For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అవమానం తర్వాత తులసి సంచలన నిర్ణయం.. చచ్చిపో అని చెబుతుంది అంటూ!

  |

  తరాలు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి ఎంతకూ రాకపోవడంతో నందూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత గెస్ట్ హౌస్‌లోని ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేస్తాడు. దీంతో సామ్రాట్, తులసి రెస్ట్ తీసుకుంటున్నారని ఓ కుర్రాడు చెబుతాడు. దీంతో నందూకు కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. అనంతరం తులసి ఇంటికి రాగానే పంచాయతీ మొదలు పెడతారు. ఆ సమయంలో పార్టీలో వాళ్లు డ్యాన్స్ చేసిన వీడియోను చూపించి తులసిపై నిందలు వేస్తారు. దీంతో తులసి చాలా బాధ పడుతుంది. అయినా అనసూయ, అభి, లాస్య, నందూలు తులసిని నోటికొచ్చినట్లు అంటారు.


  Nitya Menon Pregnant: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నిత్యమీనన్.. బిడ్డకు తండ్రి ఎవరంటే?

  తులసిని అవమానించిన నందూ

  తులసిని అవమానించిన నందూ

  తులసి ఎంత చెప్పినా నందూ మాత్రం అస్సలు వినడు. దీంతో మిస్టర్ నందగోపాల్ అంటూ తులసి ఎదురు తిరుగుతుంది. ఆ తర్వాత 'మీరు మేమిద్దరం కలిసి డ్యాన్స్ చేసింది మాత్రమే చూశారు. కానీ, ఆ తర్వాత సామ్రాట్ గారు కింద పడిపోయారు. అది అందులో చూడలేదు' అని అంటుంది. అప్పుడు నందూ 'అసలు అక్కడ జరిగితేనే కదా అది ఉండడానికి. అయినా అందులో అక్కడ అన్నీ జరిగాయి. కానీ, ఏమీ లేవు. మీ ఫస్ట్ నైట్ కూడా అందులో మిస్సైంది కదా' అని తీవ్రంగా అవమానిస్తాడు. అప్పుడు లాస్య కూడా మరింతగా రెచ్చగొడుతూ ఉంటుంది.

  అభి, ప్రేమ్ గొడవ.. కొట్టుకుంటూ

  అభి, ప్రేమ్ గొడవ.. కొట్టుకుంటూ


  నందూ మాట్లాడుతుండగా ప్రేమ్‌కు చాలా కోపం వస్తుంది. దీంతో 'మిస్టర్ నందగోపాల్. ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి' అంటాడు. దీంతో నందూ 'ముందు మీ అమ్మ చేసిన తప్పును ప్రశ్నించరా' అంటాడు. అప్పుడే అభి కూడా అనుమానించేలా మాట్లాడతాడు. దీంతో ప్రేమ్ 'ఏరా నువ్వు కూడా అమ్మని అనుమానిస్తున్నావా' అని అడుగుతాడు. దీనికతడు 'అమ్మ చేసిందని అనను. కానీ, అనుమానించకుండా మాత్రం ఉండను' అంటాడు. దీంతో ప్రేమ్ అతడిపై గొడవకు వెళ్తాడు. అప్పుడు ఇద్దరూ కాసేపు కలబడతారు. దీంతో అందరూ వచ్చి ఆపుతారు.

  బాత్‌టబ్‌లో అరాచకంగా దీపికా పదుకొనె: హాట్ షోలో గీత దాటేసిందిగా!

  అనసూయను నిలదీసిన తులసి

  అనసూయను నిలదీసిన తులసి


  ప్రేమ్, నందూ కొట్టుకుంటుంటే లాస్య 'ఏంటి నందూ.. నీ ముందే ఇంత జరుగుతుంటే కామ్‌గా ఉన్నావు. వాళ్లిద్దరినీ అదుపులో పెట్టొచ్చుగా' అంటుంది. అప్పుడతను 'తల్లినే అదుపులో పెట్టలేకపోతున్నా. ఇక పిల్లలను ఎలా పెట్టాలి' అంటాడు. దీంతో తులసి అతడిపై సీరియస్ అవగా.. అనసూయ వచ్చి కోప్పడుతుంది. అప్పుడు తులసి 'అత్తయ్య ఒక్కటి అడుగుతా చెప్పంది. నేను 26 ఏళ్లలో ఎప్పుడైనా ఏదైనా తప్పు చేశానా? మరి ఇప్పుడెలా చేస్తానని అనుకుంటున్నారు? మీరు సైలెంట్‌గా ఉన్నారంటే నేను చేయలేదనే కదా' అంటూ సూటిగా నిలదీస్తుంది.

  తులసి గురించి సామ్రాట్ టెన్షన్

  తులసి గురించి సామ్రాట్ టెన్షన్

  తులసి ఇంట్లో ఇలా జరుగుతూ ఉండగా సామ్రాట్ బెడ్‌పై ఒంటరిగా కూర్చుని బాధ పడుతూ ఉంటాడు. అంతలో వాళ్ల బాబాయి వచ్చి మెడిసిన్ ఇచ్చి ఏమీ మనసులో పెట్టుకోకుండా కామ్‌గా ఉండమని అంటాడు. అప్పుడు సామ్రాట్ 'ఎలా ఉండగలను బాబాయి. అక్కడ వర్షం పడి అంత రచ్చ జరిగింది. పైగా ఆమె వేరే డ్రెస్‌తో ఇంటికి వెళ్లింది. వీటికి తోడు వీడియోతో రచ్చ అయింది. అసలే తులసి గారి ఫ్యామిలీ గురించి తెలుసు కదా. లేని దానికే ఏదేదో ఊహించుకుంటారు. అలాంటిది ఇప్పుడెలా ఉంటుందో. ఆమె ఎలా ఉందో అని టెన్షన్‌గా ఉంది' అని అంటాడు.

  యాంకర్ శ్యామల అందాల విందు: అలాంటి డ్రెస్‌తో రెచ్చగొడుతోందిగా!

  తేల్చేసిన తులసి.. రిక్వెస్ట్ చేస్తూ

  తేల్చేసిన తులసి.. రిక్వెస్ట్ చేస్తూ

  తులసి ఎంత చెప్పినా నందూ, అనసూయ అస్సలు వినరు. ఆమె తప్పు చేసినట్లుగానే మాట్లాడతారు. దీంతో తులసి 'అసలు ఇప్పుడు మీకు సంజాయిషీ ఇచ్చే అవసరం నాకు లేదు. కానీ, ఇంత వరకూ వచ్చింది కాబట్టి చెబుతున్నా. సామ్రాట్ గారికి నాకు మధ్య స్నేహ బంధం మాత్రమే ఉంది' అని తేల్చేస్తుంది. కానీ, నందూ, అనసూయ ఒప్పుకోరు. దీంతో తులసి 'మీకు దండం పెడతాను. నా పిల్లల ముందు పరువు తీసేలా మాట్లాడొద్దు. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి' అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ, వాళ్లు మాత్రం ఇంకా తులసిని నిందిస్తూనే ఉంటారు.

  ఇవే ఆఖరి కన్నీటి బొట్లు అంటూ

  ఇవే ఆఖరి కన్నీటి బొట్లు అంటూ

  ఎంత చెప్పినా వినకపోవడంతో తులసి.. అనసూయను నోరు మూసుకో అంటూ సైగలు చేస్తుంది. 'ఈ కుటుంబం కోసం ఎంత చేశానో.. ఇక్కడున్న వాళ్ల వేళ్లు, ఈ ప్రపంచంలోని అందరి వేళ్లు లెక్కపెట్టినా సరిపోదు. మీ అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతుంటే పరువు పోతుందనే ఆనాడు మౌనంగా ఉన్నాను. ఇక, ఈ కుటుంబం కోసం నేను చేసింది చాలు. ఈ కుటుంబం కోసం నేను కార్చిన కన్నీళ్లు చాటు. ఇక, ఇవే నా ఆఖరి కన్నీటి బొట్లు. ఇప్పుడు నా మనసు నన్ను చచ్చిపో అంటుంది. ఎందుకో తెలుసా? మీ నిందలకు భయపడి కాదు.. నేను దైవంగా భావించిన వాళ్లే ఈరోజు నాపై అనుమానపడుతున్నందుకు' అంటూ ఏడుస్తుంది.

  సమంతకు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి? షాకిస్తోన్న లేటెస్ట్ ఫొటోలు

  ఇల్లు వదిలి వెళ్లాలని నిర్ణయం

  ఇల్లు వదిలి వెళ్లాలని నిర్ణయం

  ఆ తర్వాత తులసి 'వ్యక్తిత్వం మీద, క్యారెక్టర్ మీద నిందలు వేస్తూ.. ఆడది కాళికా మాత అవుతుంది. ఆ ఆవేశం బంధాలను చూడకుండా అందరినీ మింగేస్తుంది. అలాగే, నేనూ మారతాను. ఎవరినీ లెక్క చేయకుండా చేస్తాను. ఇక, ఇంత జరిగినా నేను ఇక్కడ ఉండడం వేస్ట్. ఈ ఇల్లు వదిలి వెళ్లిపోతాను' అంటుంది. అప్పుడు లాస్య 'ముందు బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కున్నాం. ఆ తర్వాత ఇల్లు వదిలి వెళ్లడానికి కారణం వెతుక్కున్నాం. మీ ప్లాన్‌ సక్సెస్ అయిందని సామ్రాట్‌కు నువ్వు ఫోన్ చేస్తావా? నేను చేయనా' అంటూ మాట్లాడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 775: Nandhu Accuses Tulasi about Party Video. Then Abhi and Prem Gets into Fight. After That Tulasi Decides to Leave Home.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X