Intinti Gruhalakshmi: నోరు విప్పిన ప్రియ.. నిజం చెప్పిన తాతయ్య.. దివ్య కీలక నిర్ణయం

జనరేషన్లు మారుతూ ఉన్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే : శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ బాధ పడుతుండడంతో రాములమ్మ వచ్చి తులసితో అతడి గురించి మాట్లాడుతుంది. దీంతో తులసి.. అనసూయకు అన్నం తినిపించమని చెప్తుంది. అనంతరం భర్త భుజంపై వాలిన దివ్య.. అసలేం జరిగిందో అతడికి వివరించి చెప్తుంది. దీంతో విక్రమ్ ఆమెకు అండగా నిలుస్తానని అంటాడు. అదంతా విన్న బసవయ్య.. రాజ్యలక్ష్మిని రెచ్చగొడతాడు. ఇక, తనకు అన్యాయం జరుగుతుందని లాస్య.. మహిళా సంఘాలను తీసుకొచ్చి నందూ ఇంటి ముందు ధర్నా చేస్తుంది. వాళ్లకు తులసి సరైన సమాధానం చెబుతుంది.

intintigruhalakshmi

బెదిరించి వెళ్లిపోయిన లాస్య : మహిళా సంఘాల వాళ్లకు తులసి క్లాస్ పీకుతుంది. అంతేకాదు, కోర్టులో తీర్పు రాకుండా ఎలా గొడవ చేస్తారని ప్రశ్నిస్తుంది. అలాగే, ఆ తీర్పు వచ్చే వరకూ ఓపిక పట్టమని చెప్తుంది. దీంతో వాళ్లంతా 'నువ్వు చెప్పినట్లే ఓపిక పడతాము. అప్పుడుగాని లాస్యకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఊరుకోము. తనకోసం మేము ఉన్నాము' అంటూ తులసితో ఆవేశంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ వెంటనే లాస్య కూడా 'మీ ఎవర్ని వదిలిపెట్టను' అంటూ ఇంట్లో వాళ్లను బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

intintigruhalakshmi

దివ్యకు నిజం చెప్పిన తాత : ఏదో ఆలోచిస్తూ ఉన్న దివ్య.. ప్రియను రమ్మని పిలుస్తుంది. కానీ, ఆమె మాత్రం వెళ్లడానికి భయపడుతుంది. అప్పుడు దివ్య 'ఎందుకు తప్పించుకోవాలని చూస్తున్నావు? నువ్వు సమస్యల్లో ఉన్నావో.. నేను సమస్యల్లో ఉన్నాను అర్థం కావడం లేదు. దయచేసి నోరు విప్పు' అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ వాళ్ళ తాతయ్య 'తను మాట్లాడలేదు. తను ఈ ఇంటి కట్టు బానిస. మనమందరం మీ అత్తగారి కబంధహస్తాల్లో ఉన్నాము' అని చెప్తాడు. దీంతో దివ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.

intintigruhalakshmi

నోరు విప్పి చెప్పిన ప్రియ : విక్రమ్ వాళ్ల తాతతో 'అత్తగారు విక్రమ్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు' అని దివ్య అంటుంది. దీనికాయన 'డబ్బు కోసం అలా నటిస్తుంది తను. ఆమె ప్రేమ, తన అభిమానం అన్ని అబద్దమే. అందుకు నిలువెత్తు సాక్ష్యం నేనే. ఆవిడ ఆగడాలను భరించలేక మేమందరం చేతులు ఎత్తేసాము' అంటాడు. అప్పుడు దివ్య 'ప్రియ అంటే ఇష్టం ఉండదని తెలుసు. కానీ నేనంటే ఎందుకు ఇష్టం ఉండదు' అంటుంది. అప్పుడు ప్రియ 'నన్ను ఈ ఇంటి కోడల్ని చేసింది మీరే కదా. అందుకే పంతంతోనే మిమ్మల్ని కోడలిగా చేసుకున్నారు' అంటూ నోరు విప్పుతుంది.

intintigruhalakshmi

అత్తతో యుద్దానికి దివ్య రెడీ : ఒకవైపు తాతయ్య, మరోవైపు ప్రియ నిజాలు చెప్పడంతో దివ్య 'నాకు నిజం చెప్పి మంచి పని చేశారు. ఇకపై నేను కూడా ఆవిడ తోవలోనే వెళ్లి ఒక ఆట ఆడుకుంటాను. కంటికి కనిపించని యుద్ధం చేస్తాను. నన్ను దీవించండి' అంటూ తాత కాళ్లపై పడుతుంది. అప్పుడాయన 'ఈ యుద్ధంలో నీ భర్త సపోర్ట్ నీకు ఉండదు. వాడు మీ అత్తగారికి మూఢ భక్తుడు. నా సపోర్ట్ మాత్రం నీకు ఎప్పుడూ ఉంటుంది' అని భరోసా ఇస్తాడు. దీంతో ప్రియ కూడా సంతోషిస్తుంది.

intintigruhalakshmi

యుద్ధం కావాలంటే తప్పదు : అవమానం తలుచుకుని నందూ మందు తాగుతుంటాడు. దీంతో తులసి వచ్చి అతడి దగ్గర బాటిల్ లాక్కుంటుంది. అప్పుడు నందూ 'నా మనాన నన్ను వదిలేయ్. నీకు నాకు ఏం సంబంధం' అంటాడు. దీంతో అయితే తాగండి అంటూ తులసి ఆ బాటిల్ ఇస్తుంది. కానీ, నందూ బాధతో ఆ బాటిల్‌ను నేలకేసి కొట్టేస్తాడు. తర్వాత 'నిన్ను సమస్యల్లోకి లాగకూడదు అనుకున్నాను. కానీ నాతో పాటు నిన్ను కూడా నానా మాటలు అన్నారు' అంటాడు. అప్పుడు తులసి 'సంధి వద్దు యుద్ధం కావాలి అనుకున్నారు. అలాంటప్పుడు ఇలాంటివన్నీ భరించాలి' అంటుంది.

intintigruhalakshmi

ఆ నిందలే నిజం అవుతాయి : తులసి మాటలకు నందూ 'నా వాళ్ళు బాధ పడితే నేను చూడలేను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను' అంటాడు. దీంతో తులసి 'అప్పుడు వాళ్లు వేసిన నిందలే నిజం చేసినట్లుగా అవుతుంది. సమస్యను ధైర్యంగా ఎదుర్కోండి' అని సలహా ఇస్తుంది. దీనికి నందూ 'తప్పు చేశానని ఫీలింగ్ లాస్య మనసులో అస్సలు లేదు' అంటాడు. అప్పుడు తులసి 'తను అప్పుడు ఇప్పుడు ఒక్కలాగే ఉంది. మీ కళ్ళకి ఉన్న పొర ఇప్పుడు కరిగిపోయి నిజాన్ని గ్రహిస్తున్నారు అంతే. నేను వెళ్లి లాస్యతో మాట్లాడి ఇంటికి తీసుకొస్తా' అంటుంది. దీంతో నందూ 'ఇంటికి తీసుకువస్తే తనని చంపేస్తాను. జీవితాంతం జైల్లో అయినా కూర్చుంటాను కానీ తనని భరించలేను' అంటాడు.

intintigruhalakshmi

రాజ్యలక్ష్మికి షాకివ్వాలని : రాజ్యలక్ష్మి, బసవయ్య మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కాఫీ కావాలి అని అడుగుతుంది. ఇప్పుడే తెస్తాను అని బసవయ్య భార్య వెళ్లే లోపు దివ్య కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి 'నాకు కాఫీ తాగాలనిపించిందని నీకు ఎలా తెలుసు' అంటుంది. దీంతో దివ్య 'తెలిసిపోతుంది అత్తయ్య.. మీరు నా గురించి ఆలోచిస్తున్నారు. నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. రెండు నిమిషాలు నా కళ్ళల్లోకి చూస్తే మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పేస్తాను' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X