For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: వాళ్లకు మరో షాకిచ్చిన లాస్య.. అంకితకు నిజం తెలియడంతో రచ్చ

  |

  దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

  దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ రెస్టారెంట్‌లో పర్స్ మర్చిపోయానని చెప్పడంతో అక్కడి మేనేజర్ నోటికొచ్చినట్లు తిడుతుంటాడు. ఆ సమయంలో తులసి, సామ్రాట్ వస్తారు. అప్పుడు అతడికి క్లాస్ పీకిన తులసి.. నందూ డబ్బులు కూడా కట్టేస్తుంది. అనంతరం శృతి, అంకిత.. దివ్య ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారని, ఎలాంటి ఓవర్ యాక్టింగ్ చేయొద్దని చెప్తారు. తర్వాత వాళ్లు రాగానే రిసీవ్ చేసుకుంటారు. కానీ, లాస్య ఏదేదో మాట్లాడుతుంది. ఇక, సామ్రాట్‌కు తులసి ఓ చాలెంజ్ ఇస్తుంది. తర్వాత అనాథాశ్రమానికి తీసుకెళ్తుంది. దీంతో అతడు సంతోషిస్తాడు.

  బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ రచ్చ: నాకు అదే కావాలి అంటూ దొరికిపోయిందిగా!

  పాట ఆపిన లాస్య.. దివ్య గొడవ

  పాట ఆపిన లాస్య.. దివ్య గొడవ

  దివ్య తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా పరందామయ్య అక్కడకు వచ్చి.. వాళ్లను మరింతగా ఉత్సాహ పరుస్తుంటాడు. ఆ సమయంలోనే ఇంకా ఫన్ కావాలి అంటాడు. దీంతో సౌండ్ ఎక్కువగా పెట్టి వాళ్లంతా సామీ సామీ పాటకు డ్యాన్స్ చేస్తుంటారు. ఆ సౌండ్‌కు లాస్యకు ఇరిటేషన్ వస్తుంది. దీంతో కోపంగా బయటకు వచ్చి మ్యూజిక్ సిస్టమ్‌ను ఆఫ్ చేస్తుంది. దీంతో దివ్యకు కోపం వచ్చి 'మేమంతా డ్యాన్స్ నేర్చుకుంటున్నాము కదా. పాటలు ఎందుకు ఆపేశావ్' అని అరుస్తుంది. దీంతో లాస్య తనకు ఇరిటేషన్ వస్తుందని చెప్పి గొడవ పడుతుంది.

  నందూ ఎంట్రీ... దివ్యపై కోపం

  నందూ ఎంట్రీ... దివ్యపై కోపం

  లాస్య మాటలకు దివ్య కూడా తగ్గకుండా సమాధానం చెబుతుంది. అంతలోనే అక్కడకు నందూ వచ్చి ఏమైందని అడుగుతాడు. దీంతో లాస్య నిజాన్ని దాచేసి 'దివ్య వాళ్లు ఎక్కువ సౌండ్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు. నేను ఎంత సర్దుకుపోదాం అనుకున్నా కూడా అలాగే జరుగుతోంది. నన్నే ఎగతాళి చేస్తున్నారు. సౌండ్ తట్టుకోలేక పక్కన వాళ్లు కూడా వచ్చి నాకు కంప్లైంట్ చేశారు. కానీ, నేను సర్దిచెప్పి పంపించాను. కావాలంటే వాళ్ల ఫ్రెండ్స్‌ను అడుగు' అంటుంది. దీంతో నందూ దివ్యతో పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలుసుకో అని కోప్పడతాడు. దీంతో ఆమెను ఏం చేయాలో అర్థం కాదు. అంతేకాదు, పరందామయ్యను కూడా నందూ తిడతాడు. దీంతో దివ్య తన ఫ్రెండ్స్‌ను పంపేస్తుంది.

  హాట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన లైగర్ పాప: ఆమెను ఇలా చూస్తే అస్సలు ఆగలేరు!

  మీ ద్వారానే నేర్చుకుంటున్నా

  మీ ద్వారానే నేర్చుకుంటున్నా

  తులసి, సామ్రాట్‌ కారులో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇద్దరూ జీవిత సత్యాల గురించి మాట్లాడుకుంటుంటారు. ఆ సమయంలో అతడు తులసిని ప్రశంసిస్తూ ఉంటాడు. దీనికామె మురిసిపోతూ ఉంటుంది. ఆ సమయంలోనే 'నేను ఏదైనా నా జీవితంలో ఎదురైన సంఘటనల నుంచి నేర్చుకున్నా. అందుకే ఎప్పుడు ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా పెద్దగా బాధపడను. పైగా వాటిని ధీటుగా ఎదుర్కొంటాను' అని చెప్తుంది. దీనికి సామ్రాట్ 'అందుకే నేను కూడా మీలా ఆలోచిస్తున్నా.. ఆలోచించడం నేర్చుకుంటున్నా' అని చెబుతాడు.

  ప్రేమ్, అభికి దివ్య కంప్లైంట్

  ప్రేమ్, అభికి దివ్య కంప్లైంట్

  లాస్య, నందూ మాటలకు దివ్య బాధ పడుతూ ఉండగా పరందామయ్య వచ్చి 'లాస్య సంగతి నీకు తెలుసు కదా. సీరియస్‌గా తీసుకోకు. వదిలేయ్' అంటాడు. దీంతో అంకిత 'ఆమెను పిన్ని అని దివ్య ఫ్రెండ్స్‌కు పరిచయం చేయలేదని అలా చేసింది' అంటుంది. ఇంతలో అభి, ప్రేమ్ వస్తారు. వచ్చీ రావడమే ఏమైందని అడుగుతారు. అప్పుడు అంకిత లాస్య ఆంటి.. దివ్య మీద అరుస్తోంది అని చెబుతుంది. దీంతో ప్రేమ్‌కు కోపం వస్తుంది. అప్పుడు దివ్య 'నా ఒక్కదాని పైనే కాదు.. అందరిపై అరిచింది. డాడ్ కూడా ఆంటీకే సపోర్ట్ చేశారు' అని వాళ్లకు చెబుతుంది.

  కొత్త లవర్‌తో హీరోయిన్ అరాచకం: ప్యాంట్ తీసేసి మరీ.. మరీ ఇంత దారుణమా!

  బ్రతిమాలిన పరందామయ్య

  బ్రతిమాలిన పరందామయ్య


  దివ్య చెప్పిన వెంటనే ప్రేమ్ ఇంకా మనం ఆలోచిస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు అంటాడు. అప్పుడు పరందామయ్య 'మీ డాడీకే జాబ్ లేదనే టెన్షన్‌లో ఉన్నాడు. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితిలో కూడా లేడు. కొంత కాలం ఎదురుచూద్దాం' అంటాడు. దీంతో అనసూయ 'మీరు అలాగే మాట్లాడుతారు. ప్రతిసారి నందూ ముందు మనం దోషులుగా నిలబడుతున్నాం' అంటుంది. దీంతో అభి అలా కాదు కానీ.. తాతయ్య చెప్పినట్టు కొంచెం ఓపిక పట్టడం మంచిదేమో అంటాడు. దీనికి పరందామయ్య 'ఇలా తొందరపడే తులసిని మనం దూరం చేసుకున్నాం. నందూకు జాబ్ వస్తే పరిస్థితులు మారుతాయేమో అన్న ఆశగా ఉంది. కాస్త ఓపిక పడదాం. నామాట వినండిరా ప్లీజ్' అని బ్రతిమాలతాడు.

  దివ్యకు ధైర్యం చెప్పిన తల్లి

  దివ్యకు ధైర్యం చెప్పిన తల్లి

  ఇక, తులసి దివ్య డ్యాన్స్ ప్రాక్టీస్ ఎక్కడి వరకూ వచ్చిందో తెలుసుకునేందుకు ఆమెకు ఫోన్ చేస్తుంటుంది. కానీ, దివ్య చూసుకోకుండా కాల్ కట్ చేస్తుంది. దీంతో తులసి మళ్లీ మళ్లీ చేస్తుంది. ఆ సమయంలో ఆమె 'జరిగిన గొడవ మామ్‌కు తెలియకూడదని తాతయ్య చెప్పారు. జాగ్రత్తగా మాట్లాడాలి' అని అనుకుంటుంది. కాల్ లిఫ్ట్ చేయగానే 'బిజీగా ఉన్నావా? నా కాల్ కట్ చేస్తున్నావు' అని అడుగుతుంది. దీంతో దివ్య 'సారీ మామ్ నేను చూసుకోలేదు. ఏం లేదు అమ్మ. నాకు కన్నతల్లి ఉండి కూడా అనాథగా బతుకుతున్నట్టుగా ఉంది. అందరి మధ్యలో ఉండి కూడా నాకు ఒంటరిగా అనిపిస్తోంది' అంటుంది. దీంతో తులసి 'ఏవడకమ్మా.. నన్నే మీ అందరికీ దేవుడు దూరం చేశాడు. నువ్వు ఇప్పుడు దైర్యంగా ఉంటేనే నేను ఇక్కడ దైర్యంగా ఉంటా' అంటుంది.

  స్పోర్ట్స్ బ్రాతో అనుష్క ఓవర్ డోస్ షో: షార్ట్‌ కూడా పైకి లేపేసి మరీ!

  అంకితకు నిజం తెలియగానే

  అంకితకు నిజం తెలియగానే

  పరందామయ్యకు కడుపులో మంటగా ఉందని చెప్తాడు. అంతలో అంకిత అక్కడకు వస్తుంది. అప్పుడు పరందామయ్యను ట్యాబ్లెట్లు వేసుకున్నారా అంటే ఏమీ మాట్లాడడు. పైగా ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడు అనసూయ 'కడుపులో మంట మొదలైంది. పాలు కాచి తీసుకొస్తానంటే వద్దంటున్నారు' అంటుంది. దీంతో అంకిత 'వద్దు ఏంటి.. అసలు తాతయ్యను అడగాల్సిన అవసరం ఏంటి.. ఆయన్ను ప్రతి మూడు గంటలకు ఏదో ఒకటి తినమని చెప్పారు కదా. శృతి ఎక్కడ' అంటూ కిచెన్‌లోకి వెళ్లి గోల చేస్తుంది. అప్పుడు శృతి.. ప్రిడ్జ్‌కు లాస్య తాళం వేసిందని చెప్తుంది. దీంతో అంకిత 'ఫ్రిడ్జ్‌కు తాళం ఎందుకు వేశావు' అని ప్రశ్నిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 824: Divya Shares Her Worries with Tulasi. Then She Gives Some Advises to her. After That Ankitha Surprised by Lasya Harsh Demands.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X