For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి కోసం సామ్రాట్ ప్లాన్.. ప్రేమ అంటూ కొత్తగా.. అనసూయ ఝలక్

  |

  దాదాపు ఇరవై, ముప్పై ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంటి డాక్యూమెంట్లను తీసుకున్న లాస్య చాలా సంతోషంగా ఉంటుంది. వాటిని ఎవరికీ కనిపించకుండా దాచేయాలని అనుకుంటుంది. కానీ, అది నందూ చూస్తాడు. అయితే, అతడికి అవి రెజ్యూమ్ పేపర్లు అని అబద్ధం చెబుతుంది. ఇక, తులసి అద్దె ఇంటిలోకి వెళ్లాలని అనుకుంటుంది. ఇందుకోసం చాలా ఇల్లు వెతుకుతుంది. కాకపోతే వాళ్లంతా సింగిల్ అయిన వాళ్లకు రెంట్‌కు ఇవ్వమని చెప్తారు. అప్పుడు సామ్రాట్ ఫోన్ చేయగా అతడిపై తులసి ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. దీంతో అతడికి అసలు ఏం చేయాలో అర్థమే కాదు.

  మోనాల్ గజ్జర్ ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు ఆరబోస్తూ అరాచకంగా!

  పరందామయ్య బర్త్‌డే చేయాలని

  పరందామయ్య బర్త్‌డే చేయాలని


  ఇంట్లో కూర్చుని అందరూ డిన్నర్ చేస్తున్న సమయంలో పార్టీ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు నందూ 'ఉండు నేను చెబుతాను. నాన్నగారి పుట్టినరోజు కాబట్టి గ్రాండ్‌గా పార్టీని చేద్దామని అనుకుంటున్నాం. అదే లాస్య చెప్పడానికి ట్రై చేస్తుంది' అంటాడు. అప్పుడే అనసూయ 'ఇక, గొడవలన్నీ మరిచిపోదాం.. ఇంతకు ముందులా అందరం కలిసి ఉందాం. కొన్నిరోజుల పాటు తులసి, సామ్రాట్ పేర్లు ఈ ఇంట్లో వినిపించకూడదు' అంటుంది. అప్పుడే లాస్య 'మన మధ్య లేని వాళ్ల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం అని తెలుసు కదా' అని అంటుంది.

  నీకు లేని రూల్స్ మాకు ఎందుకు

  నీకు లేని రూల్స్ మాకు ఎందుకు


  లాస్య మాటలకు ప్రేమ్ 'ఈ ఇంట్లో గొడవలు వస్తున్నాయంటే అది నీ వల్లే. నీకు లేనిరూల్స్ మా అమ్మకి ఎందుకు? ఎవరి అభిప్రాయం వాళ్లని మాట్లాడనీయండి' అని అంటాడు. అప్పుడు అభి మాట్లాడనిస్తే ఇలాగే ఉంటుంది అంటాడు. దీంతో ప్రేమ్ నీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకుని ఉండు అని అంటాడు. అప్పుడు నందూ అరస్తున్నావ్ ఏంటి అని సీరియస్ అవుతాడు. దీనికి ప్రేమ్ అరిచేలా చేస్తున్నావు అంటాడు. అప్పుడు దివ్య అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయినా వదలరా అని అంటుంది. దీంతో లాస్య 'మీ అమ్మకి ఏం కష్టం వచ్చింది. తన తన బాయ్‌ఫ్రెండ్‌తో రాజభవనంలో ఉంటుంది' అని అంటుంది.

  నోయల్‌పై ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు: పెళ్లైన 16 రోజులకే అలా.. అక్కడ యాసిడ్ పోస్తానన్నాడు అంటూ!

  తినకుండా వెళ్లిపోయిన ఫ్యామిలీ

  తినకుండా వెళ్లిపోయిన ఫ్యామిలీ


  లాస్య నిందలకు ప్రేమ్ 'తెలిసి తెలియకుండా మాట్లాడకు. మా అమ్మ సామ్రాట్ గారి ఇంట్లో లేదు. తన పుట్టింట్లో ఉంది. త్వరగా వేరే ఇంట్లో ఉండాలని ఉంటుంది. ఇన్నాళ్లూ తనని నమ్ముకున్న వాళ్లు మోసం చేశారు. అందుకే తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటుంది' అని అంటాడు. అప్పుడు అనసూయ 'బంధాలను తెంచుకుని వెళ్లిపోయిన వాళ్ల గురించి ఈ డిస్కషన్ అవసరమా? తాను ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా మనకి అనవసరం' అని అంటుంది. దీనికి ప్రేమ్ అంటే తాతయ్య బర్త్ డేకి కూడా అమ్మని పిలవరా? అని అడుగుతాడు. అప్పుడు అనసూయ 'పిలిచే ప్రసక్తే లేదు.. తను ఈ ఇంటి గడప తొక్కడానికి లేదు' అని అంటుంది. అప్పుడు పరందామయ్య తినకుండా వెళ్లిపోతాడు. ఆయన వెనకాలే అందరూ లేచి వెళ్లిపోతారు.

  ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటూ

  ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటూ

  తులసి అద్దె ఇంట్లోకి వెళ్లిపోతానని అనగానే ఆమె తల్లి సరస్వతి ఎమోషనల్ అవుతుంది. దీంతో తులసి 'పుట్టింట్లో ఉండే ఆడదానిపై చుట్టుపక్కల వాళ్ల నుంచి రాళ్లు పడతాయి. నీకు ఎన్నో ప్రశ్నలు వెంటాడుతాయి. మా అత్తయ్య విషయంలో జరిగిన పొరపాటు అమ్మ విషయంలో జరగక్కూడదు. చేయి కాలిన తరువాత అత్త అయినా అమ్మ అయినా ఒకటే కదా. అత్తయ్య నన్ను అమ్మ కంటే ఎక్కువ చూసుకున్నారు. నేను జాగ్రత్త పడుతున్నాను. నేను ఇక్కడ ఉంటే అమ్మ చాటు బిడ్డను అయిపోతాను. నేను బావిలో కప్పని కాదు.. జనారణ్యంలో పడ్డాను. నా ప్రయాణం నన్ను చేయనీవ్వు అమ్మా' అని అంటుంది. దీనికి సరస్వతి 'నువ్వు జీవితంలో గెలవాలి.. ఆ గెలుపు నేను చూడాలి' అని అంటుంది.

  వాష్ రూమ్‌లో హాట్‌గా తెలుగు పిల్ల డింపుల్: టైట్ ఫిట్‌లో ఆ ఫోజు చూస్తే మెంటలే

  తులసి కోసం సామ్రాట్ కొత్త ప్లాన్

  తులసి కోసం సామ్రాట్ కొత్త ప్లాన్


  సామ్రాట్ తులసి గురించే ఆలోచిస్తాడు. ఆ సమయంలో తులసి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటుంటాడు. అప్పుడే వాళ్ల బాబాయి వచ్చి సామ్రాట్‌ను ఏవేవో అడుగుతూ ఉంటాడు. ఇంటి గురించి కూడా ప్రశ్నలు సంధిస్తాడు. 'కొంపదీసి నువ్వు కూడా తులసితో కలిసి నిజంగానే ఇంటిని వెతకాడానికి వెళ్తావా ఏంటి' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు సామ్రాట్ 'ఓ బ్రోకర్ ద్వారా.. తులసికి ఇల్లు దొరికేట్టుగా ప్లాన్ చేశాను. ఆ విషయం తులసికి తెలియదు' అని చెబుతాడు. దీంతో ఆయన సామ్రాట్ వ్యవహరిస్తున్న తీరును చూస్తూ అనుమానపడతాడు.

  నీ మనసులో ఏదో ఉంది అంటూ

  నీ మనసులో ఏదో ఉంది అంటూ


  తులసి తన గురించి మరోలా అనుకోకూడదు అని సామ్రాట్ అనగానే వాళ్ల బాబాయి మీ ఇద్దరి మధ్య ఏదో ఉందిరా అని అంటాడు. అప్పుడు సామ్రాట్ 'నాకు ఏ ఆశా లేదు. స్నేహం తప్ప. నా మనసులో ఏం లేదు' అని అంటాడు. దీనికాయన 'సర్లేరా నా ఆశ నాది. కానీ, తులసి మనసులో వేరే ఆలోచన ఉండి నిన్ను అడిగితే నో అనేస్తావా' అని ప్రశ్నిస్తాడు. దీంతో సామ్రాట్.. తులసి అలా అడిగే అవకాశం లేదు అని అంటాడు. అప్పుడు వాళ్ల బాబాయి 'అంటే.. అడిగితే ఓకే అంటావు అన్నమాట. నీ మనసులో ప్రేమ కళ్లల్లో కనిపిస్తుందిరా. నీ కళ్లు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. తింటూ ఆలోచించుకోరా' అని వెళ్లిపోతాడు.

  బట్టలు లేకుండా అమ్మాయి: అలాంటి పిక్ షేర్ చేసిన దీప్తి సునైనా

  తులసికి ఫోన్ చేసి ఏడ్చిన దివ్య

  తులసికి ఫోన్ చేసి ఏడ్చిన దివ్య


  ఆ తర్వాత తులసికి దివ్య ఏడుస్తూ ఫోన్ చేస్తుంది. అప్పుడామె కంగారు పడుతుంటుంది. దీంతో దివ్య 'నీ మీద బెంగగా ఉంది. నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తాను అమ్మా' అంటుంది. అప్పుడామె 'నువ్వు అలా చిన్న పిల్లలా ఏడవకు. నువ్వు రేపోమాపో ఓ ఇంటికి కోడలు అవుతావు. అలాంటిది ఇలా ఏడవొచ్చా' అంటూ థైర్యం చెప్పి ఓదార్చుతుంది. ఆ తర్వాత నందూ ఎలాగైనా పరందామయ్య బర్త్‌డే పార్టీని గ్రాండ్‌గా చేయాలని మాట్లాడుతుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 783: Tulasi Consoles Saraswathi as She Gets Emotional about The Decision. After That Anasuya and Parandhamaiah Get into an Argument.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X