For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి థ్యాంక్స్ చెప్పిన నందూ.. చంపేస్తా లేకపోతే చస్తా అంటూ!

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్య వెళ్లిపోమని వేడుకోవడంతో చేసేందేం లేక అనసూయ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లిపోతోంది. దీంతో ఆమెను తులసి కాపాడుతుంది. అంతేకాదు, అసలు గొడవ ఎందుకు వచ్చింది అనేది అనసూయకు వివరించి చెబుతుంది. దీంతో ఆమె తులసికి క్షమాపణలు చెప్పడంతో తన భర్తను పంపించమని కోరుతుంది. మరోవైపు, లాస్య ద్వారా అసలు విషయం తెలుసుకున్న నందూ.. అందరిపై అరుస్తుంటాడు. అప్పుడు తులసి, అనసూయ అక్కడికెళ్తారు.

  పబ్లిక్‌లోనే హీరోయిన్ శ్రీయ కొంటె పని: నా భర్తకు అలా చేస్తేనే ఇష్టమంటూ షాకింగ్‌గా!

  అనసూయను రావొద్దన్న నందూ

  అనసూయను రావొద్దన్న నందూ


  ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అనసూయను కాపాడిన తులసి.. నేరుగా వాళ్ల ఇంటికి ఆమెను తీసుకుని వస్తుంది. అప్పుడే నందూ అసలు విషయం తెలుసుకుని గొడవ చేస్తుంటాడు. ఆ సమయంలో తల్లిని చూసిన అతడు.. 'ఇంట్లో అడుగు పెట్టడానికి వీలులేదమ్మా. చిలక్కి చెప్పినట్లు చెప్పి వెళ్లాను. నాన్న జోలికి వెళ్లొద్దు అని. కానీ, మా నాన్నను అవమానించి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేశావు. ఆయన ఇంట్లో అడుగు పెట్టే వరకూ నువ్వు ఈ గడప తొక్కడానికి వీల్లేదు' అంటూ అనసూయపై అరుస్తాడు. ఆ తర్వాత తులసిని కూడా గెట్ అవుట్ అని కోప్పడతాడు.

  మా నాన్న ఎక్కడున్నారు అంటూ

  మా నాన్న ఎక్కడున్నారు అంటూ


  ఈ తర్వాత నందూ నీకు ఇక్కడేం పని? గెట్ అవుట్ అంటూ తులసిపై కేకలు వేస్తాడు. దీంతో అనసూయ తను నన్ను తీసుకొచ్చింది అని చెప్తుంది. దీంతో అనసూయ 'ఈ గ్యాప్‌లో మాజీ అత్తా కోడలు కలిసిపోయారా ఏంటి' అని మనసులో అనుకుంటుంది. అప్పుడు నందూ 'తను ఈ ఇంటి మనిషి కాదమ్మా. పరాయి మనిషి. తనను అడగాల్సినవి.. తెలుసుకోవాల్సినవి ఏమీ లేవు. కానీ, నిన్ను అడగాల్సినవి చాలా ఉన్నాయి. మా నాన్న ఎక్కడ? ఎందుకు ఇంటికి రాలేదు? నిన్నే అడిగేది' అని కోప్పడతాడు. అప్పుడు తులసి 'అత్తయ్య.. మామయ్యను బ్రతిమాలి ఇక్కడికి తీసుకు రావడానికే వచ్చారు. కానీ, ఆయన మాత్రం కోపంతో రానని చెప్పారు' అని సమాధానం చెప్తుంది.

  బోల్డు షోలో హద్దు దాటిన పాయల్: కాలు పైకి లేపి.. అలా సైగలు చేస్తూ!

  వేరే ఎవరైనా అయితే చంపేస్తా

  వేరే ఎవరైనా అయితే చంపేస్తా

  తులసి మాటలకు నందూ 'ఎలా ఒప్పుకుంటారు? ఎలా వస్తారు? తల తెగేలా చేసినా పోనీలే అని వచ్చేవారు. కానీ, సిగ్గుతో తల భూమిలో పెట్టుకునే విధంగా తన వాళ్లే అవమానిస్తే ఎలా వస్తారు? ఎలా వస్తారనుకున్నావు అమ్మా? ఆయనకు ఆత్మాభిమానం ఉండదా? మానాన్న మీద ఒట్టు. మా నాన్నను అవమానించింది నువ్వు కాకుండా ఇంకెవరో అయి ఉంటే వాళ్లను చంపేసే వాడిని. కానీ, ఆ మనిషి నాకు జన్మనిచ్చిన అమ్మ అయింది. నీ రక్తం పంచుకుని పుట్టాను. కానీ, ఆ ప్రేమ నా చేతులు కట్టేయలేదు. మా నాన్న నేర్పించిన సంస్కారం, పద్దతి ఆపాయి' అని చెబుతాడు.

  తన ప్రాణం ఇస్తానన్న నందూ

  తన ప్రాణం ఇస్తానన్న నందూ


  ఆ తర్వాత నందూ 'మా నాన్న ఈ ఇంటి గుమ్మం లాంటి వారు. నువ్వు ఎంత ఎత్తు ఉన్నా గుమ్మం దగ్గర తల దించుకునే రావాలి. అలా చేయకుండా లోకం ముందు నాన్న పరువు తీశావు. నాన్న గౌరవం నిలబెడడానికి ప్రాణం ఇవ్వగలను, ప్రాణం తీయగలను కూడా. కానీ, ఇక్కడ మా నాన్న పరువు తీసింది మా అమ్మ. కాబట్టి ప్రాణం తీసే అవకాశం లేదు. అందుకే నేనే నా ప్రాణం ఇస్తాను.. నా ప్రాణం తీసుకుంటాను. నేను చావడానికైనా సిద్ధమే కానీ.. నాన్న లేకుండా ఉండలేను. తల్లి బిడ్డల తప్పులు సరిదిద్దుతుంది కానీ.. తప్పులు చేయదు. కానీ, నువ్వు చేశావు.. పాపం చేశావు. వరం ఇవ్వాల్సిన దేవుడే శపిస్తే నేను ఎవరికి చెప్పుకోవాలమ్మా' అని అరుస్తాడు. దీంతో తులసి ఏదో చెబుతుండగా నందూ కోపంతో ఆమెను కూడా తిడతాడు.

  Bigg Boss: ఫ్యామిలీ ఎపిసోడ్‌లో రేవంత్‌కు షాక్.. కనికరించని బిగ్ బాస్.. ఆమె కోసం పెద్ద త్యాగం

  తులసి గురించి సామ్రాట్ టెన్షన్

  తులసి గురించి సామ్రాట్ టెన్షన్


  అనసూయను తీసుకుని ఇంటికి వెళ్లిన తులసి గురించి సామ్రాట్, వాళ్ల బాబాయి టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ సమయంలో సామ్రాట్ 'తులసి గారు చూడ్డానికి ఎంతో ధైర్యంగా కనిపించినా.. అంకుల్ పరిస్థితి.. ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసి లోలోపల కుమిలిపోతుందేమో అనిపిస్తుంది బాబాయ్' అంటాడు. అప్పుడాయన 'తులసి గురించి ఎంత పొగిడినా తక్కువేరా. తనలా ఈ పరిస్థితులను ఎవరూ డీల్ చేయలేరేమో అనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే తులసికి సపోర్ట్ అవసరం. బాధలో ఉన్నప్పుడే మనిషి తోడు అవసరం. ఆయన్ని చీరప్ చేద్దాం' అంటాడు.

  నందూకు ఎదురు తిరిగిన తులసి

  నందూకు ఎదురు తిరిగిన తులసి


  నందూ తనను షట్ అప్ అని అనడంతో తులసి ఎదురు తిరుగుతుంది. 'ఒక్క తప్పుతో ఇంకో తప్పును సరిచేయలేరు నందగోపాల్ గారు. మావయ్యను అవమానించి అత్తయ్య తప్పు చేశారు. మీరు కూడా అదే తప్పు చేయకండి. మరి అత్తయ్య చేసిన పనికి కోపం రావడం సహజం. అలా అని తల్లిని అగౌరపరచకండి. తను చిన్నప్పటి నుంచి మీ తప్పులను సరిచేస్తూ ఎదిగేలా చేసింది' అని అంటుంది. దీనికి నందూ 'కానీ, మా అమ్మ చేసినట్లు నేనెప్పుడూ పెద్ద తప్పులు చేయలేదు' అంటాడు. దీంతో తులసి అత్తయ్యను లోపలికి తీసుకెళ్లండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది.

  Bigg Boss Elimination: ఒక్కసారిగా మారిన ఓటింగ్.. ఆమె మళ్లీ సేఫే.. ఎలిమినేషన్ ప్రమాదంలో మంచోళ్లు!

  తులసికి నందూ థ్యాంక్స్ చెప్పగా

  తులసికి నందూ థ్యాంక్స్ చెప్పగా


  ఆ తర్వాత తులసి 'మీ నాన్న గారు నా దగ్గరే ఉన్నారు. మీరేం టెన్షన్ పడకండి' అంటుంది. దీంతో నందూ థ్యాంక్స్ అంటాడు. అప్పుడు లాస్య 'నువ్వు తులసికి ఎందుకు థాంక్స్ చెబుతున్నావు నందూ. అసలు దీని అంతటికి కారణం తులసే కదా. మామయ్య గారిని తన వైపునకు తిప్పుకొని తన దగ్గర దాచుకొని నాటకాలు ఆడుతోంది' అని నిందలు వేస్తుంది. దీంతో తులసి 'మనం గొడవ పెట్టుకోవడానికి ఇది సమయం కాదు లాస్య. నేను ఈ ఇంటికి పరాయి దాన్ని అని మీ ఆయన ఇందాకే చెప్పారు కదా. నేను ఆయనకు పరాయిదాన్ని అయితే.. ఆయన కూడా నాకు పరాయి మనిషే కదా. పరాయివాళ్లను ప్రశ్నించనని ఆయనే ఇంతకు ముందు చెప్పారు కదా. ఆయనకు మీరు భయపడాలి.. నేను కాదు' అని ధీటైన సమాధానం చెబుతుంది.

  నందూ, లాస్య నిందలు వస్తూనే

  తులసి మాటలకు లాస్య 'ఎక్కువ చేస్తున్నావు తులసి. కావాలని తులసి మామయ్యను మనకు దూరం చేసి ఫ్యామిలీని ముక్కలు చేసి పండుగ చేసుకోవాలని అనుకుంటోంది' అంటుంది. దీనికామె 'నేను 26 ఏళ్లు ఈ ఇంటి కోడలుగా ఉన్నా. ఎప్పుడూ ఫ్యామిలీ విడిపోతుందేమో అని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇంటిని బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత కోడలుది. అది నీకు చేతగాక.. బయటి వారి మీద నిందలు వేసి తప్పించుకొని తిరుగుతున్నావు. నిజంగా నేను ఈ ఫ్యామిలీని ముక్కలు చేయాలని అనుకుంటే.. నేను ఈ ఇంట్లో నుంచి అడుగు పెట్టిన వెంటనే మామయ్య గారిని కూడా నాతో తీసుకెళ్లి ఉండేదాన్ని' అంటుంది. ఇదే విషయాన్ని లాస్యను నందూ కూడా అంటాడు. ఆ తర్వాత తులసిని కూడా నిందిస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 800: Nandu fires on Anasuya for Coming Home without Parandhamaya. After that Tulsi questions Lasya and Nandu for blaming her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X