఈ ఇంటితో నీకు, అభికి సంబంధం లేదా అని అంకితను తులసి ప్రశ్నిస్తుంది. దీనికామె 'అభిని పిలవాల్సిన అవసరం లేదు ఆంటి. పిలిస్తేనే రావాలని లేదు కదా. పిలవకున్నా రావాలి' అంటుంది.

    తులసి నిర్ణయానికి అంకిత సిగ్నల్

    తులసి నిర్ణయానికి అంకిత సిగ్నల్


    ఆ తర్వాత తులసి 'అయినా నేను వాడిని పిలిచేది నీకోసమే కదా' అంటుంది. దీనికి అంకిత అక్కర్లేదు అనే కదా అక్కడే ఉండిపోయాడు అంటుంది. అప్పుడు తులసి 'వాడు మొండివాడు.. వాడు మారడు. నువ్వే వాడిని మార్చుకోవాలి. వాడు గడప తొక్కేలా చేస్తాను. వాడు ఇక్కడే ఉండిపోయేలా చేసే బాధ్యత నీది' అని చెప్తుంది. అప్పుడు అంకిత జరగని విషయం గురించి ఏం ఆలోచించినా వేస్ట్ ఆంటి' అంటుంది. తర్వాత 'ప్రేమ్, శృతిని కూడా ఇక్కడికే వచ్చి ఉండమని పిలుద్దామనుకుంటున్నా' అంటుంది. దీంతో వెంటనే ఆపని చేయండి అంటుంది.

    పవన్ కల్యాణ్‌కు తీవ్ర అనారోగ్యం: అతడు చేసిన పని వల్లే.. డాక్టర్లు ఏం చెప్పారంటే!పవన్ కల్యాణ్‌కు తీవ్ర అనారోగ్యం: అతడు చేసిన పని వల్లే.. డాక్టర్లు ఏం చెప్పారంటే!

    వెళ్లిపోయిన శృతి.. తులసి ఫోన్‌తో

    వెళ్లిపోయిన శృతి.. తులసి ఫోన్‌తో


    ప్రేమ్ అన్న మాటలకు బాధ పడిపోయిన శృతి.. తన అత్తయ్య వాళ్ల ఇంటికి వెళ్లిపోతుంది. బ్యాగుతో వచ్చిన శృతిని చూసి వాళ్ల అత్తయ్యకు అనుమానం వస్తుంది. అప్పుడు ఆమె 'అర్ధరాత్రి పూట ప్రేమ్‌ను వదిలేసి వచ్చావా. మొగుడు ఒక మాట అనగానే చెప్పాపెట్టకుండా బ్యాగు పట్టుకొని వచ్చావని ఆశ్చర్యపోతున్నాను' అంటుంది. అప్పుడు శృతి 'నా మీద నమ్మకం పోయింది అన్నాడు. నేను మోసం చేశాను అన్నాడు. నా కన్నీళ్లను నమ్మను అన్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అని చెప్తుంది. ఇంతలో తులసి.. ప్రేమ్‌కు ఫోన్ చేసి 'బోనాల పండుగకు ఇంటికి రండి. మీరిద్దరూ ఇంటికి వచ్చేయండి. ఇక మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు' అంటుంది. దీంతో ప్రేమ్ అలాగే అమ్మ.. ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తాం అంటాడు.

    తులసికి చెక్ పంపించిన సామ్రాట్

    తులసికి చెక్ పంపించిన సామ్రాట్


    తన తప్పును సరిదిద్దుకోడానికి తులసికి ఏదో ఒక సాయం చేయాలని అనుకుంటోన్న సామ్రాట్.. తులసికి ఒక కవర్ పంపిస్తాడు. అప్పుడు డ్రైవర్ 'సార్ మీకు ఈ కవర్ ఇచ్చి రమ్మన్నారు. అందులో ఏముందో మాకు తెలీదు మేడం' అంటాడు. ఇక, తులసి అది చూడగా అందులో బ్లాంక్ చెక్ ఉంటుంది. దాన్ని చూసి తులసి షాక్ అవుతుంది. అప్పుడు పరందామయ్య 'డబ్బుందని పొగరా? మనకు డబ్బు వాసన చూపిస్తే మనం పడిపోతామని ఆశ ఏమో' అని అంటాడు. దీనికి అనసూయ 'నువ్వు ఆ చెక్కు ఇప్పుడు తీసుకుంటావా' అని అడుగుతుంది. తర్వాత తులసి కోపంగా సామ్రాట్ ఇంటికి బయలుదేరుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 690: Samrat Feels Guilty knowing about Tulasi Real Character. Otherside.. Prem Gets Depressed to Finds Shruthi Letter
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X