For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అతడిని కొత్త చోటుకు తీసుకెళ్లిన తులసి.. లాస్యకు కోడళ్లు షాక్

  |

  ఇండియాలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తనకు పార్టీ కావాలని అడిగిన సామ్రాట్‌కు తులసి కొన్ని అనుభవాలను కళ్లకు అద్దినట్లుగా చూపించాలని అనుకుంటుంది. ఇందులో భాగంగానే ఓ 500 రూపాయలతో ప్రయోగం చేస్తుంది. తర్వాత కళ్లకు గంతలు కట్టి ఓ పరీక్ష పెడుతుంది. వీటిలో అతడు ఓడిపోవడంతో తులసి కొన్ని సూచనలు చేస్తోంది. మరోవైపు నందూ తన పరిస్థితిని తలుచుకుని బాధ పడతాడు. మళ్లీ సామ్రాట్ దగ్గరకు వెళ్తే పరువు పోతుందని అనుకుంటాడు. ఇక, చివర్లో నందూ ఉన్న రెస్టారెంట్‌కే తులసి, సామ్రాట్ వస్తారు. దీంతో అతడు షాక్ అవుతాడు.

  సారా అలీ ఖాన్ హాట్ వీడియో వైరల్: రెడ్ బికినీలో ఎద అందాల ప్రదర్శన
  https://telugu.filmibeat.com/heroine/sara-ali-khan-swimming-pool-video-goes-viral-115732.html

  నందూ పరువు తీసేసిన ఓనర్

  నందూ పరువు తీసేసిన ఓనర్


  రెస్టారెంట్‌లో డబ్బు కట్టడానికి పర్స్ లేక నందూ ఇబ్బంది పడతాడు. ఇదే విషయాన్ని మేనేజర్‌కు చెప్తాడు. అప్పుడాయన 'లోపలికి వచ్చే ముందు పర్స్ ఉందో లేదో చూసుకోవా? లోపలికి పిలిచి.. మర్యాదలు చేసి.. ఫ్రీగా భోజనం పెట్టడానికి ఇది మీ అత్తగారిల్లు అనుకున్నావా' అంటాడు. దీంతో నందూ ఇంటికెళ్లి డబ్బు తీసుకుని వచ్చి కట్టేస్తాను అంటాడు. అప్పుడాయన 'అప్పటి వరకూ నీ మొబైల్ ఇక్కడ పెట్టి వెళ్లు. ఇలా టిప్ టాప్‌గా రెడీ అయి.. కడుపు నిండా తిని ఇలాంటి కథలు చెప్పే వాళ్లను చాలా మందిని చూశాను. మీ వాళ్లకు ఎవరికైనా కాల్ చేసి డబ్బులు తెమ్మని చెప్పు' అంటూ అరుస్తాడు.

  నందూకు తులసి సహాయం

  నందూకు తులసి సహాయం


  నందూను రెస్టారెంట్‌లోని మేనేజర్ అవమానిస్తూ మాట్లాడుతుంటాడు. అప్పుడు అతడు చాలా బాధ పడతాడు. ఆ సమయంలో తులసి, సామ్రాట్ అక్కడకు వస్తారు. వచ్చి రావడమే ఆయన బిల్ ఎంత అని తులసి అడుగుతుంది. దీంతో అతడు ఏ మీరు కడతారా అని అడుగుతాడు. అప్పుడామె 'నిజాయితీని అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడకూడదు. ఆయన మీ మాటలకు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూడండి' అంటూ మొత్తం బిల్స్ పే చేస్తుంది. దీంతో నందూ 'థ్యాంక్స్. ఇంటికి వెళ్లిన వెంటనే మీ డబ్బులు రిటర్న్ చేస్తాను' అని చెప్పి వెళ్లిపోతాడు.

  Dhamaka Twitter Review: ధమాకాకు అలాంటి టాక్.. అసలైందే మైనస్‌గా.. రవితేజ మూవీ హిట్టా? ఫట్టా?

  లాస్యకు కోడళ్లు హెచ్చరికలు

  లాస్యకు కోడళ్లు హెచ్చరికలు


  ఇక, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోడానికి దివ్య స్నేహితులు ఇంటికి వస్తారన్న విషయాన్ని అంకిత, శృతి వెళ్లి లాస్యకు చెబుతారు. అంతేకాదు, 'దివ్య కాలేజ్‌లో పార్టీ ఉందట. అందుకోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి వాళ్ల ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తున్నారు. వాళ్లకు కావాల్సిన సదుపాయాలు, స్నాక్స్ విషయం మేము చూసుకుంటాం. మీరు మధ్యలో ఎలాంటి సీన్ క్రియేట్ చేయొద్దు. ఎందుకంటే తను మా లాంటిది కాదు. దేనికైనా పెద్దగా రియాక్ట్ అవుతుంది. అలాగే, అంకుల్‌కు కూడా తను అంటే చాలా ఇష్టం. మీ మంచికే ఇది చెబుతున్నాం జాగ్రత్తగా ఉండండి' అంటారు. అప్పుడు లాస్య 'మీరు హెచ్చరిస్తున్నారా? రిక్వెస్ట్ చేస్తున్నారా? అయినా ఈ ఇంట్లో నా మాట వినడం కావాలి. అంతకు మించి ఏమీ వద్దు' అంటుంది.

  ఫ్రెండ్ ముందు లాస్య ప్రశ్న

  ఫ్రెండ్ ముందు లాస్య ప్రశ్న

  ఆ తర్వాత దివ్య డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తన ఫ్రెండ్స్‌ను తీసుకొస్తుంది. ఇంతలో లాస్య వచ్చి మీ ఫ్రెండ్సా అని అడుగుతుంది. దీంతో వాళ్లు ఈమె ఎవరు అని ప్రశ్నిస్తారు. అప్పుడు దివ్య మా ఆంటీ అంటుంది. దీంతో ఆంటీ అంటే అని అడుగుతారు. దీనికి దివ్య మా డాడ్ సెకండ్ వైఫ్ అని అంటుంది. అప్పుడు లాస్య 'సెకండ్ వైఫ్ అంటే ఏమంటారు' అని దివ్య ఫ్రెండ్స్‌ను అడగ్గా.. వాళ్లు పిన్ని అంటారు అని చెప్తారు. దీంతో దివ్య తను నాకు పిన్ని అవుతుంది అంటుంది. దీంతో లాస్య మీ అమ్మ నీకు ఇవన్నీ నేర్పించలేదా అంటుంది. తర్వాత దివ్య కోపంగా వెళ్లిపోతుంది.

  సరయు రాయ్ ఎద అందాల ప్రదర్శన: మరీ ఇలా టెంప్ట్ చేస్తుందేంటి!

  సామ్రాట్‌కు తులసి చాలెంజ్

  సామ్రాట్‌కు తులసి చాలెంజ్

  రెస్టారెంట్‌లో కాఫీ తాగిన తర్వాత సామ్రాట్, తులసి ఇద్దరూ కలిసి బయట నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పుడు సామ్రాట్ నేను ఇప్పుడు మధ్యతరగతి వ్యక్తిగా మారిపోయానండి అంటాడు. దీంతో తులసి 'మీరు మారిపోయాను అంటే కాదు.. ఖచ్చితంగా మీరు మధ్యతరగతి వ్యక్తిగా మారిపోయారో లేదో మీకు ఒక పరీక్ష పెడతాను. మీ దగ్గర, నా దగ్గర సమానమైన డబ్బులను తీసుకొని వాటిని ఎలా ఖర్చు చేస్తున్నామో చూద్దాం' అంటుంది. దీంతో సామ్రాట్ 500 నోట్లు రెండు ఇస్తాడు. అప్పుడు తులసి అంత డబ్బా వద్దని తన దగ్గర ఉన్న రెండు 10 రూపాయల నోట్లు ఇస్తుంది.

  ఓడిపోయానని ఒప్పుకుంటూ

  ఓడిపోయానని ఒప్పుకుంటూ


  ఆ పది రూపాయలు ఇచ్చిన తర్వాత తులసి ఈ డబ్బులతో ఎవరు ఎన్ని ఎక్కువ వస్తువులు కొంటే వాళ్లే గెలిచినట్టు అంటుంది. దీంతో ఇద్దరూ వేరు వేరుగా వెళ్తారు. ముందు తులసి ఒక కూరగాయల షాపునకు వెళ్లి 10 రూపాయలకు సరిపడా అన్ని ఒక్కొక్క కూరగాయ కొంటుంది. ఆ తర్వాత సామ్రాట్ షాపునకు వెళ్లి 10 రూపాయల బియ్యం తీసుకొస్తాడు. వచ్చి నేనే ఎక్కువ కొన్నాను కాబట్టి గెలిచాను అంటాడు. దీంతో తులసి 'ఎవరు ఎన్ని రకాల వస్తువులు తెచ్చారు అన్నది కానీ.. ఒకే వస్తువును తేవడం కాదు' అంటుంది. దీంతో సామ్రాట్ ఓడిపోయా అంటాడు.

  స్పోర్ట్స్ బ్రాతో అనుష్క ఓవర్ డోస్ షో: షార్ట్‌ కూడా పైకి లేపేసి మరీ!

  సామ్రాట్‌కు గుర్తుండే పార్టీ

  సామ్రాట్‌కు గుర్తుండే పార్టీ

  తర్వాత సామ్రాట్‌ను తులసి ఓ అనాథాశ్రమానికి తీసుకెళ్తుంది. అక్కడ ఉన్న పిల్లలకు కొన్ని పార్శిల్స్ ఇస్తుంది. ఆ తర్వాత వాళ్లతో కలిసి సామ్రాట్, తులసి వాటిని తింటారు. ఆ సమయంలో వాళ్ల సంతోషం చూసి సామ్రాట్ సంతోషపడతాడు. తర్వాత దాతలు లేకపోవడంతో పిల్లలు తగ్గిపోతున్నారని అక్కడి వాళ్లు చెప్తారు. దీంతో సామ్రాట్ నేను ఎంతో కొంత సహాయం చేస్తానని అంటాడు. అనంతరం తులసి 'మీకు నేనిచ్చే పార్టీ ఇదే' అని అంటుంది. దీంతో సామ్రాట్‌కు మాటలు కూడా రావు. ఆ సమయంలో తులసికి అతడు థ్యాంక్స్ చెబుతాడు. ఇక, ఇంట్లో దివ్య వాళ్లు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా పరందామయ్య వచ్చి కామెంట్లు చేస్తుంటాడు. ఇక, ఈ సౌండ్లకు లాస్య ఇరిటేట్ అవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 823: Tualsi Helps Nandhu at Restaurant. Then He Feels Embarrassed. After That Parandhamaiah and Divya Take Up Fun Challenge.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X