For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: మనసులో మాట చెప్పిన సామ్రాట్.. అతడినే పెళ్లి చేసుకోవాలని అనడంతో!

  |

  దేశంలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ, లాస్య వచ్చి సామ్రాట్‌పై తిరగబడతారు. అంతేకాదు, నందూ అయితే తమ ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సామ్రాట్‌ను వెళ్లిపోమంటాడు. దీంతో తులసి అతడిని ఆపి ఇది తన ఇల్లు.. ఎప్పుడైనా రావొచ్చని చెబుతుంది. అప్పుడు అనసూయ.. తులసికి ఎదురు తిరిగి నందూకు సపోర్ట్ చేస్తుంది. దీంతో తులసి.. సామ్రాట్ తన ఫ్రెండ్ అని, ఇద్దరం కలిసి వరంగల్ వెళ్తున్నాం అని చెబుతుంది. ఆ తర్వాత రెడీ అవుతుంది. దీంతో ఈ విషయం గురించి పరందామయ్య, అనసూయ.. నందూ, లాస్య మధ్యన చర్చలు జరుగుతాయి.

  ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత ఘోరంగా ఎప్పుడూ చూసుండరు!

  లాస్యకు అదిరిపోయే సమాధానం

  లాస్యకు అదిరిపోయే సమాధానం

  సామ్రాట్‌తో కలిసి వరంగల్ వెళ్లేందుకు తులసి రెడీ అయి వస్తుంది. అంతలో నందూ, లాస్య అక్కడే ఉంటారు. అప్పుడు లాస్య ‘ఏం తులసి కొత్త చీర కట్టుకున్నావా? అది ఎవరు కొనిచ్చారు' అని ప్రశ్నిస్తుంది. దీనికి తులసి ‘ఎప్పుడో మా ఆయన కొన్నారులే.. కట్టుకోవడానికి ఇప్పటికి కుదిరింది.. నీకేమైనా ప్రాబ్లమా? అయినా నీ ప్రాబ్లమ్ శారీతో కాదులే' అని ధీటుగా సమాధానం ఇస్తుంది. దీంతో లాస్య నోరు మూతపడుతుంది. అప్పుడు తులసి మారిపోయిందని అనసూయ, అభి మనసులో అనుకుంటారు. దీంతో ఏమీ మాట్లాడకుండా ఉండాలని డిసైడ్ అవుతారు.

  సామ్రాట్ రాక... ఘాటు కామెంట్లు

  సామ్రాట్ రాక... ఘాటు కామెంట్లు

  వాళ్లు మాట్లాడుతూ ఉండగానే సామ్రాట్ కారు తీసుకుని వచ్చి బటయ వెయిట్ చేస్తుంటాడు. అప్పుడు తులసి నా జడ బాగానే ఉందా అని దివ్యను అడుగుతుంది. దీంతో ఆమె మల్లెపూలు ప్రిడ్జ్‌లో ఉన్నాయి తీసుకురానా అని అడుగుతుంది. కానీ, తులసి వద్దని అంటుంది. అప్పుడే శృతి వెళ్లి పెర్ఫూమ్ తీసుకొచ్చి తులసికి కొడుతుంది. అప్పుడే లాస్య ‘వెళ్లు తులసి.. వెళ్లు.. మీ క్లోజ్ ఫ్రెండ్ ఎంతో ఆరాటంగా ఎదురుచూస్తున్నాడు. అయినా ఆయన లోపల రాకుండా బయటే ఎందుకు ఉండిపోయారో.. ఎందుకు నందూ' అని వెటకారంగా కామెంట్లు చేస్తుంది.

  పబ్లిక్ ప్లేస్‌లో రెచ్చిపోయిన శ్రీయ: అతడి నోట్లో నోరు పెట్టేసి మరీ!

  అవమానించేలా మాట్లాడుతారు

  అవమానించేలా మాట్లాడుతారు

  లాస్య అడిగిన దానికి నందూ ‘ఏముంది పబ్లిసిటీ కోసం. మేం ఇద్దరం చెట్టాపట్టాలు వేసుకుని భరితెగించి తిరుగుతాం అని కాలనీ వాళ్లకి ఛాలెంజ్ విసరడం. అందుకే ఆయన అక్కడున్నాడు' అని అంటాడు. అప్పుడు లాస్య కోట్ల అధిపతిని చివరికి కారు డ్రైవర్‌ను చేసింది చూశారా అత్తయ్యా అని అంటుంది. దీనికి నందూ ‘ఈరోజు ఊరు దాటి తిరుగుతున్నారు. రేపు దేశం దాటి తిరుగుతారు. అడిగేవాళ్లు లేరు కదా' అని అంటాడు. అప్పుడు తులసి ‘మీకు అడిగే హక్కు లేదు' అనగా.. ‘మీకు మాత్రం తిరిగే హక్కు ఉందిలే.. ఎందుకంటే ఫ్రీ బర్డ్‌వి కదా' అంటుంది.

  కలిసి వెళ్లిన తులసి.. సామ్రాట్

  కలిసి వెళ్లిన తులసి.. సామ్రాట్


  అందరూ అన్ని మాటలు అంటుండడంతో అనసూయ ఇన్ని మాటలు పడి వెళ్లడం అవసరమా? తులసి ఆగిపోవచ్చు కదా అని అంటుంది. దీనికామె ‘వాళ్లు అన్నారని నేనిప్పుడు ఆగిపోతే.. వాళ్లు అన్న మాటలు నిజం చేసిన దాన్ని అవుతాను. ఏమంటారు మామయ్యా' అని అడుగుతుంది. దీనికి పరందామయ్య ‘నువ్ ఏది చేస్తే అది కరెక్ట్ తులసి. ఏమీ పట్టించుకోకుండా క్షేమంగా వెళ్లి రా' అని మాట్లాడతాడు. ఆ తర్వాత తులసి బయటకు వెళ్తుంది. దీంతో సామ్రాట్ దగ్గరుండి మరీ కారు డోరు తీసి ఆమెను ఎక్కిస్తాడు. ఆ తర్వాత డోర్ వేసి అతడు కూడా ఎక్కుతాడు.

  బాత్‌టబ్‌లో బట్టలు లేకుండా సమీరా రెడ్డి.. అబ్బా ఏం ట్విస్ట్ ఇచ్చింది గురూ!

  మనసులోని మాట బయటపెట్టి

  మనసులోని మాట బయటపెట్టి

  కారులో ప్రయాణం చేస్తోన్న సమయంలో తులసితో సామ్రాట్ మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అసలు మీ ఇంట్లో వాళ్లను ఎలా భరిస్తున్నారు? అన్నట్లుగా ఆమెతో మాట్లాడతాడు. దీనికి తులసి ‘నేను కోరుకుంటుంది మరణాన్ని కాదు. ప్రేమపాశాన్ని. గొడవలు ఉన్నా నా ఇల్లు అందమైన ప్రపంచం. అందుకే ఈ ప్రపంచం అంటే నాకు ఇష్టం' అని అంటుంది. దీనికి సామ్రాట్ ‘మీరు చెప్తుంటే తెలియకుండా ఆ అనుభూతిని నేను ఫీల్ అవుతున్నా. ఒక్కక్షణం పాటు మీ ప్రపంచంలోకి నేను అడుగుపెట్టాను. ఎంత బాగుందో. నాకు అలాంటి ప్రపంచం ఉంటే బాగుండు' అని మనసులో కోరికను బయటపెట్టేస్తాడు.

  అనసూయను రెచ్చగొట్టిన అత్త

  అనసూయను రెచ్చగొట్టిన అత్త

  అనసూయ తులసి భరితెగింపును గుర్తు చేసుకుని రగిలిపోతుంటుంది. ఇంతలో లాస్య వచ్చి.. మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ‘ఒకప్పుడు నాపై ఎలా అరిచేవారు? ఆ కోపం ఆ ఆవేశం ఏమైపోయింది? చెంప పగలకొడతా అని నాపైకి వచ్చేవారు. ఆ రోషం ఏమైపోయింది? మీ మాట వినకుండా భరితెగించి ప్రవర్తిస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? తులసికి భయపడుతున్నావా? లేదంటే ఇంట్లో నుంచి తరిమేస్తుందని ఆలోచిస్తున్నారా? తులసి మిమ్మల్ని చూడకపోతే మీకు మేం ఉన్నాం. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. కానీ, మీరు భయపడి పారిపోయారని ఈ కాలనీ వాళ్లు అనుకుంటారు. అందుకే ఆ తులసి భరితెగింపుని అడ్డుకోవాల్సిందే' అంటుంది. దీంతో అనసూయ.. నా ప్రేమే కాదు కోపం కూడా చూపిస్తా అంటుంది.

  బెడ్‌పై బ్రాతో దారుణంగా హీరోయిన్: ఈ అరాచకాన్ని చూశారంటే!

  గుడిలో సామ్రాట్‌కు సైట్ కొట్టి

  గుడిలో సామ్రాట్‌కు సైట్ కొట్టి

  వెళ్లే దారిలో ఓ గుడి కనిపించగానే సామ్రాట్, తులసి అక్కడికి వెళ్తారు. దేవుడిని దర్శించుకున్న తర్వాత కాసేపు గుడిలోనే కూర్చుందాం అంటుంది. దీంతో ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటుంటారు. అప్పుడు ఇద్దరు అమ్మాయిలు సామ్రాట్‌కు సైట్ కొడుతుంటారు. అంతేకాదు, అతడినే పెళ్లి చేసుకోవాలనేలా ఉన్నాడు అని అంటాడు. అది చూసిన సామ్రాట్, తులసి సిగ్గు పడుతుంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 771: Lasya Instigates Anasuya Against Tulasi with an Evil Intention. After That Samrat Feels Happy About Tulasi Company.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X