For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు నందూ సారీ.. అంతలోనే మరో మోసం.. ఆ ఇంటికి వెళ్తున్న తులసి

  |

  తరాలు మారుతూ ఉన్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిని వస్తువులు ఎందుకు తెచ్చావని అభి ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె అతడికి క్లాస్ పీకుతుంది. అప్పుడే లాస్యతో నందూ గొడవ పడుతూ ఉంటాడు. అలా ఇద్దరూ చాలా సేపు వాగ్వాదానికి దిగుతారు. ఎంత చెప్పినా వినకపోయే సరికి లాస్య తన తలపై కొట్టుకుంటుంది. అప్పుడు పరందామయ్యతో పాటు ఇంట్లో వాళ్లంతా ఆపుతారు. అనంతరం తులసి.. లాస్యతో మాట్లాడి కొన్ని సలహాలు సూచనలు ఇస్తుంది. అలాగే, నందూతో కూడా మాట్లాడుతుంది. ఆ సమయంలో లాస్యపై అతడి కోపాన్ని తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.

  గుర్తుందా శీతాకాలం ట్విట్టర్ రివ్యూ: తమన్నాతో సత్యదేవ్ రొమాన్స్.. సినిమా టాక్ అలా.. ఇంతకీ హిట్టేనా!

  అందుకే ముఖం చూస్తున్నా అని

  అందుకే ముఖం చూస్తున్నా అని


  లాస్యతో గొడవ పడుతున్న నందూను కూల్ చేసేందుకు తులసి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో 'మీరు కోపంలో, ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతంగా నిర్ణయం తీసుకోండి' అంటుంది. దీనికతడు 'ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేం తులసి' అంటాడు. అప్పుడు తులసి 'ఈ గొడవ పిల్లల మీద పడుతుంది. అర్థం అయ్యేలా చెప్పాలి. కనీసం మానవత్వం అయినా చూపించండి. లాస్య నా పట్ల లెక్కలేనని తప్పులు చేసింది. అయినా నేను క్షమించేశాను. అందుకే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఆమె ముఖం చూడగలుగుతున్నాను. ఈ ఇంటికి రాగలుగుతున్నాను' అని చెబుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోబోతుంది.

  నందూ మనసు మార్చిన తులసి

  నందూ మనసు మార్చిన తులసి


  తులసి వెళ్తుండగా నందూ ఆపుతాడు. అప్పుడతను 'బాధగా ఉంది తులసి. తప్పయింది.. ఇంకోసారి ఇంటికి వస్తే నువ్వు పిల్లలతో సంతోషంగా గడపడానికి మాత్రమే వస్తావు. నేను మాటిస్తున్నాను' అంటాడు. దీంతో తులసి 'అది ఇప్పటి కోరిక కాదు. పాతికేళ్ల నాటి కోరిక. నా కోరికను నెరవేర్చుకోవడం కోసం అప్పటి నుంచి కిందా మీదా పడుతున్నాను. నిజంగా నా కోరిక నెరవేరితే నాకన్నా ఎక్కువగా సంతోషించేవారు ఉండరు. అత్తయ్య మామయ్యను జాగ్రత్తగా చూసుకోండి' అని వెళ్తుంది. దీంతో నందూ నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త అని ఆమెతో అంటాడు.

  లాస్యకు సారీ చెప్పేసిన నందూ

  లాస్యకు సారీ చెప్పేసిన నందూ


  తులసి తనకు చెప్పిన మాటల గురించి లాస్య ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు నందూను ఎలా మార్చుకోవాలా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో నందూ అక్కడకు వస్తాడు. వచ్చీ రావడమే గొడవ జరిగినప్పుడు లాస్య కింద పడేసిన అన్ని వస్తువులను తీసి రూమ్‌లో ఎక్కడివి అక్కడ సర్ధుతూ ఉంటాడు. అప్పుడే లాస్య కూడా అక్కడకు వచ్చి సామాన్లను సర్ధుతూ ఉంటుంది. ఆ సమయంలోనే నందూ 'సారీ లాస్య. ఆవేశంలో నిన్ను చాలా అనకూడని మాటలను అనేశాను. నిన్ను చాలా హర్ట్ చేశాను. నన్ను క్షమించు. ఇంకెప్పుడూ ఇలా చేయను' అని చెప్తాడు.


  బ్రాలో అరాచకంగా ఆదా శర్మ: వామ్మో ఇంత దారుణంగా చూపిస్తే ఎలా!

  లాస్య మరో ప్లాన్.. మోసం చేస్తూ

  లాస్య మరో ప్లాన్.. మోసం చేస్తూ


  నందూ తనకు సారీ చెప్పడంతో లాస్య 'తప్పు నీది కాదు.. నాదే నందూ. నేను మారుతానని నువ్వు నమ్ముతున్నావు కదా. నేను నీ దగ్గరికి రావచ్చు కదా. సారీ నందూ నేను కూడా కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అయ్యాను' అని అంటుంది. అప్పుడు నందూ 'ఈ ఇంటి కోడలుగా నువ్వు ఇన్నాళ్లు చేయలేని పని ఇప్పుడు చేయాలి. ఇంటి వాళ్లతో కలిసిపోవాలి. నాకు కావాల్సింది ఇంట్లో ప్రశాంతత. ఇంట్లో వాళ్లు సంతోషంగా ఉండటం. తులసి చేసింది అదే' అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో లాస్య 'నిన్ను దారిలోకి తెచ్చుకోవడం కోసమే నేను తగ్గాను. కానీ, అలాంటి పనులు చేయడం కోసం కాదు. ఈ ఇంటిని ఆయుధంగా మార్చుకొని నీ ఫ్యామిలీని రోడ్డు మీదికి లాగుతాను' అని అనుకుంటుంది.

  పాయల్ బాత్రూం పిక్స్ వైరల్: అది కూడా లేకుంటే అంతే సంగతులు!

  కోరికల చిట్టాను విప్పిన తులసి

  కోరికల చిట్టాను విప్పిన తులసి


  ఇంటికి చేరుకున్న తులసి నా బతుకు నేను బతుకుతాను అని అనుకుంటుంది. ఆ తర్వాత పుస్తకాలు తీస్తుండగా తన తీరని కోరికలు రాసుకున్న ఓ బుక్ కనిపిస్తుంది. వెంటనే ఆ పుస్తకాన్ని పట్టుకొని తీరని ఆశలు బాధలను ఇస్తాయి అని అనుకుంటుంది. అప్పుడామె 'తీరని ఆశలు ఎన్నో.. తీరుతాయో లేదో తెలియకపోయినా ఆశతో నా ఆశలన్నింటినీ ఒక దగ్గర రాసుకుంటున్నాను' అని అనుకుంటుంది. అందులో 'ఇష్టపడిన వాడితో జీవితం పంచుకోవాలి. ఈ కోరిక తీరిందో తీరలేదో నాకే అయోమయంగా ఉంది. ఏదీ నా ఇష్ట ప్రకారం జరగలేదు' అని మాట్లాడుతుంది.

  సామ్రాట్ వల్ల కోరిక తీరిందని

  సామ్రాట్ వల్ల కోరిక తీరిందని


  ఆ తర్వాత తులసి 'గాల్లో విమానంలో రెక్కలొచ్చిన పక్షిలా సంతోషంగా ఎగరాలి అనే కోరిక మాత్రం సామ్రాట్ గారి పుణ్యం వల్ల తీరింది. సముద్రపు ఒడ్డున నిలబడి నీళ్లు నా పాదాలను తాకుతుంటే ఒళ్లు పులకరించిపోవాలి.. ఈ ఆశ కూడా సామ్రాట్ గారి వల్లే తీరింది. నా జీవితాంతం అత్త మామలకు సేవ చేసుకోవాలి.. నా కాళ్ల మీద నేను నిలబడాలి అనే కోరిక కూడా సామ్రాట్ పుణ్యమా అని నెరవేరింది. ఆశలకి అంతే ఉండదు. హద్దు కూడా ఉండదు. నా వరకు ఇంకా తీరని ఆశలు చాలా ఉన్నాయి. అవేవీ గొంతెమ్మ కోరికలు కావు. చిన్నిచిన్ని ఆశలు రాసిపెట్టుకుంటాను. అవి తీరకపోతాయా' అని మళ్లీ కొన్ని కోరికలు రాస్తుంది.

  తల్లి దగ్గరకు వస్తానన్న తులసి

  తల్లి దగ్గరకు వస్తానన్న తులసి


  తన కోరికలు రాసుకుంటూ ఉండగా తులసికి తన తల్లి గుర్తొస్తుంది. వెంటనే ఆమెకు ఫోన్ చేస్తుంది. దీంతో ఆమె చెప్పు తల్లి.. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దీనికి తులసి 'జీవితం గురించి ఆలోచిస్తున్నా. ఆలస్యం అయిందేమో కానీ.. జీవితం మాత్రం ముగిసిపోలేదు కదా' అంటుంది. అప్పుడు వాళ్ల అమ్మ 'నా వయసులో నేను మాట్లాడాల్సిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. నీ మాటల్లో నిరాశ కనిపిస్తోంది. నీకు జన్మనిచ్చాను కానీ, మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను' అంటుంది. అప్పుడు తులసి 'రేపు ఉదయం నేనే మీ ఇంటికి వస్తా. మా అమ్మకు ఇష్టమైన టిఫిన్ నేనే చేసుకొని తీసుకొస్తా. సరేనా' అని కాల్ కట్ చేస్తుంది.

  సామ్రాట్‌కు ఆ కోరిక కోరిన హనీ

  సామ్రాట్‌కు ఆ కోరిక కోరిన హనీ


  హనీ కోసం సామ్రాట్ షాపింగ్ చేసి వస్తాడు. దీంతో హనీకి ఏమైంది ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్లింది అని అనుకుంటాడు. అంతలో ఆ చిన్నారి ఏదో ఆలోచించుకుంటూ ఒకచోట కూర్చొంటుంది. అప్పుడు సామ్రాట్ ఏమైంది డల్‌గా కూర్చున్నావు అని అడుగుతాడు. దీంతో మనసు బాగో లేదు. నిన్ను ఒకటి అడుగుతా.. మాట మీద ఉంటావా? వెనక్కి తగ్గవు కదా. ప్రామీస్.. ఎగ్జామ్‌లో నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి' అని అడుగుతుంది. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. అంతేకాదు, 'అది నేను ఎలా తీసుకొస్తాను. నువ్వు కదా తెచ్చుకోవాల్సింది' అంటాడు. దీనికి తను 'నేను చాలా సార్లు మంచిగానే రాస్తున్నా కానీ.. ఇప్పటి వరకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 811: Nandhu Recalls Tulasi Words and Apologises to Lasya. After That Tulasi Gets Emotional and Shares her Sorrows with Mother.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X