For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసితో సంతకం పెట్టించుకున్న లాస్య.. బంధం పూర్తిగా పోయినట్లే!

  |

  దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తెల్లారిపోయినా అమ్మగారి ఇంట్లో తులసి నిద్ర లేవదు. ఇది చూసిన అందరూ వింత అని అనుకుంటారు. ఆ తర్వాత ప్రేమ్.. పరందామయ్యలా మాట్లాడి తల్లిని ఆటపట్టిస్తాడు. అనంతరం పరందామయ్య కాఫీ పెట్టుకుంటూ ఉండగా అనసూయ వెళ్లి 'తులసి తప్పు చేస్తే.. శిక్ష నాకు వేస్తారా' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరందామయ్య.. సామ్రాట్‌ను పొగుడుతూ నందూపై విమర్శలు చేస్తాడు. ఇక, చివర్లో టిఫిన్ లేట్ అయిందని అభికి కోపం వస్తుంది. అప్పుడు అంకిత వచ్చి అతడిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ క్లాస్ పీకుతుంది.

  Poorna Marriage Gift: పూర్ణకు భర్త పెళ్లి కానుక.. బంగారంతో పాటు లగ్జరీ హౌస్.. వాటి ధర ఎంతో తెలిస్తే!

  తులసిని అవమానించిన అత్త

  తులసిని అవమానించిన అత్త


  అనసూయ కూరగాయలు కొనడం కోసం ఇంటి బయటకు వస్తుంది. అక్కడ ఉన్న చుట్టుపక్కన వాళ్లంతా తులసి వ్యవహారం గురించి అనసూయను తలో మాట అంటూ ఉంటారు. 'కోడల్ని కూతురు కూతురు అని నెత్తినెక్కించుకున్నావు. ఇప్పుడు చూడు ఏం చేస్తుందో. దాని బాయ్‌ఫ్రెండ్‌తో సహా నెత్తినెక్కి కూర్చుంది. మీ వల్లే ఆమె ఇలా చేసింది' అని అంటుంది. ఇంతలో తులసి స్కూటీ వేసుకుని అటుగా వస్తుంంది. ఆ తర్వాత బయట నుంచి ఆ ఇంటిని చూస్తూ ఉంటుంది. ఇంతలో అనసూయ ఆవేశంగా తులసి దగ్గరకు వెళ్తుంది. తులసి అనసూయ కాళ్లపై పడబోతుంటే.. ఆగు ఆపు నీ నాటకాలు అంటూ అవమానిస్తుంది.

  తులసిపై అనసూయ నిందలు

  తులసిపై అనసూయ నిందలు


  ఆ తర్వాత అనసూయ 'మీరంతా తులసి ఎక్కడకి వెళ్లిందని అనుకుంటున్నారుగా తను వెళ్లడం కాదు.. నేనే బయటకు తోసేశాను. ఈవిడ మర్యాదలు హద్దులు కట్టుబాట్లను కాదనుకుని సిగ్గులేకుండా ప్రవర్తించింది. నాకు నా ఇంటికి ఇలాంటి కూతురు కోడలు అవసరం లేదు. అందుకే తోసేశా. ఇన్నాళ్లూ దీన్ని కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నా. కానీ ఇప్పుడు అర్ధమైంది. కోడలు ఎప్పుడు కూతురు కాలేదని. ఇది ఎప్పటికీ ఈ ఇంటికి రాలేదు. ఈ అనసూయ ఎప్పటికీ తప్పుని క్షమించదు. ఇది నా కోడలు కాదు. నా కూతురు కాదు. దీనితో నా కుటుంబానికి సంబంధం లేదు. ఎక్కడ ఉన్నా పట్టించుకోను. ఇంకోసారి దీని గురించి నన్ను అమానిస్తూ మాట్లాడితే మీ అందరికీ బాగోదు' అని వార్నింగ్ ఇస్తుంది.

  వంద కోట్ల దర్శకుడితో బాలయ్య: పాన్ ఇండియాపై దండయాత్ర.. టాప్ ప్రొడ్యూసర్ భారీ ప్లాన్

  తులసికి మరో షాకిచ్చిన లాస్య

  తులసికి మరో షాకిచ్చిన లాస్య


  అందరి ముందే అనసూయతో తిట్లు తిని వెళ్లిపోబోతూ ఉండగా తులసిని లాస్య ఆపుతుంది. అంతేకాదు, రావడం రావడమే ఆమె 'కేవలం బాయ్‌ఫ్రెండ్‌కు మాత్రమే తలుచుకోగానే దర్శనం ఇస్తావేమో అనుకున్నా.. మాకు కూడా దర్శనం ఇస్తావన్న మాట' అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో తులసి ఎందుకు ఆగమన్నావో ముందు విషయం చెప్పు అని అంటుంది. అప్పుడు లాస్య 'అరే ఎందుకు కంగారు పడుతున్నావు. అపాయింట్‌మెంట్ ఇచ్చావా ఏంటి? కోపంలో భలే ముద్దొస్తావ్ తులసీ. ఈ మాటను అతనెప్పుడూ చెప్పలేదా' అని మాట్లాడుతుంది.

  ఆస్తి పేపర్లతో వచ్చేసిన లాస్య

  ఆస్తి పేపర్లతో వచ్చేసిన లాస్య


  అనంతరం లాస్య 'సర్లే పాయింట్‌కి వచ్చేస్తా. ఇప్పుడే లాయర్‌ను కలిసి వస్తున్నా. ఈ డాక్యుమెంట్స్ చూసి సంతకం పెట్టు' అంటుంది. అప్పుడు తులసి 'లాయర్‌ను కలవడం ఏంటి.? మీ ఆయనకి విడాకులు ఇస్తున్నావా' అని కౌంటర్ వేస్తుంది. దీంతో లాస్య 'జోక్ బాగుంది కానీ.. నవ్వురాలేదు. డాక్యుమెంట్స్ చదవి సంతకం ఇక్కడపెడతావా? లోపలికి వచ్చి పెడతావా' అని అడుగుతుంది. అప్పుడు అనసూయ 'దీన్ని చచ్చినా ఈ ఇంట్లోకి రానివ్వను.. ఆ పేపర్లు దీని ముఖాన కొట్టు.. ఇక్కడే సంతకం పెడుతుంది' అంటుంది. అప్పుడు తులసి ఈ పేపర్లు ఏంటి అని ప్రశ్నిస్తుంది. దీనికి లాస్య 'ఈ ఇంటికి సంబంధించిన పేపర్లు.. ఎవరి బలవంతం లేకుండా.. నీకు సంబంధించిన ఇంటిని అత్తయ్య పేరిట రాస్తున్నట్టుగా ఇందులో ఉంది' అని అంటుంది.

  శృతి మించిన అఖండ హీరోయిన్ హాట్ షో: వామ్మో గీత దాటేసిందిగా!

  తులసిపై అనసూయ ఆగ్రహం

  తులసిపై అనసూయ ఆగ్రహం


  పేపర్లు ఇచ్చిన తర్వాత లాస్య కావాలంటే వీటిని నీ సామ్రాట్ గారి లీగల్ టీంకి చూపించుకో అని అంటుంది. అప్పుడు అనసూయ 'తులసి బంధాలను తుంగలో తొక్కి దులిపేసుకుని వెళ్లిపోయింది. ఈవిడ గారి జీవితంలోకి కోరికలు తీర్చే కొత్త దేవుడు వచ్చాడు. ఇక మనతో పనేం ఉంది? ఈ ఇంటితో అవసరం ఏముంది? మా పట్ల నిజాయితీగా ఉందన్న భ్రమతో ఈ ఇల్లు నీ ఇంటి పేరున కొన్నారు. కానీ ఇప్పుడు మారిపోయింది. మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. మేమే వద్దని వెళ్లిపోయినప్పుడు.. మేం ఇచ్చిన ఇల్లు తిరిగి ఇచ్చేయాల్సిందే. అందరికీ న్యాయదేవతలా స్పీచ్‌లు ఇవ్వడం కాదు.. ఏ మాత్రం సిగ్గుశరం ఉన్నా.. నిజాయితీ ఉన్నా.. నోరుమూసుకుని ఆ కాగితాలపై సంతకం పెడుతుంది' అని కోపంగా మాట్లాడుతుం

  సంతకాలు పెట్టేసిన తులసి

  సంతకాలు పెట్టేసిన తులసి


  అనసూయ మాటలకు ఫీలైన తులసి కన్నీరు పెట్టుకుంటుంది. అంతేకాదు, పరందామయ్య మాటలు గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ పేపర్లను తీసుకుని 'ఈ ఇంటిని నేను ఎప్పుడూ ఆశపడలేదు. ఇప్పుడు కూడా ఆశలేదు' అంటూ సంతకం చేసేస్తుంది. అనంతరం ఇంటి పేపర్లను అనసూయ చేతిలో పెట్టి.. 'ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. పూర్తిగా మీదే. నేను బాధపడ్డాను కాబట్టే ఈ ఇల్లు వదిలాను. మీ సంతోషం కోసం హక్కును వదిలేశాను. కానీ, బంధాలను మాత్రం తెంచుకోను అత్తయ్యా.. మీరు నన్ను ఈ ఇంటికి రాకుండా ఆపగలరేమో కానీ.. ఈ ఇంటితో నాకున్న సంబంధాన్ని తెంపలేరు' అని వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆ పేపర్లను అనసూయ దగ్గర నుంచి తీసుకుని లాస్య తన దగ్గర పెట్టుకుంటుంది.

  బాత్రూంలో హాట్‌గా మెగా హీరోయిన్: ఆ డ్రెస్సు.. ఆమె ఫోజు చూశారంటే!

  లాస్య ప్లాన్.. పేపర్లు తీసుకుని

  లాస్య ప్లాన్.. పేపర్లు తీసుకుని


  ఇక, తులసి సంతకం పెట్టిన పేపర్లను తీసుకున్న అనసూయ ఇంటి లోపలికి వచ్చి సంతోషంగా మాట్లాడుతుంది. ఆమెను మరంతగా రెచ్చగొడుతూ లాస్య ఏదేదో ఎక్కించి చెబుతుంది. ఇక, చివర్లో 'మీరు దగ్గరకు తీసుకుంటే ప్రియుడికి దూరం అవ్వాల్సి వస్తుంది. మీరు తిట్టారని ఇంటికి నుంచి వెళ్లలేదు. సామ్రాట్‌తో వెళ్లాలని అనుకుంది కాబట్టి వెళ్లింది. ఏకంగా లంకెబిందెలే దొరికాక మనతో లింకులెందుకని తెంచుకుంది. అందుకే ఆస్తి పేపర్లను విసిరికొట్టింది' అని రెచ్చగొడుతుంది. అనంతరం ఆ పేపర్లను తీసుకుని దాచుకుంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 781: Anasuya Insults Tulasi about her Relationship with Samrat. After That Lasya Executes her Evil Plan to Steal Anasuya Property.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X