Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్‌కు షాకిచ్చిన తులసి.. శృతి, ప్రేమ్‌ మధ్యన కౌశల్య చిచ్చు

ఇండియాలోని మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ బాబాయి తులసి గురించి అసలు నిజాలను అతడికి వివరిస్తాడు. దీంతో అతడు చాలా పశ్చాత్తాపపడతాడు. అనంతరం తులసికి డబ్బు సహాయం చేయాలని అనుకుంటాడు. ఇక, ఇంట్లో కృష్ణాష్టమి చేయాలని అనుకుంటోన్న తులసి.. అభిని పిలుద్దామని అంకితతో చెబుతుంది. దీనికి ఆమెను ఒప్పిస్తుంది. మరోవైపు, ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శృతికి వాళ్ల అత్తయ్య సర్ధి చెబుతుంది. అనంతరం సామ్రాట్ తన దగ్గర పని చేసే మనిషితో తులసికి బ్లాంక్ చెక్‌ను పంపుతాడు. అది చూసిన ఆమెకు తీవ్రంగా కోపం వస్తుంది.

 సామ్రాట్ ఇంటికి వచ్చిన తులసి

సామ్రాట్ ఇంటికి వచ్చిన తులసి


హనీని షాపింగ్‌కు తీసుకు వెళ్లేందుకు సామ్రాట్ సిద్ధం అవుతూ ఉంటాడు. ఇంతలో ఆ ఇంటికి తులసి వస్తుంది. ఆమెను చూసి సామ్రాట్ షాక్ అవుతాడు. అప్పుడు హనీ హాయ్ ఆంటి అని అంటుంది. ఆ సమయంలో తులసి దగ్గరికి వెళ్లు అని సామ్రాట్ సైగ చేస్తాడు. దీంతో తులసి దగ్గరికి వెళ్తుంది. అప్పుడామె హాయ్ హనీ ఎలా ఉన్నావు అని అడుగుతుంది. దీంతో 'బాగున్నా ఆంటి. నాకు ఎప్పుడు ప్రాబ్లమ్ వచ్చినా నువ్వు వస్తున్నావు కదా. అందుకే నువ్వు ఉంటే నాకు ఏం కాదు ఆంటి' అంటుంది. అప్పుడు ఇదిగో నీకోసం ఉప్మా పెసరట్టు తీసుకొచ్చా అంటుంది. దీంతో తినిపించండి అంటుంది. దీంతో ఆ చిన్నారికి తినిపిస్తుంది.

 తులసిని అర్థం చేసుకోని సామ్రాట్

తులసిని అర్థం చేసుకోని సామ్రాట్


తులసి.. హనీకి కొసరి కొసరి తినిపిస్తూ ఉండడాన్ని చూసిన సామ్రాట్ 'ఆమెకు బ్లాంక్ చెక్ పంపించాను. చూశావు కదా రియాక్షన్ ఎలా ఉందో. ముఖం వెలిగిపోతోంది కదా. మధ్య తరగతి అవసరాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు బాబాయి. ఈరోజుతో నేను చేసిన తప్పును సరిచేసుకున్నాను' అని అంటాడు. ఇక, హనీ తిన్నాక నువ్వు లోపలికి వెళ్లి ఆడుకో అంటుంది. దీంతో హనీ లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత తులసి సామ్రాట్ దగ్గరకు వెళ్లి థాంక్స్ అంటుంది. దీంతో అతడు ఎందుకు అనగా.. బ్లాంక్ చెక్ ఇచ్చారు కదా అంటుంది తులసి. దీంతో సామ్రాట్ 'ఇది నాకు చాలా చిన్న విషయం. మీకు ఎంత కావాలంటే అంత రాసుకోండి' అంటాడు.

నేను నీలా స్వార్థపరురాలిని కాదు

నేను నీలా స్వార్థపరురాలిని కాదు


సామ్రాట్ మాటలకు తులసి నా వరకు ఇది చాలా పెద్ద విషయం. ఇదిగోండి మీ చెక్ అని తీసి ఇస్తుంది. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. ప్లీజ్ తీసుకోండి అంటుంది. అప్పడతను ఏంటి మీరు చేసిన పని అంటాడు. దీంతో తులసి 'చేసిన సాయానికి డబ్బు తీసుకుంటే అది సాయం అనిపించుకోదు. స్వార్థం అనిపించుకుంటుంది. వ్యాపారం అనిపించుకుంటుంది. నేను నీలా స్వార్థపరురాలిని కాదు.. వ్యాపారవేత్తను కాదు. నా చేతుల్లో మీరు బ్లాంక్ చెక్ చేతుల్లో పెట్టినంత మాత్రాన.. మీరు చేసిన తప్పులు ఒప్పుకావు. మాలోంటోళ్లకు కష్టాలు కొత్తేం కాదు' అని అంటుంది.

మనిషిని మంచితనంతో కొలవండి

మనిషిని మంచితనంతో కొలవండి


ఆ తర్వాత తులసి మాట్లాడుతూ.. 'డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన మీలాంటి వాళ్లకు దాని విలువ తెలియదు కావచ్చు. కానీ, మాకు తెలుసు. డబ్బున్నవాళ్లే కాదు.. డబ్బు లేని వాళ్లు కూడా మనుషులే అని తెలుసుకోండి. మీరు వేసే బిక్ష కోసం నేను మొహం వాచిపోయేలా ఉన్నాను అనుకున్నారు అంతే కదా. మనిషి విలువ డబ్బుతో కాదు.. మంచితనంతో కొలవండి. చిన్నపిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఉత్త చేతులతో రాకూడదు అంటారు. అందుకే తనకు ఇష్టమైన పెసరట్టు దోశ తీసుకొచ్చా. అంతే కానీ, తనను నా వైపునకు తిప్పుకోవడానికి కాదు' అని చెబుతుంది.

ప్రేమ్‌ను చూసినా దాక్కున్న శృతి

ప్రేమ్‌ను చూసినా దాక్కున్న శృతి


గొడవ పెట్టుకుని వెళ్లిపోయిన శృతి కోసం ప్రేమ్ వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఆమె కచ్చితం కౌశల్య అత్తయ్య ఇంటికే వెళ్లి ఉంటుంది అని అనుకుంటాడు. మరోవైపు ప్రేమ్ వస్తాడేమో అని శృతి ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ల అత్త 'తెల్లారేసరికి నీ ప్రేమ్ వస్తాడన్నావు కదా. ఏడి నీ ప్రేమ్ ఇంకా రాలేదు' అంటుంది. ఇంతలో ప్రేమ్ వాళ్ల ఇంటికి వస్తుంటాడు. అతడిని చూసి శృతి సంతోషిస్తుంది. అప్పుడు కౌశల్య 'నువ్వు ముందు లోపలికి వెళ్లు. ఒక రెండు నిమిషాలు నేను ప్రేమ్ ఆటాడుకుంటాను' అంటుంది. దీంతో శృతి ఇంటి లోపలికి వెళ్లి దాక్కుంటుంది.

 వెళ్లిపోయిన ప్రేమ్.. బాధలో శృతి

వెళ్లిపోయిన ప్రేమ్.. బాధలో శృతి


ప్రేమ్.. కౌశల్య ఇంటికి వెళ్తాడు. దాన్ని శృతి చాటుగా గమనిస్తుంటుంది. అంతేకాదు, 'నువ్వా అబ్బాయి ఎంత సేపు అయింది వచ్చి.. చూడలేదు. నువ్వు ఒక్కడివే వచ్చావేం. నా మేనకోడలు శృతిని తీసుకురాలేదేంటి' అని అడుగుతుంది. దీంతో ప్రేమ్ షాక్ అవుతాడు. అప్పుడు 'మా గొడవ గురించి ఈవిడకు చెబితే అనవసరంగా తొందరపడి మా అమ్మకు చెబుతుంది. ఎలాగోలా తనను మేనేజ్ చేయాలి' అని మనసులో అనుకుంటాడు. ఆ వెంటనే ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో ప్రేమ్ అంటూ శృతి వెళ్లబోతుండగా కౌశల్య ఆపి ప్రేమ్ నీకోస రాలేదంటుంది.

వంద మంది సామ్రాట్‌లను చేస్తా

వంద మంది సామ్రాట్‌లను చేస్తా


బిజినెస్ విషయమై నందూ, లాస్యలు సామ్రాట్ ఆఫీస్‌కు వెళ్తారు. వాళ్లు వెళ్లడమే లోపలికి ఆహ్వానించి 'నా లాంటి సామ్రాట్‌లను వంద మందిని తయారు చేయాలి. క్రియేటివిటీ ఏ ఒక్కరి సొత్తు కాదు. కానీ.. పెట్టబడి లేక పుట్టిన చోటే సమాధి అవుతుంటాయి. గొప్ప బిజినెస్ ఐడియాలు ఉన్నవాళ్లను వెతికిపట్టుకోవాలి' అని వాళ్లకు చెబుతాడు. దీంతో నందూ 'నేను వంద మంది సామ్రాట్‌లను వెతికి పట్టుకుంటాను సార్. థాంక్యూ' అంటాడు. మరోవైపు, ఐడియాల కోసం సోషల్ మీడియాలో నందూ ఓ పోస్ట్ పెడతాడు. దాన్ని అంకిత చూస్తుంది. అది తులసికి చెప్తుంది. ఇక, చివర్లో అనసూయ, పరందామయ్య సరదాగా మాట్లాడుకుంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X