For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: కింద పడిపోయిన తులసి.. పరిస్థితి విషమం.. డాక్టర్ ఏం చెప్పారంటే!

  |

  ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య ఇంట్లో చేస్తున్న పనులు అన్నింటిని శృతి, అంకిత, దివ్యలు బయటపెడతారు. ఆ సమయంలో నందూపై తులసి అసహనం వ్యక్తం చేస్తుంది. దీంతో నందూకు పట్టలేని కోపం వస్తుంది. అప్పుడే లాస్యపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. కానీ, లాస్య మాత్రం తనదైన మాటలతో అతడిని కూల్ చేసేస్తుంది. అనంతరం తులసి ఇంటికి వెళ్లగానే సామ్రాట్ ఆమెకు ఫోన్ చేసి బెనర్జీ కాంట్రాక్టును లాస్య, నందూ తీసుకుంటున్నారని చెబుతాడు. దీంతో షాకైపోయిన తులసి వాళ్లు ఆ తప్పు చేయకుండా ఉండేలా చూస్తానని అంటుంది.

  బిగ్ బాస్ శ్రీ సత్య బాత్రూం ఫొటోలు వైరల్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

  సాయం చేయడానికొచ్చిన తులసి

  సాయం చేయడానికొచ్చిన తులసి

  బెనర్జీ ఇచ్చిన ఆఫర్‌ విషయంలో సహాయం చేసేందుకు తులసి.. లాస్య, నందూ దగ్గరకు వస్తుంది. అప్పుడు లాస్య రాత్రేగా కనిపించాము. అప్పుడే బెంగ పెట్టుకున్నావా అని అడుగుతుంది. దీంతో తులసి అవును అంటుంది. అప్పుడు లాస్య నీ జోక్ బాగుంది అంటుంది. దీంతో తులసి 'ఇప్పుడు నా మాట వినకపోతే నిజంగానే నవ్వులపాలు అవుతారు' అంటుంది. ఆ తర్వాత 'మీరు ఆ బెనర్జీ ఇచ్చిన ఆఫర్ గురించే కదా మాట్లాడుకుంటున్నారు' అంటుంది. దీంతో లాస్య 'చూడు నందూ.. మనల్ని ఫాలో అవుతూ మనం ఎదగకుండా చేయాలని చూస్తుంది' అంటుంది.

  నిన్ను పెళ్లి చేసుకోవడమే తప్పని

  నిన్ను పెళ్లి చేసుకోవడమే తప్పని

  ఆ తర్వాత లాస్య 'ఆ బెనర్జీ ఫ్రాడ్ కూడా అంటావా ఏంటి' అంటుంది. దీంతో తులసి 'నువ్వు ఏమైనా అనుకో కానీ అదే నిజం. ఆ బెనర్జీ నిజంగా మోసగాడే. అతడి గురించి నేను ఆరా తీశాను. అతడు పచ్చి మోసగాడు. సామ్రాట్ గారు ఆ ప్రాజెక్ట్ కాదంటేనే మీ దగ్గరికి వచ్చాడు' అని చెబుతుంది. దీంతో నందూ 'ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్స్. కానీ సలహాలు అడిగితేనే ఇవ్వాలి. అడగకుండా ఇస్తే దాన్ని సలహా అనరు' అంటాడు. అప్పుడామె బెనర్జీతో చేతులు కలపడమే తప్పుడు నిర్ణయం అంటుంది. దీనికి నందూ 'నిన్ను పెళ్లి చేసుకోవడమే అతి పెద్ద తప్పుడు నిర్ణయం. నువ్వు ఒక తియ్యటి విషానివి. నవ్వుతూ కాటేస్తావు. నా మీద జాలి చూపిస్తున్నట్టుగా నటిస్తూ వెన్నుపోటు పొడుస్తావు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో' అంటాడు.

  జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!

  స్పృహతప్పి పడిపోయిన తులసి

  స్పృహతప్పి పడిపోయిన తులసి

  ఎంత చెప్పిన నందూ వాళ్లు వినకపోవడంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. దీంతో వాళ్ల మీద కోపంతో అక్కడి నుంచి నేరుగా ఇంటికి వస్తుంది. అప్పుడామెకు చాలా చిరాకుగా ఉండటంతో కొన్ని నీళ్లు తాగుతుంది. అంతలోనే స్పృహ తప్పి కింద పడిపోతుంది. మరోవైపు అభి, ప్రేమ్, శృతి, అంకిత క్యారమ్స్ ఆడుతూ ఉంటారు. వాళ్లంతా సరదాగా ఆడుతూ ఉండగా అభికి ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతుంటాడు. దీంతో అంకిత మొబైల్ లాక్కుంటుంది. అంతేకాదు, 'ఆడేటప్పుడు ఇలా డిస్టర్బ్ చేయొద్దు. అందరూ మొబైల్స్ ఇవ్వండి.. సైలెంట్‌లో పెడతాను' అని అందరి మొబైల్స్ తీసుకొని సైలెంట్‌లో పెట్టి వాటిని ఒకచోట ఉంచుతుంది.

  వాళ్లు పట్టించుకోకుండా.. అతడికి

  వాళ్లు పట్టించుకోకుండా.. అతడికి

  కళ్లు తిరిగి పడిపోయిన తులసికి కాసేపటికి స్పృహ వస్తుంది. ఆ వెంటనే తన ఫోన్ తీసుకుని ప్రేమ్‌కు కాల్ చేస్తుంది. కానీ, అది సైలెంట్‌లో ఉండడంతో చూసుకోడు. ఆ తర్వాత అభికి కూడా చేస్తుంది. కానీ, అతడు కూడా ఫోన్ చూడడు. వీళ్లెవరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తులసి నేరుగా సామ్రాట్‌కు కాల్ చేస్తుంది. దీంతో అతడు లిఫ్ట్ చేస్తాడు. హలో తులసి గారూ అంటూ మాట్లాడతాడు. కానీ, తులసి మాత్రం ఏమీ మాట్లాడదు. దీంతో మళ్లీ ఆమెకు ఫోన్ చేస్తాడు. కానీ తులసి మాత్రం లిఫ్ట్ చేయదు. దీంతో కంగారు పడిన సామ్రాట్ వెంటనే తులసి ఇంటికి వస్తాడు.

  బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

  ఆస్పత్రికి తులసి.. సీరియస్ అని

  ఆస్పత్రికి తులసి.. సీరియస్ అని

  తులసి ఇంటికి వచ్చిన తర్వాత సామ్రాట్ డోర్ కొడతాడు. కానీ, ఆమె తీయదు. ఫోన్ చేస్తాడు. కానీ, ఆమె లిఫ్ట్ చేయదు. అయితే, అక్కడే ఆమె రింగ్ టోన్ వినిపిస్తుంది. దీంతో ఏమైందా అని కిటికీ వైపు వెళ్లి చూస్తాడు. అప్పుడు తులసి స్పృహ తప్పి పడపోవడాన్ని గమనిస్తాడు. ఆ వెంటనే కంగారుగా తులసి గారు అని డోర్ బద్దలు కొట్టి లోపలికి వస్తాడు. ఆమెను మోసుకుంటూ బయటికి వస్తాడు. కారులో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తాడు. అక్కడి డాక్టర్ తులసిని పరీక్షించి.. 'ఆమె హెల్త్ చాలా బ్యాడ్ కండిషన్‌లో ఉంది. బీపీ అబ్‌నార్మల్‌గా పడిపోయింది' అని చెబుతుంది.

  సంతకం పెట్టి వైద్యం చేయించి

  సంతకం పెట్టి వైద్యం చేయించి


  ఆ తర్వాత డాక్టర్ 'తులసి గారికి పల్స్ కూడా పడిపోయింది. వెంటనే మేజర్ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేయాలి' అంటాడు. దీంతో సరే అని వెంటనే డబ్బులు పే చేస్తా అంటాడు. ఆ తర్వాత అతడి దగ్గరకు నర్సు వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేయమని చెబుతుంది. అంతేకాదు, మీరు ఆమె భర్తే కదా.. ఇక్కడ సంతకం పెట్టండి అని అంటుంది. దీంతో ఏం చేయాలో సామ్రాట్‌కు అర్థం కాదు. అప్పుడు 'అంత టైమ్ లేదు కదా. ఇప్పుడు నేను ఆమె భర్తను కాదు అంటే ఆమె వాళ్లు వచ్చే వరకు ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేయరు. తులసి గారు క్షేమంగా ఈ గండం నుంచి బయటపడాలి' అని అన్ని వివరాలను రాసి సంతకం పెడతాడు.

  నిధి అగర్వాల్ హాట్ వీడియో వైరల్: ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ.. అలా చూపిస్తూ!

  దీపిక్‌కు చెప్పేసి.. నందూ అలా

  దీపిక్‌కు చెప్పేసి.. నందూ అలా

  సామ్రాట్ ఆస్పత్రిలో కంగారు పడుతూ ఉండగానే తులసి తమ్ముడు దీపక్ ఆమె నెంబర్‌కు కాల్ చేస్తాడు. ఆ వెంటనే సామ్రాట్ ఫోన్ లిఫ్ట్ చేసి అతడికి అసలు విషయం చెబుతాడు. దీంతో దీపక్ ఇప్పుడే అమ్మను తీసుకొని బయలుదేరుతాం అంటాడు. మరోవైపు నందూ, లాస్య ఇంట్లో అందరూ ఉన్న దగ్గరికి వస్తారు. లాస్య చెప్పు నందు. ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అంటుంది. అప్పుడు నందూ 'నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా' అంటాడు. దీంతో అంకిత 'గతంలో ఒకసారి దెబ్బ తిన్నారు కదా అంకుల్' అంటుంది. అప్పుడు లాస్య 'నీకు ఒకసారి కడుపు పోయిందని మళ్లీ ట్రై చేయరా' అని అంటుంది. దీంతో అంతా షాక్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 836: Nandhu and Lasya Refuse to Take her Help about Banerjee Offer. Then She Gets Upseted. Later Tulasi Falls and Gets Unconscious.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X