India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అభిని కలిసేందుకు ఒప్పుకున్న అంకిత.. తులసికి షాకిచ్చిన ప్రేమ్

  |

  భారతదేశంలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి 20 లక్షల రూపాయలను బ్యాంక్ వాళ్లకు తిరిగి చెల్లిస్తానని అంటుంది. దీంతో ఇంట్లో వాళ్లు అడ్డు చెప్పగా.. అవి అక్రమంగా వచ్చాయని, అలాంటి డబ్బులు తనకు వద్దని అంటుంది. అప్పుడే బ్యాంక్ అధికారులు రాగా.. వాళ్లకు క్లాస్ పీకి.. ఆ తర్వాత చెక్ ఇచ్చేస్తుంది. అనంతరం ఈ విషయం గురించి గాయత్రి.. అంకితకు ఫోన్ చేయగా.. తులసి ఆంటీనే డబ్బు కట్టిందని చెప్తుంది. ఇక, ప్రేమ్ కోసం కాంపిటీషన్ ఎంట్రీ ఫామ్‌ను తీసుకొచ్చిన తులసి.. శృతి ద్వారా ఇప్పిస్తుంది. కానీ, అందులో పాల్గొనేందుకు అతడు ఒప్పుకోడు.

  నాగబాబుకు ఫేమస్ కమెడియన్ వార్నింగ్: ఏమనుకుంటున్నావ్.. ఇది కరెక్ట్ కాదు అంటూ!

  లాస్యను బాగా రెచ్చగొట్టిన భాగ్య

  లాస్యను బాగా రెచ్చగొట్టిన భాగ్య

  నందూతో విడిపోయే ప్రమాదం నుంచి తప్పించుకున్న తర్వాత లాస్య.. భాగ్యతో మీటింగ్ పెడుతుంది. అప్పుడు భాగ్య 'బావ గారు నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఎలా ఉండేదో. వామ్మో తులసి మైండే మైండ్. ఎంత తెలివి' అని అంటుంది. అప్పుడు లాస్య ఇక తులసిని పొగడటం ఆపుతావా అంటుంది. దీనికామె 'నీకంటే ఎక్కువ నాకే తులసి మీద చాలా కోపంగా ఉంది. ఎప్పుడు పగ తీర్చుకోవాలా అని చూస్తున్నా. ఏది ఏమైనా తులసితో జాగ్రత్తగా ఉండాలి. మాజీ మొగుడిని కొంగున కట్టుకున్నా కట్టుకుంటుంది' అని లాస్యకు జాగ్రత్త చెబుతూనే తెగ రెచ్చగొడుతుంది.

  జాబ్‌లో జాయిన్ అయిన అంకిత

  జాబ్‌లో జాయిన్ అయిన అంకిత

  అప్పుడే ఇంటికి వచ్చిన అంకిత తులసితో మళ్లీ ఇది వరకు జాబ్‌లోనే జాయిన్ అయ్యాను. ఈరోజు నుంచి రమ్మన్నారు అని చెబుతుంది. దీంతో 'సరే మంచి నిర్ణయం తీసుకున్నావు మరి.. అభికి ఈ విషయం చెప్పావా' అని అడుగుతుంది. అప్పుడు అంకిత ఏం మాట్లాడదు. దీంతో తులసి 'అభి నీ శత్రువేమీ కాదు కదా. అభి మనస్తత్వం నీకు తెలుసు. తనకు లాభం ఉంటుందన్నవైపే వాడు ఉంటాడు. అలా అని వాడు చెడ్డవాడు కాదు. స్వార్థపరుడు. ఎంత కాదనుకున్నా సంసారాన్ని నిలబెట్టుకునే బాధ్యత భార్యదే' అని అంకితకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది.

  మళ్లీ రెచ్చిపోయిన తెలుగు యాంకర్: చీరలోనూ హాట్‌గా.. ఈ వీడియో చూశారంటే!

  అభిని కలిసేందుకు ఒప్పుకుంది

  అభిని కలిసేందుకు ఒప్పుకుంది


  తులసి మాటలకు అంకిత 'కలిసి ఉండాలన్న ఆలోచన నా ఒక్కదానికే ఉంటే సరిపోతుందా? అభికి కూడా ఉండాలి కదా. అటు నుంచి కూడా ప్రయత్నం జరగాలి కదా' అంటుంది. దీనికి తులసి 'ఎందుకు లేదు అనుకుంటున్నావు? వాడు నీకోసమే ఎదురు చూస్తున్నాడేమో. మొదటి అడుగు నువ్వే వేయొచ్చు కదా. తప్పు కాదు అవసరం. ఒక మెట్టు దిగినంత మాత్రన నువ్వు తప్పు చేసినట్లు అయిపోదు అంకిత' అని వివరిస్తుంది. దీంతో అంకిత ఈరోజే అభిని కలుస్తాను అని చెబుతుంది. అప్పుడు తులసి సంతోషిస్తూ సరే మంచిది వెళ్లిరా అని అంటుంది.

  అనసూయకు కొరియర్, లెటర్

  అనసూయకు కొరియర్, లెటర్

  తులసి ఇంటికి ఒక కొరియర్ వస్తుంది. దాన్ని చూసి అంతా షాక్ అవుతారు. దీనికి కారణం అది అనసూయ పేరు మీద ఉండడమే. ఆ వెంటనే అత్తయ్య మీకు ఏదో కోరియర్ వచ్చింది చూడండి అని అంటుంది. దీంతో దివ్య అందులో ఏముందో అని తీసి చూస్తుంది. అప్పుడు అనసూయ 'నా జీవితంలో మొదటి సారి నా పేరు మీద కొరియర్ వచ్చింది. అందులో ఏముందో చూడమ్మా.. ఆరాటం ఆపుకోలేకపోతున్నాను' అంటుంది. ఇక, అందులో ఓ షీల్డ్ ఉంటుంది. అలాగే ఓ లెటర్ కూడా ఉంటుంది. అందులో 'నానమ్మ గారు నమస్తే.. నా పేరు సతీశ్. నెట్‌లో నానమ్మాస్ కిచెన్‌లో మీరు పెట్టిన వంటకాలు చూసి ఈ షీల్డ్ పంపకుండా ఆగలేకపోయాను' అని ఉంటుంది. దీంతో పరందామయ్య 'ఎవడికో నచ్చి షీల్డ్ పంపించడం ఏంటి.. వింతగా ఉంది' అంటాడు.

  తెలుగు పిల్ల అనన్య నాగళ్ల పరువాల విందు: వామ్మో ఆమెనిలా చూశారంటే!

  అభితో గొడవకు దిగిన అంకిత

  అభితో గొడవకు దిగిన అంకిత

  తులసి కోరిక మేరకు అభిని కలిసేందుకు అంకిత హాస్పిటల్‌కు వెళ్తుంది. ఆమె వెళ్లడమే అతడు 'మళ్లీ ఎందుకు ఈ చిన్న హాస్పిటల్‌లో జాయిన్ అయ్యావు మీ అత్తయ్య గారు చెప్పారా' అని అడుగుతాడు. దీనికామె ఎవరో చెబితే నేను చేయను. నాకు నచ్చింది నేను చేస్తాను అంటుంది. అప్పుడు అభి అది సరే కానీ నువ్వు ఎందుకు నన్ను ఇక్కడికి పిలిపించావు అని అడుగుతాడు. దీనికి అంకిత 'నువ్వు ఒంటరిగా బతకడం ఇష్టం లేకే.. ఇంటికి రమ్మని.. నచ్చజెప్పమని ఆంటినే చెప్పింది' అని అంటుంది. దీంతో అభి 'ఇదంతా ఆమె డైరెక్షనా.. ఆమె కడుపులో పుట్టి ఏం పాపం చేశానో' అంటాడు. అప్పుడు అంకిత 'ఆమె కడుపులో పుట్టడం నీ అదృష్టం. ఆంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు సాయం చేసే స్టేజ్‌లో ఉండి కూడా నువ్వు చేయలేదు. నువ్వు తెలుసుకొని మారేవరకు మళ్లీ నిన్ను కలవను. నీతో మాట్లాడను. నీ అంతట నువ్వే రావాలి.. ఇక నువ్వు వెళ్లొచ్చు' అని అంటుంది. దీంతో అభి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  శృతిపై ఆగ్రహం చూపిన ప్రేమ్

  శృతిపై ఆగ్రహం చూపిన ప్రేమ్

  ప్రేమ్ పాటల పోటీల కోసం పాట రాస్తూ ఉంటాడు. కానీ, పాట సరిగ్గా రాదు. ఇంతలో అక్కడికి వచ్చిన శృతి.. ఏంటి పాట రాయడం రావడం లేదా.. ఇలా అయితే కష్టం. ఎప్పుడు ఎదుగుతావు అని అంటుంది. దీంతో ప్రేమ్ 'నేను ఎదగను. నా వల్ల కావడం లేదు. కాంపిటిషన్‌కు వెళ్లనని ఎంత చెప్పినా కూడా ఫోర్స్ చేసి ఒప్పించావు. పాట రాద్దామని ఉదయం నుంచి చూస్తున్నాను. కానీ, 4 లైన్లు కూడా రాయలేకపోయాను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయ్' అంటాడు. దీంతో శృతి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఇంతలో శృతికి తులసి ఫోన్ చేసి మాట్లాడుతుంది.

  సుమ షోలో యంగ్ హీరోకు అవమానం: మొబైల్ విసిరేసిన యాంకర్.. కోపంతో వెళ్లిపోయిన స్టార్ కిడ్

  ప్రేమ్ గురించి తులసికి చెప్పి

  ప్రేమ్ గురించి తులసికి చెప్పి


  శృతికి ఫోన్ చేసిన తులసి ప్రేమ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది. బయటికి వచ్చి కూర్చొన్నాను అంటుంది. కానీ, తన మాటలో ఏదో తేడా ఉండటంతో ఏం జరిగింది అని అడుగుతుంది. ప్రేమ్ మళ్లీ మొదటికొచ్చాడా అని ప్రశ్నిస్తుంది. దీంతో శృతి 'ప్రేమ్ కాంపిటిషన్‌లో పార్టిసిపేట్ చేస్తాడని నాకు నమ్మకం లేదు ఆంటి. పాట రాయడానికి ఉదయం నుంచి ట్రై చేస్తున్నాడు కానీ.. తన వల్ల కావట్లేదు. ఎప్పుడూ ఇలా జరగలేదు. ప్రేమ్‌ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది' అంటుంది. దీంతో తులసి ఆలోచనలో పడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 678: Ankitha and Abhi Gets into Heated Argument. After That Prem Denied Shruthi Help. Then Tulasi Learns About Prem Behaviour.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X