For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నందూకు ఘోర అవమానం.. ఒక్కటైన ఫ్యామిలీ.. తన తర్వాత తులసే అంటూ!

  |

  తరాలు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడిన అనసూయ.. పశ్చాత్తపపడుతూ ఉంటుంది. అంతేకాదు, ఆ సమయంలో తులసిని తన ఇంటికి వచ్చి పోతూ ఉండమని కోరుతుంది. దీనికి తులసి మాత్రం ఒప్పుకోదు. దీంతో చాలా సేపు బ్రతిమాలిన తర్వాత ఓకే అంటుంది. మరోవైపు, తనను బయటకు పంపడంపై లాస్య గుర్రుగా ఉంటుంది. ఆ తర్వాత తులసి బయటకు రాగానే ఆమెతో గొడవకు దిగుతుంది. అప్పుడు లాస్యకు తులసి ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. అనంతరం ఆమెకు కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇస్తుంది.

  Singer Revanth: తండ్రైన సింగర్ రేవంత్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత.. ఇద్దరూ ఎలా ఉన్నారంటే!

  లాస్యకు షాకిచ్చిన పరందామయ్య

  లాస్యకు షాకిచ్చిన పరందామయ్య


  ఉదయాన్నే నిద్ర లేచి రెడీ అయి వచ్చిన లాస్య అందరికీ గుడ్ మార్నింగ్ చెబుతుంది. అంతేకాదు, అందరితో మంచిగా కలిసిపోవాలని మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు అనసూయతో 'అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీకు ట్యాబ్లెట్లు తీసుకుని రానా? రాగి జావ తెచ్చి ఇవ్వనా? మీకు కీళ్ల నొప్పులు కదా.. కాళ్లు నొక్కుతాను' అంటూ మాట్లాడుతుంది. దీంతో పరందామయ్య 'అవసరం లేదమ్మా.. ఆల్రెడీ నేను ట్యాబ్లెట్లు తెచ్చి ఇచ్చాను. అంకిత జావ చేసుకుని వచ్చింది. శృతి కాళ్లు పట్టింది. మీ అత్తయ్య వద్దు అంటేనే నొక్కడం ఆపేసింది' అని చెప్పి షాకిస్తాడు.

  కావాలని పడేసిన పరందామయ్య

  కావాలని పడేసిన పరందామయ్య


  ఆ తర్వాత అక్కడే ఉన్న బత్తాయిని తీసుకుని పరందామయ్య కింద పడేస్తాడు. అది ఆయన తీసుకుంటూ ఉండగా నేను తీస్తాను అంటూ లాస్య తీసుకుంటుంది. అంతేకాదు, అతడికి ఇవ్వబోతుంది. అప్పుడు పరందామయ్య దాన్ని నేనే పడేశాను అంటాడు. దీంతో లాస్య అదంతా చూసి బానే ఉందిగా అంటే.. పరందామయ్య 'చెడేదో మంచేదే నీకు తెలిస్తే ఇకేం.. మెరిసేదంతా బంగారు కాదు. అందంగా ఉన్న వాళ్లంతా మంచోళ్లు కాదు. పండు పైకి నిగనిగలాడుతూ కనిపించినా లోపల మంచిగా ఉంటుందని కాదమ్మా' అంటూ ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతాడు.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో రకుల్ రచ్చ: మొత్తం తీసేసి చూపించిన వీడియో వైరల్

  తులసి ఫోన్.. కుళ్లుకున్న లాస్య

  తులసి ఫోన్.. కుళ్లుకున్న లాస్య


  లాస్యకు పరందామయ్య క్లాస్ పీకుతుండగానే అనసూయకు తులసి ఫోన్ చేస్తుంది. ఆమె తులసి ఫోన్ చేస్తుంది అనగానే అందరూ సంతోషిస్తారు. అప్పుడు అనసూయ కాల్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా తులసి.. పొద్దున నుంచి నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా అంటుంది. అప్పుడామె 'ఒంట్లో ఎలా ఉంది అత్తయ్యా? ఉదయాన్నే కాల్ చేద్దామని అనుకున్నా. కానీ, ఇంకా లేవరేమో అనుకుని ఆగాను' అంటుంది. దీంతో అనసూయ బాగానే ఉంది. కానీ కాస్త నీరసంగా ఉంది అంటుంది. పక్కనే ఉన్న పరందామయ్య మీ అత్తయ్యకు నీరసంగా ఉంటేనే మాకు బాగుంటుంది అంటాడు.

  తులసిని రమ్మని పిలిచిన అత్త

  తులసిని రమ్మని పిలిచిన అత్త


  ఆ తర్వాత తులసి ఫోన్‌లో మాట్లాడుతుండగానే లౌడ్ స్పీకర్ పెట్టుకుని అందరూ జోకులు వేసుకుంటారు. ఆ సమయంలో ఇంట్లో వాళ్లందరూ తులసితో మాట్లాడడానికి పోటీ పడతారు. ఆ సమయంలోనే అనసూయ.. 'ఏమ్మా తులసి.. ఒకసారి ఇంటికి రావొచ్చు కదా. నిన్ను చూడాలని అనిపిస్తుందమ్మా' అని అంటుంది. కానీ, ఆమె మాత్రం కొంచెం పని ఉందని చెబుతుంది. ఇదంతా చూసిన లాస్యకు ఒళ్లు మండుతూ ఉంటుంది. అంతేకాదు, ఆమెకు ఏం చేయాలో తోచదు. ఆ సమయంలో వీళ్లంతా కలిసి బాగానే సంతోషంగా ఉన్నారు అని మనసులో అనుకుంటుంది.

  HIT 2 Twitter Review: హిట్ 2 మూవీకి అలాంటి.. అదే పెద్ద మైనస్.. ఇంతకీ శేష్ హిట్ కొట్టాడా అంటే!

  హనీ చేతులతో జీతం ఇప్పించి

  హనీ చేతులతో జీతం ఇప్పించి


  అనంతరం తులసి.. సామ్రాట్ వాళ్ల ఇంటికి వెళ్తుంది. అప్పుడు హనీ ఆంటీ రాలేదేంటి అని అడుగుతుంది. దీంతో నీ ఎగ్జామ్స్ అని డిస్టర్బ్ చేయలేదు అంటాడు. అప్పుడే తులసి వస్తుంది. వచ్చీ రావడమే హనీ మీద బెంగ పెట్టుకున్నాను అంటుంది. తర్వాత సామ్రాట్‌తో ఏంటి రమ్మన్నారు ఏదైనా పని ఉందా అని అడుగుతుంది. దీనికతడు 'మన మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్నీ ఒడిదుడుకులే. మీరు కంపెనీలో చేరి కూడా ఒక నెల అయింది. ఇప్పటి వరకు మీకు జీతం కూడా ఇవ్వలేదు. నా జీవితంలో నా చెల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తానో.. మీకు కూడా అంతే ఇస్తాను. అందుకే మీ మొదటి జీతాన్ని అందరిలా బ్యాంకులో వేయకుండా హనీ చేతులతో ఇప్పిద్దామని మిమ్మల్ని రమ్మన్నాను' అంటాడు.

  సామ్రాట్‌తో తులసి ఛాలెంజ్

  సామ్రాట్‌తో తులసి ఛాలెంజ్

  హనీ చేతులతో మొదటి జీతం ఇప్పించిన తర్వాత సామ్రాట్ ఈ రోజు ప్లాన్స్ ఏంటి అని తులసిని అడుగుతాడు. దీనికామె 'జీతం వచ్చింది కదా ఇక ఖర్చులు, ప్లాన్స్ అన్నీ చూసుకోవాలి కదా' అంటుంది. దీంతో సామ్రాట్ ఎప్పుడూ ఇవేనా.. మీరు జనరల్ మేనేజర్ కదా అంటాడు. దీంతో ఒక గృహిణికి ఏఏ పనులు ఉంటాయన్నది తులసి వివరించి చెబుతుంది. అప్పుడు సామ్రాట్ ఒక్కరోజు సీఎంలా ఒక్క రోజు మీ గృహిణిలా ఉంటాను అంటాడు. దీంతో తులసి 'అలా అయితే.. ఈ ఒక్క రోజు మీరు సాధారణ వ్యక్తిలా ఉండండి. నేను ఇచ్చే డబ్బులతో అన్ని పనులు చేయండి చూద్దాం' అంటూ ఛాలెంజ్ చేస్తుంది. దీనికి సామ్రాట్ సరే అంటాడు.

  Bigg Boss Elimination: 13వ వారం డబుల్ ఎలిమినేషన్.. ఎలిమినేట్ అయ్యే ఇద్దరు ఎవరంటే!

  తండ్రికి బాసటగా అభి, ప్రేమ్

  తండ్రికి బాసటగా అభి, ప్రేమ్

  అనంతరం ఇంట్లోకి కావాల్సిన సామాన్ల లిస్టును అంకిత, శృతి రాసుకుని వస్తారు. నందూతో అంకిత 'నేను, శృతి కలిసి ఈ నెలకు కావాల్సిన సరుకుల లిస్టు తయారు చేశాం. ఇదివరకు ఇవన్నీ ఆంటీ చూసుకునేది. ఇప్పుడు మీకు ఇస్తున్నాం' అంటుంది. అంతలో అది లాస్య తీసుకుంటుంది. అప్పుడు నందూను ఆమె ఉద్యోగం లేదు, డబ్బులు లేవని అవమానిస్తూ ఉంటుంది. అప్పుడే అభి, ప్రేమ్ వచ్చి ఆ చీటీ తీసుకుని సరుకులు మేము తెస్తాం అంటారు. ఆ సమయంలో ప్రేమ్, లాస్య మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇక, వాళ్లు చేసిన పనికి అనసూయ, పరందామయ్య సంతోషిస్తారు. అంతేకాదు, వాళ్లిద్దరినీ తాతయ్య అభినందిస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 805: Tulasi Gives Samrat a fun Challenge After Receiving her First Salary. After That Prem and Abhi Stop Lasya From Humiliating Nandu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X