Intinti Gruhalakshmi: లాస్యకు విక్రమ్ గ్రీన్ సిగ్నల్.. దివ్యకు ఊహించని దెబ్బ.. తులసి కొత్త ప్లాన్‌

సుమారుగా రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌కు మాయ మాటలు చెప్పి దివ్యను దోషిగా నిలబెట్టిన తర్వాత ఆ రూ. 20 లక్షలను సంజయ్ ఇచ్చేస్తాడు. అప్పుడు ఎవరు ఎంత చెప్పినా అతడు మాత్రం పట్టించుకోడు. పైగా విక్రమ్‌నే తీసుకెళ్లి ఇవ్వమంటాడు. అతడు ఆ డబ్బుతో కారులో వెళ్తుండగా పోలీసులు ఆపి గొడవ చేస్తారు. అప్పటికే రాజ్యలక్ష్మి తన ప్లాన్‌ను దివ్యకు వివరిస్తుంది. అందుకు తగ్గట్లుగానే విక్రమ్‌ ఆమెకు ఫోన్ చేసి పోలీసుల విషయం చెప్తాడు. దీంతో రాజ్యలక్ష్మి పోలీసులతో మాట్లాడుతుంది. తర్వాత లాస్యకు ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పి షాక్ ఇచ్చేస్తుంది.

Intinti Gruhalakshmi:

కెఫేకు గిరాకీ దొరికిందని హ్యాపీ: నందూ, తులసి కెఫేలో సంతోషంగా ఉంటారు. ఆ సమయంలోనే అక్కడకు మోహన్, మాధవి వెళ్తారు. వాళ్లు ఏమైంది ఇంత సంతోషంగా ఉన్నారని అడగ్గా.. ఏమీ చెప్పకుండా నవ్వుకుంటారు. అప్పుడు మాధవి వాళ్లు 'మీలో మీరు నవ్వుకోవడం కాదు.. అదేదో మాకూ చెప్తే మేమూ నవ్వుకుంటాం కదా' అని అంటారు. దీంతో నందూ 'మన కేఫేకు నెలవారీ గిరాకీ దొరికింది. క్రెడిట్ అంతా మీ వదినదే' అని చెప్తాడు. దీంతో మాధవి 'ఆ విషయం కొత్తగా చెప్పాలా? ఈ ఇంట్లో ఏదైనా మంచి జరిగింది అంటే అది వదినవల్లే కదా రాసిపెట్టుకోండి' అని అంటుంది.

Intinti Gruhalakshmi

దాన్ని గుర్తు చేసుకోకండి అని: నందూ మాట్లాడిన తర్వాత మోహన్ 'ఇంతకీ మా చెల్లికి ఎంత కమీషన్ ఇస్తున్నావో చెప్పు బావా' అని అంటాడు. దీనికి నందూ 'అదీ అడిగాను బామ్మర్ది.. కానీ ఇప్పుడే చెప్పదట. పనిని బట్టి ప్రతిఫలం అడుగుతుందట' అని అంటాడు. దీంతో మాధవి 'ఈ భార్యకు ఇవ్వకపోయినా పర్లేదు. ఆ మాజీ భార్యకు మాత్రం నెలనెలా నువ్వు భరణం ఇవ్వాలి కదా' అంటుంది. అప్పుడు పరందామయ్య 'అంతా సంతోషంగా ఉన్న టైంలో దాని పేరు ఎందుకు గుర్తు చేసుకోవడం. మన నవ్వులకు దిష్ఠి తగుతులుంది' అని అంటాడు.

Intinti Gruhalakshmi:

దివ్యతో బోనం ఎత్తించాలంటూ: ఆ తర్వాత మాధవి 'బోనాలు పండుగ వస్తుంది కదా.. కెఫే బాగా నడవాలని అమ్మవారికి బోనం ఎత్తండి' అని అంటుంది. దీనికి తులసి 'అవును.. దివ్య పరిస్థితి కూడా బాలేదు. ఆ ఇంట్లో దానికి మంచి జరగాలని దానితో కూడా బోనం ఎత్తిస్తానని మొక్కుకున్నాను. దివ్య పెళ్లి జరిగిన తర్వాత వచ్చే మొదటి బోనాల పండుగ కాబట్టి.. రేపే దివ్య ఇంటికి వెళ్లి కూతురు అల్లుడ్ని తీసుకుని వద్దాం' అంటుంది. అప్పుడు పరందామయ్య 'శుభం.. అమ్మవారి దయవల్ల దివ్య కష్టాలు తీరతాయి. ఇలా అంతా కలిసి సంతోషంగా ఉండే రోజు ఈ ఇంట్లో వస్తుందని అనుకోలేదు' అంటాడు.

రాజ్యలక్ష్మి ప్లాన్.. దివ్య మరోలా: ఇంట్లో రాజ్యలక్ష్మి 'విక్రమ్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేయబోయారనే చిరాకులో ఇంటికి వస్తున్నాడు. దీన్ని మనం ఉపయోగించుకోవాలి తమ్ముడు. ఇదే టైంలో వాడి ఆవేశాన్ని మనం అవకాశంగా చేసుకోవాలి' అని బసవయ్యతో కలిసి ప్లాన్ చేస్తుంది. ఇంతలో విక్రమ్ కోపంగా ఇంటికి వస్తాడు. అప్పుడే దివ్య వచ్చి.. 'రా విక్రమ్ పైకి వెళ్దాం.. రెస్ట్ తీసుకుందుగానీ' అని అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'ఏంటింది? నేను నా స్కెచ్‌లో ఉంటే.. ఇది మొగుడ్ని గదిలోకి లాక్కెళ్లిపోవాలని చూస్తుంది. లాస్య టాపిక్ డైవర్ట్ చేయడానికి చూస్తుందా' అని మనసులో అనుకుంటుంది.

విక్రమ్‌కు మొత్తం చెప్పిన తల్లి: దివ్య ఆ మాట అనగానే బసవయ్య 'ఇప్పుడే కదమ్మా వచ్చాడు.. వాళ్ల అమ్మతో మంచి చెడ్డ మాట్లాడుకోనివ్వు. కంగారెందుకు? నువ్వెళ్లి చల్లగా జ్యూస్ తీసుకుని రా' అని అంటాడు. దివ్య వెళ్లగానే రాజ్యలక్ష్మి విక్రమ్‌ను కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడతను 'ఆ ఎస్సై ఏంటమ్మా నన్ను అరెస్ట్ చేస్తానంటున్నాడు. నేనేమన్నా దొంగతనం చేశానా? లేక మోసం చేశానా? మన డబ్బు మనం తీసుకెళ్లడం కూడా నేరమేనా' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి అతడికి రూల్స్ వివరిస్తుంది. తర్వాత సంజయ్ సారీ చెప్పగా.. లైట్ తీసుకోమని విక్రమ్ అతడికి చెబుతాడు.

Intinti Gruhalakshmi:

ఆడిటర్ లేకపోవడం వల్లే అని: ఆ తర్వాత బసవయ్య 'అసలు ప్రాబ్లమ్ అంతా హాస్పటల్‌లో ఆడిటర్ లేకపోవడం వల్లే' అని అంటాడు. దీంతో దివ్య 'పోలీసులు పట్టుకోవడానికి, ఆడిటర్ లేకపోవడానికి సంబంధం ఏంటి? మన పొరపాటు వల్లే సమస్య వచ్చింది' అని అంటుంది. అప్పుడు బసవయ్య 'మేం చెప్పేది అర్ధం చేసుకో దివ్యా.. ఆడిటర్ ఉండి ఉంటే విక్రమ్ అలా డబ్బు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు కదా. పోలీసులు ఆపేవారు కాదు కదా.. ఇలా విక్రమ్‌కి అవమానం జరిగేది కాదు కదా' అంటాడు. తర్వాత సంజయ్ కూడా ఇదే మాట చెబుతాడు.

Intinti Gruhalakshmi:

లాస్యను పెడదామన్న విక్రమ్: ఆడిటర్ లేకపోవడం వల్ల ఆస్పత్రి మూసుకోవాల్సిందే అని విక్రమ్‌ను వాళ్లంతా నమ్మిస్తారు. అప్పుడు బసవయ్య వాళ్లు లాస్యనే పెట్టుకోవచ్చు కదా అన్నట్లు మాట్లాడతారు. దీంతో రాజ్యలక్ష్మి విక్రమ్ ఇష్టమే తన ఇష్టం అన్నట్లు అతడిని నమ్మిస్తుంది. దీంతో ఆస్పత్రి కోసం లాస్యను పెట్టుకోవడానికి విక్రమ్ ఒప్పుకుంటాడు. దీంతో దివ్యకు బిగ్ షాక్ తగులుతుంది. ఆ తర్వాత ఇదే విషయాన్ని రాజ్యలక్ష్మి లాస్యకు ఫోన్ చేసి చెప్తుంది. ఇక, తులసి వాళ్లు దివ్యకు ఫోన్ చేసి బోనాలు గురించి చెప్తారు. కానీ, ఆమె లాస్య గురించి ఏమీ చెప్పదు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X