For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: కొత్త ఇంటికి తులసి.. ఆదిలోనే షాకిచ్చిన ఓనర్.. బలైపోయిన సామ్రాట్‌

  |

  చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కూరగాయలు కొనడానికి వచ్చిన అనసూయను చుట్టు పక్కన వాళ్లంతా తులసి విషయంలో హేళన చేస్తూ మాట్లాడతారు. దీంతో ఆమెకు పట్టరాని కోపం వస్తుంది. అప్పుడు ఆమెకు తులసి కనిపిస్తుంది. దీంతో ఆమెపై ఓ రేంజ్‌లో ఫైర్ అవడంతో పాటు అందరి ముందర పరువు తీస్తుంది. ఆ తర్వాత లాస్య.. ఇంటిని అనసూయ పేరు మీద రాసినట్లు డాక్యూమెంట్లు తెచ్చి ఇవ్వగా.. తులసి వాటిపై సంతకం చేస్తుంది. అనంతరం సామ్రాట్ తన దగ్గరకు వచ్చిన తులసిని.. ఆమెకు ఉన్న బాధలన్నీ మర్చిపోయేలా ప్రోత్సహిస్తూ మాట్లాడతాడు.

  Jabardasth New Anchor: జబర్ధస్త్ నుంచి రష్మీ ఔట్.. కొత్త యాంకర్‌గా ఆ సీరియల్ నటి

  డాక్యూమెంట్స్ చూసేసిన నందూ

  డాక్యూమెంట్స్ చూసేసిన నందూ


  తులసి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో వాళ్లంతా బాధ పడుతూ ఉంటారు. కానీ, లాస్య మాత్రం ఇంటి డాక్యూమెంట్లు తన చేతిలోకి రావడంతో ఫుల్ ఖుషీగా ఉంటుంది. వాటిని తన రూమ్‌లోకి తీసుకెళ్లిన తర్వాత తెగ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే 'తులసిని రెచ్చగొట్టి ఇల్లు రాయించేశాను. అత్తయ్యను రెచ్చగొట్టి తులసి మీద ఎక్కించేశాను. వీళ్లు ఇప్పట్లో కలవరు. ఈ పత్రాలను జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టాలి. ఎవరికీ కనిపించకుండా ఉంచాలి' అని అనుకుంటుంది. అలా ఓ దగ్గర దాచి పెడుతుండగా వెనక్కి తిరిగేసరికి నందూ.. అదంతా చూస్తూనే ఉంటాడు.

  నందూకు అబద్ధం చెప్పిన లాస్య

  నందూకు అబద్ధం చెప్పిన లాస్య


  పేపర్లు దాచి పెట్టడం చూసిన నందూ.. అవేంటి అని అడుగుతాడు. అప్పుడు లాస్య బుక్కైపోయాను అనుకుంటూనే 'అవి రెజ్యూమ్ పేపర్లు నందూ' అని అబద్ధం చెబుతుంది. అది నమ్మేసిన అతడు.. టాపిక్‌ను మర్చిపోతాడు. ఆ వెంటనే నందూ 'అమ్మ ఎక్కడుంది కనిపించడం లేదేంటి. ఇన్నేళ్లలో అమ్మా నాన్నలు ఇంత దూరంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు లాస్య. తులసి వెళ్లిపోవడం వల్ల ఇలా అయింది' అని బాధ పడతాడు. దీంతో లాస్య 'వాళ్లే కలుస్తారులే నందూ. ఇంట్లో ఏదైనా పార్టీనో పండగను చేసుకోడానికో ప్లాన్ చేద్దాం' అంటూ కవర్ చేసుకుంటుంది.

  టాప్ విప్పేసి యాంకర్ స్రవంతి రచ్చ: నచ్చింది చూసేయ్.. పైన స్వర్గమే అంటూ!

  ట్యాబ్లెట్స్ వద్దన్న పరందామయ్య

  ట్యాబ్లెట్స్ వద్దన్న పరందామయ్య


  తులసి వెళ్లిపోయిన బాధలో ఉన్న పరందామయ్య మందులన్నీ ముందు పెట్టుకుని కూర్చుంటాడు. అప్పుడు దివ్య ఏ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలని వెతుకుతూ ఉంటుంది. ఆ సమయంలో ఈ టాబ్లెట్లు గురించి నాకు కంఫ్యూజన్‌గా ఉంది తాతయ్యా' అంటుంది. దీంతో పరందామయ్య 'నేను వేసుకుంటానులేమ్మా. నువ్వు వెళ్లు. వేసుకోనేమోనని భయపడకు. నాకు ఈ సమయంలో ఏదైనా అయితే నా కూతురు తులసి బాధపడుతుంది. తన వల్లే ఇలా అయిందని అనుకుంటుంది. అలాంటి పరిస్థితి నేను తీసుకునిరానివ్వను' అంటూ ఎమోషనల్‌గా మాట్లాడుతాడు.

  కొత్త ఇంటికి తులసి.. అలా చెప్పి

  కొత్త ఇంటికి తులసి.. అలా చెప్పి

  ఇక, ఉదయాన్నే తులసి అద్దె ఇల్లు వెతుక్కోవడానికి ప్రయాణం మొదలు పెడుతుంది. అలా ముందుగా ఓ ఇంటికి వెళ్లగా.. ఓనర్ ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తుంది. అప్పుడు తులసి చాలా నచ్చింది.. అడ్వాన్స్ మొదటి జీతం రాగానే ఇచ్చినా ఫర్వాలేదా అని అడుగుతుంది. దీనికామె 'ఫర్వాలేదు కానీ.. ఎవరెవరు ఉంటారు' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు తులసి 'నేను మా అబ్బాయి ఉంటాము. వాడు అప్పడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. మొత్తంగా నేను ఒక్కదాన్నే ఉంటాను' అంటుంది. దీంతో ఓనర్ 'అదేంటీ మీ భర్తా..' అని ప్రశ్నించగా.. 'ఆయన నాతో ఉండరు. నేను మాత్రమే ఈ ఇంట్లో అద్దెకు ఉంటాను' అని తులసి సమాధానం చెబుతుంది.

  అర్ధనగ్నంగా మహేశ్ హీరోయిన్: ప్రెగ్నెన్సీ టైంలోనూ హాట్ షోతో అరాచకం

  తులసికి షాకిచ్చిన ఇంటి ఓనర్

  తులసికి షాకిచ్చిన ఇంటి ఓనర్

  తులసి ఒంటరిగా ఉంటానని చెప్పడంతో ఆ ఇంటి ఓనర్ 'అలా కుదరదు. మేము సింగిల్స్‌కు ఇల్లు అద్దెకు ఇవ్వలేం. సింగిల్స్‌కు ఇవ్వడం అంటే కొరివితో తల గోక్కోవడమే. వాళ్లు ఇష్టమొచ్చిన డ్రెస్ వేసుకుని తిరుగుతారు. ఇష్టమొచ్చిన టైమ్‌కు ఇంటికి వస్తారు. అందుకే మేము ఇవ్వం' అంటూ షాకిస్తుంది. దీంతో తులసికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ వెంటనే 'సింగిల్స్ అంటే మనుషులు కాదా? వాళ్లకు జీవితాలు ఉండవా' అంటూ తిట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కూడా కొన్ని ఇళ్లకు వెళ్తుంది. కానీ, వాళ్లు కూడా సింగిల్స్‌కు ఇవ్వమని చెబుతారు.

  సామ్రాట్‌పై తులసి సీరియస్‌గా

  సామ్రాట్‌పై తులసి సీరియస్‌గా


  ఇల్లు వెతకడం.. వాళ్లు సింగిల్స్‌కు ఇవ్వమని చెప్పడంతో తులసి చిరాకుగా ఉంటుంది. అప్పుడే సామ్రాట్ ఆమెకు ఫోన్ చేస్తాడు. దీంతో అతడిపై తులసి సీరియస్ అవుతుంది. అంతలోనే అతడు మీరు సింగిల్‌గా ఉన్నారా అని అడుగుతాడు. దీంతో మరింత రెచ్చిపోయిన తులసి 'నేను సింగిల్‌గానే ఉన్నాను. అయితే ఏంటీ? మాట్లాడకూడదా? మీ ఆఫీసుకు రాకూడదా? మీకు కూడా అదే ప్రాబ్లమా? సింగిల్స్ అంటే మనుషులు కాదా' అంటూ అరిచేస్తుంది. దీంతో సామ్రాట్‌కు ఏమైందో అర్థం కాదు. ఆ తర్వాత వివరంగా అడగ్గా.. జరిగిందంతా అతడికి చెబుతుంది తులసి.

  బాత్రూంలో హాట్‌గా మెగా హీరోయిన్: ఆ డ్రెస్సు.. ఆమె ఫోజు చూశారంటే!

  ఇద్దరూ కలిసి అని.. లాస్య ప్లాన్

  ఇద్దరూ కలిసి అని.. లాస్య ప్లాన్

  తులసి చెప్పిన వెంటనే సామ్రాట్ 'మొత్తానికీ అదా విషయం. మీరు అంత కష్టపడి తిరిగిన సింగిల్ ఇల్లు కూడా దొరకలేదు అన్న మాట. సారీ.. సారీ.. సరే రేపు నేను వస్తాను. ఇద్దరం కలిసి వెతికేద్దాం. ఎందుకంటే మీరు సింగిల్, నేను సింగిల్. ఇద్దరం కలిసి హౌస్ ఓనర్స్ ప్లేస్‌లో డబుల్ ధమాకా చేద్దాం. చెరోవైపు చెడుగుడు ఆడేద్దాం.. ఏం నా ఫ్రెండ్‌తో నేను రాకూడదా? మీకేమైనా ఇబ్బందా' అని అంటాడు. దీంతో తులసి కూడా ఒప్పుకుంటుంది. మరోవైపు, లాస్య ఇంట్లో ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం డిన్నర్ చేసే సమయంలో అనసూయను చెప్పమని అంటుంది. ఆమె మొహమాటపడగా.. లాస్య మాట్లాడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 782: Nandhu Questions About Property Documents to Lasya. After That Tulasi Gets Into Heated Argument with House Owner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X