For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసిని చంపేస్తానని వార్నింగ్.. సామ్రాట్ నిర్ణయంతో అందరూ షాక్

  |

  రోజులు మారుతున్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. హనీని చూసుకునేందుకు తులసి ఫ్యామిలీ మొత్తం సామ్రాట్ ఇంటికి వస్తుంది. ఆ వెంటనే తులసి వెళ్లి హనీని రెడీ చేసి తీసుకు వస్తుంది. అనంతరం అక్కడకు నందూ వస్తాడు. వచ్చీ రావడమే తులసితో అతడు గొడవ పడతాడు. తన ఫ్యామిలీని సామ్రాట్‌కు దూరం చేయమని డిమాండ్ చేస్తాడు. కానీ, తులసి మాత్రం అతడి మాటలను ఖాతరు చేయదు. తర్వాత అభి కూడా అంకితతో ఇదే విషయం గురించి మాట్లాడతాడు. అప్పుడు అంకిత కూడా అతడిని తప్పుబడుతుంది. అనంతరం హనీతో తులసి వాళ్లంతా సరదాగా ఉంటారు.

  క్లీవేజ్ షోతో బిగ్ బాస్ లహరి రచ్చ: ఆమె డ్రెస్సు, ఫోజులు చూశారంటే!

  రావును అడ్డంగా బుక్ చేసిన తులసి

  రావును అడ్డంగా బుక్ చేసిన తులసి

  సామ్రాట్‌తో మాట్లాడుతూ ఉండగానే అతడి జనరల్ మేనేజర్‌ రావుకు ఫోన్ కాల్ వస్తుంది. దీంతో అతడు బయటకు వెళ్లి మాట్లాడి వస్తా అని వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఫోన్‌లో మాట్లాడుతూ.. 'చూడండి ప్రకాశ్ గారు.. సామ్రాట్‌కు నేను ఎంత చెబితే అంత. నాకు ఆస్తి మొత్తం రాసివ్వమని చెప్పినా రాసి ఇచ్చేస్తాడు. మీ పని అయిపోయినట్లే. కాసేపట్లో ఫైల్‌పై సంతకం చేయిస్తాను' అంటూ చెబుతుంటాడు. ఇంతలో ఫోన్ రావడంతో బయటికి వచ్చిన తులసి.. అతడు మాట్లాడే మాటలను వింటుంది. ఆ వెంటనే అతడి దగ్గరికి వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది.

  తులసికి వార్నింగ్ ఇచ్చిన మేనేజర్

  తులసికి వార్నింగ్ ఇచ్చిన మేనేజర్

  తులసి అతడి దగ్గరకు రాగానే రావు 'అన్నీ వినేశావా... నీ పని నువ్వు చూసుకో. నేను ఎంత మంచిగా ఉంటానో అంత కిరాతకంగా ఉంటాను. నాకు వచ్చే వాటాలో నీకూ పదో పరకో పడేస్తా.. కాదు కూడదు అని సామ్రాట్ గారికి ఈ విషయం చెప్పాలని చూస్తే నువ్వు ఉండవు. నా నెట్‌వర్క్ గురించి నీకు తెలియదు. మర్యాదగా ఇక్కడి విన్నది విన్నట్లు ఉండు అంతే. ఏదోలా సామ్రాట్ గారికి దగ్గరయ్యావు. ఇప్పుడు ఆయన పక్కనే ఉంటున్నావని ఎక్కువ చేయకు' అంటూ తులసికి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు తులసి 'ఏంటి మాట్లాడే పద్దతిలో కూడా తేడా వచ్చింది' అంటుంది.

  అనసూయ అందాల ఆరబోత: షర్ట్ విప్పేసి.. ప్యాంట్ లేకుండా!

  నరికేస్తా, నాలుక కోస్తా అని ఆగ్రహం

  నరికేస్తా, నాలుక కోస్తా అని ఆగ్రహం

  ఇక, మేనేజర్ రావు ఇంట్లోకి వెళ్లి సామ్రాట్ దగ్గర నుంచి ఫైల్ తీసుకోబోతాడు. అంతలో దాన్ని తులసి అందుకుంటుంది. అప్పుడు అందరూ ఏమైందా అని షాక్ అవుతారు. అప్పుడు రావు 'ఏంటి మేడం.. నా పని నేను చేసుకుంటాను ఆ ఫైల్ ఇచ్చేయండి' అని అడుగుతాడు. దీంతో తులసి 'ఎందుకు మేనేజర్ గారూ.. మీ పని నేను చెప్తా కదా' అంటుంది. ఆ తర్వాత సామ్రాట్‌తో 'ఎవరైనా మీ ఉప్పు తిని మీకు ద్రోహం చేస్తున్నారంటే ఏం చేస్తారు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే ఏం చేస్తారు' అని అడుగుతుంది. దీంతో సామ్రాట్ నరికేస్తా, నాలిక కోస్తా అంటాడు.

  రావు మోసం బయట పెట్టిన తులసి

  రావు మోసం బయట పెట్టిన తులసి

  రావు మోసం బయట పెట్టేందుకు తులసి అతడి ఫోన్ లాక్కుంటుంది. అంతేకాదు, అంతకు ముందు అతడు మాట్లాడిన వ్యక్తికి కాల్ చేస్తుంది. అప్పుడు అవతలి వ్యక్తి 'చెప్పండి రావు గారు.. నమ్మిన వాళ్లను మోసం చేయడంలో మీ తర్వాతనే ఎవరైనా? వర్క్ విషయం ఏమైంది. ఆ సామ్రాట్‌ గారితో ఫైల్ మీద సంతకం పెట్టించారా? ఒక గంటలో మీ కమిషన్ మీకు వచ్చేస్తుంది' అని అంటాడు. అవన్నీ విని సామ్రాట్‌కు కోపం వస్తుంది. ఆ వెంటనే ఓరేయ్ అంటూ అతడి గల్ల పట్టుకుంటాడు. దీంతో నందూతో పాటు వాళ్ల బాబాయి పోలీసులకు అప్పగించమని సలహా ఇస్తారు.

  తడిచిన బట్టల్లో సీరియల్ నటి పరువాల విందు: ఆమెనిలా చూస్తే మెంటలెక్కిపోద్ది!

  క్షమించమంటూ అడిగిన మేనేజర్

  క్షమించమంటూ అడిగిన మేనేజర్


  సామ్రాట్‌ పోలీసులకు ఫోన్ చేయాలని అనుకుంటున్న సమయంలో మేనేజర్ రావు 'నన్ను క్షమించండి సార్. మేడం మీరైనా చెప్పండి. నాకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. నాకిప్పుడు ఏదైనా జరిగితే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. దయచేసి ఈ ఒక్క తప్పుకు క్షమించండి' అని ప్రాధేయపడతాడు. దీంతో తులసి 'సామ్రాట్ గారు.. ఇలాంటి తండ్రి కడుపున పుట్టిన పాపానికి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు. పెళ్లి ఆగిపోతే ఆ పిల్ల ఆత్మహత్య చేసుకున్నా చేసుకుంటుంది. వద్దు. ఎవరు చేసిన పాపానికి వాళ్లే ఫలితం అనుభవిస్తారు' అంటుంది. దీంతో అతడిని వదిలేస్తాడు.

  జనరల్ మేనేజర్‌గా తులసికి పోస్టు

  జనరల్ మేనేజర్‌గా తులసికి పోస్టు


  రావును పంపేసిన తర్వాత నందూ ఇప్పుడు అతడు వెళ్లిపోయాడు కానీ.. ఇప్పుడు ఆ ప్లేస్‌లో ఎవరిని మేనేజర్‌గా పెడతాం అని అడుగుతాడు. దీంతో లాస్య మన మధ్యే అర్హత వాళ్లు ఎవరో ఒకరు దొరకరా చెప్పు అని అంటుంది. దీనికి సామ్రాట్ కరెక్టే అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు లాస్య మీరు అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని అంటుంది. దీంతో సామ్రాట్ 'నాతో పాటు రండి.. నా నిర్ణయం నేను చెబుతా' అంటూ అందరి దగ్గరికి తులసి, నందూ, లాస్యను తీసుకెళ్తాడు. ఆ తర్వాత మన కంపెనీ కొత్త జనరల్ మేనేజర్‌గా తులసి గారిని అపాయింట్ చేస్తున్నాను అని చెబుతాడు. దీంతో నందూ, లాస్య షాక్ అవుతారు. కానీ, తులసి కుటుంబ సభ్యులు అందరూ సంతోషిస్తారు.

  యాంకర్ స్రవంతి అందాల ఆరబోత: శృతి మించిన హాట్ షోతో రచ్చ

  వద్దనేసిన తులసి... మామ మాత్రం

  వద్దనేసిన తులసి... మామ మాత్రం


  సామ్రాట్ ప్రకటన చేయగానే అందరూ సంతోషించడంతో పాటు తులసికి కంగ్రాట్స్ అని చెప్తారు. అప్పుడామె 'ఆయనేదో సరదాగా అంటే మీరు కూడా నమ్మేస్తారా? నేను గడ్డిపోచను. నన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతారా' అంటుంది. దీంతో లాస్య కరెక్ట్ తులసి.. నువ్వేంటో తెలుసుకున్నావు అంటుంది. అప్పుడు సామ్రాట్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం గొప్ప వాళ్ల లక్షణం అంటాడు. అప్పుడే అభి 'నేను చెప్పేది నేనే కదా మామ్. అసలు.. సామ్రాట్ గారు ఈ పోస్ట్ ఎందుకు ఇచ్చారో అడుగు. ఆయన చెప్పేది గుడ్డిగా నమ్మొద్దు.. ప్రాబ్లమ్స్ కొనితెచ్చుకోవద్దు' అంటాడు. దీనికి తులసి కూడా అంగీకరిస్తుంది. కానీ, పరందామయ్య మాత్రం తులసి ఓకే చేసినట్లే అంటాడు. నందూ, లాస్య మాత్రం ఇది జీర్ణించుకోలేరు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 745: Samrat Gets Furious after Learning about Rao's Betrayal. After That Samrat Takes Unexpected Decision. Then Lasya and Nandhu Gets Irritated.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X