For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: ఇల్లు వదిలి వెళ్లిపోయిన తులసి.. సామ్రాట్‌తో ఫస్ట్ నైట్ అంటూ!

  |

  జనరేషన్లు ఛేంజ్ అవుతూ ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిని ఒంటరి దాన్ని చేసి అనసూయ, నందూ, అభి, లాస్యలు నిందలు వేస్తూ ఉంటారు. కానీ, ఆమె అందరికీ సమాధానాలు చెబుతూనే ఉంటుంది. దీంతో వాళ్లు ఆమెపై మాటలతో దాడి చేస్తారు. అప్పుడు తులసి ఎమోషనల్ అవుతుంది. అంతేకాదు, అసలు పార్టీలో ఏం జరిగిందో చెప్పినా కూడా వాళ్లెవరూ వినరు. ఒక సమయంలో అభి, ప్రేమ్ కొట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక, తనపై నిందలు వేయడంతో మనస్థాపం చెందిన తులసి.. ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటుంది. మరోవైపు, సామ్రాట్ ఆమె గురించి బాధ పడుతుంటాడు.

  డెలివరీ తర్వాత షాకింగ్‌గా సోనమ్: ఎద అందాలు చూపిస్తూ దారుణంగా!

  మొదటి రాత్రి అయిపోయిందని

  మొదటి రాత్రి అయిపోయిందని


  తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అనగానే లాస్య 'ఓహో.. ముందే బాయ్‌ఫ్రెండ్‌ను వెతుకున్నావ్.. ఇప్పుడు అతడితో వెళ్లిపోవడానికి కారణం వెతుకున్నావ్.. సామ్రాట్‌కు ఫోన్ చేసి చెప్పనా? వెంటనే వచ్చేస్తాడు. కోట్ల ఖరీదైన కారులో నిన్ను ఊరేగిస్తూ తీసుకుని వెళ్తాడు. డైరెక్ట్‌గా గుడికి వెళ్లి పెళ్లి చేసుకుంటారా? లేదంటే కొన్నాళ్లు సహజీవనం చేస్తారా? ఎలాగో పెళ్లి తరువాత జరిగే మొదటి రాత్రిని మీరు ముందే కానిచ్చేశారు కదా.. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం ఉందిలే తులసీ' అని దారుణమైన పదజాలంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది.

  అందరికీ ఇచ్చిపడేసిన తులసి

  అందరికీ ఇచ్చిపడేసిన తులసి

  లాస్య మాటలతో చిర్రెత్తుకొచ్చిన తులసి 'పెళ్లి తరువాత జరుపుకోవాల్సిన కార్యక్రమం పెళ్లికి ముందే.. ఒక పెళ్లైన వాడితో నా బెడ్‌రూంలో నా ముందే నువ్వు జరుపుకున్నావు లాస్యా.. సమాజం గురించి ఆలోచించకుండా, కట్టుబాట్లను పట్టించుకోకుండా విచ్చలవిడిగా ప్రవర్తించింది నువ్వు, నీ నందూ' అంటూ ఫైర్ అవుతుంది. ఆ తర్వాత అనసూయ దగ్గరకు వెళ్లి 'ఆవేశంలో నన్ను అన్ని మాటలు అన్నారే.. అవి అనాల్సింది నన్ను కాదు.. మీ కొడుకుని.. మీ కోడల్ని. చేయకూడని తప్పులన్నీ మీ సమక్షంలో చేశారు. వాళ్లని మానేసి నన్ను అంటారా' అని ఇచ్చిపడేస్తుంది.

  Nitya Menon Pregnant: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నిత్యమీనన్.. బిడ్డకు తండ్రి ఎవరంటే?

  అభిపైనా అంతెత్తు లేస్తూ ఫైర్

  అభిపైనా అంతెత్తు లేస్తూ ఫైర్

  నందూ వాళ్లను తులసి తిడుతుండగా అభి మధ్యలోకి వచ్చి 'డాడ్ అన్న దాంట్లో తప్పేముంది మామ్' అంటాడు. దీంతో తులసి 'నోర్ముయ్.. చెంప పగలగొట్టానంటే వెళ్లి అత్తారింట్లో పడతావు' అని అంతెత్తున లేస్తుంది. అంతేకాదు, 'ఈరోజు ఇప్పుడే తులసి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. కానీ, ఒక్కతే కాదు.. ఈ ఇంట్లో విలువైనవి అన్నీ తీసుకునే వెళ్తుంది' అని అంటుంది. అప్పుడు లాస్య 'పాయింట్‌కు వచ్చేశావు అన్నమాట.. ఈ ఇంట్లో ఉన్నది ఉమ్మడి ఆస్తి. డబ్బు బంగారాన్ని తీసుకుని వెళ్లడానికి వీలు లేదు' అని అంటుంది. దీంతో తులసి 'డబ్బు నగలకు విలువ ఎవరు ఇస్తారో.. వాళ్లకంటే పేదవాళ్లు ఈ లోకంగా ఎవరూ ఉండరు లాస్యా. ఈ ఇంటి నుంచి నాతో పాటు తీసుకుని వెళ్లేది డబ్బు, నగలు కాదు. గౌరవం, మర్యాద, ప్రేమ, ఆత్మాభిమానం' అంటుంది.

  శాపనార్థలతో.. వద్దు అంటూనే

  శాపనార్థలతో.. వద్దు అంటూనే

  ఆ తర్వాత తులసి దేవుడి గదిలోకి వెళ్లి 'ఏ ఇంట్లో ఆడపిల్లకి అవమానం జరగుతుందో ఆ ఇంట్లో సుఖం, సౌభాగ్యం ఉండవు' అని శాపనార్ధాలు పెడుతుంది. ఆ వెంటనే బయటకు వెళ్లిపోడానికి రెడీ అవుతుంది. అప్పుడు ఆమెకు సపోర్ట్ చేసే వాళ్లందరూ వద్దు వద్దు అంటూ బ్రతిమాలుతుంటారు. అంతలో పరందామయ్య అక్కడకు ఎంట్రీ ఇచ్చి 'తులసి ఎవరూ ఆపొద్దు. అందరూ నా బిడ్డకి వీడ్కోలు చెబుదాం' అంటాడు. అప్పుడు తులసి 'నేను ఈ ఇంట్లో ఉండలేను మామయ్యా' అంటుంది. దీనికాయన నువ్వు ఉందాం అనుకున్నా నేను ఉండనీయనమ్మా అంటాడు.

  బాత్‌టబ్‌లో అరాచకంగా దీపికా పదుకొనె: హాట్ షోలో గీత దాటేసిందిగా!

  వాళ్ల వేళ్లను నరికేయ్ అంటూ

  వాళ్ల వేళ్లను నరికేయ్ అంటూ

  తులసి మాటలకు పరందామయ్య 'వీళ్లు నిన్ను ఎన్ని మాటలు అన్నారో.. ఎన్ని నిందలు వేశారో నేను ఊహించగలను.. వీళ్లు ఎంతకైనా దిగజారతారు. ఇలాంటి దిగజారిన మనుషుల మధ్య నా బిడ్డ ఉండలేదు. తప్పు నాదేనమ్మా. నన్ను క్షమించు.. ఈ పంజరం వదిలి ఎగిరిపో.. స్వేచ్ఛగా నీకు కావాల్సిన చోటికి ఎగిరిపో. దోషి అనే భావన లేకుండా వెళ్లు. దేవత ఎప్పుడూ గుడిలోనే ఉండాలి.. ఇలాంటి బజారులో కాదు. నిన్ను వేలెత్తి చూపిస్తే కాళీ మాతలా మారి ఆ వేలుని నరికెయ్' అంటాడు. ఇక మిగిలిన వాళ్లు కూడా నీతో ఉండే అర్హత వీళ్లకు లేదు అని అంటారు.

  అలా పంపించి.. ఎమోషనల్

  అలా పంపించి.. ఎమోషనల్

  అనంతరం పరందామయ్య.. తులసికి బొట్టు పెట్టి మరీ బయటకు వెళ్లిపో అని సాగనంపుతాడు. ఆ సమయంలో వెళ్తూ వెళ్తూ అనసూయ కాళ్లకి నమస్కారం పెట్టాలని అనుకుంటుంది. అయితే అనసూయ దూరంగా జరిగిపోతుంది. అప్పుడు దివ్య నన్ను కూడా తీసుకుని వెళ్లు మామ్ అని ఏడుస్తుంది. దీనికి తులసి 'ఇది నా సమస్య.. నేనే శిక్ష అనుభవిస్తా. ఇల్లు ముక్కలు చేశానని పేరే నాకు వద్దు. నేను లేకపోయినా మీరంతా సంతోషంగా ఉండాలి నేను బయట ఉన్నా మీ పట్ల బాధ్యతగానే ఉంటాను. ఏ అవసరం ఉన్నా చూసుకుంటా. మీరు తలెత్తుకులా చేస్తా.. నా యుద్ధం నేనే చేస్తాను' అంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. అప్పుడు పరందామయ్య వెళ్లిపోతుంది.. నా కూతురు వెళ్లిపోతుంది అని ఎమోషనల్ అవుతాడు.

  యాంకర్ శ్యామల అందాల విందు: అలాంటి డ్రెస్‌తో రెచ్చగొడుతోందిగా!

  తులసికి తోడుగా వెళ్లిన ప్రేమ్

  తులసికి తోడుగా వెళ్లిన ప్రేమ్

  ఇక తులసితో పాటు ఆమె కొడుకు ప్రేమ్ కూడా అడుగులో అడుగులు వేసి అండగా నిలబడతాడు. భార్యను వదిలేసి మరీ.. తల్లి తులసితో వచ్చేస్తాడు. అంతేకాదు, తన ఫ్రెండ్ రూంకి వెళ్దాం అని ప్రేమ్ అంటాడు. కానీ, తులసి మాత్రం 'నన్ను ఎలా వదిలెయ్ ప్రేమ్' అని ఒంటరిగా ఎటో వెళ్లిపోతానని అంటుంది. దీంతో ప్రేమ్ 'నువ్వు ఎక్కడికి వెళ్లినా.. మళ్లీ నా దగ్గరకు వస్తానని మాట ఇవ్వు అమ్మా' అని ప్రేమ్ అనడంతో ప్రామిస్ చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 776: Tulasi Leave The Home With Prem After Big Fight. Then Parandhamaiah Supports and Send Tulasi From Home.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X