For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అడ్డంగా బుక్కైన నందూ.. ఉద్యోగం కోసం మళ్లీ సామ్రాట్ దగ్గరకు!

  |

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తనకు ఎంతో ఇష్టమైన వాక్‌మెన్‌ను తులసికి సామ్రాట్ గిఫ్టుగా ఇస్తాడు. దీంతో అతడిపై సరస్వతి ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అనంతరం ఇంటర్వ్యూకు వెళ్లి నిరాశగా తిరిగి వచ్చిన నందూకు లాస్య కొన్ని బిల్లులు కట్టాలని చెబుతుంది. దీంతో ఆమెనే మేనేజ్ చేయమని చెప్తాడు. ఇక, ట్యాబ్లెట్లు అయిపోవడంతో పరందామయ్య, అనసూయ బాధ పడుతుంటారు. వాళ్ల మాటలు విని నందూ ఫీల్ అవుతాడు. అప్పుడే తులసి వాళ్లకు మందులు పంపుతుంది. దీంతో నందూ.. తులసికి థ్యాంక్స్ అని మనసులోనే చెప్పుకుని బాధ పడతాడు.

  సారా అలీ ఖాన్ హాట్ వీడియో వైరల్: రెడ్ బికినీలో ఎద అందాల ప్రదర్శన

  500 నోటుతో తులసి ప్రయోగం

  500 నోటుతో తులసి ప్రయోగం


  తులసితో కలిసి వెళ్తోన్న సమయంలో సామ్రాట్ నాకు మీరు ఈరోజు పార్టీ ఇస్తున్నారా లేదా అని అడుగుతాడు. దీనికామె మీ దృష్టిలో పార్టీ అంటే ఏంటి అని అడుగుతుంది. దీంతో సామ్రాట్ 'ఏముంది.. పార్టీ అంటే మనకు వచ్చిన ఆనందాన్ని మనకు నచ్చిన వాళ్లతో పంచుకోవడం' అంటాడు. అప్పుడు తులసి 'అదే కదా.. సరే పదండి వెళ్దాం' అంటుంది. దీనిక సామ్రాట్ 'నాకు ఇప్పుడు ఆకలిగా లేదు.. ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్దాం' అంటాడు. దీంతో తులసి ఓకే అంటుంది. అలాగే, అప్పుడు ఒక 500 నోటుతో ప్రయోగం చేసి చూపిస్తా అంటుంది.

  భయంతో తీసుకోని వ్యక్తులు

  భయంతో తీసుకోని వ్యక్తులు

  సామ్రాట్‌కు బతుకు పాఠం నేర్పించడం కోసం తులసి నేను ఒక పని చేస్తా అంటూ ఒక 500 రూపాయల నోటును ఒక పర్సులో పెట్టి కింద పడేస్తుంది. తర్వాత ఇది ఎవరికి దక్కుతుంది అని అడుగుతుంది. దీంతో సామ్రాట్ ముందు ఆ పర్సును ఎవరు చూస్తే వాళ్లకే అంటాడు. దీనికి తులసి 'అంత సీను లేదు. ఎవరికి రాసి పెట్టి ఉంటే వాళ్లకే ఆ డబ్బు దక్కుతుంది' అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రోడ్డు పక్కన వెళ్లి నిలబడుతారు. ఆ సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఆ పర్సును చూస్తారు. కానీ.. వాళ్లు సీసీ కెమెరాలు ఉన్నాయన్న భయంతో ఆ పర్స్ తీసుకోరు.

  బీచ్‌లో యాంకర్ హరితేజ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో తొలిసారి అరాచకంగా!

  అంధులకు దొరికినా వద్దని

  అంధులకు దొరికినా వద్దని


  వాళ్లు అలా వెళ్లిపోగానే ఇద్దరు అంధులు అటుగా నడుచుకుంటూ వస్తారు. అప్పుడు వాళ్లకు పర్స్ దొరికేలా చూడు అని తులసి మనసులో అనుకుంటుంది. అలా వాళ్లు కర్ర సహాయంతో నడుచుకుంటూ వెళ్తుండగా.. దానికి పర్స్ తగులుతుంది. అప్పుడా పెద్దాయన కర్రకు ఏదో మెత్తగా తగులుతుంది అంటాడు. ఆ తర్వాత దాన్ని తీసుకుని చేతులతో తడుముతూ పర్స్ అనుకుంటా అంటాడు. అప్పుడు వాళ్ల ఆవిడ ఎవరో పోగొట్టుకున్నారు.. పక్కన ఎవరైనా ఉన్నారేమో పిలిచి ఇచ్చేయ్ అంటుంది. ఆయన పిలిచినా ఎవరూ రారు. దీంతో చేసేదేం లేక ఆ పర్సును అక్కడే పడేయాలని వాళ్లిద్దరూ అనుకుంటారు.

  వాళ్లకు డబ్బులు ఇచ్చింది

  వాళ్లకు డబ్బులు ఇచ్చింది

  అంధులు డబ్బులు అక్కడే పెట్టాలని అనుకున్న సమయంలో తులసి వెళ్తుంది. అప్పుడామె 'ఆ డబ్బులు మీరే తీసుకోవచ్చు కదా. మీ కష్టాల్లో కొంచెమైనా తీరడానికి అందులో ఉన్న డబ్బులు ఉపయోగపడతాయేమో కదా' అంటుంది. దీనికి వాళ్లు 'మాకు తీరలేనన్ని కష్టాలు ఉన్నాయి. అయినా పరుల సొమ్ము పాపంలాంటిది. ఎవరో పడేసుకున్న డబ్బులు మాకేందుకు' అని అంటారు. దీంతో తులసి ఆ పర్సు నాదే అంటుంది. దీంతో పర్స్‌ను వాళ్లు ఆమెకు ఇచ్చేస్తారు. దీంతో అందులో నుంచి డబ్బులు తీసి ఆ 500 నోటును వాళ్లకే ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు.

  స్పోర్ట్స్ బ్రాతో అనుష్క ఓవర్ డోస్ షో: షార్ట్‌ కూడా పైకి లేపేసి మరీ!

  సామ్రాట్ చేతులు పట్టుకుని

  సామ్రాట్ చేతులు పట్టుకుని


  తన గురించి పరందామయ్య, అనసూయ అన్న మాటలను నందూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. దీంతో అతడికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు నందూ 'ఎలాంటి వాడిని ఎలా అయిపోయాను. సంపాదన లేకపోవడం నా పెద్దరికాన్ని తగ్గించేసింది. అమ్మానాన్న నన్ను చూసి జాలి పడుతున్నారు. మళ్లీ వెళ్లి సామ్రాట్ చేతులు పట్టుకుందామా అంటే ఈగో అడ్డొస్తుంది. నా విలువ నేనే తగ్గించుకున్నట్టు అవుతుంది. అందుకే ఎలాగైనా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి. నా వాళ్ల ముందు సగర్వంగా తలెత్తుకుని బతకగలగాలి' అని అనుంటాడు.

  సామ్రాట్‌కు పరీక్ష పెట్టింది

  సామ్రాట్‌కు పరీక్ష పెట్టింది

  అంధులకు డబ్బులు ఇచ్చి తర్వాత తులసి 'ఆ దేవుడు చూశారా.. కళ్లు లేని వాళ్లకు మంచి గుణం ఇచ్చాడు. కళ్లు ఉన్నవాళ్లకు మాత్రం మంచి గుణం ఇవ్వలేకపోయాడు' అంటుంది. అప్పుడు సామ్రాట్ 'అయినా.. వాళ్లు కళ్లు లేకున్నా అసలు రోడ్డు మీద ఎలా నడుస్తున్నారు' అంటాడు. దీంతో తులసి మీకు ఒక చిన్న పరీక్ష అని అంటూ కళ్లకు గంతలు కట్టి రెండు నిమిషాల్లో రోడ్డు దాటాలని పరీక్ష పెడుతుంది. కానీ, అతడు ఎంతగా ప్రయత్నించినా రోడ్డు దాటలేకపోతాడు. చివరికి సామ్రాట్ నా వల్ల కాదండి.. నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను అని అంటాడు. దీంతో తులసి మధ్య తరగతి వాళ్ల మనస్థత్వాల గురించి సామ్రాట్‌కు క్లాస్ పీకుతుంది.

  నగ్నంగా చరణ్ హీరోయిన్: ప్రైవేటు భాగాలను అలా కవర్ చేస్తూ ఘోరంగా!
  https://telugu.filmibeat.com/heroine/actress-amy-jackson-shares-stunning-picture-in-instagram-115673.html

  రెస్టారెంట్‌లో బుక్కైన నందూ

  రెస్టారెంట్‌లో బుక్కైన నందూ

  తర్వాత నందూ ఓ రెస్టారెంట్‌లో ఫ్రైడ్ రైస్ తింటూ ఉంటాడు. అప్పుడే సామ్రాట్, తులసి కూడా అక్కడకు వస్తారు. వాళ్లిద్దరూ ఆకలి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో సామ్రాట్ పెళ్లి ప్రస్తావన రాగా.. ఇద్దరూ నవ్వుకుంటారు. దీంతో నందూ వాళ్లను చూసి షాక్ అవుతాడు. దీంతో వెంటనే లేచి వెళ్లిపోవాలని అనుకుంటాడు. కానీ, అతడి జేబులో పర్సు కనిపించదు. దీంతో బిల్ ఎలా పే చేయాలో అతడికి అర్థం కాదు. తర్వాత అతడు కూర్చొన్న ప్లేస్‌లో పర్సు మరిచిపోయానా అని అనుకుంటాడు. కానీ.. అక్కడికి వెళ్లి చూసినా అది కనిపించదు. దీంతో పర్స్‌ను ఇంట్లోనే మర్చిపోయాను అనుకుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 822: Tualsi Gives Some Suggestions to Samrat. After That Nandhu Gets Irritated After Spoting Tulasi and Samrat At The Restaurant.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X