For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నిజం చెప్పేసిన అనసూయ.. నందూకు డాక్యూమెంట్లతో షాకిచ్చిన లాస్య

  |

  చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసితో కలిసి ఇంటికి వచ్చిన అనసూయను నందూ ఇంట్లోకి రానివ్వకుండా అడ్డకుంటాడు. అంతేకాదు, తన తండ్రిని ఇంతలా అవమానించిన తల్లిపై విరుచుకుపడతాడు. ఆ స్థానంలో మరొకరు ఉంటే చంపేసేవాడిని అని అంటాడు. అంతేకాదు, నా ప్రాణం పోయినా పర్లేదు కానీ.. నాకు నా తండ్రి కావాలి అంటూ నందూ ఎమోషనల్ అవుతాడు. దీంతో తులసి అతడికి ఎదురు తిరుగుతుంది. దీంతో లాస్య, నందూలు ఆమెపై నిందలు వేస్తారు. అప్పుడామె వాళ్లిద్దరికీ ధీటుగానే సమాధానం చెప్పి నోర్లు మూయించే ప్రయత్నం చేస్తుంది.

  Bigg Boss Nominations: 13వ వారం నామినేషన్ లిస్ట్ లీక్.. ఆ ఇద్దరు తప్ప అంతా.. వాళ్ల మధ్య భీకర ఫైట్

  జుట్టు ఊడినా కారణం తులసే

  జుట్టు ఊడినా కారణం తులసే

  అనసూయ, పరందామయ్య మధ్య గొడవ జరగడానికి కారణం తులసే అని లాస్య నిందలు వేస్తుంది. దీంతో తులసి 'ఈ ఇంట్లోనే కాదు.. లోకంలో ఏమూలన ఏ అనర్థం జరిగినా నీ దృష్టిలో కారణం నేను. కూరలు రేట్లు పెరిగాయి దానికి కారణం తులసి.. బంగారం రేట్లు పెరిగాయి కారణం తులసి.. నీ జుట్టు ఊడిపోయింది దానికి కారణం తులసి' అంటుంది. దీనికి లాస్య 'నా జుట్టు ఊడడానికి నువ్వు కారణం ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్ తులసి? పిచ్చి పిచ్చి ఉదాహరణలు చెప్పి ఈ టాపిక్‌ను డైవెర్ట్ చేయాలని చూడకు. ఈ గొడవకు కారణం నువ్వే' అని అంటుంది.

  నిజాన్ని చెప్పేసిన అనసూయ

  నిజాన్ని చెప్పేసిన అనసూయ

  లాస్య మాటలతో అనసూయ సీన్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. అంతేకాదు, 'తులసి వల్ల మేము గొడవ పడలేదు. తులసికి మా గొడవకు సంబంధం మీ నాన్న ఇంటికి రాకపోవడంలో తులసి ప్రమేయం లేదు. తప్పంతా నాదే' అంటుంది. దీంతో నందూ 'ఇప్పటికైనా నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావా. తప్పేంటో తెలుసుకుని పశ్చాత్తపపడితే సరిపోదమ్మా. నాన్నను నువ్వే వెళ్లి తీసుకొని రావాలి. నాకు దేనితోనూ సంబంధం లేదు. నాన్న ఇంటికి తిరిగి తీసుకు రావాలి. నువ్వే ఆయనను తీసుకు రావాలి అంతే' అంటాడు. అప్పుడు అనసూయ.. తులసిని రిక్వెస్ట్ చేస్తుంది.

  Bigg Boss Winner: ఆరో సీజన్ విజేత ఆ కంటెస్టెంటే.. పేరు లీక్ చేసిన మెగాస్టార్.. నాగార్జున అసంతృప్తి

  వాళ్లను కూడా దూరం చేస్తావా

  వాళ్లను కూడా దూరం చేస్తావా


  అనసూయ మాటలకు తులసి 'అత్తయ్య చెప్పింది నిజం. అందరం కళ్లారా చూశాం. కావాలంటే అభిని కూడా పిలవడం. అభి చెప్పరా. మామయ్య కోపం మామూలుగా లేదు. ఏం చెప్పినా వినిపించుకోవడం లేదు. మొడిగా ఉన్నారు. తగిలిన గాయం అలాంటిది. ఆయనకు కొద్దిగా సమయం ఇస్తే అంతా చల్లారుతుంది. అప్పుడు మీరంతా వచ్చి ఆయనను తీసుకెళ్లొచ్చు' అంటుంది. దీనికి లాస్య 'కొద్దిగా టైం ఇస్తే మామయ్య మనసులో విషాన్ని నింపుతావా? ఇప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అందరినీ దూరం చేస్తావా' అని అంటుంది. అంతలో నందూ అరుస్తాడు.

  లాస్యకు ఓ రేంజ్‌లో ఇచ్చాడు

  లాస్యకు ఓ రేంజ్‌లో ఇచ్చాడు

  లాస్య మాట్లాడుతుండగా షటప్ అన్న నందూ.. 'అక్కడ పుట్టినరోజు సంబరాలు జరుగుతుంటే.. అమ్మకు కోపం వస్తుంటే నువ్వు పక్కనే ఉండి ఏం చేశావ్. అమ్మను కన్విన్స్ చేసి ఆపలేదు. నీ సంగతి నాకు బాగా తెలుసు లాస్య. గొడవలు ఆపడం.. అందరూ ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం ఉండదు. అందుకే ఆ గొడవకు ఆజ్యం పోసి ఉంటావ్. అప్పుడే కదా నీ కడుపు నిండేది. హాయిగా ఉండేది. నీ కంప్లైంట్స్ వినే ఓపిక, అమ్మ మాటలు, తులసి గారి వివరణలు వినే సహనం లేదు. నాకు మా నాన్న ఇంటికి రావడం కావాలి' అంటూ ఓ రేంజ్‌లో ఆమెకు ఇచ్చి పడేస్తాడు.

  బ్రా కూడా లేకుండా కరీనా రచ్చ: తల్లైనా తెగించేసిన హీరోయిన్

  ముఖంపై అలా.. తండ్రి రాక

  ముఖంపై అలా.. తండ్రి రాక


  ఆ తర్వాత నందూ తన తల్లిని, తులసిని బయటకు గెంటేసి తలుపు మూసే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో తులసి కూడా మూయనివ్వకుండా అడ్డుకుంటుంది. అప్పుడు ఎవ్వరు ఏం చెప్పినా ఇద్దరూ వినరు. అలా నందూ తలుపు తోస్తున్న సమయంలోనే పరందామయ్యను తీసుకుని సామ్రాట్ వస్తాడు. తండ్రిని చూసిన నందూ తలుపులు తీసేసి ఆయన దగ్గరకు వెళ్తాడు. అంతేకాదు, కాళ్లపై పడి ఏడుస్తుంటాడు. అలాగే, రండి లోపలికి వెళ్దాం అంటాడు. కానీ.. పరందామయ్య 'నన్ను క్షమించరా ఇదే నా హద్దు. ఇది దాటి లోపలికి రాలేను. నేను ఇక్కడి దాకా వచ్చింది లోపలికి తిరిగి రావడానికి కాదు. ఒక్క మాట చెప్పడానికి. ఈ ఇల్లు ఇప్పటి వరకు చాలా కోల్పోయింది. ఇక మిగిలినవి అయినా కాపాడుకో. జాగ్రత్తగా దాచుకో' అని చెబుతాడు.

  తులసే తప్పు చేసిందంటూ

  తులసే తప్పు చేసిందంటూ


  అనంతరం పరందామయ్య 'మీ ఇల్లు, మీ నాన్న, గౌరవం అన్నీ ముక్కలయిపోయాయి. చాలురా.. ఇంకేమీ ముక్కలు కాకుండా చూసుకో. నిజానికి ఇది పగిలిన ముక్కలను పోగు చేసుకునే సమయం. ముక్కలయిన బంధాన్ని ఒక్క దగ్గరికి చేర్చుకో. నేను ముక్కలయిన గౌరవాన్ని ఒక్కటయ్యేలా చేసుకుంటా' అంటాడు. దీనికి నందూ 'అమ్మ చేసిన తప్పుకు మా అందరినీ శిక్షించకండి. ఈ ఇల్లు మీది. మీరు లేని ఇల్లు.. ఇల్లే కాదు. ప్లీజ్ లోపలికి రండి నాన్న' అంటాడు. తర్వాత అంతా లాస్య వల్లే ఇదంతా జరిగింది అని పరందామయ్యను క్షమించమని అడుగుతుంది. దీంతో లాస్య 'తప్పు చేసింది మీరు. ఇప్పుడు నన్ను అంటున్నారా' అంటుంది. దీంతో తులసి నోరు అదుపులో పెట్టుకో లాస్య అంటుంది. అప్పుడు నందూ లాస్యను అరుస్తాడు.

  పబ్లిక్‌లోనే హీరోయిన్ శ్రీయ కొంటె పని: నా భర్తకు అలా చేస్తేనే ఇష్టమంటూ షాకింగ్‌గా!

  నందూకు షాక్ ఇచ్చిన లాస్య

  నందూకు షాక్ ఇచ్చిన లాస్య


  నందూ కోప్పడగానే లాస్య 'అందరి ముందు నా మీద అరవకు. వాళ్ల మీద అరవకుండా నా మీద అరుస్తున్నావా' అని అంటుంది. దీంతో నందూ 'నువ్వు ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యావు' అని అంటాడు. అలా ఇద్దరూ గొడవ పడుతుండగా తులసి, ప్రేమ్ ఆపే ప్రయత్నం చేస్తారు. దీంతో లాస్య ప్రేమ్ మీదకు వెళ్తుంది. అప్పుడు నందూ ఏం చేస్తావు అని లాస్యపై కొప్పడతాడు. దీంతో లాస్య మీరంతా మంచోళ్లు.. నేనే చెడ్డదాన్ని అంటుంది. అప్పుడు నందూ 'నీకు ఇష్టం లేని వాళ్ల దగ్గర ఉండటం ఎందుకు? పదా బట్టలు సర్దుకొని మనం వెళ్లిపోదాం' అంటాడు. దీంతో లాస్య లోపలికి వెళ్లి డాక్యూమెంట్స్ తీసుకుని వస్తుంది. అవి చూసి నందూ షాక్ అవుతాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 801: Anasuya and Nandhu Apologies to Parandhamaiah. Then They Ask Him to Return Home. After That Nandhu Fires on Lasya about This.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X