For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి సామ్రాట్ సర్‌ప్రైజ్.. లాస్య వంకర బుద్ధి.. మామిడి తోటలో!

  |

  గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా డిఫరెంట్ షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిని ఏ కోరిక కోరుకున్నారో చెప్పమని సామ్రాట్ పదే పదే అడుగుతాడు. కానీ, ఆమె మాత్రం అస్సలు చెప్పదు. అనంతరం ఇంటికి వెళ్లిన సామ్రాట్‌కు హనీ తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్న గుడ్ న్యూస్ చెబుతుంది. దీంతో ఈ విషయాన్ని అతడు తులసికి చెప్తాడు. ఆ తర్వాత ఉదయాన్నే ఓ ఊరు వెళ్దామని ఆమెతో అంటాడు. మరోవైపు, ప్రేమ్‌కు ఫుడ్ ఆర్డర్ రావడంతో లాస్య.. నందూకు అబద్దాలు చెబుతుంది. దీంతో శృతికి నందూ క్లాస్ పీకుతాడు. తర్వాత పరందామయ్య తినే వంటకాన్ని లాస్య లాక్కుని తినేసి ఇబ్బంది పెడుతుంది.

  హీరోయిన్ శ్రీయ అందాల ఊచకోత: బట్టలున్నా లేనట్లే యమ ఘోరంగా!

  తులసిని సొంతూరికి తీసుకెళ్లి

  తులసిని సొంతూరికి తీసుకెళ్లి


  ముందుగా అనుకున్నట్లుగానే ఉదయం కాగానే తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి కారులో వెళ్తుంటారు. తులసి కోరిక తీర్చడం కోసం సామ్రాట్ ఆమె సొంతూరుకు తీసుకెళ్తుంటాడు. అప్పుడు వాళ్ల ఊరు దగ్గరికి వస్తుంది. కానీ, తులసి మాత్రం ఆ ఊరును గుర్తుపట్టదు. దీంతో సామ్రాట్ కావాలనే కారును స్లోగా డ్రైవ్ చేస్తుంటాడు. అంతేకాదు, ఎలాగైనా తులసి తన ఊరిని గుర్తుపట్టేలా చేయాలి అని అనుకుంటాడు. కానీ, ఆమె మొత్తం చూస్తుంటుంది కానీ, ఊరును మాత్రం అస్సలు గుర్తు పట్టదు. అప్పుడు రామచంద్రాపురం అనే బోర్డు కనిపిస్తుంది. దీంతో వెంటనే కారును ఆపుతాడు.

  పేరు చూసి తులసి సంతోషం

  పేరు చూసి తులసి సంతోషం

  కావాలనే కారును ఆపిన సామ్రాట్.. రిపేర్ వచ్చిందని తులసికి అబద్ధం చెబుతాడు. దీంతో ఆమెక కారు దిగి చుట్టూ తిరుగుతూ పల్లెటూరి అందాలను ఆస్వాదిస్తూ ఉంటుంది. అలా ఎంజాయ్ చేస్తోన్న సమయంలోనే ఊరి పేరుతో ఉన్న బోర్డును చూస్తుంది. రామచంద్రాపురమా అంటూ షాక్ అవుతుంది. ఆ వెంటనే తనలో తాను ఎంతో సంతోషిస్తూ ఉప్పొంగిపోతుంటుంది. ఆమెను చూసిన సామ్రాట్ 'మనం సంతోష పడే కన్నా.. ఇంకొకరు సంతోషానికి కారణం కావడం చాలా ఆనందాన్నిస్తుంది' అని అనుకుంటాడు. తులసేమో నా ఊరు అంటూ బాగా హ్యాపీగా ఉంటుంది.

  Bigg Boss Winner: రేవంత్‌కు బిగ్ షాక్.. ఫినాలేలో ఊహించని ఎలిమినేషన్.. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్

  అందుకే గుర్తించేలేదంటూనే

  అందుకే గుర్తించేలేదంటూనే


  తన ఊరికి వచ్చిన ఆనందంలో సామ్రాట్‌కు తులసి ఏదో చెప్పాలని అనుకుంటుంది. అంతలో అతడే ఏమీ తెలియనట్లే ఏమైంది తులసి గారు? పట్టలేని సంతోషంతో ఉన్నారు ఎందుకు? అని అడుగుతాడు. దీంతో ఆమె అది అది అంటూ ఊరు బోర్డు చూపిస్తూ ఇది మా ఊరు అని చెప్తుంది. అప్పుడు సామ్రాట్ 'మీ ఊరు అయితే ఇంత ఆలస్యంగా గుర్తు పట్టారేంటి' అని ప్రశ్నిస్తాడు. దీనికామె 'ఎప్పుడో చిన్నప్పుడు మా ఊరిని చూశా. ఆ తర్వాత రాలేదు. చిన్నతనంలో ఇక్కడే నేను పెరిగానను. నా జీవితం నాది.. చాలా ఎంజాయ్ చేశాను' అని అన్నీ గుర్తు చేసుకుంటుంది.

  నన్ను కూడా భాగం చేయండి

  నన్ను కూడా భాగం చేయండి


  ఆ తర్వాత సామ్రాట్ వచ్చి తులసి గారు.. కారు రిపేర్ పూర్తయింది. ఇక మనం బయలుదేరుదామా అంటాడు. దీంతో తులసి వెళ్లాలా? తప్పదా అంటుంది. దీనికతడు అది మీ ఇష్టం అంటాడు. అప్పుడు తులసి 'నాకు ఈరోజు మొత్తం ఇక్కడే గడపాలని ఉంది' అని అంటుంది. దీంతో సామ్రాట్ 'ఈరోజు మీది. నేను నా కారు మీ సేవలోనే ఉంటాం. మీతోనే ఉంటాం. మీ ఆనందాన్ని చూస్తూ ఉంటాం. కాకపోతే ఒక కండిషన్. నన్ను కూడా మీ ఆనందంలో భాగం చేసుకోవాలి. నాకు కూడా మీ సంతోషాన్ని పంచి ఇవ్వాలి. అలా అయితేనే ఒప్పుకుంటాను' అని అంటాడు.

  మరోసారి హద్దు దాటిన కేతిక శర్మ: బెడ్‌పై ఆ బాడీ పార్టులు కనిపించేలా!

  పేషెంట్లకు షాకిచ్చిన లాస్య

  పేషెంట్లకు షాకిచ్చిన లాస్య


  లాస్య ఇంటికి ఎవరో వస్తారు. దీంతో ఆమె ఎవరు అని అడుగుతుంది. అప్పుడు వాళ్లు డాక్టరమ్మ (అంకిత) కోసం వచ్చాం అంటారు. దీంతో లాస్య 'మీ డాక్టరమ్మ ఇక్కడ క్లీనిక్ పెట్టలేదు. హాస్పిటల్‌కు వెళ్లండి' అంటుంది. దీంతో వాళ్లు 'బాగోలేనప్పుడు ఇంటికే వచ్చి చూపించుకుంటాం. డాక్టర్ గారిని పిలవండి' అంటారు. దీనికి లాస్య పిలుస్తాను కానీ.. 500 ఇవ్వండి అంటుంది. దీంతో వాళ్లు 'డబ్బులెందుకమ్మా. మా దగ్గర ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదమ్మా' అంటారు. దీనికామె 'డబ్బులు లేనప్పుడు జబ్బులు ఎందుకు తెచ్చుకున్నారు. ఇంకా ఇక్కడే నిలబడ్డారు ఎందుకు. వెళ్లండి' అంటుంది. అప్పుడు వాళ్లు డబ్బులు ఇవ్వగా లోపలికి వెళ్లి కూర్చోమని అంటుంది.

  అప్పటివి గుర్తు చేసుకుంటూ

  అప్పటివి గుర్తు చేసుకుంటూ

  సామ్రాట్ కారులో తులసి ఊరంతా తిరుగుతుంది. అలా వెళ్తూనే చుట్టూ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఊరిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్తుంది. అక్కడ తన చిన్నతనంలో దొంగతనంగా మామిడి కాయలు కోసుకున్న సంఘటనలను గుర్తు చేసుకుని సంతోషిస్తుంది. అంతలో అక్కడ కాపరిగా ఉన్న వీరయ్య కనిపిస్తాడు. అప్పుడాయనకు అవన్నీ గుర్తు చేయడంతో పాటు కొంత డబ్బును కూడా అందజేస్తుంది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 815: Tulasi Went to her Own Village with Samrat. Then She Feels Happy and Reminisces her Childhood Memories.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X