For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: పరందామయ్యకు సామ్రాట్ ప్రామిస్.. సీక్రెట్‌గా వాళ్లను చూసిన అభి

  |

  ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చే సరికి తులసి కోసం వాళ్ల పిల్లలు వేచి చూస్తుంటారు. ఆ తర్వాత వాళ్ల సహాయంతో ఇల్లు మొత్తం సర్ధుకుంటారు. అనంతరం పాలు పొంగించిన తులసి అందరి కోసం పాయసం చేసి ఇస్తుంది. ఆ వెంటనే అందరూ వెళ్లిపోగా తులసి, సామ్రాట్ మాత్రమే ఉంటారు. వాళ్లిద్దరూ పూజా చేస్తుంటారు. ఆ సమయంలో సామ్రాట్ తన మనసులోని మాట చెప్పాలనుకుని ఆగిపోతాడు. ఇక, బాధలో ఉన్న నందూకు ధైర్యం చెప్పిన లాస్య.. పరందామయ్య పుట్టినరోజును ప్లాన్ చేస్తుంది. కానీ, ఇంట్లో వాళ్లు ఎవరూ కనిపించరు.

  పెళ్లైన కొత్తలోనే హీరోయిన్ పూర్ణకు షాక్: బయటపడిన భారీ మోసం.. తన భర్త ఎలాంటి వాడో చెబుతూ పోస్ట్

  వాళ్లకు షాకిచ్చిన పరందామయ్య

  వాళ్లకు షాకిచ్చిన పరందామయ్య

  పరందామయ్య పుట్టినరోజును గట్టిగా సెలెబ్రేట్ చేయాలని నందూ బ్యాచ్ ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం అతడు స్వయంగా వెళ్లి కేక్ కూడా తీసుకు వస్తాడు. ఆ తర్వాత అభి, లాస్య.. ప్రేమ్, దివ్య, అంకితలను నిద్రలేపడానికి వెళ్తారు. కానీ వాళ్లు అక్కడ ఉండరు. ఆ విషయం నందూకు చెప్పడంతో వాళ్లు వచ్చినప్పుడు వస్తారులే.. వెళ్లి నాన్నని లేపుదాం పదండి అని అంటాడు. ఆ వెంటనే పరందామయ్య రూమ్‌లోకి వెళ్లి ఆయనను విష్ చేయడం మొదలెడతారు. కానీ, ఉలుకూ పలుకూ ఉండదు. దీంతో నందూ బ్లాంకెట్ తీయగా పరందామయ్య కనిపించకపోవడంతో షాక్ అవుతాడు.

  తులసి కళ్లు మూసి తీసుకు వెళ్లి

  తులసి కళ్లు మూసి తీసుకు వెళ్లి


  మరోవైపు, పరందామయ్య బర్త్‌డేను సెలెబ్రేట్ చేసుకోవాలన్న తులసి కోరిక మేరకు సామ్రాట్ అదిరిపోయే ప్లాన్ వేస్తాడు. ఇందులో భాగంగానే తులసి కళ్లు మూసి తీసుకు వెళ్తుంటాడు. అప్పుడామె మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంది. దీంతో సామ్రాట్ మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నా అని జోక్ చేస్తాడు. ఆ తర్వాత సర్‌ప్రైజ్ అనగానే తులసి 'జీవితాంతం నాకు ఇలాగే సర్‌ప్రైజ్‌లు ఇస్తారా? అని సామ్రాట్‌ను ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత పరందామయ్య ఫొటోతో కేక్ కట్ చేయాలని సామ్రాట్ సెట్ చేసిన ప్రదేశానికి ఆమెను తీసుకుని వెళ్తాడు.

  హాట్ వీడియో వదిలిన ప్రగ్యా జైస్వాల్: వామ్మో ఇది మామూలు షో కాదుగా!

  పరందామయ్య ప్రత్యక్షం అవుతూ

  పరందామయ్య ప్రత్యక్షం అవుతూ


  సామ్రాట్ సెట్టింగ్ చూడగానే తులసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు సామ్రాట్ 'మీరు మామయ్య దగ్గరకు మీరు వెళ్లలేరు కాబట్టి.. ఆయన తరుపున మీరు కేక్ కట్ చేయండి.. ఆయనకి వీడియో పంపిద్దాం. సంతోషిస్తారు' అని అంటాడు. దీంతో తులసి 'నేను సంతోషంగా ఉన్నా అక్కడ మామయ్య సంతోషంగా ఉండలేరు. సరే.. నా సమస్యను మామయ్య అర్దం చేసుకుంటారు' అని అంటుంది. అంతలోనే 'అర్థం చేసుకున్నానమ్మా.. అందుకే నీ దగ్గరకే వచ్చేశాను' అంటూ పరందామయ్య ప్రత్యక్షం అవుతాడు. ఆ వెంటనే తులసి వెళ్లి ఆయన కాళ్ల మీద పడుతుంది.

  తులసిని వదలొద్దు.. అభి ఎంట్రీ

  తులసిని వదలొద్దు.. అభి ఎంట్రీ


  ఆ తర్వాత ప్రేమ్, శృతి, అంకిత, దివ్యలు కూడా అక్కడకు వస్తారు. ఆ సమయంలో అందరూ సంతోషంగా ఉంటారు. అలా కేక్ కట్ చేయించి ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడే అభి కూడా అక్కడకు వచ్చి చాటుగా అంతా చూస్తుంటాడు. ఆ సమయంలోనే పరందామయ్య 'నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. మా ఇంటి మహలక్ష్మికి నువ్వు అండగా నిలబడ్డావు. ఎప్పటికే మా తులసిని నువ్వు ఒంటరిగా విడిచిపెట్టొద్దు' అని అంటాడు. ఆ మాట విన్న అభి.. ఇదేం దరిద్రం అన్నట్లుగా మాట్లాడుకుంటాడు. ఆయన అండగా ఉండడం ఏంటని రగిలిపోతుంటాడు.

  Yashoda Twitter Review: యశోదకు పాజిటివ్ టాక్.. ఆ సీన్స్‌లో అదరగొట్టిన సమంత

  సామ్రాట్ హామీ.. అంకిత అక్కడే

  సామ్రాట్ హామీ.. అంకిత అక్కడే


  పరందామయ్య మాటలకు సామ్రాట్ 'మీకు ఎలాంటి దిగులు అవసరం లేదండీ.. మీ తులసిని నేను చూసుకుంటాను' అని హామీ ఇస్తాడు. పరందామయ్య ఇంటికి బయలుదేరుతూ.. 'ఆ ఇంటికి తిరిగి వెళ్లాలంటే మనసు మొరాయిస్తుంది' అని అంటాడు. ఆ సమయంలో ప్రేమ్ వాళ్లు కూడా 'నువ్వులేని ఇల్లు ఇల్లులా లేదమ్మా.. తప్పక అక్కడ ఉంటున్నాం' అని అంటారు. ఇదంతా చూసిన అభి కోపంతో రగిలిపోతుంటాడు. ఆ తర్వాత అంతా ఇంటికి తిగిరి వెళ్తారు. కానీ, అంకిత మాత్రం.. ఆంటీకి తోడుగా ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి ఉంటుంది.

  తండ్రి కోసం నందూ వెయిటింగ్

  తండ్రి కోసం నందూ వెయిటింగ్


  పరందామయ్యతో పాటు ఇంట్లో వాళ్లు కనిపించకపోయినా నందూ మాత్రం ఆ కేక్ పట్టుకుని అలాగే ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో బాధ పడుతూ 'ఆయనకు నాపై కోపం ఉండొచ్చు కానీ.. నాకు ఆయనపై ప్రేమ, గౌరవం ఉంది. ఆయన వచ్చే వరకూ ఇలాగే ఉంటాను' అంటాడు. కానీ, అనసూయ, లాస్య మాత్రం ఇది వర్కౌట్ అయ్యేలా లేదని అనుకుంటారు. ఇక, తులసి ఇంట్లో ఉన్న అభి.. అందరూ వెళ్లే వరకూ దాక్కుని ఆ తర్వాత లోపలికి వెళ్తాడు. ఆ సమయంలోనే తులసి, సామ్రాట్, అంకితలు మాట్లాడుకుంటూ ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఉంటారు.

  బట్టలు మొత్తం విప్పేసి శ్రీయ దారుణం: ఈ వీడియోలో ఆమెను చూశారంటే!

  అభి ఎంట్రీ.. అమ్మపైనే కోపంగా

  అభి ఎంట్రీ.. అమ్మపైనే కోపంగా


  అంకిత మాట్లాడుతూ.. 'ఈ ఇంట్లో చాలా సంతోషం కనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉండొచ్చా ఆంటీ' అని అడుగుతుంది. దీనికి తులసి 'ఇది మీ ఇల్లు అమ్మా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఉండొచ్చు' అంటుంది. అప్పుడే అభి 'ఎవరూ రారు ఇక్కడికి. శుభకార్యానికి అయినా సరే.. అశుభ కార్యానికి అయినా సరే ఎవరూ రారు' అంటూ ఆవేశంగా ఇంట్లోకి వస్తాడు. దీంతో తులసి 'ఈరోజు తాతయ్య పుట్టిన రోజు మనందరికీ పండగ రోజు.. కొంచెం ముందు రావాల్సిందిరా.. మాతో పాటు ఎంజాయ్ చేసేవాడివి' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 787: Parandhamaih Goes Missing From Home. Then Nandhu and Anasuya Gets Confused. After That Parandhamaih Feels Happy about Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X