Intinti Gruhalakshmi Today Episode: తులసి గురించి సామ్రాట్‌కు చెప్పిన నందూ.. అంతలోనే ఊహించని షాక్
చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కాంపిటీషన్‌లో విజయం సాధించిన తర్వాత హనీ ఎంతో సంతోషంగా ఇంటికి వస్తుంది. అప్పుడు వాళ్ల తాతయ్య, తండ్రి సామ్రాట్‌తో ఆనందాన్ని పంచుకుంటుంది. ఆ సమయంలో సామ్రాట్.. తులసి గొప్పదనం గురించి బాబాయితో మాట్లాడతాడు. అనంతరం తులసి ఇంటికి నందూ, లాస్య మ్యూజిక్ స్కూల్ ప్లాన్ తీసుకుని వస్తారు. అప్పుడు వాళ్లను పరందామయ్య, అనసూయ అవమానిస్తారు. తులసి కూడా వింత ప్రవర్తనతో ఇబ్బంది పెడుతుంది. కానీ, నందూ మాత్రం తులసి చెప్పినట్లు మర్యాద చూపిస్తాడు.

నందూ ముందే తేల్చేసిన తులసి
మ్యూజిక్ స్కూల్ ప్లాన్ గురించి నందూ, లాస్య తన ఇంటికి రావడంతో తులసి వాళ్లు చెప్పేది వింటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్ తనకు నచ్చలేదని అంటుంది. దీనికి కారణం ఏంటని నందూ ఆమెను ప్రశ్నిస్తాడు. దీంతో 'మ్యూజిక్ స్కూల్‌తో పాటు షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం నాకు ఇష్టం లేదు. సంగీతం అంటే ప్రశాంతత అవసరం' అంటుంది. దీనికి నందూ 'మీ బిజినెస్‌కు సహాయం చేసే వాళ్ల ఆదాయానికి అడ్డు పడడం మంచిది కాదు' అని అంటాడు. దీంతో ఇలా అయితే నాకు మీ ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు అంటూ నందూ ముందే తేల్చి చెప్పేస్తుంది.

నందూకు లాస్య విలువైన సలహా
తులసి తనకు బిజినెస్ వద్దని చెప్పడంతో నందూకు కోపం వస్తుంది. అప్పుడు లాస్య 'ఇదే మాటను సామ్రాట్ గారికి కూడా చెప్పాలా' అని అడుగుతుంది. దీనికి తులసి 'చెప్పమనే కదా అంటున్నాను. ఎవరికైనా చెప్పుకోండి' అంటుంది. దీంతో వాళ్లిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అనంతరం కారులో వెళ్లే సమయంలో 'తులసి ప్రాజెక్టును నేను చేయలేనని సామ్రాట్‌కు చెప్పేస్తా' అని నందూ చెప్తాడు. దీంతో లాస్య 'నువ్వు ఆ మాట అంటే ఆయన మొత్తానికి నిన్ను వెళ్లిపో అంటాడు. అప్పుడు మన ఆదాయానికి గండి పడుతుంది. అయినా ఇప్పుడు తులసి నువ్వు చెప్పినట్లు వినే నీ మాజీ భార్య కాదు. తనలో చాలా మార్పు వచ్చింది. సీఈవోకే ఎదురు తిరిగే ధైర్యం వచ్చింది. కాబట్టి నువ్వు కామ్‌గా ఉండు' అంటూ నందూకు సలహా ఇస్తుంది.

శృతికి లెటర్ రాసుకున్న ప్రేమ్
శృతి జాడ తెలియకపోవడంతో ప్రేమ్ బాధ పడుతూనే ఉంటాడు. ఈ క్రమంలోనే ఒంటరిగా కూర్చున్న అతడు.. శృతి గురించి ఓ పేపర్ మీద రాస్తాడు. ఆ సమయంలో తన మనసులోని బాధనంతా వెల్లగక్కుతాడు. మొత్తానికి తప్పు చేశానని అనుకుంటాడు. అదే సమయంలో శృతి కూడా ప్రేమ్ విషయంలో తప్పు చేశానని ఫీల్ అవుతూ ఉంటుంది. 'నిన్ను అర్ధరాత్రి ఒంటరిగా వదిలి వచ్చేయడం తప్పే ప్రేమ్. కానీ, అలా ఎందుకు చేయాల్సి వచ్చింది. అలా చేయకుండా ఉంటే బాగుండేది. వచ్చి నన్ను నీ దగ్గరకు తీసుకెళ్లు ప్రేమ్' అని అనుకుంటుంది.

తులసి గురించి సామ్రాట్‌కు చెప్పి
తులసితో మాట్లాడిన తర్వాత సామ్రాట్ ఆఫీస్‌కు వచ్చిన నందూ.. 'మనం ఒక కమర్షియల్ ప్లేస్‌లో మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కదా సార్.. కేవలం ఒక్క స్కూల్ కోసమే ఆ ప్లేస్ వాడడం కరెక్ట్ కాదు సార్.. ఒక మల్టీప్లెక్స్ ప్లాన్ చేసి అందులో ఒక ఫ్లోర్ అంతా మ్యూజిక్స్ స్కూల్ పెట్టి మిగతా ఫ్లోర్సులో కమర్షియల్ బిజినెస్ చేయాలని నేను ఆలోచించాను. కానీ తులసి గారికి ఆ ఐడియా నచ్చడం లేదు. ఇలా చేస్తే మ్యూజిక్ స్కూల్ ప్రపోజల్ నుంచి బ్యాక్ అవుట్ అవుతానని అంటున్నారు సార్' అని చెప్తాడు. దీంతో ఇది నిజమేనా అని సామ్రాట్ తులసిని ప్రశ్నిస్తాడు.

నందూ మాటలకు తులసి రిప్లై
ఆ తర్వాత నందూ 'ఈరోజుల్లో దేవుడు గుడిలో కూడా కమర్షియల్ యాంగిల్ ప్లాన్ చేస్తున్నరు. మనం మల్టీఫ్లెక్స్ పెట్టుకుంటే ఏమౌతుంది సార్' అని అడుగుతాడు. అప్పుడు తులసి 'ఒక కుటుంబంలో ప్రతి తండ్రి ప్రతి విషయాన్ని ఆర్థిక కోణంలో ఆలోచిస్తాడు. కానీ తల్లి బిడ్డకు అన్నం తినిపిస్తూ దానివల్ల తనకేం లాభం అని ఆలోచించదు. ఇందాక నందగోపాల్ గారు గుడి గురించి చాలా విషయాలు చెప్పారు. కానీ మనం వెళ్లిన కొన్ని గుళ్లలో మాత్రమే మానసిక ప్రశాంతత లభిస్తుంది. నా మ్యూజిక్ స్కూల్‌కు వచ్చే పిల్లలకు కూడా అది అందించాలి' అంటుంది.

దాన్ని కూడా కమర్షియల్ వద్దు
తులసి చెప్పిందంతా చెప్పి ఇది తప్పా సర్ అని సామ్రాట్‌ను అడుగుతుంది. అతడు కాదు అని అంటాడు. తర్వాత నందూ ఏదో చెప్పబోతుండగా సామ్రాట్ అడ్డుపడతాడు. ఆ తర్వాత తులసి 'ఈ రోజుల్లో విద్య ఎలాగూ కమర్షియల్ అయిపోయింది. దానిమీద ఎలా సంపాదించాలని అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు. సంగీతం కలను కూడా అలా చేయకండి సర్.. పచ్చని ప్రకృతి మధ్య పక్షుల కిలకిల రావాలని ఆస్వాదించేలాగా పిల్లలు నేర్చుకోవాలి. దీన్ని కూడా కమర్షియల్ చేయకూడదని నా ఆలోచన సార్. మీకు నచ్చకపోతే మాత్రం నేనేమీ చేయలేను' అని అంటుంది.

తులసికి సామ్రాట్ సహాయం
అనంతరం తులసి 'కొంతమంది మనుషులు జీవితాన్ని కూడా వ్యాపారంగానే చూస్తారు. కట్టుకున్న భార్య మనసుకు నచ్చకపోతే మోజుకు తీరిపోతే ఆ బంధాలను తెంపుకొని మరొకరితో కలిసి వెళ్లిపోతారు. లాభనష్టాలు బేరీజు వేసుకుంటారు. సార్ నా వల్ల మీకు నష్టం జరుగదు' అని చెప్పేసి తులసి వెళ్లిపోతుంది. అంతలో సామ్రాట్ 'ఒక్కసారి ఆగండి తులసి. మిస్టర్ నందగోపాల్ తులసి ఎలా ఆ బిల్డింగ్ ప్లాన్ కావాలనుకుంటుందో.. అలా డిజైన్ చేయండి. తులసి గారు మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించడానికి నేను మీకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటాను' అంటాడు. అప్పుడు ఇద్దరూ దండం పెట్టుకోగా.. రేపు దండలు మార్చుకుంటారేమో అని నందూను లాస్య రెచ్చగొడుతుంది. ఆ తర్వాత హనీ.. సామ్రాట్‌తో మాట్లాడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











