For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అనసూయ ఎంట్రీతో ట్విస్ట్.. ప్రేమ్‌కు లక్కీ ఛాన్స్.. అంతలోనే షాక్

  |

  జనరేషన్లు అప్‌డేట్ అవుతూ ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి ముందు అభి తన బాధనంతా వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలోనే తన మనసులో ఏమీ లేదని.. తనను ఎవరూ రెచ్చగొట్టడం లేదని చెప్తాడు. అంతేకాదు, తులసికి ప్రామిస్ కూడా చేస్తాడు. అనంతరం సామ్రాట్, తులసి గురించి ఆలోచిస్తూ బాధ పడుతుంటాడు. ఆమెను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానని బాబాయితో చెప్పుకుంటాడు. ఇక, కూరగాయల కోసం బయటకు వెళ్లిన అనసూయతో ఇంటి పక్క వాళ్లు తులసి గురించి చెడుగా మాట్లాడతాడు. ఆ తర్వాత తులసి జనరల్ మేనేజర్‌గా ఆఫీసుకు వెళ్తుంది.

  Ponniyin Selvan Twitter Review: తమిళ బాహుబలికి అలాంటి టాక్.. అసలైందే మిస్.. సినిమా చూడొచ్చా అంటే!

  లాస్యకు అలా క్లాస్ పీకిన నందూ

  లాస్యకు అలా క్లాస్ పీకిన నందూ

  సామ్రాట్ కంపెనీలో తులసి జనరల్ మేనేజర్‌గా కుర్చీలో కూర్చొని ఫైల్స్ చూస్తూ ఉంటుంది. అయితే, అది ఆమెకు అర్థం కాకపోవడంతో తన పీఏ ఝాన్సీని పిలుస్తుంది. ఆమెతో ఈ ఫైల్స్‌లో ఏముందో ఒకసారి చూసి చెబితే నేను సంతకం పెడతా అని అంటుంది. దీంతో ఆమె సరే అనడంతో తర్వాత ఇద్దరూ ఫైల్స్ చదువుతారు. ఇక, తులసి జనరల్ మేనేజర్ సీటులో కూర్చోవడం చూసి లాస్యకు అస్సలు నచ్చదు. ఆమెను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తానని లాస్య అంటే.. 'తప్పో ఒప్పో ఎలాగూ సామ్రాట్ గారు తనను జీఎంగా చేశారు. మనకు నచ్చినా నచ్చకపోయినా భరించాలి తప్పదు' అని అంటాడు.

  లాస్యకు డెడ్‌లైన్ పెట్టిన తులసి

  లాస్యకు డెడ్‌లైన్ పెట్టిన తులసి


  నందూ అలా అనడంతో లాస్యకు కోపం వస్తుంది. దీంతో మనసులో 'నిన్ను మార్చడం నావల్ల కాదు. నా పని నేను చేసుకుపోతా' అని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి తులసి వస్తుంది. అప్పుడామె 'ఏం చేస్తున్నారు. బడ్జెట్ ఫైల్ రెడీ చేయమన్నాను కదా.. చేశారా' అని అడుగుతుంది. దీంతో లాస్య లేదు.. వేరే పనిలో బిజీగా ఉన్నా అంటుంది. అప్పుడు తులసి 'నీకు చేతగాదంటే చెప్పు నేను సామ్రాట్ గారికి చెప్పి వేరే వాళ్లతో బడ్జెట్ ఫైల్ చేయిస్తా. ఒకవేళ అవుతుందంటే నాకు మధ్యాహ్నం వరకు ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి' అని వార్నింగ్ ఇస్తుంది.

  పైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షో

  అనసూయను రెచ్చగొట్టిన అభి

  అనసూయను రెచ్చగొట్టిన అభి

  బట్టలు ఆరబెడుతూ తనలో తాను మాట్లాడుకుంటూ అనసూయ చిరాకు పడుతూ ఉంటుంది. 'ఎవ్వరూ నా గురించి పట్టించుకోవడం లేదు. నా మాటలు వినడం లేదు' అని అనుకుంటుంది. ఇంతలో అభి అక్కడకు వస్తాడు. వచ్చీ రావడమే 'ఒకప్పటి అనసూయను గుర్తు తెచ్చుకో నానమ్మా. మళ్లీ అప్పటిలా మారు. మామ్ విషయంలో ఏం చేస్తే బెటరో నువ్వే ఇంప్లిమెంట్ చేయి. సామ్రాట్ గారి ఆఫీసులో మామ్ ఉద్యోగం మానేయడమే ఈ సమస్యకు పరిష్కారం. అందుకు ఏం చేయాలో నువ్వే ఆలోచించు నానమ్మ' అని చెప్పి ఆమెను రెచ్చగొట్టి వెళ్లిపోతాడు.

  తులసి ఫోన్.. సామ్రాట్ హ్యాపీగా

  తులసి ఫోన్.. సామ్రాట్ హ్యాపీగా

  ఆ తర్వాత సామ్రాట్‌కు తులసి ఫోన్ చేస్తుంది. దీంతో అతడు రెడీ అవుతున్నా వస్తా అంటాడు. అప్పుడు తులసి ఈరోజు మీటింగ్ ఉంది అంటుంది. దీనికి సామ్రాట్ వస్తా కానీ.. కాస్త లేట్ అవుతుంది మేనేజ్ చేయండి అంటాడు. దీంతో సామ్రాట్‌కు ఆమె సరదాగా క్లాస్ పీకుతుంది. ఇక, తులసితో మాట్లాడిన తర్వాత సామ్రాట్ చాలా హుషారు అవుతాడు. దీంతో వాళ్ల బాబాయి నీ సంతోషానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. దీంతో సామ్రాట్ ఏం లేదు బాబాయి అంటాడు. అప్పుడాయన నీకు ఇంతకు ముందు కాల్ చేసింది ఎవరు అని అడుగుతాడు. తులసి చేసింది అంటాడు. దీనికి ఆయన అది చాలులే అని అంటాడు. అప్పుడు సామ్రాట్.. హనీని స్కూల్‌కు తీసుకెళ్లమని బాబాయికి చెబుతాడు.

  టూ పీస్ బికినీలో చరణ్ హీరోయిన్: ముఖం తప్ప ఆ పార్టులన్నీ కనిపించేలా!

  సామ్రాట్‌కు అనసూయ బిగ్ షాక్

  సామ్రాట్‌కు అనసూయ బిగ్ షాక్

  హనీని తీసుకుని వాళ్ల బాబాయి వెళ్లిపోగానే సామ్రాట్ ఇంట్లో రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు అక్కడకు అనసూయ వస్తుంది. దీంతో కంగారు పడిన సామ్రాట్ ఏమైందని అడుగుతాడు. అప్పుడామె 'తులసి ఇక మీ ఆఫీసులో పని చేయకూడదు. మీరు తులసిని దూరం చేసుకోవాలి' అని డిమాండ్ చేస్తుంది. దీంతో సామ్రాట్ ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. అంతేకాదు, ఈ విషయం తులసి గారికి తెలుసా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అనసూయ 'తులసికి తెలిస్తే నేను ఇక్కడి దాకా రావాల్సిన అవసరం ఉండదు. మా పరువు రోడ్డున పడకూడదు అంటే తులసి మీ ఆఫీసులో పనిచేయకూడదు' అని అంటుంది.

  అనసూయ బాధను బయటపెట్టి

  అనసూయ బాధను బయటపెట్టి

  అనసూయ డిమాండ్‌ చేసిన తర్వాత సామ్రాట్ నన్ను ఇలా వెన్నుపోటు పొడిస్తే ఎలా అంటాడు. అప్పుడామె 'తులసి తెగింపు వల్ల తను పోగొట్టుకున్నదేదో తెలిసింది. నా తప్పు ఏంటో తెలుసుకున్నాను' అంటుంది. దీనికి సామ్రాట్ తులసి గారు చేసిన దాంట్లో పరువు తక్కువ పని ఏముంది అని అడుగుతాడు. దీంతో అనసూయ 'మీరు గొప్పోళ్లు. కానీ, మావి మధ్య తరగతి బతుకులు. నలుగురిలో బతకాల్సిందే. మా బతుకులు మావి అంటే ఒప్పుకోరు. మీలా మొండికేయలేం బాబు. అందుకే మా బతుకులు మమ్మల్ని బతకనివ్వాలని వేడుకుంటున్నాం' అంటుంది.

  Indira Devi: మహేశ్ తల్లి గురించి సంచలన నిజాలు.. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఆమె ఏం చేశారో తెలిస్తే!

  ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయిన ప్రేమ్

  ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయిన ప్రేమ్

  ఇదిలా ఉండగా.. ప్రేమ్ ఉదయాన్నే గిటార్ పట్టుకుని ఎక్కడికో వెళ్తుంటాడు. అప్పుడు శృతి అతడికి ఆల్ ది బెస్ట్ చెబుతుందేమో అని చూస్తాడు. కానీ, ఆమె పట్టించుకోనట్లు యాక్టింగ్ చేస్తుంది. చివరికి ప్రేమ్ 'సామ్రాట్ గారు ఒక ఈవెంట్‌కు రిఫర్ చేశారు. అక్కడికి ఆడిషన్స్‌కు వెళ్తున్నా' అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అందులో అతడు సెలెక్ట్ అవుతాడు. ఆ వెంటనే లోపలికి వెళ్లబోతుండగా ఒక వ్యక్తి ఆపుతాడు. 'నాకు టాలెంట్ ఉంది. నీకు మాత్రం రిఫరెన్స్ ఉంది. ఇది నాకే రావాలి' అని అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 751: Anasuya Puts Unexpected Demand to Samrat. Then He Taken Back. After That Prem Gets Selected in Music Audition.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X