For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు షాకిచ్చిన నందూ.. అమ్మ ముందు తులసికి శీల పరీక్ష అంటూ!

  |

  జనరేషన్లు మారుతూ ఉన్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత తులసి గురించి నందూ, అభి, లాస్య, అనసూయలు చర్చించుకుంటారు. ఆ సమయంలో లాస్య వాళ్లందరినీ రెచ్చగొడుతుంది. అంతేకాదు, పీడా విరగడ అయిపోయిందని అంటుంది. ఆ తర్వాత పరందామయ్య వచ్చి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తాడు. ఆ వెంటనే తులసి దగ్గరకు చిన్న కృష్ణయ్య వెళ్తాడు. అలా ఆమెకు ధైర్యం చెబుతాడు. అనంతరం తులసి వాళ్ల అమ్మ ఇంటికి వెళ్లిపోతుంది. ఆమె వెనకాలే సామ్రాట్ కూడా వెళ్తాడు. చివర్లో తులసితో మాట్లాడమని ప్రేమ్‌.. సామ్రాట్‌ను కోరుతాడు.

  శృతి మించిన అఖండ హీరోయిన్ హాట్ షో: వామ్మో గీత దాటేసిందిగా!

  తల్లికి విషయం చెప్పిన తులసి

  తల్లికి విషయం చెప్పిన తులసి


  పెద్ద గొడవ జరిగాక తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తులసి.. తల్లి, తమ్ముడు దగ్గరకు వచ్చేస్తుంది. అవమానం తర్వాత తన దగ్గరకు వచ్చిన కూతురికి ఆమె బాసటగా నిలుస్తుంది. ఆ సమయంలో అసలేం జరిగిందో చెప్పమని అడగ్గానే తులసి మాట్లాడుతుంది. 'నేను జీవితంలో చేయకూడదని అనుకున్న పని జరిగిపోయింది. నా వాళ్లను వదిలి వచ్చేశాను. నేను కట్టుకున్న గూడు నాకే ఇరుకుగా అనిపించింది. ఊపిరి ఆడక వచ్చేశాను. ఇక, ఈ విషయాన్ని గురించి ఎవరూ నన్నేమీ అడగకండి. దయచేసి ఇక్కడితో వదిలేద్దాం' అని వాళ్లకు రిక్వెస్ట్ చేస్తుంది.

  తులసికి ధైర్యం చెప్పిన మదర్

  తులసికి ధైర్యం చెప్పిన మదర్

  తులసి మాటలకు ఆమె తల్లి 'నిన్నేమీ అడగను. కానీ.. ఒకే ఒక మాట చెప్తానమ్మా.. శెభాష్ అమ్మా.. కోడలిగా వెళ్లి ఆ ఇంటికి కూతురుగా మారావు. కానీ, వాళ్లు నీకు విలువ ఇవ్వలేదు. నా కూతురు ధైర్యం చేసింది. అందుకే శెభాష్ అంటున్నా. ఎవరి ముందైనా తల దించడం అంటే పర్వాలేదు. ఆత్మాభిమానం చంపుకుని తలదించుకోవడం కంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు. నా కూతుర్ని చూసి గర్వంగా ఉంది. నా కూతురు తల వంచిందే కానీ ఆత్మాభిమానం వదులుకోలేదు. నువ్వు ఈ విషయంలో ఓడిపోయినా గెలిచావమ్మా' అంటూ ధైర్యం చెప్పేలా మాట్లాడుతుంది.

  బోల్డు షోలో హద్దు దాటిన అనన్య నాగళ్ల: కుర్రాళ్లకు ఇది కదా అసలైన విందు

  సామ్రాట్‌ను తీసుకొచ్చిన ప్రేమ్

  సామ్రాట్‌ను తీసుకొచ్చిన ప్రేమ్


  తులసి వెనకాలే వచ్చిన సామ్రాట్.. తన వల్లే ఆమెకు ఈ పరిస్థితి వచ్చిందని బాధ పడుతూ లోపలికి వెళ్లకుండానే ఆగిపోతాడు. అప్పుడు ప్రేమ్ వచ్చి ఆయనను లోపలికి రమ్మని అడుగుతాడు. అలాగే, తులసికి ధైర్యం చెప్పి అండగా ఉండమని కోరుతాడు. అంతేకాదు, 'అన్ని బంధాలను వదిలి అమ్మ స్నేహాన్ని నమ్మింది. ఈ టైంలో అమ్మకి స్నేహం చాలా అవసరం. రండి సార్ అమ్మ దగ్గరకు వెళ్దాం' అంటూ సామ్రాట్‌ని బ్రతిమిలాడి మరీ తీసుకుని వస్తాడు. అలా సామ్రాట్ తులసి వాళ్ల అమ్మగారి ఇంట్లోకి వెళ్తుంటాడు. దీంతో ప్రేమ్ సంతోషంగా ఉంటాడు.

  శీల పరిక్ష కావాలా అని అడిగి

  శీల పరిక్ష కావాలా అని అడిగి


  ఆ తర్వాత తులసి 'నేను తప్పు చేయలేదని మీరిద్దరూ నమ్ముతున్నారు కదా? మీ మనసులో కూడా అలాంటి సందేహాలు ఉంటే చెప్పండి. ఇప్పుడే వెళ్లిపోతా. ఎందుకంటే మీ దగ్గర కూడా నా నిజాయితీని నిరూపించలేను. ఏ ఆడదానికైనా భరించలేని నరకం ఏంటో తెలుసా? తాను పవిత్రురాల్ని అని నిరూపించుకోవడం. శీల పరీక్షకు నిలబడటం. నా భయం నాకు ఉంటుంది కదా అమ్మా.. అందుకే అడుగుతున్నా' అని అంటుంది. దీంతో తులసి తల్లి.. 'నా కూతురు తప్పు చేయదు. ఆ నమ్మకం నాకు ఎప్పుడూ ఉంటుందమ్మా' అంటూ సపోర్టుగా మాట్లాడుతుంది.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో శృతి హాసన్: లోపలివి కనిపించేలా ఘోరంగా!

  నా వల్లే తప్పు జరిగింది అంటూ

  నా వల్లే తప్పు జరిగింది అంటూ


  ఇక, సామ్రాట్ ఇంట్లోకి రాగానే తులసికి ప్రాణం లేచొస్తుంది. కానీ, అతడు మాత్రం తులసిని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. అప్పుడు ప్రేమ్ 'నేనే సామ్రాట్‌ గారికి జరిగింది చెప్పానమ్మా.. నేనే ఫోర్స్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చాను' అని చెబుతాడు. దీంతో తులసి ఆయనను అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో సామ్రాట్ వచ్చి.. తులసి గారూ ఎలా ఉన్నారు అంటాడు. దీనికామె 'నేను బాగానే ఉన్నాను.. అమ్మ దగ్గరకు వచ్చాను కదా' అని అంటుంది. అప్పుడతను 'సారీ తులసి గారూ.. ఇదంతా నా వల్లే జరిగింది' అని అంటాడు. దీంతో ఆమె 'మీ వల్ల కాదు.. కొంతమంది తప్పుగా అర్ధం చేసుకవడం వల్ల' అంటూ ఏదేదో అంటుంది.

  యుద్దం.. గన్.. పోరాటం అని

  యుద్దం.. గన్.. పోరాటం అని

  ఇక, తులసికి వచ్చిన పరిస్థితి గురించి సామ్రాట్ మాట్లాడుతుంటాడు. అప్పుడు తులసి 'నేను ఏ తప్పు చేయలేదు.. అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి? నిందలకు ఎందుకు తలవంచాలి? ఓటమిని ఎందుకు ఒప్పుకోవాలి? అందుకే యుద్ధం చేస్తాను' అంటుంది. అప్పుడు తులసి తల్లి 'మా తులసి నిన్ను నమ్ముకుంది. అవసరంలో ఆదుకున్నావు. నిజమైన స్నేహితుడు అనిపించావు' అంటుంది. దీంతో తులసి 'మళ్లీ నా జీవితం మొదటికి వచ్చింది. రేస్ ఎక్కడ నుంచి మొదలౌతుందో' అంటుంది. అప్పుడు సామ్రాట్ 'రేస్ మొదలైంది తులసి గారూ.. గన్ షూట్ చేసేశారు. పరుగు మొదలుపెట్టాల్సిందే' అంటాడు. దీనికి తులసి 'చాలామంది ఆడవాళ్లు.. రేస్‌లో పరుగుపెట్టలేక ఆగిపోతుంటారు' అంటూ ఎమోషనల్ అవుతుంది.

  యాంకర్ శ్రీముఖికి చేదు అనుభవం: అది లేకుండానే షోలోకి.. స్టేజ్‌పైనే పరువు తీసిన హీరోయిన్

  లాస్యకు షాక్ ఇచ్చిన నందూ

  లాస్యకు షాక్ ఇచ్చిన నందూ


  మరోవైపు, తులసి మీద బాధతో పరందామయ్య అన్నం మానేస్తాడు. దీంతో దివ్యతో చెప్పి ఆయన తినేలా చేస్తాడు నందూ. ఆ తర్వాత లాస్య దగ్గరకు వచ్చి 'దేవుడు మనకి పరీక్ష పెడుతున్నాడు. జాబ్‌లు ఉన్నప్పుడు అమ్మ నాన్నలు మన దగ్గర లేరు. మన జాబ్‌లు పోయాక బాధ్యత వచ్చింది. ఇన్నాళ్లూ అత్తామామల్ని చూసుకోవాలంటే తులసి అడ్డు తగులుతుందని అన్నావు. ఇప్పుడు నీకు తులసి అడ్డు లేదు. మా అమ్మ నాన్నల్ని నువ్వే చూసుకోవాలి. తులసి లేని లోటుని నువ్వే భర్తీ చేయాలి. ఇది నీ ఫ్యామిలీ. వాళ్లకి దగ్గరయ్యే బాధ్యత నీది' అని అంటాడు. ఆ తర్వాత తులసి నిలయం అనే బోర్డును తీసి పడేస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 778: Tulasi Returns Her Mother House. Then She Supports Her. After That Nandhu puts Forth a Demand to Lasya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X