Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌కు మప్పీ లహరి షాక్.. తులసి తీరుపై పరందాయ్య ఆగ్రహం

ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇల్లు అమ్మనివ్వకుండా అడ్డుకుంటానన్న భాగ్యకు తులసి 20 లక్షలు ఆఫర్ ఇస్తుంది. దీనికామె ఒప్పుకోవడంతో శశికళకు ఇంటిని అప్పగిస్తుంది తులసి. దీంతో వెంటనే 20 లక్షలు తులసికి ఇస్తుంది. ఆ డబ్బును భాగ్యకు ఇవ్వడంతో అవి తీసుకుని వెళ్లిపోతుంది. అప్పుడు శశికళ ఆ ఇంట్లో తులసి వాళ్లను కొన్ని రోజులు ఉండమంటుంది.

కానీ, ఆమె మాత్రం దానికి ఒప్పుకోదు. ఇక, భాగ్య చేసిన పనికి లాస్య కోపంగా ఉంటుంది. అప్పుడు నందూకు విషయం తెలియడంతో తులసి అలా చేసిందేంటని ఆలోచించడంతో పాటు బాధ పడతాడు.

 కోపంతో తిరిగి వెళ్లిపోయిన దీపక్

కోపంతో తిరిగి వెళ్లిపోయిన దీపక్

ఇల్లు అమ్మేశారని తెలిసి తులసిని తన ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన దీపక్‌కు నిరాశే ఎదురు అవుతుంది. తన అత్తమామలను వదిలి ఎక్కడికీ వచ్చేది లేదని తులసి అతడితో గొడవకు దిగుతుంది. అంతేకాదు, అతడిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెబుతుంది. దీంతో కన్నీరు పెట్టుకుంటూ అక్కడి నుంచి దీపక్ వెళ్లిపోబోతూ.. 'నువ్వు ఏం నష్టపోతున్నావో నీకు తెలియట్లేదు అక్క.. తెలిసిన రోజున నువ్వే పుట్టింటి గడప తొక్కుతావు' అని అంటాడు. దీంతో తులసి బాధను దిగమింగుకుంటూ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది.

ప్రేమ్‌కు షాకిచ్చిన మప్పీ లహరి

ప్రేమ్‌కు షాకిచ్చిన మప్పీ లహరి

ప్రేమ్ విధి నిర్వహణలో భాగంగా మప్పీ లహరి డబ్బింగ్ స్టూడియోకు వెళ్తాడు. వెళ్లడమే ఆయనతో ఓ పాట రాశానని చూపిస్తాడు. దీంతో మ్యూజిక్ డైరెక్టర్‌కు కోపం వస్తుంది. అప్పుడు 'ఈరోజు అడక్కుండానే పాట రాశావు.. రేపు అడక్కుండానే ట్యూన్ కడతావు.. ఎల్లుండి నా సీటును కూడా కబ్జా చేస్తావు.

నన్ను తక్కువ అంచనా చేయకు. మప్పి లహరి దగ్గర కాదు నీ కుప్పిగంతులు. ప్రతి ఒక్కడు బాలసుబ్రహ్మణ్యం అయిపోదామని. ముందు పోయి సిగిరెట్ ప్యాకెట్ తీసుకురా' అంటాడు. దీంతో ప్రేమ్ ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో సిగరెట్ కోసం వెళ్తాడు.

అద్దె ఇంట్లోకి తులసి కుటుంబం

అద్దె ఇంట్లోకి తులసి కుటుంబం

శశికళ ఉండమని చెప్పినా వినకుండా అద్దె ఇంట్లోకి వెళ్లేందుకు తులసి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఇందులో భాగంగానే ఇల్లు మొత్తం ఖాళీ చేయడానికి చూస్తుంది. అప్పుడే తన మేనేజర్‌కు ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఫ్యాక్టరీ పరిస్థితుల గురించి ఆయనతో చర్చిస్తుంటుంది.

అంతలో అక్కడకు అభి వస్తాడు. వచ్చీ రావడమే 'మా ఫ్రెండ్ ఇల్లు ఒకటి ఖాళీగా ఉంది మామ్. అందులోకి రేపే వెళ్లిపోదాం. అందుకు తగిన పనులు పూర్తి చేసుకుందాం' అని అంటాడు. దీంతో సరే.. రేపే వెళ్లిపోదాం అంటుంది తులసి. ఆ తర్వాత ఈ విషయాన్ని మామయ్యకు చెప్తుంది.

తులసి తీరుపై మామయ్య నిరాశ

తులసి తీరుపై మామయ్య నిరాశ

తన దగ్గరకు వచ్చిన తులసితో పరందామయ్య 'ఎందుకో కానీ.. నీలో చాలా మార్పు కనిపిస్తోంది అమ్మా. నువ్వు బాధతో అలా మాట్లాడుతున్నావో.. బాధపడి అంటున్నావో అర్థం కావడం లేదు. మీ తమ్ముడి మీద నువ్వు అరిచిన విధానం నాకు నచ్చలేదు. నువ్వు పడుతున్న కష్టాలను చూసి అతడు తట్టుకోలేకపోయాడు' అంటాడు.

అప్పుడు తులసి 'వాడికి నా మీద నిజంగా ప్రేమ ఉంటే అర్థం చేసుకుంటాడు. మా అమ్మ ప్రేమ, కోపం ఎలా ఉంటాయో నాకు తెలుసు. అర్థం చేసుకుంటుంది అమ్మ కదా. మా అమ్మ నాలా మొండిది కాదు' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

సాయం చేయలేదని అభి బాధగా

సాయం చేయలేదని అభి బాధగా

ప్రతి ఒక్కరూ ఆ ఇంటితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. అప్పుడు అభి'మామ్ నాకు జన్మనివ్వడమే కాదు.. ప్రాణాలు కూడా కాపాడింది. కానీ.. ఇటువంటి క్రిటికల్ టైమ్‌లో తనకు సాయం చేయలేకపోయాను' అని ఏడుస్తుంటాడు. అప్పుడు అంకిత 'అంత డబ్బు ఎవరైనా ఎక్కడి నుంచి తెస్తారు చెప్పు.

ఇల్లు అమ్మడం తప్ప ఇంకో మార్గం లేదు' అని ధైర్యం చెబుతుంది. దీనికి అభి 'ఈ ఇంటికి దూరం అవడం అంటే అమ్మకు దూరం అవుతున్నట్టుగా ఉంది. ఇదే ఈ ఇంట్లో ఆఖరి రోజు అంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇదంతా ఒక పీడ కల అయితే ఎంత బాగుండు అనిపిస్తోంది' అంటూ భోరుభోరున ఏడుస్తుంటాడు. అప్పుడు ఏం జరిగినా మన మంచికోసమే అని అనుకోవాలి అంటుంది అంకిత.

తన నిర్ణయంపై బాధపడ్డ తులసి

తన నిర్ణయంపై బాధపడ్డ తులసి

ఇల్లు వదిలి వెళ్లాలని అనుకుంటున్నప్పుడు పరందామయ్య 'ఇన్ని రోజులు నా మనుషులు దూరం అయ్యారు. ఇప్పుడు ఇల్లు కూడా దూరం అవుతోంది' అని బాధపడతాడు. మరోవైపు తులసి ఒకసారి ఇల్లంతా తిరిగి చూసుకొని బాధపడుతుంది. ప్రతి ఒక్క రూమ్ కు వెళ్లి.. అక్కడి సామాన్లను చూసి పాత మధురానుభూతులను గుర్తుకు తెచ్చుకుంటుంది.

అలా చాలా బాధపడుతుంది. ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు. ఒక చోట కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎన్ని తీపి మెమోరీస్‌ను ఇచ్చి ఈ ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తోంది అని బాధపడుతుంది.

ఏదీ శాశ్వతం కాదంటూ కన్నీరు

ఏదీ శాశ్వతం కాదంటూ కన్నీరు

తులసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అంతలో అక్కడకు రాములమ్మ వస్తుంది. ఈ ఇల్లు వదిలి వెళ్లాలంటే కష్టంగానే ఉంటుందమ్మా అంటుంది రాములమ్మ. దీనికి తులసి 'జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఎవ్వరూ శాశ్వతం కాదు అని తెలుసు. అయినా మనసు బాధపడటం మానదు.. ఆశ పడటం మానదు.. ఏడిపించడం మానదు. భోజనానికి సిద్ధం చేశావా' అని అడుగుతుంది. దీంతో చేశానమ్మా.. టేబుల్ మీద సిద్ధం చేశా అంటుంది రాములమ్మ. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X