Intinti Gruhalakshmi Today Episode: ఇంటర్వ్యూకు వెళ్లిన దివ్య.. ఆ సీన్ చూసి కోపం.. చివర్లో ట్విస్ట్
సుదీర్ఘ కాలంగా తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య వస్తుందని నందూ, లాస్య కారులో.. తులసి స్కూటీపై ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. అక్కడామె పాపకు ఎగిరిపోయిన బెలూన్లను పట్టుకుని ఇస్తుంది. ఆ తర్వాత అవి కట్ చేసిన కుర్ర బ్యాచ్ దగ్గరకు వెళ్లి క్లాస్ పీకుతుంది. ఇక, బయటకు వచ్చిన వెంటనే తులసిని చూసి సంతోషిస్తుంది. అలాగే, తండ్రిని కూడా పలకరిస్తుంది. కానీ, లాస్యకు ఝలక్ ఇస్తుంది. అనంతరం తన లగేజ్‌ను నందూ కారులో పెట్టి.. తులసితో స్కూటీపై వెళ్తుంది. ఇక, ఇంటికి వెళ్లిన తర్వాత దివ్య అందరితో సంతోషంగా మాట్లాడుతూ డ్యాన్సులు కూడా చేస్తుంది.

తులసి కోరిక తీరుస్తానన్న దివ్య
అభితో మాట్లాడుతోన్న సమయంలో దివ్య 'నువ్వు డాక్టర్ అయిన కొత్తలో క్లీనిక్ పెట్టించి పేదలకు తక్కువ ఖర్చులో వైద్యం చేయాలని అమ్మ చెబుతూ ఉండేది. కానీ, అమ్మ కోరిక కోరికగానే మిగిలిపోయింది. ఇప్పుడు నేను ఆ కోరిక తీర్చాలి అనుకుంటున్నాను' అని చెబుతుంది. దీంతో అభి 'కోరికలు మాటలు చెప్పడానికి బాగా ఉంటాయి దివ్య. కానీ దిగితేనే తెలుస్తుంది. నా ఆకలి తీరనప్పుడు నేను వేరే వాళ్ళ ఆకలి ఎలా తీరుస్తాను' అని అంటాడు. అప్పుడు దివ్య 'నేను నిన్ను తప్పు పట్టడం లేదు అన్నయ్య. కానీ ఇప్పుడే మొదలుపెట్టాను కొంచెం ట్రైనింగ్ అయిన తర్వాత మళ్లీ మొదలు పెడతాను' అంటుంది. దీంతో నందూ చాలా మంచి ఆలోచన దివ్య అని పొగుడుతాడు.

లాస్య వెటకారం... మోసం అని
వాళ్ల మాటలు వినగానే లాస్య 'అయితే రేపటి నుంచి మనం కెఫేకు పేదలన్ని పిలిచి ఉచితంగా ఫుడ్ ఇప్పిద్దామా' అని వెటకారంగా అంటుంది. అప్పుడు నందూ 'నువ్వు వెటకారంగా అన్నా నేను కూడా అదే మనసులో అనుకున్నాను' అంటాడు. దీంతో తులసి 'దానం ఇవ్వడం అంటే మనకున్న అంత దానం చేయడం కాదు. ఉన్నలో కొంచెం ఇవ్వడం మన సంతోషంతో పాటు ఎదుటి వ్యక్తి సంతోషం కూడా కోరుకోవాలి' అంటుంది. అప్పుడు లాస్య 'ఇల్లు తాకట్టు పెట్టుకుంటాను అని ప్రాధేయపడినప్పుడు ఈ సూత్రం గుర్తు రాలేదా తులసి' అని అడుగుతుంది. దీనికి తులసి 'నువ్వు మోసం చేసి ఇంటిని నీ పేరు మీద రాయించుకోకుండా ఉంటే ఇచ్చేదాన్నేమో' అని అంటుంది.

రికమండేషన్ చేయొద్దు అంటూ
తులసి, లాస్య గొడవకు దిగుతుండడంతో అభి 'ఇంకా చాలు ఆపండి.. దివ్య నేను ఇంతకుముందు పనిచేస్తున్న హాస్పిటల్‌లో రికమెండ్ చేయాలా' అని అడుగుతాడు. దీంతో నందూ తొందరగా ఆ పని చెయ్ అని అంటాడు. అప్పుడు దివ్య 'రికమండేషన్స్ వద్దు. నా స్వశక్తితో నేనే ఉద్యోగం సంపాదించుకుంటాను' అని అంటుంది. అప్పుడు తులసి సంతోషపడుతూ 'నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీ అంతట నువ్వే నిర్ణయాలు తీసుకుని స్థాయికి ఎదిగావు. నీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను. నీ మనసుకు నచ్చిన పని నచ్చిన పద్ధతిలో చెయ్' అని చెబుతుంది.

దివ్యకు పెళ్లి చేయాలని అంటూ
దివ్య వెళ్లి ప్రేమ్ పిల్లాడితో ఆడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత తులసి 'ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది మావయ్యా. పెద్ద కొడుకు వాళ్ళ అత్త మాటలు విని ఎక్కడ చెడిపోతాడు అనుకున్నాను' అంటుంది. అప్పుడాయన అందరి మంచి కోరుకునే నీకు దేవుడు ఎలా చెడు చేస్తాడమ్మా అని అంటాడు. దీనికి తులసి 'అభి, అంకితలకు పిల్లలు లేరని బాధ మామయ్య' అంటుంది. దీనికి పరందామయ్య 'కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్లకి ఇంకా చాలా వయసు ఉంది. పైగా వారిద్దరూ కూడా డాక్టర్లే. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారులే' అంటాడు. దీంతో తులసి దివ్య ఒకటే నా బాధ్యత అని అంటుంది. దీంతో పరందామయ్య 'దివ్యకి కూడా పెళ్లి చేసేద్దామా. మేము ముసలివాళ్లం ఎప్పుడేం జరుగుతుందో తెలియదు' అని అంటాడు.

దివ్యకు ఒక మార్కు ఉంటుంది
తులసి మాటలకు పరందామయ్య 'ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే మంచిది తులసి' అంటాడు. దీనికామె 'ప్రస్తుత రోజుల్లో పిల్లలు వారి జీవితంలో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. వీటన్నటికీ మించి విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల బిడ్డగా దివ్యకి ఒకరి మార్క్ ఉంటుంది. కాబట్టి దివ్యకు సంబంధం తేవడం అన్నది కష్టమైన పని. ఆ విషయం తలుచుకుంటేనే ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటుంది మావయ్య' అంటుంది. దీనికాయన సమస్య చూపించిన దేవుడే మార్గం కూడా చూపిస్తాడు అంటాడు.

ఇంటర్వ్యూకు దివ్య.. తల్లితోనే
తులసి మాటలు విన్న లాస్య 'నాకు మంచి అవకాశం దొరికింది. ఎలా అయినా దివ్యను నా గుప్పెట్లో పెట్టుకొని తులసిని ఒక ఆట ఆడిస్తాను' అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దివ్య ఇంటర్వ్యూకు వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా.. పరందామయ్య వచ్చి ఆల్ ద బెస్ట్ దివ్య అని చెబుతాడు. దీంతో దివ్య 'లైఫ్‌లో నేను ఫస్ట్ టైం వెళ్తున్న ఇంటర్వ్యూ ఇది కచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి. లైఫ్‌లో ఫస్ట్ సెలెక్షన్ ఆల్వేస్ బెస్ట్ సెలక్షన్' అని అంటుంది. దీంతో తులసి ఆమెకు జాగ్రత్తలు చెబుతుంది. అనంతరం నందూ, లాస్య అక్కడకు రాగా.. దివ్య తండ్రి కాళ్లకు నమస్కరించి లాస్యకు షాకిస్తుంది. తర్వాత నందూ వాళ్లతో రమ్మన్నా వెళ్లను అంటుంది. దీంతో తులసే ఆమెను ఇంటర్వ్యూకు తీసుకెళ్తుంది.

డబ్బు తక్కువ వస్తుందని క్లాస్
ఇంటర్వ్యూకు వెళ్లిన దివ్య కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంతో అప్పుడే వచ్చిన యండీ రాజ్యలక్ష్మికి కోపం వస్తుంది. ఆ విషయాన్ని ఒకరు చెప్పడంతో దివ్య కంగారు పడుతుంది. ఇక, హాస్పిటల్ గురించి రివ్యూ మీటింగ్ జరుగుతుంది. దీంతో రాజ్యలక్ష్మి కొడుకు సంజయ్ పేషెంట్లకు నమ్మకం కలిగేలా చేయాలి.. డబ్బులు ఎక్కువ గుంజాలి అని ఏవేవో చెబుతాడు. ఆ తర్వాత దివ్య ఇంటర్వ్యూకు వచ్చిందని ఓ వ్యక్తి చెప్పగా.. రాజ్యలక్ష్మి సీక్రెట్‌గా చూస్తా మీరే చేయండి అని అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











