For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: కోర్టు కేసుపై తులసి ఫోకస్.. సామ్రాట్‌కు సమస్య.. శృతికి అవమానం

  |

  క్రమంగా కొత్త కొత్త షోలు వస్తున్నప్పటికీ.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గొడవ పెట్టుకుంటుంటే ఆపిన తులసి.. ముందుగా లాస్యకు కొన్ని విలువైన సలహాలు ఇస్తుంది. ఆ తర్వాత నందూతో మాట్లాడి అతడి మనసును కూడా మార్చుతుంది. దీంతో నందూ వెళ్లి లాస్యకు సారీ చెప్పి తన ఇంట్లో వాళ్లతో కలిసి ఉండమని చెప్తాడు. కానీ, లాస్య మాత్రం ఈ ఇంట్లోని వాళ్లను రోడ్డు మీదకు ఈడుస్తానని మనసులో అనుకుంటుంది. మరోవైపు, తులసి తన కోరికలను గుర్తు చేసుకుని తల్లికి ఫోన్ చేసి ఇంటికి వస్తానని అంటుంది. మరోవైపు, తనకు ఫస్ట్ ర్యాంక్ కావాలని సామ్రాట్‌ను హానీ కోరుకుంటుంది.

  బ్రాలో అరాచకంగా ఆదా శర్మ: వామ్మో ఇంత దారుణంగా చూపిస్తే ఎలా!

  తులసి ఆంటీకి చెప్పావు కదా అని

  తులసి ఆంటీకి చెప్పావు కదా అని


  తనకు ఫస్ట్ ర్యాంక్ కచ్చితంగా కావాల్సిందే అని సామ్రాట్‌తో హనీ అంటుంది. దీంతో సామ్రాట్ ఆ చిన్నారికి ఎంతో సర్ధి చెబుతాడు. అప్పుడామె 'నాకు కావాల్సింది ఓదార్పు కాదు. ఫస్ట్ ర్యాంక్. రేపే ఎగ్జామ్. ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తానని చెప్పా. మరి నా ఫస్ట్ ర్యాంక్‌ను ఎవరు డిసైడ్ చేస్తారు' అని అంటుంది. దీంతో సామ్రాట్ ఆ దేవుడు డిసైడ్ చేస్తారు అంటాడు. దీంతో హనీ 'మనసు పెట్టి దేవుడిని అడిగితే ఏదైనా చేస్తాడు అని నువ్వు మొన్న తులసి ఆంటితో చెప్పావు కదా. అందుకే ఇప్పుడు నువ్వు నాకోసం దేవుడిని అడుగు' అంటూ సామ్రాట్‌ను విసిగిస్తుంది.

  ఫస్ట్ ర్యాంక్ వచ్చి తీరాల్సిందేనని

  ఫస్ట్ ర్యాంక్ వచ్చి తీరాల్సిందేనని

  ఆ తర్వాత కూడా హనీ 'నువ్వే అడగాలి. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చి తీరాలి. లేకపోతే నేను స్కూల్‌కు వెళ్లను. ఎగ్జామ్ రాయను. అంతేకాదు, నేను ఫస్ట్ ర్యాంకును సాధిస్తానని తాతయ్యతో కూడా పందెం కట్టాను. ఇప్పుడు రాకపోతే నేను ఓడిపోవాల్సి వస్తుంది' అంటుంది. దీంతో సామ్రాట్ చేసేదేం లేక 'సరే నేను నీకు ఫస్ట్ ర్యాంక్ తెప్పించమని ఆ దేవుడిని వేడుకుంటానులే.. నువ్వు ఆ బొమ్మలు తీసుకుని ఆడుకోపో' అంటాడు. అప్పుడు తను ఆడుకోడానికి వెళ్లిపోతుంది. తర్వాత సామ్రాట్ 'నేను ఎక్కడి నుంచి ఫస్ట్ ర్యాంక్ పట్టుకొస్తాను' అని మనసులో అనుకుంటాడు.

  Bigg Boss: అతడికి ముద్దు పెట్టిన వాసంతి.. సంచలనంగా మారిన వీడియో.. ప్రేమలో బిగ్ బాస్ కొత్త జంట!

  తల్లి ఒళ్లో పడుకుని తులసి బాధ

  తల్లి ఒళ్లో పడుకుని తులసి బాధ


  ఇక, ముందుగా చెప్పినట్లుగానే తులసి తన తల్లి సరస్వతి దగ్గరకు వెళ్తుంది. అంతేకాదు, జీడిపప్పు ఉప్మా చేసుకొని తీసుకెళ్లి ఆమెకు తినిపిస్తుంది. అప్పుడు సరస్వతి నువ్వు చేసిందేమీ బాగోలేదు అంటుంది. దీంతో తులసి ఏంటి.. ఉప్మా బాగోలేదా అని అడగడంతో నేను చెప్పేది ఉప్మా గురించి కాదు అంటుంది. దీనికి తులసి 'ఉప్మా గురించి అయితే ఏమైనా చేయగలను. కానీ, నా జీవితం గురించి నేను ఏం చేయలేను. ముందు నువ్వు సరిగ్గా కూర్చో. నీ ఒడిలో పడుకుంటా' అంటుంది. తర్వాత తన తల్లి ఒడిలో పడుకొని ప్రశాంతంగా మాట్లాడుతుంటుంది.

  ఎక్కడ వెతికినా దొరుకుతుందని

  ఎక్కడ వెతికినా దొరుకుతుందని

  తల్లి మాటలకు తులసి 'అమ్మ ఒడి చాలా ప్రశాంతతను ఇస్తుంది. ఆకాశంలో ఎగిరే పక్షి ఒంటరిగానే ఎగురుతుంది. అలా అని సంతోషంగా లేదా? సంతోషం ఎప్పుడూ మనల్ని వెతుక్కుంటూ రాదు. మనమే వెతుక్కుంటూ వెళ్లాలి. అప్పుడు ఎక్కడ వెతుక్కున్నా దొరుకుతుంది. అప్పుడు ఎప్పటికీ ఎవ్వరికీ దూరం అవ్వాలనిపించదు. కాలం దూరం చేయాలన్నా వాటికి మనం దూరం కాము' అంటుంది. దీంతో సరస్వతి 'నీకు పుట్టిన ఊరు మీద, పుట్టింటి మీద ఉన్న ఆపేక్ష నాకు తెలుసు. నువ్వు పుట్టిన ఇల్లు కోర్టు లిటిగేషన్‌లో ఇరుక్కుపోతుంది. కేసులో ఆ ఇంటిని గెలిచి నీకు పుట్టింటి ఆస్తిగా దాన్ని ఇవ్వాలని నా ఆశ' అంటుంది.

  ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

  ఆ ఇంటికే వెళ్లిపోదామన్న తులసి

  ఆ ఇంటికే వెళ్లిపోదామన్న తులసి


  సరస్వతి చెప్పిన మాటలకు తులసి 'ఆ ఇల్లు మన సొంతం అయ్యాక మనం అక్కడికే వెళ్దాం. నువ్వు దాని గురించి ఆలోచించకు' అంటుంది. దీనికామె నేను ఉండగా ఆ ఇల్లు మన సొంతం కాదు అంటుంది. దీంతో సరస్వతి అది సరే.. ఆఫీసు లేదా అని అంటుంది. దీంతో తులసి 'అమ్మ దగ్గర ఉన్నాను. ఇక్కడికి వచ్చి పికప్ చేసుకో అని సామ్రాట్ గారికి చెప్పాను' అంటుంది. ఇంతలో సామ్రాట్ అక్కడకు వస్తాడు. 'ఇక లేవాల్సిందే. ఈ పెద్దమనిషి బయట అందరికీ సూక్తులు చెబుతుంటారు. కానీ ఇంట్లో చూస్తే ఎప్పుడూ అమ్మ ఒడిలోనే ఉంటారు' అంటాడు.

  హనీ గురించి సలహా ఇచ్చిందిగా

  హనీ గురించి సలహా ఇచ్చిందిగా


  తర్వాత సామ్రాట్, తులసి కారులో ఆఫీసుకు వెళ్తుంటారు. ఆ సమయంలో తులసి మాట్లాడుతుండగా సామ్రాట్ మాత్రం సైలెంట్‌గా ఉంటాడు. ఆ తర్వాత తులసి ఏవేవో అడగ్గా అతడు మాత్రం పరధ్యానంగా సమాధానాలు చెబుతాడు. దీంతో కారును పక్కకు ఆపమని అంటుంది. ఆ వెంటనే పరద్యానంగా ఎందుకు ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. దీంతో హనీ కోరిక గురించి ఆమెకు చెబుతాడు. 'హనీ నన్ను ఇరికించింది. ఎగ్జామ్స్ ఎంత బాగా రాసినా ఎప్పుడూ సెకండ్ ర్యాంకే వస్తుంది. ఈసారి ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ రావాలని ముడుచుకొని కూర్చొంది. ఇప్పుడు నేను చేసిన పొరపాటుకే నేనే గిలగిలా కొట్టుకుంటున్నాను' అంటాడు. దీంతో తులసి 'మీరు అబద్ధం చెబితే హనీ మిమ్మల్ని నమ్మదు. అందుకే దేవుడిని నమ్ముకోండి' అని సలహా ఇస్తుంది.

  పాయల్ బాత్రూం పిక్స్ వైరల్: అది కూడా లేకుంటే అంతే సంగతులు!

  శృతిని అవమానించిన లాస్య

  శృతిని అవమానించిన లాస్య


  ప్రేమ్ కోసం శృతి కిచెన్‌లో వంట వండుతూ ఉంటుంది. ఇది చూసిన లాస్య ఆమెపై చిరాకు పడుతుంది. అంతేకాదు, 'వంట ఇప్పటికే అయిపోయింది కదా.. మళ్లీ మీ ఆయనకు కావాల్సింది వండిపెట్టాలా? ఇలా ఎవరికి పడితే వాళ్లకు సపరేట్‌గా వండుకుంటే ఎలా? ఏం కావాలన్నా.. ఏం చేయాలన్నా ముందు నా పర్మిషన్ తీసుకోవాలి. ఇది నా ఇల్లు' అంటూ అవమానిస్తుంది. దీంతో శృతి 'తులసి ఆంటి ఎవ్వరికీ ఇలా చెప్పలేదు. మీరు ఎందుకు ఇలా చెబుతున్నారు' అని అంటుంది. దీంతో నేను తులసిని కాదు లాస్యను అంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 811: Tulasi Gives a Suggestion to Samrat When he Tells her about Honey Request. Then Shruthi Upset as Lasya Humiliates her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X