For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: గాయత్రికి అంకిత ఝలక్.. ప్రేమ్ గురించి నిజం తెలిసి తులసి షాక్

  |

  దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి 20 లక్షలు ఎలా సంపాదించాలా అని లాస్య ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఆమె ఫోన్ చేసి 20 లక్షలు తన అకౌంట్‌లో పడ్డాయని చెబుతుంది. అప్పుడు నందూ.. ఆ డబ్బును తానే వేసినట్లు లాస్యతో చెప్తాడు. దీంతో లాస్యకు కోపం వచ్చి తులసికి ఫోన్ చేయగా.. తాను ఆ విషయం నందూకు చెప్పలేదని అంటుంది. ఆ తర్వాత లాస్య ఫ్రెండ్ ఫోన్ చేసి నందూకు ఈ విషయం చెప్పింది తానేనని అంటుంది. లాస్యను కోపంతో వదిలేస్తానని నందూ అనగానే.. ఆమె విషం తాగినట్లు యాక్టింగ్ చేసి అతడి మనసును మార్చేస్తుంది.

  తెలుగు పిల్ల అనన్య నాగళ్ల పరువాల విందు: వామ్మో ఆమెనిలా చూశారంటే!

  డబ్బు ఇచ్చేయాలని తులసి డిసైడ్

  డబ్బు ఇచ్చేయాలని తులసి డిసైడ్

  ఉదయం లేవగానే తులసి.. అంకితకు కొన్ని పనులు చెబుతుంది. దీంతో అసలు ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావాలని దివ్య ఆమెను అడగుతుంది. దీంతో తాను బ్యాంక్‌కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులతో చెబుతుంది. అప్పుడు అసలు బ్యాంకుకు ఎందుకు వెళ్తున్నారు అని అంకిత ఆమెను ప్రశ్నిస్తుంది. అప్పుడు తులసి 'ఆ బ్యాంక్‌లో తీసుకున్న లోన్‌ను తిరిగి కట్టేద్దామని వెళ్తున్నాను' అని అంటుంది. దీనికామె అదేంటి ఆంటి ఎందుకు లోన్ తీర్చడం అని అడుగుతుంది. దీంతో తులసి 'ఫేక్ సర్టిఫికెట్లతో తీసుకున్న ఆ లోన్ వద్దు. దాన్ని తీర్చేస్తా' అంటుంది.

  బ్యాంకు వాళ్లపై ఫైర్.. చెక్ ఇచ్చేసి

  బ్యాంకు వాళ్లపై ఫైర్.. చెక్ ఇచ్చేసి

  బ్యాంకుకు బయలుదేరి వెళ్తోన్న సమయంలోనే ఆఫీసర్లు వాళ్లు ఇంటికి చేరుకుంటారు. వచ్చీ రావడమే తులసి 'ఏంటి మళ్లీ నా మీద పోలీస్ కేసు పెట్టడానికి వచ్చారా' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు వాళ్లు 'మా తప్పయింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి' అని చెప్తుంది. దీంతో తులసి 'ఏది ఏమైనా.. మీరు నన్ను ఇబ్బంది పెట్టారు. నాకంటే చదువు రాదు. ఆ ఏజెంట్ నన్ను మోసం చేశాడు. మరి మీకు ఏమైంది? ఆ ఫేక్ డాక్యుమెంట్లను చూడకుండా ఎలా లోన్ అప్రూవ్ చేశారు' అని వాళ్లపై ఫైర్ అవుతుంది. ఆ తర్వాత 20 లక్షలు చెక్ ఇచ్చేస్తుంది.

  సుమ షోలో యంగ్ హీరోకు అవమానం: మొబైల్ విసిరేసిన యాంకర్.. కోపంతో వెళ్లిపోయిన స్టార్ కిడ్

  ఏం చెప్పినా నీకు సంతోషమే కదా

  ఏం చెప్పినా నీకు సంతోషమే కదా


  మరోవైపు.. అభితో లోన్ విషయంలో బ్యాంక్ వాళ్లు మీ మమ్మీకి ఈరోజే టైమ్ ఇచ్చారు అని గాయత్రి చెబుతుంది. దీంతో అభి 'నీతో చేసిన చాలెంజ్‌లో మామ్ ఓడిపోతుంది. ఖచ్చితంగా ఇంటికి తిరిగి రావాల్సిందే అని అంకితకు ఫోన్ చేసి కనుక్కోండి' అంటాడు. దీంతో అంకితకు గాయత్రి ఫోన్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన అంకిత చెప్పు మామ్ అంటుంది. దీంతో గాయత్రి నేను ఎందుకు కాల్ చేశానో తెలుసు కదా అంటుంది. అప్పుడు అంకిత 'ఎవరు పే చేశారని చెప్పాలి. ఆంటి పే చేసిందనా? నేను పే చేశానని చెప్పాలా? ఏం చెప్పినా నీకు సంతోషమే కదా' అంటుంది.

  గాయత్రి, అభికి షాకిచ్చిన అంకిత

  గాయత్రి, అభికి షాకిచ్చిన అంకిత

  అక్కడితో ఆగని అంకిత 'నీతో పాటు నీ పక్కనే కూర్చొని నా మాటలు వింటున్న నీ అల్లుడిని కూడా అడుగు. ఏం జరిగితే బాగుంటుందా' అని అంటుంది. దీనికి గాయత్రి 'నాకు తెలిసి నీ ప్రియమైన ఆంటి లోన్ బాధ్యత నీమీదే వేసి ఉంటుంది' అని అంటుంది. దీంతో అంకిత 'కుళ్లు బుద్ధి ఉన్న మనుషులకు ఇంతకంటే మంచి ఆలోచనలు ఎలా వస్తాయి. మా ఆంటి సింహం. తన డబ్బుతోనే లోన్ రీపే చేసింది' అంటుంది. దీంతో అభికి కోపం వస్తుంది. అప్పుడు గాయత్రి నేను నా కూతురును ప్రేమిస్తున్నాను అంటుంది. దీంతో అంకిత 'అది నువ్వు చెప్పడం కాదు. నాకు అనిపించాలి. పక్కనే ఉన్న నీ అల్లుడికి చెప్పు. ఇప్పటికైనా తన తల్లి విలువను తెలుసుకొమ్మను' అని అంటుంది.

  జబర్ధస్త్ వర్ష అందాల ఆరబోత: ఉల్లిపొరలాంటి చీరలో అదిరిపోయే హాట్ ట్రీట్

  ప్రేమ్ కోసం లెటర్ తెచ్చిన తులసి

  ప్రేమ్ కోసం లెటర్ తెచ్చిన తులసి

  బ్యాంకులో డబ్బులు కట్టేసిన తర్వాత తులసి.. సంజన ఇంటికి ట్యూషన్ చెప్పేందుకు వెళ్తుంది. ఇంతలో సంజన పిలిచి ఇదుగోండి ఈ నెల మీ టూషన్ ఫీజు అంటుంది. ఆ తర్వాత సింగింగ్ పోటీల్లో నా కొడుకు ప్రేమ్‌కు చాన్స్ ఇవ్వండి అని అడుగుతుంది. దీంతో సరే అండి ఇదిగోండి.. పార్టిసిపేషన్ లెటర్ అని ఇస్తుందామె. దాన్ని తీసుకొని వెంటనే సంతోషంతో తులసి.. ప్రేమ్ ఇంటికి వస్తుంది. అప్పుడు శృతి.. ప్రేమ్ ఇంట్లో లేడు ఆంటి అంటుంది. దీనికి తులసి 'వాడు వచ్చేలోపు వెళ్లిపోవాలి. ఇంకొద్ది రోజులు ఈ సంఘర్షణ తప్పదు. ఇది నేను చెప్పిన పాటల పోటీలకు సంబంధించిన ఎంట్రీ ఫామ్. వాడిని పాటలు ప్రాక్టీస్ చేయమను. గెలుపు మీదే దృష్టి పెట్టమను' అని చెబుతుంది.

  ప్రేమ్ గురించి నిజం చెప్పడంతో

  ప్రేమ్ గురించి నిజం చెప్పడంతో

  తులసి మాటలకు శృతి స్పందిస్తూ ప్రేమ్ కాంపిటిషన్‌కు వెళ్లనంటున్నాడు అని అసలు నిజం చెబుతుంది. దీంతో తులసి షాక్ అవుతుంది. తర్వాత తులసి 'వాడు వెళ్లను అంటే నువ్వు వదిలేశావా.. ఒప్పించవా. అయినా వెళ్లకపోవడానికి కారణం ఏంటి. జీవితంలో ఎదగడానికి ఇంతకంటే మంచి అవకాశం వస్తుందా' అని అడుగుతుంది. దీంతో శృతి 'చాలా డిప్రెస్డ్‌గా ఉన్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు' అని అంటుంది. ఇంతలో ప్రేమ్ ఇంట్లోకి వస్తాడు. దీంతో తులసి తలుపు చాటున దాక్కుంటుంది. తర్వాత తన చేతుల్లో ఉన్న ఎంట్రీ ఫామ్‌ను ప్రేమ్‌కు ఇస్తుంది. అప్పుడతను 'నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పాను కదా' అంటాడు.

  బీచ్‌లో నిక్‌తో ప్రియాంక చోప్రా రొమాన్స్: వాళ్ల బట్టలు, ఫోజులు చూశారంటే!

  తులసి పాట విని ప్రేమ్ నిర్ణయం

  తులసి పాట విని ప్రేమ్ నిర్ణయం


  శృతి మాటలకు ప్రేమ్ 'నేను పాడే మూడ్‌లో లేను. ఈ కాంపిటిషన్ గురించి నాతో మాట్లాడకు శృతి. ఆ ఫామ్‌ను చించి అవతల పారేయ్. నీ కొడుకు చేతకాని వాడని మా అమ్మకు చెప్పేయ్. నీ కొడుకు ఓడిపోయాడని మా అమ్మకు చెప్పేయ్ శృతి' అని కోపంగా బయటకు వెళ్లిపోతాడు. దీంతో తులసి చాలా బాధపడుతుంది. తర్వాత ఆమె గాలి చిరుగాలి అనే పాట పాడుతుంది. దీంతో ప్రేమ్ ఈ పాట పాడింది ఎవరు అమ్మే కదా అని అడుగుతాడు. అప్పుడు శృతి 'అంకిత బర్త్ డే పార్టీలో మీ అమ్మ పాడిన పాటే ఇది. ఆంటి కలను చింపేయాలంటే మీ మధ్య ఉన్న బంధాన్ని చంపేయడమే. నువ్వు పిరికివాడిలా ఉండిపోవడం నాకు గానీ.. ఆంటికి గానీ నచ్చని విషయం. నిన్ను నువ్వు నిరూపించుకో' అని అనగానే అతడు ఒప్పుకుంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 677: Tulasi Returns her Loan Money to Bank. After That Shruthi Disappointed about Prem Behaviour on Competition.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X