Intinti Gruhalakshmi: భాగ్యకు దొరికిపోయిన దివ్య.. తులసి కోసం ఏడ్చిన నందూ.. వంటగదిలో సాహసం చేసి మరీ!

ఎప్పటికప్పుడు కొత్త షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను బసవయ్య ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఆ వెంటనే రాజ్యలక్ష్మి కూడా అతడితో ప్రేమగా మాట్లాడినట్లు నటిస్తూ పెళ్లి చేసుకోమని అడుగుతుంది. దీంతో అతడు ఓకే అనేస్తాడు. మరోవైపు, తులసి, నందూకు పెళ్లిరోజు పార్టీ జరుగుతుంది. ఇందులో ఇద్దరూ కేక్ కట్ చేసిన తర్వాత నందూ ఆమె కోసం ఓ డైమండ్ నెక్లెస్‌ను గిఫ్టుగా తెచ్చి ఇస్తాడు. దీంతో అందరూ షాక్ అయిపోతారు. ఆ తర్వాత నందూ తన తప్పులను పరోక్షంగా ప్రస్తావిస్తూ తులసికి సారీ చెప్తాడు. అయినప్పటికీ ఆమె కూడా ఘాటుగానే మాట్లాడి షాకిస్తుంది.

తల్లికి ఇచ్చిన మాట మార్చేసి

తల్లికి ఇచ్చిన మాట మార్చేసి

విక్రమ్ పెళ్లి గురించి వంట మనిషి దేవుడు 'ఇంక చేసేదేమీ లేదు. నీకు తగ్గట్టు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని వస్తారు. ఆ అమ్మాయికి పెళ్లి చేసి జీవితాంతం ఏడ్చుకుంటూ కూర్చోవడమే' అని అంటాడు. అప్పుడు విక్రమ్ 'నువ్వు చెప్పినట్టే చేసుకుంటాను అన్నాను. కానీ నువ్వు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అమ్మకు మాట ఇవ్వలేదు కదా' అని తెలివిగా మాట్లాడతాడు. దీనికి దేవుడు 'ఏం చెప్పారు బాబు.. ఇంకొకసారి చెప్పండి' అనగా విక్రమ్ 'నేను ఇష్టపడ్డ అమ్మాయిని అమ్మ కూడా ఇష్టపడేలా చేసి పెళ్లి చేసుకుంటాను' అని అంటాడు.

తన ప్లాన్ వివరించిన విక్రమ్

తన ప్లాన్ వివరించిన విక్రమ్


ఆ తర్వాత విక్రమ్ 'దేవుడు రాసిన రాతను ఎవరు తప్పించలేరు' అంటాడు. దీంతో దేవుడు 'ఇంట్లో దేవుడు ఎవరు కాదు.. మీ అమ్మగారు అదే పెద్దమ్మ గారు. లేస్తే వెళ్లి కూరగాయలు తీసుకుని వద్దాము' అంటాడు. దీంతో విక్రమ్ 'మొదటి అడుగు నా మనసులో మాట దివ్యకి చెప్పడం. రెండో అడుగు దివ్య మనసులో నేను ఉన్నానో లేదో తెలుసుకోవడం. మూడో అడుగు దివ్యను అమ్మకు పరిచయం చేయడం. నాలుగో అడుగు ఇద్దరము కలిసి పెళ్లి చేసుకుని ఏడు అడుగులు వేయడం' అంటాడు. దీంతో దేవుడు 'ఇప్పుడు నువ్వు ఒక అడుగు బయటకు వేస్తే కూరగాయలకు వెళ్దాం బాబు' అంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి మార్కెట్‌కు బయలుదేరుతారు.

తులసి కోసం నందూ బాధగా

తులసి కోసం నందూ బాధగా

ఇక, నందూ 'తులసికి ఏమైంది? పొద్దున నుంచి కనిపించడం లేదు. రాత్రి జరిగిన దానికి ఏమైనా కోపం తెచ్చుకుందా' అనుకుంటూ ఉంటాడు. అంతలోనే అనసూయ అక్కడికి రావడంతో అమ్మా తులసికి ఏమైంది కనిపించడం లేదు అని అడుగుతాడు. అప్పుడే వాసుదేవ్ అక్కడికి వచ్చి 'తులసికి జ్వరం వచ్చి మూసిన కన్ను తెరవకుండా అలాగే పడుకుంది' అని చెప్తాడు. దీంతో నందూ కంగారుగా లోపలికి తులసిని చూసి చలించిపోతాడు. వెంటనే వంట గదిలోకి వెళ్లి నీళ్లు తీసుకుని వచ్చి తులసికి తడి బట్ట వేస్తూ సేవలు చేస్తాడు. ఆ సమయంలో బాధ పడుతుంటాడు.

మనశ్శాంతి లేకుండా చేస్తూ

మనశ్శాంతి లేకుండా చేస్తూ

తులసికి సేవ చేస్తోన్న సమయంలో నందూ 'భర్తగా ఉన్నప్పుడు నిన్ను ఎంతో బాధ పెట్టాను. నీ మనసును గాయపెట్టాను. భర్తగా ఉన్నప్పుడు ఏ సంతోషం ఇవ్వలేదు. విడాకులు తర్వాత కూడా నీకు మనశ్శాంతి ఇవ్వలేకపోతున్నాను' అని కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలోనే తులసి నిద్ర లేవడంతో టాబ్లెట్స్ ఇచ్చి సేవలు చేస్తూ ఉంటాడు. అందంతా చూసి లాస్య కోపంతో రగిలిపోతూ అక్కడికి వస్తుంది. అప్పుడామె 'తులసికి జ్వరం నిజంగానే వచ్చిందా? లేకుంటే నువ్వే కావాలని తెప్పించావా' అని గొడవకు దిగుతుంది. అప్పుడు నందూకు కోపం వచ్చినా తులసి చెప్పిందని ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. తర్వాత నెక్లెస్ బాగుంది అందుకే నా దిష్టి తగిలి జ్వరం వచ్చిందని లాస్య అంటుంది. అనంతరం కెఫే గురించి పట్టించుకోమంటుంది.

నందూకు క్లాస్.. లాస్యకు షాక్

నందూకు క్లాస్.. లాస్యకు షాక్

నందూను కెఫేకు తీసుకెళ్లాలని లాస్య అనుకుంటూ ఉండగానే వాసుదేవ్ అక్కడకు వస్తాడు. అప్పుడతను ఎక్కడికి వెళ్లాలి అనగా కెఫే దగ్గరకు అని చెప్తాడు. దీంతో వాసుదేవ్ 'కట్టుకున్న భార్య కంటే ఏది ముఖ్యం కాదు. కట్టుకున్న వాడికి విడాకులు ఇచ్చిన వాళ్లకు ఇలాంటివి అర్థం కావులే. అయినా లాస్యను పనిలో ఎందుకు పెట్టుకున్నావు నందూ? నీ మీద అజమాయిషి చేయడానికా' అని ప్రశ్నిస్తాడు. దీంతో లాస్య 'అర్థమైంది సార్.. మీరు ఇక్కడ దగ్గరుండి చూసుకోండి' అని వెళ్లిపోతుంది. తర్వాత వాసుదేవ్ భార్య జ్వరం భర్త ప్రేమతో త్వరగా తగ్గిపోతుంది అని అంటుంది.

దివ్య, విక్రమ్.. భాగ్య ఫొటో

దివ్య, విక్రమ్.. భాగ్య ఫొటో

కూరగాయల కోసం వెళ్లిన విక్రమ్.. దివ్య కనిపిస్తే బాగుండు అనుకుంటాడు. అంతలోనే అక్కడకు దివ్య వస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ చూసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో విక్రమ్ కూరగాయల గురించి వివరించి చెబుతాడు. అప్పుడు దివ్య నాకు వంట వచ్చిన అబ్బాయి అంటే ఇష్టం అంటుంది. దీంతో విక్రమ్ సిగ్గు పడుతుంటాడు. అప్పుడే భాగ్య అక్కడకు వస్తుంది. అయితే, దివ్యతో విక్రమ్ ఉండడాన్ని చూసి ఆమెకు అనుమానం మొదలవుతుంది. ఆ వెంటనే లాస్యకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తుంది. ఆ తర్వాత తన ఫోన్‌లో వాళ్లిద్దరినీ ఫొటోలు తీస్తుంది. అక్కడ కూరగాయలు తీసుకున్న తర్వాత దివ్య స్కూటీ టైర్ పంక్చర్ కావడంతో విక్రమ్ ఆమెను తన కారులో తీసుకు వెళ్తాడు.

తులసి కోసం సూప్ చేసి

తులసి కోసం సూప్ చేసి

తులసి ఉదయం నుంచి ఏమీ తినలేదని తెలుసుకున్న నందూ.. ఆమె కోసం సూప్ చేయాలని అనుకుంటాడు. అందుకోసం వంటగదిలోకి వెళ్లగా అక్కడ రాములమ్మ ఉంటుంది. ఆమె విషయం చెప్పి గ్యాస్ కావాలని అడుగుతాడు. దీనికామె 'చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు.. మీకోసం ఎప్పుడు మీరు ఏమి చేయలేదు.. అలా అని లాస్యమ్మ కోసం కూడా చేయలేదు.. తులసమ్మ గారి కోసం ప్రేమగా ఇలా సూప్ చేస్తున్నారు' అంటుంది. దీంతో నందూ సిగ్గు పడతాడు. తర్వాత అది తీసుకెళ్ళి తులసికి తాగించగా ఆమెకు నచ్చుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X