Intinti Gruhalakshmi Today Episode: తులసి కోరిక చూసి షాకైన సామ్రాట్.. ప్రేమ్‌కు నిజం చెప్పిన శృతి

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కొత్త కొత్త ప్రోగ్రామ్‌లు ప్రసారం అవుతోన్నా.. సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తనకు ఎగ్జామ్స్‌లో ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ కావాల్సిందే అని హనీ.. సామ్రాట్‌ దగ్గర పట్టు పడుతుంది. దీనికతడికి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు హనీ.. దేవుడిని మనసు పెట్టి అడిగితే ఏదైనా ఇస్తాడని తులసి ఆంటీకి చెప్పావుగా అలా అడుగు అంటుంది. తర్వాత తులసి తన తల్లి దగ్గరకు వెళ్లి కష్ట సుఖాలు మాట్లాడుకుంటుంది. అనంతరం సామ్రాట్‌ను కలవగా హనీ కోరిక గురించి ఆమెకు చెబుతాడు. దీంతో దేవుడిని నమ్మి కోరిక కోరుకోమని సామ్రాట్‌కు తులసి సూచిస్తుంది. ఇక, ఇంట్లో శృతిని లాస్య తన మాటలతో అవమానిస్తుంది.

అసలు ఎవరు చెప్పారు అంటూ

అసలు ఎవరు చెప్పారు అంటూ


కారులో గుడికి వెళ్లోన్న సమయంలో తులసి 'అవును.. మీకు ఈ గుడి గురించి ఎవరు చెప్పారు' అని సామ్రాట్‌ను ప్రశ్నిస్తుంది. దీంతో అతడు 'ఆఫీసులో కొందరు చెప్పారు. ఇక్కడ అమ్మవారిని కోరుకొని ముడుపులు కడితే తప్పకుండా తీరుతుందట' అని అంటాడు. దీనికి తులసి 'మన వాళ్ల దగ్గర ఒకటి ఉంది. మనం సమస్యల్లో ఉన్నాము అని తెలిస్తే చాలు. ఆ గుడికి వెళ్లండి.. ఈ గుడికి వెళ్లండి.. ఆ దేవుడు బాగా పవర్‌ఫుల్.. ఈ దేవుడు బాగా పవర్‌ఫుల్ అంటారు. ముడుపులు కట్టండి.. కోరికలు కోరుకోండి అని చెప్తారు' అని అంటుంది. దీంతో సామ్రాట్ నవ్వుకుంటాడు.

ముడుపు కట్టమన్న పంతులు

ముడుపు కట్టమన్న పంతులు


అలా మాట్లాడుకుంటూ గుడి దగ్గరకు చేరుకుంటారు. అనంతరం ఇద్దరూ కలిసి గుడి లోపలికి వెళ్తారు. అప్పుడు దేవుడికి పూజ చేసి హారతి తీసుకుంటారు. ఆ తర్వాత సామ్రాట్‌కు కుంకుమ బొట్టును పెడుతుంది. ఇంతలో పూజారి బయటకు వచ్చి 'ఈ అమ్మవారు చాలా శక్తివంతురాలు. కాబట్టి మీ మనసులో ఏదైనా తీరని కోరిక ఉంటే ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ముడుపును కట్టండి. ఆ పక్కన చెట్టు ఉంది. కాగితం కావాలంటే ఇక్కడుంది' అని చెబుతాడు. దీంతో పేపర్, పెన్ను తీసుకొని వాళ్లిద్దరూ చెట్టు దగ్గరికి వస్తారు. ఇక, అక్కడున్న వాళ్లను చూసి షాక్ అవుతారు.

సామ్రాట్‌తో పాటు తులసి రాసి

సామ్రాట్‌తో పాటు తులసి రాసి


పూజారి చెప్పిన దాని ప్రకారం.. సామ్రాట్ తన మనసులోని కోరికను పేపర్ మీద రాసి వెళ్లి చెట్టుకు కడతాడు. ఇంతలో తులసికి కూడా ఒక ఆలోచన వస్తుంది. ఆ వెంటనే అక్కడికి వెళ్లి పెన్ను, పేపర్ తీసుకొని తను కూడా ముడుపు రాయాలనుకుంటుంది. ఇందులో భాగంగానే పేపర్ మీద ఏదో రాసి దాన్ని ముడుపుగా చేసి చెట్టుకు కడుతుంది. అప్పుడు సామ్రాట్ ఆమె ఏం రాసిందా అని అనుకుంటాడు. వెంటనే ఆమె దగ్గరికి వస్తాడు. తులసి ముడుపు కడుతుండగా సామ్రాట్ కళ్లు ఆర్పకుండా ఆమెను చూస్తుంటాడు. దీంతో తులసి ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది.

కోరిక చెప్పమని.. తులసి అలా

కోరిక చెప్పమని.. తులసి అలా

తులసి తనను ఎందుకు చూస్తున్నారు అని అడగడంతో సామ్రాట్ 'మీ ముఖంలో నవ్వు వెలిగిపోతోంది. మీరూ ముడుపు కడుతున్నారా' అని అడుగుతాడు. దీంతో అవును కడుతున్నా అంటుంది. ఆ తర్వాత అతడు ఆ ముడుపులో ఏం రాసి ఉందో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. దీంతో తులసి 'దేవుడిని కోరుకునే మొక్కులు పైకి చెప్పకూడదు అని మా అమ్మమ్మ చెప్పింది' అంటుంది. దీనికతడు 'నేను మీ ఫ్రెండ్‌ను కదా. నాకు అది చెప్పొచ్చు' అని అంటాడు. కానీ, తులసి మాత్రం అతడికి క్లాస్ పీకడంతో పాటు కోరిక గురించి మాత్రం చెప్పదు.

తులసి కోరిక తెలుసుకోవాలని

తులసి కోరిక తెలుసుకోవాలని


గుడిలో ముడుపు కట్టి ఇద్దరూ వచ్చి కారులో కూర్చొంటారు. కానీ, సామ్రాట్‌కు మాత్రం తులసి ఆ ముడుపులో ఏం కట్టిందో తెలుసుకోవాలని అనుకుంటాడు. దీంతో ఆమెకు అబద్దం చెప్పి గుడిలోకి వెళ్తాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్లి తులసి ఆ ముడుపులో ఏం రాసిందో చూద్దామని ఓపెన్ చేస్తాడు. అంతలో అక్కడకు పూజారి వచ్చి చూస్తాడు. అంతేకాదు, 'కట్టిన ముడుపు విప్పకూడదు. అలా విప్పితే ముడుపు కట్టినా ప్రయోజనం ఉండదు. నీ కంగారు చూస్తుంటే నువ్వు విప్పిన ముడుపు నీది కాదని తెలుస్తోంది అవునా' అని అడుగుతాడు. దీంతో సామ్రాట్ అవును అంటాడు.

ఆమె కోరిక తీర్చమన్న పూజారి

ఆమె కోరిక తీర్చమన్న పూజారి


సామ్రాట్ నిజం చెప్పడంతో పంతులు అది మీ వాళ్లదేనా అని అడుగుతాడు. అప్పుడు సామ్రాట్ అవును.. చెడు చేయడానికి తీయలేదు. మంచి చేయాలనే తీశాను అంటాడు. అప్పుడు పూజారి 'ఆ ముడుపును నువ్వు తీసి చదివావు కాబట్టి ఖచ్చితంగా ఆ ముడుపులో ఉన్న కోరికను నువ్వు నెరవేర్చాల్సిందే' అని చెప్తాడు. దీంతో సామ్రాట్ సరే అంటాడు. తర్వాత ఆ ముడుపును తీసి చూస్తాడు. అందులో 'నేను పుట్టిన ఊరికి వెళ్లాలి. నా ఇంట్లో తిరుగుతూ చిన్నప్పటి గుర్తులను నెమరు వేసుకోవాలి. చిన్ననాటి నేస్తాన్ని కలవాలి' అని ఉంటుంది. దీంతో సామ్రాట్ 'తులసి గారు ఇంత చిన్న కోరిక కోరారేంటి? తులసి గారు పుట్టిన ఊరు ఏంటో తెలుసుకోవడం పెద్ద విషయం ఏం కాదు' అని అనుకుంటాడు. తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తారు.

లాస్య గురించి చెప్పిన శృతి

లాస్య గురించి చెప్పిన శృతి


శృతి దీనంగా తన రూమ్ లో కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన ప్రేమ్ ఆమెను చూసి ఏమైందని ప్రశ్నిస్తాడు. అప్పుడు శృతి 'ఏం లేదు. నా మీద నాకే కోపంగా ఉంది. కట్టుకున్న వాడు అడిగిన చిన్న కోరికను కూడా నేను నెరవేర్చలేకపోయాను. అడగక అడగక ఫ్రైడ్ రైస్ చేయమని అడిగావు. ఇంతలో ఆ లాస్య ఆంటి అడ్డుపడింది' అని జరిగిన విషయం చెబుతుంది. దీంతో ప్రేమ్ ఆమెతో గొడవ పడేందుకు వెళ్లబోతాడు. అప్పుడు శృతి అతడిని ఆపుతుంది. దీంతో కూలైన ప్రేమ్ ఆన్‌లైన్‌లో ప్రైడ్‌ రైస్ ఆర్డర్ చేస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X