For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి సామ్రాట్ సర్‌ప్రైజ్.. నిజం చెప్పిన శృతి.. ఆమె రాకతో షాక్

  |

  సౌతిండియాలోని మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంట్లో దొరికిన పెట్టెలో పాత వస్తువులను చూసి తులసి సంతోషిస్తుంటుంది. అలాగే, అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటోంది. అలా ప్రతి విషయాన్ని సామ్రాట్‌కు వివరిస్తుంది. అప్పుడు వాక్‌మెన్ దొరకగా.. తన తల్లి పాట ఇందులో రికార్డు చేశానని చెబుతుంది. మరోవైపు, లాస్య తనను అవమానించడంతో అంకిత రగిలిపోతూ ఉంటుంది. ఆ సమయంలో అభితో గొడవకు దిగుతుంది. ఇక, లాస్య ఇంట్లోని ఫ్రిడ్జ్‌కు తాళం వేయడంతో పరందామయ్య టీ లేక ఇబ్బంది పడతాడు. చివర్లో తులసి తన చిన్ననాటి స్నేహితులను కలుస్తుంది.

  కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న అనుపమ: హాట్ షోకు మించిన ట్రీట్‌తో అరాచకం

  ఫ్రెండ్స్ మాటలకు తులసి బాధ

  ఫ్రెండ్స్ మాటలకు తులసి బాధ


  ఊరిలో తిరిగి.. ఫ్రెండ్స్‌ను కలిసిన తర్వాత తులసి, సామ్రాట్ కారులో ఇంటికి బయలుదేరుతారు. ఆ సమయంలో తులసి తన భర్త గురించి ఫ్రెండ్స్ అడిగిన విషయాన్ని గుర్తు చేసుకుని బాధ పడుతుంది. 'మా ఫ్రెండ్స్ ముందు నేను ఏం మాట్లాడలేకపోయా. అయినా విడాకులు తీసుకున్న ఆడది అంటే అందరూ తేడాగా చూస్తారు ఎందుకు? వాళ్లు మాత్రం మనుషులు కాదా? మగవారికి ఈ పరిస్థితి ఎందుకు ఎదురు కాదు? సారీ సామ్రాట్ గారు' అంటుంది. దీనికతడు 'పర్లేదండి. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. ఏమీ పట్టించుకోకుండా ఉండండి' అని చెప్తాడు.

  లాస్య గురించి చెప్పేసిన శృతి

  లాస్య గురించి చెప్పేసిన శృతి

  టీ చేసుకొస్తానని వెళ్లిన శృతి డికాషన్ మాత్రమే తీసుకొచ్చి పరందామయ్య, అనసూయకు ఇస్తుంది. దీంతో అనసూయ 'డికాషన్‌లో పాలు పోయడం మరిచిపోయావా' అని అడుగుతుంది. అప్పుడు శృతి 'కావాలనే డికాషన్ తీసుకొచ్చా. అలా తాగితేనే ఆరోగ్యానికి మంచిదట' అంటుంది. దీనికి పరందామయ్య 'వామ్మో.. ఆ డికాషన్ మేము తాగలేం' అంటాడు. దీంతో అనసూయ వెళ్లి పాలు పోసి తీసుకొస్తా అని అంటుంది. అప్పుడు శృతి 'వద్దు అమ్మమ్మ వెళ్లకండి.. పాలు ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి. దానికి తాళం వేసి ఉంది. ఆ తాళం లాస్య దగ్గర ఉంది. నేను వెళ్లి అడిగితే ఇవ్వలేదు' అని నిజం చెప్పేస్తుంది.

  Shrihan Remuneration: శ్రీహాన్ గెలిచింది 45 లక్షలు.. రెమ్యూనరేషన్‌ భారీగా.. ట్యాక్సులు పోను ఎంతంటే!

  నిజాన్ని దాచాలని చెప్పిన భర్త

  నిజాన్ని దాచాలని చెప్పిన భర్త


  లాస్య గురించి శృతి నిజం చెప్పగానే అనసూయకు ఓ రేంజ్‌లో కోపం వచ్చేస్తుంది. దీంతో ఆమె లాస్య గురించి ఈ విషయాన్ని నందూకు చెబుతాను అంటుంది. అప్పుడు పరందామయ్య 'వద్దు అనసూయ. పరిస్థితులన్నీ చక్కదిద్దడానికి నాకు కాస్త సమయం కావాలని వాడు అన్నాడు కదా. అందుకే మనం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. అప్పటి వరకూ తను ఏం చేసినా మనం సర్ధుకుపోదాం' అంటాడు. దీంతో అనసూయ 'అలా అయితే తులసి దగ్గరికి వెళ్లిపోదాం' అంటుంది. దీనికి వద్దని అంటాడు పరందామయ్య. ఆ తర్వాత ఇద్దరూ డికాషన్‌ను తాగేస్తారు.

  తులసికి మరో సర్‌ప్రైజ్ అంటూ

  తులసికి మరో సర్‌ప్రైజ్ అంటూ


  తులసి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అప్పుడామె 'కారు దిగాలని లేదు సామ్రాట్ గారు. దిగితే నా మనసులో నింపుకొచ్చిన అందమైన మెమోరీస్ చెల్లాచెదురు అవుతాయేమో అని భయంగా ఉంది. వాటిని దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను' అంటుంది. దీంతో సామ్రాట్ 'ఆ ఇల్లే మీకు సొంతం చేయాలని అనుకుంటున్నా తులసి గారు' అని మనసులో అనుకుంటాడు. తర్వాత తులసి 'మీరు చేసిన ఈ మేలును నేను మరిచిపోలేను సామ్రాట్ గారు' అంటుంది. దీంతో అతడు మీరు ముడుపు కట్టారు కదా అందుకే మంచి జరిగింది అంటాడు. దీనికి తులసి కూడా అవును అంటుంది. ఆ తర్వాత సామ్రాట్ 'మీరు ఇంటికి వెళ్లాక 5 నిమిషాల్లో మీకు ఒక సర్‌ప్రైజ్ ఉంది' అంటాడు. అదేంటి అని ఆమె అడిగినా సామ్రాట్ చెప్పకుండా దాచేస్తాడు.

  బాత్రూంలో జాతి రత్నాలు చిట్టి హాట్ షో: అదొక్కటే చుట్టుకుని టెంప్ట్ చేస్తోందిగా!

  నిజాన్ని దాచిన పరందామయ్య

  నిజాన్ని దాచిన పరందామయ్య

  ఇక, ఇంటికి వెళ్లిన తర్వాత తన ఊరిలో తిరిగిన అన్ని విషయాలను తులసి గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఆమె పరందామయ్యకు ఫోన్ చేస్తుంది. అప్పుడు అనసూయ కాల్ లిఫ్ట్ చేయగా 'హలో అత్తయ్య నేను తులసిని. ఏం చేస్తున్నారు' అని అడుగుతుంది. దీంతో ఆమె 'నేను, మీ మామయ్య కలిసి సంతాప సభ పెట్టుకున్నాం' అంటుంది. దీంతో తులసికి నిజం చెప్పేస్తుందేమో అన్న భయంతో పరందామయ్య ఆ ఫోన్‌ను లాక్కుంటాడు. అంతేకాదు, 'ఏం లేదమ్మా.. ఇద్దరం ఊరికే ఇక్కడ కూర్చొన్నాం. అదే మీ అత్త నీకు చెబుతుంది' అని అంటాడు.

  అంతా మంచిగానే ఉందంటూ

  అంతా మంచిగానే ఉందంటూ


  అనంతరం పరందామయ్యతో తులసి 'ఈరోజు నేను మా పుట్టిన ఊరికి వెళ్లాను. సామ్రాట్ గారు తీసుకెళ్లారు' అని చెప్తుంది. దీంతో తులసి 'ఇంకేంటి అమ్మా.. ఎంజాయ్ చేసి ఉంటావు కదా' అంటాడు. దీనికామె 'అవును మావయ్యా.. ఇలా ఫోన్‌లో కాదు.. నా అనుభవాలు అక్కడికి వచ్చి డైరెక్ట్‌గా చెబుతాను. మీరు కులాషాగా ఉన్నారు కదా. ప్రతి మూడు నాలుగు గంటలకు ఒకసారి మీకు ఏదైనా తినడానికి ఇవ్వమని అంకితకో, శృతికో చెబుతాను. లేదంటే అత్తయ్య గారికి చెబుతాను' అంటుంది. దీంతో పరందామయ్య 'ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా.. మా గురించి నువ్వు మరిచిపో. ఇక్కడ అన్నీ మంచిగానే ఉన్నాయి' అని అంటాడు. దీంతో తులసి కాల్ కట్ చేస్తోంది.

  గ్లామర్ కంచె తెంచేసిన కాజల్: డెలివరీ తర్వాత తొలిసారి యమ హాట్‌గా!

  తులసి ఇంటికి8 వచ్చిన మదర్

  తులసి ఇంటికి8 వచ్చిన మదర్

  ఊరికెళ్లి వచ్చి అలసిపోయిన తులసి అలాగే కుర్చీలోనే నిద్రపోతుంది. ఇంతలో వాళ్ల అమ్మ అక్కడికి వస్తుంది. అప్పుడామె 'నా బంగారు తల్లి అలిసిపోయింది. నీ సేద తీర్చడానికే వచ్చానమ్మా' అని తల మీద చేయి పెడుతుంది. దీంతో వెంటనే తులసి మేల్కుంటుంది. అప్పుడామె అమ్మా ఈ టైమ్‌లో నువ్వు ఇక్కడేంటి అంటుంది. దీనికి సరస్వతి 'నువ్వే కదా.. అర్జెంట్‌గా రమ్మని ఫోన్ చేశావు. అందుకే వచ్చాను' అంటుంది. దీంతో నేను కాల్ చేయలేదు. ఒకవేళ నిద్రమత్తులో చేశానేమో అంటుంది. అప్పుడు తులసి 'నీ ఫ్రెండ్ సామ్రాట్ కాల్ చేసి నీ దగ్గరకు వెళ్లమన్నాడు' అని చెబుతుంది. దీంతో సామ్రాట్ ఇస్తానన్న సర్‌ప్రైజ్ ఇదేనేమో అనుకున్న తులసి.. వెంటనే అతడికి ఫోన్ చేసి థ్యాంక్స్ చెబుతుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 819: Samrat Surprises Tulasi. Then She Thanks To Him. After That Anasuya and Parandhamaiah Hide The Truth From Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X