For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు తులసి ఛాలెంజ్.. ప్రేమ్‌కు తల్లి షాక్.. ఆమె రాకతో సందడి

  |

  ఎన్నో ఏళ్ల తరబడి తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి తన ఇంటికి వెళ్తుందన్న విషయం తెలిసిన సామ్రాట్ ఆమెను ఇంకా ప్రోత్సహిస్తాడు. మరోవైపు, లాస్య, నందూ ఓ సేట్‌ను తీసుకొచ్చి ఇంటిని చూపిస్తారు. అతడికి డాక్యూమెంట్లు ఇచ్చిన సమయంలో తులసి అక్కడకు వెళ్లి అవి రిజిస్ట్రేషన్ కాలేదని అంటుంది. దీంతో సేట్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నందూ, లాస్యపై తులసి ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. అంతేకాదు, ఇకపై ఇంట్లోనే ఉంటానని చెబుతుంది. దీంతో నందూ ఇంట్లో నుంచి వెళ్లిపోడానికి రెడీ అవుతుంటాడు. అప్పుడు లాస్య అతడిని ఆపుతుంది.

  యాంకర్ విష్ణుప్రియ ఎద అందాల జాతర: బీచ్‌లో తడిచిన శరీరంతో ఘాటుగా!

  నేను ఆత్మబంధువును మాత్రమే

  నేను ఆత్మబంధువును మాత్రమే


  తులసి గురించి నిజం చెప్పమంటూ సామ్రాట్‌ను వాళ్ల బాబాయి అడుగుతుంటాడు. కానీ, సామ్రాట్ మాత్రం తన మనసులో ఏమీ లేదని అంటాడు. అప్పుడు వాళ్ల బాబాయి 'తులసి ఇంత కాలం ఒంటరిగా ఉంది. అప్పుడే నీ మనసులోని మాటను బయట పెట్టేయాల్సిందిరా. అనవసరంగా మంచి ఛాన్స్‌ను మిస్ చేసుకున్నావు' అంటాడు. దీంతో సామ్రాట్ 'తులసి గారిపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు బాబాయ్. తనకు నేను ఆత్మబంధువును అని, ఇకపై పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని నాతో చెప్పేశారు. కాబట్టి ఈ విషయాన్ని మళ్లీ రిపీట్ చేయకు బాబాయ్' అని చెబుతాడు.

  శృతి కోసం రాములమ్మ ఎంట్రీ

  శృతి కోసం రాములమ్మ ఎంట్రీ

  తులసి ఇంటికి పని మనిషి రాములమ్మ వస్తుంది. ఆమెను చూసి శృతి సంతోషిస్తుంది. అప్పుడు రాములమ్మ 'శృతమ్మా.. నీకు మూడో నెలంట కదమ్మా' అంటుంది. దీనికామె 'అవును.. నువ్వు ఎప్పుడొచ్చావు. నిన్ను ఎవరు రమ్మన్నారు' అని అడుగుతుంది. దీంతో రాములమ్మ 'ఇంకెవరు.. తులసి అమ్మగారే రమ్మన్నారు. మీరంతా అలాగే ఉన్నారమ్మా.. అన్నట్లు ఆ లాస్య కూడా ఏం మారలేదట కదా' అంటుంది. ఇంతలో తులసి వచ్చి 'నువ్వు మాటలేనా.. చేతలు ఉందా? వంటింటి పనులు నేను చూసుకుంటా కానీ, శృతి పనులు నువ్వు చూసుకోవాలి' అని చెబుతుంది.

  మళ్లీ అలా జరిగితే తట్టుకోలేము

  మళ్లీ అలా జరిగితే తట్టుకోలేము

  తులసి మాటలకు శృతి 'వద్దులేంటి ఆంటి. నా పనులు నేను చూసుకుంటాను. రాములమ్మను వంటింటి పనులు చూసుకోమనండి చాలు' అంటుంది. దీంతో రాములమ్మ 'ఏం కాదమ్మా.. మీకు ఇప్పుడు మూడో నెల కదా. నేను చూసుకుంటాను' అంటుంది. అప్పుడు తులసి 'ఇప్పటికే అంకితకు పిల్లలు పుట్టలేదు. మళ్లీ నీకు అలా ఒకసారి జరిగింది. ఇంకోసారి అలా జరిగితే మనం తట్టుకోలేం. కాబట్టి ఏమీ మాట్లాడకుండా నీకేమి కావాలన్న రాములమ్మను అడుగు' అంటుంది. దీంతో శృతి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత వాళ్లు అందరూ వంట గదిలోకి వెళ్లిపోతారు.

  లాస్యపైకి దూసుకెళ్లిన తులసి

  లాస్యపైకి దూసుకెళ్లిన తులసి

  వంట గదిలో ప్రిడ్జ్‌కు తాళం వేసి ఉండడంతో తులసికి కోపం వస్తుంది. దీంతో లాస్య సంగతి చూసుకుంటా అని ఆమె మీదకు దూసుకుపోతోంది. అప్పుడే లాస్య 'తులసి వచ్చి నా ఆశల మీద నీళ్లు జల్లింది. పరిస్థితి చూస్తుంటే తులసి నన్ను వదిలేలా లేదు. ఇప్పుడు కూడా నాకోసమే వస్తున్నట్టు ఉంది' అని అనుకుంటుంది. అంతేకాదు, 'తులసికి చాన్స్ ఇవ్వకూడదు. నేను జింకలా భయపడడం కాదు.. పులిలా తనకు ఎదురు తిరగాలి' అని అనుకుంటుంది. అప్పుడు లాస్య కొంగుకు కట్టుకున్న తాళాల గుత్తిని తులసి చూస్తుంది. దీంతో దాన్ని చీరతో దాచేందుకు లాస్య ప్రయత్నం చేస్తుంది. దీంతో తులసి నువ్వు దాస్తే దాగేది కాదు అని తాళాల గుత్తిని లాక్కుంటుంది. దీంతో లాస్య ముందు ఆ తాళాల గుత్తి ఇవ్వు తులసి అని అడుగుతుంది.

  ఘాటు ఫొటోతో టెంప్ట్ చేస్తోన్న దీప్తి సునైనా: కింది నుంచి చూపిస్తూ హాట్‌గా!

  నీ వంకర బుద్దిని దాచలేవని

  నీ వంకర బుద్దిని దాచలేవని

  లాస్య మాటలకు తులసి 'నేను ఇక్కడకు వచ్చిందే నీ దగ్గర నుంచి ఒక్కొక్కటి లాక్కోవడానికి. తల కిందులుగా తపస్సు చేసినా నువ్వు ఈ ఇంటికి కోడలు కాలేవు' అని అంటుంది. దీంతో లాస్య 'నీ పిల్లలకు తల్లిగా, నీ మాజీ అత్తామామలకు కోడలుగా నీ స్థానాన్ని నేను ఆక్రమించబోతున్నాను. ఇది గ్యారెంటీ' అని బదులిస్తుంది. అప్పుడు తులసి అది నీ వల్ల కాదు అని అంటుంది. దీంతో లాస్య 'అవన్నీ చేయడానికి నేను రెడీ. చేసి చూపిస్తాను' అంటుంది. దీనికి తులసి 'మంచితనం ముసుగు వేసుకుంటావా? అలా నీ వంకర బుద్ధిని దాచుకోలేవు' అంటుంది.

  తులసి, లాస్య మధ్య చాలెంజ్

  తులసి, లాస్య మధ్య చాలెంజ్

  లాస్య మాటలకు తులసి 'మనిషి అందంగా కనపడాలి అంటే ముఖానికి మేకప్ వేసుకుంటే చాలు. కానీ, మనసు అందంగా కనిపించాలంటే దానికి ఎలాంటి రంగులు లేవు. ముఖానికి వేసుకున్న రంగు ఏదో ఒకరోజు వెలిసి పోయి బయటపడుతుంది' అని కౌంటర్ ఇస్తుంది. దీంతో లాస్య 'నన్ను ఎందుకు డిస్‌కరేజ్ చేస్తున్నావు. నాకు నెల రోజుల సమయం ఇవ్వు. నేను ఈ ఇంట్లో నెల రోజుల్లో మంచి కోడలుగా అందరితో అనిపించుకుంటా చూస్తుండు' అని చాలెంజ్ విసురుతుంది. దీంతో తులసి 'నీ చాలెంజ్‌కు నేను రెడీ' అంటుంది. దీంతో ఇద్దరూ గొడవ పడతారు.

  ప్రేమ్‌కు గిటార్ ఇచ్చిన తులసి

  ప్రేమ్‌కు గిటార్ ఇచ్చిన తులసి

  ఇక, ప్రేమ్ పాటను రిహాల్సల్ చేస్తుండగా తులసి అక్కడకు వచ్చి 'పాట పాడు నాన్న. నీ పాట వినక చాలా రోజులు అయింది. గిటార్ తెచ్చి పాడు' అంటుంది. కానీ, ప్రేమ్ తన దగ్గర గిటార్ లేని విషయాన్ని ఆమెకు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడు తులసి ఆ గిటార్‌ను తీసుకొచ్చి ప్రేమ్‌కు ఇస్తుంది. దీంతో ప్రేమ్ ఆమెను హత్తుకుని ఏడుస్తాడు. అప్పుడు తులసి 'అమ్మ ఉంది ఎందుకురా. కష్టం వస్తే చెప్పుకోవాలి కానీ.. ఇలా గిటార్‌ను అమ్ముకోవచ్చా' అని అడుగుతుంది. దీనికి ప్రేమ్ 'నిన్ను ఎంతగా అభిమానిస్తానో.. నువ్వు ఇచ్చిన గిటార్ కూడా అంతే. కానీ, పరిస్థితి అలా వచ్చింది' అంటాడు. దీంతో తులసి అతడిని ఓదార్చుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 842: Tulasi is Enraged with Lasya Reckless Behaviour Towords the Family. After That She Praises Prem for Taking Care of Shruthi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X