For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి ఇంటికి అనసూయ.. ఇల్లు ధ్వంసం చేసి.. పుట్టినరోజే షాకింగ్‌గా!

  |

  జనరేషన్లు మారుతూ ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్యను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించిన అనసూయ.. అతడితో మనసు విప్పి మాట్లాడి నందూ బాధను వివరించి చెప్తుంది. ఆ తర్వాత నందూ కొనిచ్చిన బట్టలను ఆయనకు అందిస్తుంది. దీంతో లాస్య ఈ విషయం చెప్పడానికి నందూకు ఫోన్ చేయగా.. అతడు మాత్రం లిఫ్ట్ చేయడు. అంతేకాదు, ఇంకా తులసి ఆలోచనలోనే ఉంటాడు. ఇక, చివర్లో పరందామయ్య కోసం తులసి పూజ చేయించాలని అనుకుంటుంది. అలాగే వస్తుండగా అనసూయ, లాస్య ఆపుతారు. కానీ, పరందామయ్య మాత్రం తులసికే జై కొడతాడు.

  Gaalodu Twitter Review: గాలోడుకు అలాంటి టాక్.. ప్లస్ మైనస్‌లు ఇవే.. ఇంతకీ సుధీర్ హిట్ కొట్టాడా అంటే!

  అంతా కలవడంతో సంతోషంగా

  అంతా కలవడంతో సంతోషంగా

  తులసి ఇంటికి వచ్చిన పరందామయ్య 'అన్నింటికీ తెగించి నేను ఇక నా మనసుకు నచ్చిన పని చేస్తున్నాను. అందుకే నా వాళ్ల మధ్య పుట్టినరోజు జరుపుకోవాలని వచ్చాను' అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే నేను కూడా అందుకే వచ్చాను అని సామ్రాట్ వాళ్ల బాబాయి కూడా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు పరందామయ్యకు శుభాకాంక్షలు చెబుతాడు. దీంతో సామ్రాట్ 'ఖాళీ చేతులతో వచ్చావు ఏంటి బాబాయి' అని అడగ్గా.. చేతులు ఖాళీగానే ఉన్నాయి కానీ.. మనసు మాత్రం నిండుగా ఉంది అంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి సంతోషంగా ఉంటూ పూజకు రెడీ అవుతారు.

  కోపంతో ఊగిపోయిన అనసూయ

  కోపంతో ఊగిపోయిన అనసూయ

  పరందామయ్య ఇంట్లో నుంచి వెళ్లడంతో అనసూయ కోపంగా ఉంటుంది. అంతేకాదు, 'రాక్షసి నన్ను కన్నీళ్లు పెట్టిస్తోంది. మా మొగుడు పెళ్లాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోంది. నా ఊసురు ఖచ్చితంగా తగులుతుంది. ఇంతకు ఇంత అనుభవిస్తావు' అని అరుస్తూ గోల చేస్తుంది. దీంతో అభి ఆమెను ఆపాలని చూస్తాడు. కానీ, లాస్య మాత్రం 'ఏంటి అత్తయ్య ఇది. మీరు కోపం చూపించాల్సింది ఆ తులసి మీద. మనింట్లో నిప్పు పెట్టి తనింట్లో పండుగ చేసుకుంటోంది. ఏదైనా అనాలంటే తనను అనాలి' అంటుంది. అప్పుడు అభి కూడా లాస్య చెప్పిందే నిజమంటాడు.

  ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్ స్రవంతి: ఎద అందాలు ఆరబోస్తూ ఘోరంగా!

  తులసి అంతును చూడాలంటూ

  తులసి అంతును చూడాలంటూ


  ఆ తర్వాత అభి కూడా లాస్య మాటలకు వంత పాడుతూ మాట్లాడతాడు. 'నానమ్మ మామ్‌కు మనం అర్జెంట్‌గా అడ్డు పడకపోతే చాలా కష్టం' అంటాడు. అప్పుడు లాస్య 'మామయ్య ఎలాగూ తులసిని ఏం చేయరు. మీరు రంగంలోకి దిగితేనే తులసికి అడ్డుకట్ట పడుతుంది. మీరే ఆలోచించండి అత్తయ్య' అంటుంది. దీంతో అనసూయ 'సామ్రాట్ అండ చూసుకొని తులసి రెచ్చిపోతోంది. నాకు తిక్క రేగితే ఆ సామ్రాట్‌నే కాదు.. తనను పుట్టించిన దేవుడిని కూడా వదలను. పదరా అభి' అంటూ లాస్యను కూడా తీసుకుని తులసి ఇంటికి కోపంగా బయలుదేరుతుంది.

  సరదాగా మాట్లాడుకున్న ఫ్యామిలీ

  సరదాగా మాట్లాడుకున్న ఫ్యామిలీ


  పుట్టినరోజు సందర్భంగా పరందామయ్య పూజలో పాల్గొంటాడు. అది అయిపోయిన తర్వాత పూజారి 'పూజ దివ్యంగా జరిగింది. మీరు స్వామి వారి కరుణ, కటాక్షాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తారు' అని దీవిస్తాడు. దీనికాయన ఆయురారోగ్యాల కన్నా నేను ప్రశాంతంగా జీవిస్తే చాలు అంటాడు. ఆ తర్వాత అందరూ పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అనంతరం మీకు ఆయుస్సు పెరగాలి కానీ.. పొట్ట తగ్గాలి అని సామ్రాట్ బాబాయి అంటాడు. దీంతో దివ్య 'తాతయ్య అలాంటివి పట్టించుకోరు. పాపం నానమ్మ మాత్రం ఏం చేస్తుంది. తాతయ్య పొట్ట గురించి పట్టించుకోవడం మానేసింది' అంటుంది. దీంతో అందరూ నవ్వుకుంటారు.

  రష్మీ గౌతమ్‌కు విల్లాను గిఫ్టుగా ఇచ్చిన హీరో: అతడి గురించి పెదవి విప్పబోతున్న యాంకర్

  అనసూయ ఎంట్రీ.. వెళ్లిపోమని

  అనసూయ ఎంట్రీ.. వెళ్లిపోమని


  పూజ పూర్తైన తర్వాత అందరూ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలని అడుగుతారు. ఆ తర్వాత అందరూ కలిసి ఫ్యామిలీ పార్టీ అంటూ డ్యాన్స్ చేస్తుంటారు. అలా అందరూ సంతోషంగా ఉండగా.. ఇంతలో అనసూయ కోపంగా అక్కడికి వస్తుంది. ఆమెను చూసి పరందామయ్య షాక్ అవుతాడు. అప్పుడాయన 'అనసూయ.. ఈరోజు నా పుట్టినరోజు. నేనే కావాలని ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుకుండా వెంటనే వెళ్లిపో' అని అరుస్తాడు. కానీ, అనసూయ మాత్రం వినదు. పైగా 'పోనీలే పోనీలే అంటూ ఇప్పటి వరకు నేను భరించాను' అంటూ గొడవకు దిగుతుంది.

  తులసి వైపు మాట్లాడిన మామ

  తులసి వైపు మాట్లాడిన మామ

  అనసూయ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండగా పరందామయ్య 'నువ్వు కాదు.. తులసి నిన్ను ఇప్పటి వరకు భరించింది. తులసి నీ కోడలుగా అడుగు పెట్టాకే నీ ఇల్లు ఇల్లుగా కనిపించడం మొదలైంది' అంటాడు. దీంతో అనసూయ 'ఆవిడ గారు వచ్చి అందమైన బృందావనంలా మార్చింది. సిగ్గులేకపోతే సరి. మీరు నన్ను ఎనాడు బాగా చూసుకున్నారు? చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పిల్లలను పెంచి.. నేను కడుపు మాడ్చుకొని మీకు భోజనం పెట్టాను. పేదరికంలో పిల్లలను పెంచి పెద్ద చేశాను. నాకు చేతి నిండా ఏనాడైనా డబ్బులు ఇచ్చారా? కనీసం బంగారం కొనిచ్చారా? మీకోసం నేను నా సంతోషాన్ని, జీవితాన్ని త్యాగం చేస్తే దానికి బదులుగా మీరు ఇచ్చింది ఏంటి' అంటూ భర్తపై విరుచుకుపడుతుంది.

  అతి దారుణమైన ఫొటోలు వదిలిన సీరియల్ నటి: ఏమీ దాచుకోకుండానే హాట్ షో

  మొత్తం నాశనం చేస్తానంటూ

  మొత్తం నాశనం చేస్తానంటూ


  ఆ తర్వాత అనసూయ మాట్లాడుతూ.. 'మీరు నన్నే నోర్మూయ్ అంటూ బయటికి వెళ్లమంటారా' అంటూ ప్రశ్నిస్తుంది. అనసూయ మాటలకు పరందామయ్య 'నువ్వు నాకోసం చేసిన అన్నింటికీ బదులుగా నేను ఏం ఇచ్చానో తెలుసా? మౌనంగా ఉండటం. నువ్వు చెప్పినట్టు చేయడం' అని బదులిస్తాడు. ఆ తర్వాత కూడా ఆమె మీద అరుస్తాడు. దీంతో అనసూయ మీరంతా కలిసి నా కుటుంబాన్ని నాశనం చేస్తారా? నేను ఈ ఇంటిని నాశనం చేస్తాను' అంటూ అక్కడున్న వస్తువులు అన్నింటినీ పడేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 793: Parandhamaiah and his family attend the Pooja. Then Tulasi Feels So Happy. After That Anasuya Insulting Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X