Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు షాకిచ్చిన కోడళ్లు.. సామ్రాట్‌కు క్లాస్ పీకిన తులసి

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఉదయాన్నే లేచి వచ్చిన లాస్య అందరినీ తన వైపు తిప్పుకోవాలని అనుకుంటుంది. ఇందుకోసం అత్తయ్య అది కావాలా? ఇది కావాలా? అంటూ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. దీంతో ఆమెకు పరందామయ్య ఓ రేంజ్‌లో క్లాస్ పీకి షాకిస్తాడు. మరోవైపు, తులసికి సామ్రాట్ ఫస్ట్ శాలరీని హనీ చేత్తో ఇప్పిస్తాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ సరదాగా ఓ ఛాలెంజ్ చేసుకుంటారు. ఇక, ఇంట్లో సరుకుల విషయంలో లాస్య, నందూను అవమానించేలా మాట్లాడుతుంది. దీంతో ప్రేమ్, అభి తండ్రికి బాసటగా నిలుస్తారు. దీంతో తాత వాళ్లను మెచ్చుకుంటాడు.

లోక జ్ఞానం ఉంటే చాలు అంటూ

లోక జ్ఞానం ఉంటే చాలు అంటూ

సామ్రాట్ మధ్య తరగతి గృహిణిగా మారతానని చెప్పిన తర్వాత అతడు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే ఇంత తక్కువ మొత్తాన్ని నెలకు సరిపోయే విధంగా ఎలా చేస్తారు అని అడుగుతాడు. దీంతో తులసి 'నాకు సంసారాన్ని మోసిన అనుభవం ఉంది అందుకే తెలుసు. మీకు ఆ అనుభవం లేదు కాబట్టి తెలీదు' అంటుంది. అప్పుడతను 'నేను ఫారెన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ చేశాను. చాలా కాలంగా కంపెనీని నడుపుతున్నాను' అంటాడు. అప్పుడు తులసి 'బరువు మోయడానికి బలం ఉండాలి. లెక్కలు రాయడానికి తెలివి ఉండాలి. అలాగే, కుటుంబ బాధ్యత మోయడానికి ఫారెన్ చదువు అవసరం లేదు. లోక జ్ఞానం ఉంటే చాలు' అంటుంది.

సామ్రాట్‌కు మధ్య తరగతి పాఠం

సామ్రాట్‌కు మధ్య తరగతి పాఠం


తులసి మాటలకు సామ్రాట్ 'కానీ, మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీకు వచ్చే జీతంతో ఖర్చులను పోల్చితే నెలకు ఐదారు వేల కంటే ఎక్కువ మిగలదు కదా. మరి అన్ని ఖర్చులకు ఎలా చేస్తారు' అని అడుగుతాడు. దీంతో ఆమె తన జీతాన్ని లెక్కలు వేసి నెలకు 20 వేలు మిగులుతాయి చూడండి అని ఇస్తుంది. ఆ లెక్కలు చూసిన సామ్రాట్ 'ఇందులో పనిమనిషి జీతం ఏది? ఎంటర్‌టైన్‌మెంట్ ఖర్చులు ఏవి? బట్టల ఖర్చులు ఏవి' అని అడుగుతాడు. దీంతో తులసి 'తప్పదు సామ్రాట్ గారు.. డబ్బులు ఆదా చేయాలంటే ఆడది మాత్రమే చేస్తుంది' అంటుంది.

అలా బతకడం ఇష్టం లేదంటూ

అలా బతకడం ఇష్టం లేదంటూ

తర్వాత తులసి 'ఖర్చులకు తగ్గట్టుగా మగాడు సంపాదించలేకపోవచ్చు. కానీ, ఆదాయానికి తగ్గట్టుగా ఆడది కుటుంబాన్ని మోయగలదు' అని చెబుతుంది. దీంతో సామ్రాట్ 'వావ్.. ఒప్పుకుంటాను తులసి గారు. అవును.. అలా ఆదా చేసిన డబ్బుతో ఏం చేస్తారు' అని ప్రశ్నిస్తాడు. దీంతో తులసి నా పిల్లల ఖర్చుల కోసం ఉపయోగిస్తా అంటుంది. దీనికతడు వాళ్లు తమ తండ్రి దగ్గరే ఉన్నారు కదా అంటాడు. అప్పుడు తులసి 'అవును కానీ ఆయనకు ప్రస్తుతం జాబ్ లేదు కదా. ఆయన్నే వద్దనుకొని వదిలేసినప్పుడు ఆయన ఇచ్చే భరణంతో బతకడంలో అర్థం లేదు. దేవుడు సంపాదించుకునే శక్తి ఇచ్చాడు. మార్గం కూడా చూపించాడు. ఇది నాకు చాలు' అంటుంది. తర్వాత తులసి షాపింగ్‌కు వెళ్లాలి అంటే నేను కూడా వస్తా అంటాడు.

వంట చేస్తానంటూ వచ్చిన లాస్య

వంట చేస్తానంటూ వచ్చిన లాస్య


శృతి, అంకిత ఇద్దరూ కలిసి కిచెన్‌లో వంట వండుతూ ఉంటారు. ఇంతలో లాస్య అక్కడకు వస్తుంది. ఆమె అలా అడుగు పెట్టగానే శృతి 'ఈ ఇంట్లో నువ్వు చూడని ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే' అంటుంది. దీంతో అంకిత తెలియక వచ్చి ఉంటుందేమో మీ బెడ్ రూమ్ పైన ఉంది అంటుంది. దీనికి లాస్య 'అంత వెటకారం వద్దు' అంటుంది. అప్పుడు అంకి అయినా వంటింట్లోకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. దీంతో లాస్య ఈ పూట అందరికీ నేనే వంట చేసి పెడతాను అంటుంది. దీంతో వాళ్లు సంతోషంగా చేసుకో. మాకేం అభ్యంతరం లేదంటారు.

ఎంటరైన భార్య.. ఆటపట్టించేలా

ఎంటరైన భార్య.. ఆటపట్టించేలా


వంట గదిలో అంకిత, శృతి కలిసి లాస్యను హేళన చేస్తుండగా భాగ్య అక్కడకు వస్తుంది. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి 'వంట అంటే మామూలు కాదు. ఈ ఇంట్లో మనిషికి ఒక వంట వండాలి. తాతయ్యకు అలా.. అమ్మమ్మకు ఇలా' అంటూ ఎవరికి ఎలా వండాలో చెబుతారు. దీంతో లాస్య 'ఇది ఇల్లా లేక రెస్టారెంటా? ఉన్న నలుగురికి 40 రకాల వంటలా నావల్ల కాదు. నాకు ఎలా ఇష్టమో అలా వండుతా. అందరూ అలా తినాల్సిందే' అంటుంది. అప్పుడు భాగ్య కావాలనే ఇంట్లో వాళ్లంతా చేరి లాస్యను ఆటపట్టిస్తున్నారు. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది అనుకుంటుంది.

తులసి అక్కకు ఓపిక ఎక్కువలే

తులసి అక్కకు ఓపిక ఎక్కువలే

శృతి, అంకిత చెప్పిన విషయాలు విన్న తర్వాత లాస్య షాక్‌కు గురవుతుంది. అంతేకాదు, 'ఇలా అయితే నాకు వంటింటితో సంబంధం లేదు. మీ పాట్లు మీరు పడండి' అని అంటుంది. ఇంతలో అక్కడికి వెళ్లిన భాగ్య.. 'తులసి అక్కకు ఓపిక ఎక్కువ. పాపం లాస్యకు అలాంటి ఆరాటం లేదు' అంటుంది. దీంతో లాస్య 'బాగా చెప్పావు భాగ్య. అయినా ఈ ఇంట్లో చేయడానికి బోలెడు పనులు ఉన్నాయి. వంటింటి పనులు మీరు చూసుకోండి. మిగితావి నేను చూసుకుంటాను' అని అక్కడి నుంచి జారుకుంటుంది. దీంతో శృతి, అంకిత నవ్వుకుంటూ ఉంటారు.

బస్సెక్కిన ఒక్కరోజు సామాన్యుడు

బస్సెక్కిన ఒక్కరోజు సామాన్యుడు


తులసి షాపింగ్‌కు బస్‌లో వెళ్తానని అనడంతో ఒక్కరోజు సామాన్యుడిలా మారిపోయిన సామ్రాట్ కూడా ఆమె వెంట వెళ్తాడు. అప్పుడతను ఈ రోజు ఎండ ఎక్కువగా ఉన్నట్టుంది అంటాడు. దీంతో తులసి 'మీరే ఈరోజు ఏసీ కారు వదిలి ఎండలోకి వచ్చారు. మధ్య తరగతి మనస్తత్వం ఒకటి ఉంటుంది. అది స్వతహాగా ఉండాలి' అంటుంది. తర్వాత బస్సు వస్తుంది. కానీ, సామ్రాట్ ఎక్కలేడు. దీంతో తులసి బస్సు మనకోసం ఆగదు మనమే ఎక్కాలి అంటుంది. ఆ తర్వాత పలుమార్లు ప్రయత్నించి విఫలం అవుతాడు. చివరకు బస్ ఎక్కుతాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X